Foot Over Bridge
-
ఢిల్లీలో ట్రాఫిక్‌ను తపించుకునేందుకు ఆటో డ్రైవర్ ఎమ్ చేసాడో తెలుసా..!
-
అమ్మో పంజగుట్ట చౌరస్తా.. రోడ్డు దాటడం సవాలే! పాదచారి ‘సారీ’
బంజారాహిల్స్: పంజగుట్ట చౌరస్తా... నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ చౌరస్తాలో రోడ్డు దాటేందుకు పాదచారులకు ఓ సవాలు లాంటిదే అనడం నిర్వివాదాంశం. పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట నిర్మించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి అలంకారప్రాయంగా మిగిలింది. ● రూ. 1.50 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో ఇక్కడ పాదచారుల వంతెన నిర్మించారు. లిఫ్ట్‌తో పాటు ఎస్కలేటర్లను కూడా రెండు వైపులా నిర్మించారు. ● ఇవి పట్టుమని పది రోజులు కూడా పని చేయకుండానే మూలనపడ్డాయి. అటు లిఫ్ట్ పనిచేయక, ఇటు ఎస్కలేటర్ తిరగక పాదచారులు యధావిధిగా మెట్లను ఆశ్రయిస్తున్నారు. ● ఈ సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేయాలో స్థానికులు, పాదచారులకు అంతుబట్టడం లేదు. ● జీహెచ్ఎంసీ ఈ వంతెనను నిర్మించి ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. నిర్వహణ లోపంతో వంతెన వద్ద సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ● నెల దాటుతున్నా పని చేయని ఎస్కలేటర్‌కు మరమ్మతులు చేపట్టడం లేదు. జీవీకే వన్ చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న పాదచారులు వంతెన సా...గుతున్న వంతెన నిర్మాణ పనులు... ● బంజారాహిల్స్ రోడ్ నెం. 1లో జీవీకే వన్ ముందు పాదచారుల వంతెన నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం పునాది పడింది. నత్తనడకన నిర్మాణ పనులు సాగుతున్నాయి. రూ. 1.50 కోట్ల వ్యయంతో ఇక్కడ వంతెన నిర్మాణం చేపడుతుండగా పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటికి ఇంకా 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ● ఇక్కడ కూడా నిత్యం రద్దీగా ఉంటూ వందలాది మంది రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం వంతెన నిర్మాణం చేపట్టిన జీహెచ్ఎంసీ పనుల్లో వేగం పెంచడం లేదు. ● ఏళ్ల తరబడి సాగుతున్న ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. తవ్వకాల్లో పెద్ద ఎత్తున డ్రెయినేజీ, మంచినీటి పైప్లైన్లు, ఎలక్ట్రిసిటీ కేబుళ్లు అడ్డుగా వచ్చాయని దీంతోనే తీవ్ర జాప్యం జరిగిందని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు చెబుతున్నారు. పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామని ప్రకటించుకునే ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో పనులను చేపట్టలేకపోతోంది. అరకొర పనులతో పాదచారులకు చుక్కలు చూపిస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ పాదచారుల వంతెనలు నిర్మిస్తుండగా ఇవి కాస్త మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి. -
GHMC-Hyderabad: షరా మామూలే.. అక్రమాలు ఆగలే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఈ సంవత్సరం సైతం అక్రమాలు, అవినీతి షరామామూలుగా కొనసాగాయి. బర్త్ సర్టిఫికెట్ల జారీలో అవినీతి గుర్తించి ఏళ్లవుతున్నా నిరోధించలేకపోయారు. గతంలోవి కాక ఇటీవలే మూడువేలకు పైగా బర్త్ సర్టిఫికెట్లు అవినీతి మార్గాల్లో జారీ కావడం పోలీసులు గుర్తించారు. బర్త్ సర్టిఫికెట్ల నుంచి మొదలు పెడితే ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలోనూ లోపాలు, అక్రమాలు బట్టబయలయ్యాయి. ఇక ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనుమతుల్లేని నిర్మాణాలు, నిబంధనలు ఉల్లంఘించి అదనపు అంతస్తులను ప్రజలు ఫొటోలతో సహ ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దిక్కులేదు. ఐదంతస్తుల వరకు నిర్మాణ అనుమతుల అధికారం జోన్లకే కట్టబెట్టినప్పటి నుంచి జోనల్, సర్కిల్ స్థాయిల్లో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట లేకుండాపోయింది. నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్న ఎల్బీనగర్ వంటి జోన్లలో ఈపరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పురోగతిలో ఎస్సార్డీపీ.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. మొదటి దశ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ సంవత్సరం పూర్తయిన వాటిల్లో షేక్‌పేట ఫ్లైఓవర్, బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లైఓవర్, బహదూర్‌పురా ఫ్లైఓవర్, శిల్పా లేఔట్ ఫ్లైఓవర్, నాగోల్ ఫ్లైఓవర్, చాంద్రాయణగుట్ట ఎక్స్టెన్షన్ ఫ్లైఓవర్, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జి, ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్ ఆర్యూబీ, ఖైతలాపూర్ ఆర్ఓబీలున్నాయి. కాగితాల్లోనే మూసీ బ్రిడ్జిలు.. మూసీపై నిర్మించనున్న 15 బ్రిడ్జిలు కాగితాలకే పరిమితమయ్యాయి. వాటిల్లో నాలుగింటిని జీహెచ్ఎంసీ నిర్మించాల్సి ఉండగా, ఇంతవరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం(ఎస్ఎన్డీపీ)కింద దాదాపు రూ.985 కోట్ల పనుల్లో కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఎఫ్‌ఓబీలు, వైకుంఠధామాలు.. పాదచారులు రోడ్డు దాటేందుకు కొన్ని ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు(ఎఫ్ఓబీ), స్పోర్ట్స్పార్కులు, వైకుంఠధామాలు, మలీ్టపర్పస్ ఫంక్షన్ హాళ్లు తదితరాలు ప్రారంభమయ్యాయి. పాత ఇళ్ల స్థానే వాటిని కూలి్చవేసి కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఖైరతాబాద్ ఇందిరానగర్‌లో 210, ఓల్డ్మారేడ్పల్లిలో 468 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఆగని అగ్ని ప్రమాదాలు.. న్యూబోయిగూడ స్క్రాప్ దుకాణం, సికింద్రాబాద్ రూబీ హోటల్, జూబ్లీహిల్స్ ర్యాడిసన్ బ్లూప్లాజా హోటళ్లలో జరిగిన అగ్ని ప్రమాదాలు ఫైర్‌సేఫ్టీ లోపాల్ని బట్టబయలు చేశాయి. చెత్త తరలించేందుకు కొత్తగా 60 వాహనాలు వినియోగంలోకి వచ్చాయి. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్‌లలో హైదరాబాద్ 26వ స్థానానికి దిగజారింది. పెరిగిన సీఆర్ఎంపీ రోడ్లు.. సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్ఎంపీ)లో భాగంగా ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తున్న రహదారులు 709 కి.మీ.ల నుంచి 811 కి.మీ.లకు పెరిగాయి. 32 అన్నపూర్ణ భోజన కేంద్రాల్లో సిట్టింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించినా అన్నింట్లో పూర్తికాలేదు. కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరగలేదు. ఆహారకల్తీ నిరోధానికి మొబైల్ ల్యాబ్ వినియోగంలోకి వచ్చింది. గ్రీనరీ కార్యక్రమాల్లో భాగంగా నగరంలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగి, హైదరాబాద్ ‘ట్రీసిటీ ఆఫ్ వరల్డ్’గా గుర్తింపు పొందింది. (చదవండి: గన్ చూపించి కారును ఆపిన ఎస్సై.. అవాక్కైన వాహనదారులు) -
మహారాష్ట్ర : బల్లార్షా రైల్వేస్టేషన్ లో ఘోర ప్రమాదం
-
ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇలా కూడా వాడొచ్చా?
