
సాక్షి,కవిటి(శ్రీకాకుళం) : తరాలు మారినా ఆ రెండు గ్రామాల ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో బసవపుట్టుగ, బసవకొత్తూరు గ్రామాల ప్రజలు నిత్యం ప్రాణాలు పణంగా పెట్టి రైల్వే ట్రాక్‌ను నిత్యం దాటుతూ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన జాడుపుడి రైల్వేస్టేషన్‌కు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి సేవలు లేకపోవడంతో ప్రజల అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఈ ట్రాక్‌లో గూడ్స్ రైళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దయనీయ స్థితిని మార్చాలని మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఇరుగ్రామాల ప్రజలు వాపోతున్నారు.