-
అరే ఏంట్రా ఇది.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇలా కూడా వాడొచ్చా?
ఫుట్ ఓవర్ బ్రిడ్జి... రద్దీ రోడ్లను దాటేందుకు ఇబ్బంది పడకుండా పాదచారులకోసం చేసే ప్రత్యేక ఏర్పాటు. కానీ.. మనవాళ్లు ఎలా ఉపయోగించారో చూడండి. అవును.. మీరు చూసింది నిజమే! ఆ బ్రిడ్జి మీదుగా ఆటో వెళ్తోంది. ‘ఇండియాలో ఇంతే!’ అనేలాంటి ఈ ఘటన మహారాష్ట్రలోని ఢిల్లీ–చెన్నైలను కలిపే జాతీయరహదారి 48పై పాల్ఘర్ జిల్లాలో జరిగింది. ఎస్‌యూవీలకు కూడా సాధ్యం కానీ ఆ ఫీట్ ఆటో ఎలా చేసింది? స్టెప్స్ ఎలా ఎక్కగలిగిందనే కదా మీ సందేహం. అక్కడ ర్యాంప్ సౌకర్యం ఉంది. రోడ్డు దాటాలనుకున్న డ్రైవర్ ర్యాంప్ ఎక్కించేసి తాపీగా ఫుట్ఓవర్ బ్రిడ్జిపైనుంచి రోడ్డును దాటేశాడు. ట్విట్టర్లో వైరల్ అవుతున్న ఆ వీడియోను రోడ్స్ ఆఫ్ ముంబై పోస్టు చేసింది. ‘బస్ యహీ దేఖ్నా బాకీ తా’ అంటూ కోట్ చేసింది. ‘ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇలా కూడా ఉపయోగిస్తారా?’ అంటూ కొందరు కామెంట్ చేస్తే.. ‘అక్కడ మూడునాలుగు కిలోమీటర్ల వరకు క్రాసింగ్ లేదు. చిన్న చిన్న వాహనాలు అలాగే దాటేస్తుంటాయి’ అంటూ స్పందించాడు ఓ స్థానికుడు. (క్లిక్: అమాంతం కుప్పకూలిన బ్రిడ్జి.. వందల గ్రామాలకు తెగిన సంబంధాలు) -
పాదచారీ.. నీకో దారి!
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు దాటే సమయంలో పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు నిర్మించ తలపెట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిల్లో (ఎఫ్ఓబీ) అయిదింటిని త్వరలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. వీటి అంచనా వ్యయం దాదాపు రూ.16 కోట్లు. వీటిలో రెండింటికి ఎస్కలేటర్ల సదుపాయం కూడా ఉంది. ఇవి వినియోగంలోకి వస్తే రోడ్డు దాటేందుకు పాదచారుల బాధలు తప్పుతాయి. అయిదు ఎఫ్‌ఓబీల్లో పంజగుట్ట హైదరాబాద్ సెంట్రల్‌మాల్, సికింద్రాబాద్ సెయింట్‌ఆన్స్ స్కూల్‌వద్ద నిర్మించినవి ఎస్కలేటర్లు కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని బహుశా వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్ తెలిపారు. వీటితోపాటు నేరేడ్మెట్ బస్టాప్, రాజేంద్రనగర్ సర్కిల్లోని స్వప్న థియేటర్, బాలానగర్‌లో మరో మూడు ఎఫ్ఓబీల పనులు పూర్తయ్యాయన్నారు. ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరి ఎఫ్ఓబీ పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపారు. నగరంలో ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లు దాటేందుకు అవస్థలు పడుతున్న పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు వంద ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు నిర్మించాలనుకున్నప్పటికీ, అంతిమంగా ఇరవై ప్రాంతాల్లో పనులు చేపట్టగా, ఇప్పటికే రెండు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారు. ఒక స్వచ్ఛందసంస్థ అధ్యయనం మేరకు రోడ్డు ప్రమాదాల్లో 52 శాతం రోడ్లు దాటుతుండగా జరిగినవే. ఎఫ్‌ఓబీలతో ఈ ప్రమాదాలు తగ్గగలవన్నారు. పురోగతిలో పనులు.. కూకట్పల్లి జోన్ రంగభుజంగ థియేటర్, ఖైరతాబాద్ జోన్లో బంజారాహిల్స్‌లోని జీవీకే వన్, ఎల్బీనగర్ జోన్లో సరూర్‌నగర్ స్టేడియం, దిల్సుఖ్నగర్ బస్టాప్, మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్, చార్మినార్ జోన్లో శాలిమార్ హోటల్, రక్షాపురం క్రాస్‌రోడ్స్, శేరిలింగంపల్లి జోన్లో ఖాజాగూడ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఎఫ్ఓబీల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. -
Viral: బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయిన విమానం.. అసలేమైంది?
సాక్షి, న్యూఢిల్లీ: గాల్లో ఎగిరే విమానాలు సాధారణ రోడ్లపై కనిపిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అలాంటి ఘటన ఆదివారం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కింది ఎయిర్ ఇండియా విమానం ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టు సమీపంలోని గురుగ్రామ్-ఢిల్లీ హైవేపై జరిగింది. ఆ విమానం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కింద చిక్కుకొని కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యంతో చూశారు. బ్రిడ్జ్ కింద రోడ్డుపై విమానం చిక్కుకొని ఉండగా.. దాని పక్కనుంచే వాహనాలు వెళ్లుతున్నాయి. దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. అది ఓ పాత చెడినపోయిన విమానం అని, దాన్ని చాలా రోజుల కింద అమ్మివేసినట్లు తెలిపారు. దీంతో సదరు యజమాని ఆ రెక్కలు లేని విమానాన్ని రోడ్డు మార్గంలో తీసుకెళ్లుతున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH An @airindiain plane ✈️ (not in service) got stuck under foot over bridge. Can anyone confirm the date and location? The competition starts now👇 pic.twitter.com/pukB0VmsW3 — Ashoke Raj (@Ashoke_Raj) October 3, 2021 -
పంజగుట్ట వంతెన నిర్మాణంలో జాప్యం.. రూ.లక్ష జరిమానా
సాక్షి, బంజారాహిల్స్: పంజగుట్ట చౌరస్తాలో పాదచారుల వంతెన నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం ప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తవుతుందని ఇంజనీర్లు చెప్పారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతేడాది లాక్డౌన్ సమయంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు. అడుగడుగునా పైప్లైన్లు అడ్డురావడం ఆటంకంగా మారింది. ఆరు వారాల్లో పూర్తి కావాల్సిన పనులు ఏడాదిన్నర గడిచినా పిల్లర్ల వద్దే నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్‌కు లిక్విడిటీ డ్యామేజ్ కింద రూ.లక్ష జరిమానా విధించారు. సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా తీవ్ర జాప్యం చేయడంతో ఈ జరిమానా విధించినట్లు ఇంజనీర్లు తెలిపారు. -
హమ్మయ్య నడకకు నాలుగో వంతెన
సాక్షి,సిటీబ్యూరో: నిత్యం లక్షలాది మంది రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నాలుగో వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రయాణికులతో పాటు స్టేషన్‌కు రెండు వైపులా పాదచారుల రాకపోకలకుఅనుకూలంగా నిర్మిస్తున్న నాలుగో వంతెన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి దశ పనులను పూర్తి చేశారు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి ఏడో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు వంతెన నిర్మాణం పూర్తయింది. ఏడో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు మరో రెండు నెలల్లో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్లో పాతకాలం నాటి వంతెనలు బాగా ఇరుకైపోవడం, నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా కూడా మరో బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరి కావడంతో గతేడాది నాలుగో వంతెన నిర్మాణానికి కార్యాచరణ చేపట్టారు. మరోవైపు అప్పటికే ముంబైలో పురాతన కాలం నాటి బ్రిడ్జి కూలిపోయి పలువురు దుర్మరణం చెందిన ఉదంతం నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అప్రమత్తమైంది. లక్షలాది మంది రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్లో వంతెన అవసరాన్ని గుర్తించారు. దీంతో గత సంవత్సరం జూన్‌లో రైల్వే మంత్రి పియూష్ గోయల్ నాలుగో వంతెనకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు మల్టి లెవల్ పార్కింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు వంతెన పనులను చేపట్టారు. ఇకపై నేరుగా రాకపోకలు.. ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ బయటి వైపు నుంచి బోయిగూడ వైపు ఉన్న పదో నెంబర్ ప్లాట్‌ఫామ్ బయటి వైపు నేరుగా రాకపోకలు సాగించే విధంగా కొత్త వంతెన నిర్మిస్తున్నారు. అంటే రైల్వేస్టేషన్ లోపలికి వెళ్లాల్సిన అవసరం లేని వాళ్లు నేరుగా ఇటు నుంచి బోయగూడ వైపు వెళ్లిపోవచ్చు. అంటే ఒలిఫెంటా బ్రిడ్జి కింద నుంచి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది పాదచారుల కోసం చేసిన సదుపాయం. అదే సమయంలో ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పైకి కూడా వెళ్లవచ్చు. నాలుగో వంతెన నుంచి ప్రతి ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు వీలుగా ఎంట్రెన్స్ ఏర్పాటు చేస్తారు. 676 మీటర్ల పొడవు ఉన్న సికింద్రాబాద్ స్టేషన్లో ప్రతిరోజు సుమారు 220 రైల్లు నడుస్తాయి. 1.95 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. మొత్తం 10 ప్లాట్‌ఫామ్‌లకు ఇప్పుడు మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మాత్రమే ఉన్నాయి. ఒకేసారి నాలుగైదు రైళ్లు స్టేషన్‌కు చేరుకుంటే ఒక్కసారిగా బ్రిడ్జిలు కిక్కిరిసిపోతాయి. ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లడమే తప్ప ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై నుంచి నడిచి వెళుతున్నట్లుగా ఉండదు. పైగా మూడు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఒక్క దానిపైనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే సమయంలో ఏ చిన్న ఉపద్రవం జరిగినా ముంబై తరహాలో ముప్పు తప్పదని అప్పట్లో నిపుణుల ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. నాలుగో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఇది కేవలం ప్రయాణికులకే కాకుండా ఇరువైపులా రాకపోకలు సాగించే పాదచారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఆర్టీసీతో అనుసంధానం దూర ప్రాంతాలకు వెళ్లే వారితో పాటు, ఎంఎంటీఎస్ ప్రయాణికులకు కూడా నాలుగో వంతెన వల్ల ఊరట లభించనుంది. మరోవైపు ఉప్పల్, మల్కాజిగిరి, లాలాపేట్, ఎల్బీనగర్, ఘట్కేసర్, తదితర ప్రాంతాలకు వెళ్లే సిటీ బస్సు ప్రయాణికులు ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు నుంచి నేరుగా బోయిగూడ వైపు వచ్చి బస్సు ఎక్కేందుకు అవకాశం ఉంటుంది. రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనూ, రేతిఫైల్ బస్టేషన్ వద్ద ప్రతిరోజు సుమారు 1500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. వేలాది మంది ప్రయాణికులు నిత్యం స్టేషన్‌కు ఇటు వైపు నుంచి అటు వైపు వెళ్లక తప్పదు. ఇప్పటి వరకు ఒలిఫెంటా బ్రిడ్జి నుంచి వెళ్లే వారు నేరుగా స్టేషన్ ఒకటో నంబర్ నుంచి పదో నంబర్ వైపునకు చేరుకోవచ్చు. -
రైలు వచ్చిందా.. ప్రాణం గోవిందా!
సాక్షి,కవిటి(శ్రీకాకుళం) : తరాలు మారినా ఆ రెండు గ్రామాల ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. ఫుట్ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో బసవపుట్టుగ, బసవకొత్తూరు గ్రామాల ప్రజలు నిత్యం ప్రాణాలు పణంగా పెట్టి రైల్వే ట్రాక్‌ను నిత్యం దాటుతూ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన జాడుపుడి రైల్వేస్టేషన్‌కు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి సేవలు లేకపోవడంతో ప్రజల అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఈ ట్రాక్‌లో గూడ్స్ రైళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దయనీయ స్థితిని మార్చాలని మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఇరుగ్రామాల ప్రజలు వాపోతున్నారు. -
అలంకారప్రాయంగా ఫుట్ఓవర్ బ్రిడ్జీలు
సాక్షి,బీబీనగర్: జాతీయ రహదారి విస్తరణ జరిగిన అనంతరం ప్రజలు రహదారులను దాటేందుకు ఏర్పాటు చేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జీలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. మండలంలోని కొండమడుగు మెట్టు ,గూడూరు గ్రామాల వద్ద పుట్ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయగా ఇవి రెండు బస్‌స్టాప్‌లకు దూరంగా ఉండడంతో ప్రయాణికులు వాటిని వినియోగించుకోవడం లేదు. జాతీయ రహదారిపై ఉన్న బస్‌స్టాప్‌లకు ఆమడ దూరంలో ఫుట్ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయడంతో ప్రజలు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిరుపయోగంగా మారుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.. ప్రయాణికులకు అనువైన చోట ఫుట్‌ఓవర్‌బ్రిడ్జీలు నిర్మించకపోవడంతో ప్రయాణికులు వాటిని వినియోగించడంతో లేదు. దీంతో బ్రిడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. బస్‌స్టాప్‌కు, చౌరస్తాలకు దూరంగా ఉండడంతో రాత్రి వేళల్లో మందు బాబులు వాటి పైన కూర్చొని మద్యం తాగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణికులకు ఉపయోగపడాల్సిన ఫుట్‌ఓవర్‌బ్రిడ్జీలు అనుకూలమైన చోట ఉండకపోవడంతో పార్టీల బ్యానర్లు కట్టుకోవడానికి, మద్యం బాబులకు, భిక్షాటకులకు ఉపయోగపడుతున్నాయని పలువురు వాపోతున్నారు. నిత్యం జరుగుతున్న ప్రమాదాలు.. ఫుట్ఓవర్ బ్రిడ్జీలు దూరంగా ఉండడంతో ప్రయాణికులు వాటిని వినియోగించుకోకుండా నేరుగా ప్రదాన చౌరస్తాల వద్ద రోడ్డును దాటుతూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు.కొండమడుగు మెట్టు, బీబీనగర్, గూడూరులో రోడ్డును దాటుతూ ప్రాణాలు కోల్పొయిన సంఘటనలు ఉన్నాయి. ప్రధానంగా బీబీనగర్‌లో నిత్యం రోడ్డును దాటుతూ గాయాల బారిన పడుతున్న ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఎస్కలేటర్ ఏర్పాటు ఎప్పుడో..? ఫుట్ ఓవర్ బ్రిడ్జీల మెట్లు ఎక్కడానికి వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతుండడంతో సమస్యను గుర్తించిన స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రదాన చౌరస్తాల వద్ద ఎస్కలేటర్లను ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులకు విన్నవించారు. దీంతో కొండమడుగు, బీబీనగర్, వద్ద ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం కోసం స్థలాలను పరిశీలించినప్పటికి నేటికీ ఆదిశగా చర్యలు లేవు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం బీబీనగర్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేకపోవడం, సర్వీస్ రోడ్లపై సరైన వసతులు లేకపోవడంపై హైవే అధికారులకు విన్నవించి వినతి పత్రం అందజేశాం. ఫుట్ఓవర్ బ్రిడ్జీలు బస్‌స్టాప్‌లకు దూరంగా ఉండడంతో ఎవరూ వినియోగించుకోలేకపోతున్నార – భాగ్యలక్ష్మి, సర్పంచ్, బీబీనగర్ -
ముంబై వాసులు సహనం వీడాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ముంబై వాసులది ఎంత సహనం అంటే, వారి సదుపాయాలను, వారి భద్రతను కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విస్మరించేంత వరకు దారితీసిన సహనం’ అని ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నరేశ్ పాటిల్ గురువారం నాడు వ్యాఖ్యానించారు. నగరంలో రైల్వే వంతెనలు, డ్రైనేజీకి సంబంధించిన మ్యాన్‌హోల్స్ కారణంగా నగరవాసులు మృత్యువాత పడుతున్నారని, ఎన్నిసార్లు వీటి గురించి ఫిర్యాదు చేస్తున్నా ఫలితం ఉండడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంపై ప్రధాని న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ నరేశ్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేసిన గురువారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో నగరంలోని ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్‌లోని పాదాచారుల వంతెన కూలిపోయి అరుగురు ప్రయాణకులు మరణించారు. కనీసం 21 మంది గాయపడ్డారు. కూలిపోయిన వంతెన పక్కనే మున్సిపల్ కమిషనర్ అజయ్ మెహతా కార్యాలయం ఉంది. అయినా ఆయన కొన్ని గంటల వరకు మీడియాకు అందుబాటులోకి రాలేదు. 21 మంది గాయపడ్డారు. రోడ్డు నిర్మాణంలో, మరమ్మతుల్లో నాణ్యత ఉండడం లేదంటూ ముంబై హైకోర్టు కూడా గతంలో అనేక సార్లు మున్సిపల్ అధికారులను హెచ్చరించింది. అయినా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకప్పుడు ముంబై వాసులకు మంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేవి. మున్సిపాలిటీ అధికారులు, పాలకులు ఈ బస్సు సర్వీసులను పట్టించుకోవడం మానేసి మౌలిక సదుపాయాలంటూ రోడ్లు విస్తరిస్తూ ప్రైవేటు వాహనాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో రోడ్లపై రద్దీ పెరిగింది. ఫలితంగా కాలుష్యం పెరిగింది. ట్రాఫిక్ జామ్‌లు పెరిగాయి. కేంద్ర మధ్య రైల్వేలైన్‌లోని కుర్లా రైల్వే స్టేషన్‌కు, పశ్చిమ లైన్‌లోని బండ్రా లైన్‌కు నేడు సరైన బస్సు సదుపాయం లేకుండా పోయింది. ఇరుకైన రోడ్లలో కిలోమీటరున్నర దూరం నుంచి పాదాచారాలు నడుచుకుంటూ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇదిలావుంటే ముంబై సముద్ర తీరాన 29.2 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాలని పాలకులు నిర్ణయించారు. ఇందులో పది కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేయడానికి 12,700 కోట్ల రూపాయలను కేటాయించారు. అంటే కిలో మీటరుకు 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందన్న మాట. మొత్తం నగర జనాభాలో 1.25 శాతం మంది ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఈ రోడ్డుకు ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం సమంజసమా ? నగరంలో అన్ని రోడ్లను, వంతెనలను అభివృద్ధి చేసిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టులను చేపడితే ఎవరు శంకించరు. ఇక ముంబై సహనం వీడాల్సిన సమయం వచ్చింది. (చదవండి: ఈ ఘోరానికి బాధ్యులెవరు?) -
ఈ ఘోరానికి బాధ్యులెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై నగరంలో గత రెండేళ్ల కాలంలో ఆరు రైల్వే వంతెనలు కూలిపోయాయి. వాటిలో మూడు వంతెనల ప్రమాదాల్లో పలువురు ప్రయాణికులు మరణించారు. గురువారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్‌లోని పాదాచారుల వంతెనపై ఓ భాగం హఠాత్తుగా కూలిపోవడంతో ఆరుగురు మరణించడం, 30 మంది గాయపడడం తెల్సిందే. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన పరిస్థితి ఎలా ఉందో అన్న విషయమై ‘బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్’ ఆరు నెలల క్రితమే అధ్యయనం జరిపి ‘ఇప్పట్లో ఈ వంతెనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ప్రయాణికులు ఈ వంతెనను నిర్భయంగా ఉపయోగించుకోవచ్చు’ అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. (కూలిన ‘కసబ్’ బ్రిడ్జి) ఇప్పుడు ఈ వంతెన కూలినందుకు ‘మీరు బాధ్యులంటే మీరు బాధ్యులు’ అంటూ స్థానిక రైల్వే సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది నిందలు వేసుకుంటున్నారు. ‘వంతెన నిర్వహణ బాధ్యత మీదంటే మీదే కనుక మీరే బాద్యులు’ ఇరు వర్గాలు దూషించుకుంటుంటే, మరోపక్క వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదంటూ మున్సిపాలిటీ ఎలా ‘ఆడిట్ సర్టిఫికెట్’ ఇచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ముంబై నగరంలోనే ఇన్ని ప్రమాదాలు జరిగి ఇంత మంది చనిపోయినా పాలకులకు బుద్ధి రాలేదా? అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, మున్సిపాలిటీపై బిజేపీ మిత్రపక్షమైన శివసేన ఆధిపత్యం కొనసాగుతున్న విశయం తెల్సిందే. ఈ వంతెనల ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కేవలం 18 నెలల క్రితమే పరేల్స్ ప్రతిభాదేవి రైల్వే స్టేషన్‌లోని పాదాచారుల వంతెనపై తొక్కిసలాట జరిగి 23 మంది ప్రయాణికులు మరణించారు. ఆ తర్వాత జూలై మూడవ తేదీన అంధేరి రైల్వేస్టేషన్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే పొడువైన వంతెనలో ఓ భాగం కూలిపోగా ఓ మహిళ మరణించారు. దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పురాతన వంతెనల మరమ్మతులను ఎందుకు చేపట్టడం లేదని సోషల్ మీడియా తీవ్రంగా నిలదీసింది. ముఖ్యంగా బీజేపీ అధికార ప్రతినిధి సంజూ వర్మ ‘టైమ్స్ నౌ’ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వంతెన ప్రమాదం ‘ప్రకృతి వైపరీత్యం’గా అభివర్ణించడాన్ని, కూలిపోవడంలో పాదాచారుల తప్పిదం ఉందనడాన్ని మరింత ఎండగట్టింది. సంజూ వర్మ సిగ్గూ శరం ఉందా ? అంటూ విమర్శించింది. ‘ఇంకా నయం జవహర్ లాల్ నెహ్రూ బాధ్యుడని చెప్పలేదు’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. -
కూలిన ‘కసబ్’ బ్రిడ్జి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) నుంచి అంజుమన్ కాలేజీ, టైమ్స్ ఆప్ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం గురువారం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, సీఎం ఫడ్నవీస్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రద్దీగా ఉండగా కుప్పకూలిన వంతెన ముంబైలోని సీఎస్టీ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను ‘కసబ్ బ్రిడ్జి’గా వ్యవహరిస్తారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. ముంబైలో గురువారం విధులు ముగించుకున్న ఉద్యోగులు, కార్మికులు ఈ వంతెనపై నుంచి ఇళ్లకు బయలుదేరారు. సరిగ్గా రాత్రి 7.30 గంటల సమయంలో బ్రిడ్జిపై పాదచారులు వెళుతుండగా వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురు పాదచారులు అంతెత్తు నుంచి రోడ్డుపై పడిపోయారు. ఈ సందర్భంగా బ్రిడ్జి శిథిలాలు కుప్పకూలడంతో పాదచారులంతా వాటికింద చిక్కుకున్నారు. అప్పటికే ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద నడుచుకుంటూ వెళుతున్న పలువురు వ్యక్తులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో పాదచారుల హాహాకారాలతో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను శిథిలాల కింద నుంచి వెలికితీసి ఆసుపత్రులకు తరలించారు. మృతులను అపూర్వ ప్రభు(35), రంజనా తంబ్లే(40), భక్తి షిండే(40) జహీద్ షిరాద్ ఖాన్(32), టి.సింగ్(35)గా గుర్తించారు. ఇంకొకరి వివరాలు తెల్సియాల్సి ఉంది. ముంబైలో ఇలాంటి ప్రమాదాలు కొత్తకాదు. 2017, సెప్టెంబర్ 29న ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే బ్రిడ్జిపై తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 23 మంది చనిపోయారు. అలాగే 2018, జూలై 3న అంధేరీ ప్రాంతంలోని 40 ఏళ్ల పాతదైన గోఖలే పాదచారుల వంతెన కూలిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీగా స్తంభించిన ట్రాఫిక్.. సీఎస్టీ మార్గంలో పాదచారుల బ్రిడ్జి కూలిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ సందర్భంగా డీఎన్ రోడ్డు, జేజే ఫ్లైఓవర్ మీదుగా రాకపోకలు సాగించవద్దని వాహనదారులకు సూచించారు. ఇక్కడ రోడ్డు పునరుద్ధరణ పనులు సాగుతున్నందున ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతులకు రూ.5 లక్షల పరిహారం.. ముంబై దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 పరిహారం అందజేస్తామన్నారు. ఈ ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై బృహన్ ముంబై కార్పొరేషన్, రైల్వేశాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తాయన్నారు. కాపాడిన రెడ్ సిగ్నల్ కసబ్ బ్రిడ్జి దుర్ఘటనలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ భారీగా ప్రాణనష్టాన్ని నివారించింది. ఫుట్ఓవర్ బ్రిడ్జి కూలిపోవడానికి కొద్దినిమిషాల ముందు ఎరుపురంగు ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దీంతో సీఎస్టీ రైల్వేస్టేషన్ సమీపం నుంచి ఇళ్లకు వెళుతున్న వాహనాలన్నీ నిలిచిపోయాయి. మరికాసేపట్లో సిగ్నల్ మారబోతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ సందర్భంగా బ్రిడ్జి కింద ఎవరూ లేకపోకపోవడంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. ఈ విషయమై ఓ వాహనదారుడు మాట్లాడుతూ..‘రెడ్ సిగ్నల్ పడటంతో మేమంతా ఇళ్లకు వెళ్లేందుకు అసహనంగా ఎదురుచూస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్ ఆకుపచ్చ రంగులోకి మారకముందే బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. ఒకవేళ అప్పుడు వాహనాలు ఈ మార్గంలో వెళుతుంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది’ అని తెలిపారు. మరో ప్రత్యక్ష సాక్షి స్పందిస్తూ.. గురువారం ఉదయమే ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టారనీ, అంతలోనే రాకపోకలకు అనుమతి ఇచ్చారని వ్యాఖ్యానించారు. -
ముంబైలో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి
-
కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి,ఒకరు మృతి
-
కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఇద్దరు మృతి
సాక్షి, ముంబై: ముంబైలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. చత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, సుమారు 25మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్నావారిని రక్షించి సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సాయంత్రం బాగా బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. Foot over bridge connecting CST platform 1 north end with B T Lane near Times of India building has collapsed. Injured persons are being shifted to hospitals. Traffic affected. Commuters to use alternate routes. Senior officers are on spot. — Mumbai Police (@MumbaiPolice) March 14, 2019 -
ఈజీ క్రాసింగ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రోడ్డు దాటేందుకు పలు ఇబ్బందులు పడుతున్న పాదచారులకు కొన్ని ప్రాంతాల్లో త్వరలో ఉపశమనం లభించనుంది. మొత్తం 60 రద్దీ ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు అవసరమైన 52 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు(ఎఫ్ఓబీ), 8 జంక్షన్లలో స్కైవేలు నిర్మించేందుకు రూ. 207.71 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం దాదాపు ఐదునెలల క్రితం పరిపాలన అనుమతులు మంజూరు చేయగా...జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా ఈ టెండర్లు పిలవగా, వీటిల్లో మొదటి ప్యాకేజీ టెండర్లు పూర్తయ్యాయి. టెండరు దక్కించుకున్న ఏజెన్సీకి త్వరలో వర్క్ ఆర్డర్ ఇవ్వనున్నారు. అగ్రిమెంట్ పూర్తయ్యాక ఏడెనిమిది నెలల్లోగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. మొదటి ప్యాకేజీలో భాగంగా 11 ఫ్లై ఓవర్లతో పాటు ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద స్కైవేను కూడా నిర్మించనున్నారు. వీటన్నింటి అంచనా వ్యయం రూ. 47.80 కోట్లు. ఈ ఎఫ్‌ఓబీలు, స్కైవే అందుబాటులోకి వస్తే మొత్తం 12 రద్దీ ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఎట్టకేలకు.. నగరంలో పలు రద్దీప్రాంతాల్లో రోడ్డు దాటలేక పాదచారులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రోడ్డు దాటుతుండగా, ప్రమాదాల బారిన పడుతున్న వారూ అధికసంఖ్యలోనే ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఆయా ప్రాంతాల్లో పాదచారులు రోడ్డు దాటేందుకు ఎఫ్‌ఓబీలు నిర్మించేందుకు ఎంతోకాలంగా ప్రయత్నాలు జరిగినా ఆచరణకు నోచుకోలేదు. వివిధ కారణాలతో నిర్మాణం ప్రారంభం కాక లక్ష్యం నీరుగారిపోయింది. గతంలో పీపీపీ పద్ధతిలో నిర్మించాలనుకున్నారు. వాటివల్ల పాదచారుల ఉపయోగం కంటే టెండరు దక్కించుకున్న ఏజెన్సీల వ్యాపార ప్రకటనలే ఎక్కువవుతాయని భావించి, టెండరు నిబంధనలు మార్చారు. వాటి మేరకు వ్యాపార ప్రకటనల ఆదాయం పెద్దగా ఉండదు. దాంతో ఏజెన్సీలు ముందుకు రాలేదు. ఈనేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలోనే ఎఫ్‌ఓబీలు నిర్మించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీలో నిధుల లేమి తదితర కారణాలతో 44 ఎఫ్ఓబీల నిర్మాణం హెచ్ఎండీఏకు అప్పగించినా, అదీ చేతులెత్తేసింది. కేవలం ఐదు తప్ప మిగతా 39 ప్రాంతాల్లో నిర్మాణం తాము చేయలేమని పేర్కొంది. వాటితో సహ మొత్తం 52 ఎఫ్‌ఓబీలు, 8 జంక్షన్ల నిర్మాణ బాధ్యతల్ని జీహెచ్ఎంసీకే అప్పగించింది. వీటిల్లో 39 ఎఫ్ఓబీలకయ్యే వ్యయాన్ని హెచ్ఎండీఏ, మిగతా వ్యయాన్ని జీహెచ్ఎంసీ భరిస్తుంది. త్వరలో పనులు.. మొత్తం 52 ఎఫ్‌ఓబీలు, 8 స్కైవేలకు నాలుగుప్యాకేజీలుగా టెండర్లు ఆహ్వానించారు. వీటిల్లో మొదటి ప్యాకేజీ టెండర్లు పూర్తయ్యాయి. పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మిగతా మూడు ప్యాకేజీల టెండర్లు ఈనెలాఖరుకు పూర్తికానున్నాయని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. మొదటి ప్యాకేజీలో భాగంగా ఎఫ్‌ఓబీలు, స్కైవే నిర్మించనున్న ప్రాంతాలు.. ♦ చక్రిపురం క్రాస్‌రోడ్స్(నాగారం) ♦ హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, రామంతాపూర్ ♦ నోమా ఫంక్షన్‌హాల్, మల్లాపూర్ ♦ సాయిసుధీర్ కాలేజ్ బస్టాప్(ఏఎస్‌రావునగర్) ♦ విశాల్‌మార్ట్, రామంతాపూర్ ♦ ఎస్బీఐ, హబ్సిగూడ ♦ సుష్మ థియేటర్, వనస్థలిపురం ♦ దిల్సుఖ్నగర్ బస్టాప్ ♦ కొత్తపేట ఫ్రూట్‌మార్కెట్ ♦ సరూర్‌నగర్ స్టేడియం ♦ వర్డ్ అండ్ డీడ్ స్కూల్, హయత్‌నగర్ ♦ స్కైవే (ఉప్పల్ రింగ్‌రోడ్) వీటిల్లో చక్రిపురం క్రాస్‌రోడ్స్, నోమా ఫంక్షన్‌హాల్, సుష్మ థియేటర్, దిల్సుఖ్నగర్ బస్టాప్, కొత్తపేట ఫ్రూట్‌మార్కెట్, సరూర్‌నగర్ స్టేడియం, వర్డ్ అండ్ డీడ్ స్కూల్ల వద్ద ఎఫ్ఓబీలతోపాటు ఉప్పల్ స్కైవే వద్ద ఎస్కలేటర్లను సైతం నిర్మించనున్నారు. -
హోర్డింగులపై నిషేధం
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని రకాల హోర్డింగ్‌లు, యూనిపోల్స్, ఆర్చిలు, ఆబ్లిగేటరీ స్పాన్లు, యూనిస్ట్రక్చర్స్, కాంటిలివర్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై ప్రకటలను నిషేధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలివర్షాలు, ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు కూలడం, యూనిపోల్స్‌పై వినైల్ ఫ్లెక్సీ బ్యానర్లు చిరిగి చెల్లాచెదురుగా వేలాడటం వంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. వాటి వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతోపాటు రహదారులపై ప్రయాణించే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిందని కమిషనర్ తెలిపారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించిన వీటినుంచి తగిన భద్రత కల్పించేందుకు, ప్రమాదాలు జరుగకుండా నిరోధించేందుకు శుక్రవారం నుంచే నిషేధం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ నిషేధం ఆగస్టు 14వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. హోర్డింగ్‌లు, యూనిపోల్స్, ఆర్చిలు, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, ఆబ్లిగేటరీ స్పాన్లపై ప్రస్తుతం ఉన్న ఫ్లెక్సీ బ్యానర్లను వెంటనే తొలగించాల్సిందిగా జనార్దన్‌రెడ్డి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలను ఆదేశించారు. -
పైపులైనే రహదారి
ఫతేనగర్ శివాలయం రోడ్డు నాలాపై ఉన్న పైప్‌లైనే వారికి దారి..స్థానికులు దానిపైనే రాకపోకలు సాగిస్తుంటారు. ఫతేనగర్ నుండి బాలనగర్‌కు వేళ్లే కార్మికులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. బ్రిడ్డి పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ సమస్య నెలకొంది. గతంలో అనేకమంది ఇందులో పడి గాయపడిన సంఘటనలూ ఉన్నాయి. – ఫొటోలు : నోముల రాజేష్ రెడ్డి -
అమెరికాలో కుప్పకూలిన వంతెన
మయామి: అమెరికాలోని మయామిలో వారం క్రితమే నిర్మాణం పూర్తయిన పాదచారుల వంతెన కూలిన దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీని విద్యార్థుల వసతి గృహంతో కలుపుతున్న ఈ బ్రిడ్జి గురువారం రద్దీగా ఉన్న రహదారిపై అమాంతం కుప్పకూలింది. దీని కింద పలు కార్లు, వాహనాలు నలిగిపోయాయి. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలు లభించాయని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. మరో పది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. బ్రిడ్జి రెండు చివరలకు మద్దతుగా ఉన్న నిర్మాణాలు కూడా ఏ క్షణమైనా కింద పడిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జి ఉన్నపళంగా నేలకొరుగుతున్న వీడియోను సీఎన్ఎన్ విడుదల చేసింది. సుమారు 950 టన్నుల బరువున్న బ్రిడ్జి కింద కనీసం 8 కార్లు, రెండు ట్రక్కులు చిక్కుకున్నట్లు తెలిసింది. వంతెన కూలిపోయినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని, తొలుత బాంబు పేలిందని అనుకున్నామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బ్రిడ్జిని మోస్తున్న కేబుల్స్ వదులయ్యాయని, వాటిని బిగుతు చేస్తుండగా అది కూలిపోయిందని ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియో ట్వీట్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వారు వెంటనే స్పందించి శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను బయటికి తీసుకొచ్చేందుకు సాయం చేసినట్లు తెలిపారు. గత శనివారమే పూర్తిస్థాయిలో సిద్ధమైన ఈ బ్రిడ్జిని 2019లో పాదచారులకు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. -
కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. నలుగురు మృతి
-
కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి
-
ఘోర ప్రమాదం.. కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి
ఫ్లోరిడా : మియామిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 9 మందికి తీవ్ర గాయాలుకాగా వారిని ఆస్పత్రికి తరలించారు. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జి కింద పదుల సంఖ్యలో వాహనాలు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సిటీ ఆఫ్ స్వీట్వాటర్ను అనుసంధానించి విద్యార్థులు దాటేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించగా.. తాజాగా దీనిని ప్రారంభించారు. సెల్ఫ్ ప్రొపెల్డ్ మాడ్యూలర్ ట్రాన్స్ పోర్టేషన్ విధానంలో అమెరికాలో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే కావటం గమనార్హం. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Continuing to monitor the heartbreaking bridge collapse at FIU - so tragic. Many brave First Responders rushed in to save lives. Thank you for your courage. Praying this evening for all who are affected. — Donald J. Trump (@realDonaldTrump) March 15, 2018 -
చిన్నతిరుపతిలో.. చిరుత జాడలు
స్థానికులు, భక్తుల భయాందోళనలు అటవీ అధికారుల రాక, పులి సంచారంపై ఆరా బోన్లు ఏర్పాటు చేసి పట్టుకుంటాం: రేంజ్ ఆఫీసర్ దేవరపల్లి: శ్రీవారి శేషాచలకొండ సమీప ప్రాంతంలో చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. దీంతో స్థానికులు, భక్తులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. చిరుత సంచరిస్తున్న ఈ ప్రాంతంలో సెయింట్ గ్జేవియర్ పాఠశాల ఉండటంతో విద్యార్ధులు, ఉపాధ్యాయులు భీతిల్లుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో పులి జాడలు తీవ్ర అలజడిని రేపుతున్నాయి. చిరుత అడుగు జాడలను మంగళవారం గుర్తించిన స్థానికులు సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. ఇటీవల మండలంలోని తిరుమలంపాలెంలో కొందరు రైతులు పెట్టిన గుళికలు తిని చిరుతపులి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ముందెన్నడు పులి జాడలు కనిపించని ఈ ప్రాంతంలో చిరుత మృతి అటవీశాఖ అధికారులను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. ఇప్పుడు తాజా సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ పి.సూర్యప్రకాశరావు (ఏలూరు), డిప్యుటీ రేంజ్ ఆఫీసర్ సీహెచ్.శ్రీనివాసరావు (నల్లజర్ల), దూబచర్ల బీట్ ఆఫీసర్ మెహబూబ్, నల్లజర్ల బీట్ ఆఫీసర్లు బి.కోటేశ్వరరావు, డి.రాజేష్, వెంకటరామన్నగూడెం బీట్ ఆఫీసర్ ఎస్కే.సయ్యద్ బాజీలు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత జాడలను క్షుణ్ణంగా పరిశీలించారు. పులి సంచారంపై స్థానికులను ఆరా తీశారు. వారంతా రాత్రి వరకు ఇక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఎం.వాసు, అవనిగడ్డ రమేష్, ఫాదర్ డేవిడ్ తదితరులు మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా పులిజాడలు కనిపిస్తున్నాయని, సోమవారం రాత్రి వర్షం కురవడంతో అవి మరింత ఎక్కువగా కనిపించాయని అధికారులకు తెలిపారు. ఇప్పటి వరకు ఏవిధమైన ప్రాణహానీ కలగనప్పటికీ తమకు భయంగా ఉందని అధికారులకు చెప్పారు. దీంతో రేంజ్ ఆఫీసర్ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ రాజమండ్రిలోని వైల్డ్ లైఫ్‌లో ఉన్న పులి బోన్లను తీసుకొచ్చి చిరుతను పట్టుకుంటామని తెలిపారు. అప్పటి వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, రాత్రి సమయాల్లో సిబ్బంది బీట్ నిర్వహిస్తారన్నారు. పాదయాత్ర భక్తుల్లో గుబులు ః అటవీ ప్రాంతమైన దూబచర్ల మీదుగానే నిత్యం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీవారి క్షేత్రానికి వస్తుంటారు. ఇటీవల కాలంలో పాదయాత్ర భక్తుల సంఖ్య పెరిగింది. అయితే ఇప్పటి వరకు కలగని క్రూరమృగాల భయం ఇప్పుడు పాదయాత్ర భక్తుల్లో ఏర్పడింది. అటవీశాఖ అధికారులు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. చిరుతలు.. ఇంకెన్నో.. ః తిరుమలంపాలెంలో చిరుతపులి మృతి తరువాత అటవీశాఖ అధికారులు దానికి తోడుగా మరో పెద్ద చిరుత ఉంటుందని, అది కూడా ఈ ప్రాంతంలోనే సంచరించే అవకాశం ఉందని సూచన ప్రాయంగా చెప్పారు. ఇటీవల చిరుత అలజడులు కూడా అక్కడక్కడ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మంగళవారం శేషాచలకొండ సమీప ప్రాంతంలో కనిపించిన జాడలు పలు అనుమానాలను కలిగిస్తున్నాయి. పులి వేసిన అడుగులను కొలిచిన అధికారులు అది 46 నుంచి 48 సెంటీమీటర్లు పొడవు ఉంటుందని ధృవీకరించారు. దీన్ని బట్టి చూస్తే ఇది అంత పెద్ద చిరుత కాదని కొందరు అటవీ సిబ్బంది చెబుతున్నారు. అలాంటప్పుడు ఇటీవల చనిపోయిన చిరుతకు ఇది తోడు కాకపోవచ్చని, వాటి పిల్లలు అయ్యే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తల్లి పులి ఏమైందని, అసలు ఇంకెన్ని చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయనేది సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏది ఏమైనా ఈ పులి భయాన్ని నివారించే దిశగా అధికారులు తగు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
కుప్పకూలిన బ్రిడ్జి.. నదిలో మొసళ్లు!
దక్షిణ గోవాలోని ఒక బ్రిడ్జి కుప్పకూలడంతో ఆ సమయానికి దానిమీద ఉన్న దాదాపు 50 మంది నీళ్లలో పడిపోయారు. దక్షిణ గోవాలోని కర్చోరం ప్రాంతంలో సన్వోర్డెమ్ నదిపై పోర్చుగీసువారి పాలనలో నిర్మించిన పాదచారుల వంతెన ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే కూలిపోయింది. ఈ నది జువారి నదికి ఉపనది. వాస్తవానికి నాలుగేళ్ల క్రితమే ఈ వంతెనను మూసేశారు. కానీ పాదచారులు మాత్రం ఇప్పటికీ దాన్ని ఉపయోగిస్తున్నారు. గురువారం సాయంత్రం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని రక్షించినా, చాలామంది అక్కడే గుమిగూడి చూస్తూ ఉండటంతో.. ఆ బరువును తట్టుకోలేక బ్రిడ్జి కూలిపోయింది. వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది, నౌకాదళ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు మునిగిపోగా, 20 మంది వరకు సురక్షితంగా ఈదుకుంటూ బయటపడ్డారు. మరో 14 మందిని నౌకాదళ బృందాలు కాపాడాయి. అయితే.. సరిగ్గా బ్రిడ్జి కింద ఉన్న నదిలో మొసళ్లు ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానికులు గమనించి రక్షణ చర్యల్లో ఉన్న సిబ్బందికి తెలిపారు. దాంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. మొసళ్లను గుర్తించేందుకు ప్రత్యేకమైన పెట్రోలింగ పడవలను రంగంలోకి దించారు. అలాగే మునిగిపోయినవారిని కాపాడేందుకు చేతక్ హెలికాప్టర్లు కూడా వచ్చాయని నౌకాదళ ప్రతినిధి ఒకరు చెప్పారు. కనీసం ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదని, నది పొడవునా ఆకాశ మార్గంలో హెలికాప్టర్ల ద్వారా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు. సాయంత్రం తర్వాత చీకటి పడటంతో సెర్చ్ ఆపరేషన్లను నిలిపివేశారు. -
11 ప్రాంతాల్లో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో పాదచారులు రహదారులు దాటేందుకు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు..11 ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ)ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. పబ్లిక్, ప్రైవేట్, భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో వీటిని చేపట్టనున్నారు. నగరంలో ముఖ్యమైన జంక్షన్లు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న 11 ప్రాంతాల్లో ఎఫ్ఓబీల ఏర్పాటుకు వీటిని ఆహ్వానించారు. ఏడాది క్రితం జీహెచ్ఎంసీ నిధులతోనే ఎఫ్‌ఓబీలను ఏర్పాటుచేయాలనుకున్నారు. అనంతరం మారిన నిర్ణయంతో పీపీపీ పద్ధతిలో వీటిని ఏర్పాటుచేసే సంస్థలకే ప్రకటనల ఆదాయం పొందే వెసులుబాటు కల్పించనున్నారు. టెండర్ల దాఖలుకు చివరి తేదీ ఈనెల 25 కాగా, 17వ తేదీన ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. ఎఫ్‌ఓబీలు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలు.. 1. రామకృష్ణా మఠం,ఇందిరాపార్కు ఎదుట, దోమల్‌గూడ. 2. దివ్యశ్రీ, ఎన్ఎస్ఎల్ సెజ్ దగ్గర, గచ్చిబౌలి. 3. చిలకలగూడ సర్కిల్, ముషీరాబాద్ వైపు. 4. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ఎదుట, అమీర్‌పేట. 5. గ్రీన్లాండ్స్ అతిథిగృహం ఎదుట, బేగంపేట. 6. ఐడీపీఎల్ బస్టాప్, ప్రశాంత్‌నగర్. 7. జేఎన్ఏఎఫ్ఏయూ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్– మహవీర్ హాస్పిటల్. 8. రాజీవ్‌గాంధీ రోటరీ– ఫోరమ్ సుజనా మాల్, కేపీహెచ్‌బీ 6వ ఫేజ్. 9. సైబర్ గేట్‌వే దగ్గర, హైటెక్‌సిటీ. 10. చెన్నయ్ షాపింగ్‌మాల్ దగ్గర, మదీనాగూడ. 11. హైదరాబాద్ సెంట్రల్‌మాల్ దగ్గర, పంజగుట్ట. -
ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఆందోళనలు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజీ ముందు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం కళాశాల ప్రధాన గేటు నుంచి సుమారు వెయ్యి మంది నినాదాలు చేస్తూ ప్రధాన రోడ్డుపై ఆందోళన చేశారు. ఈ రోడ్డులో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత అదే నెలలో ఇదే ప్రాంతంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు. తాము పలుమార్లు సంబంధిత అధికారులను కలిసి పరిస్థితిని వివరించి.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరాన్ని చెప్పామని అయినా అధికారుల్లో చలనం లేదని దుయ్యబట్టారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డిని కలిసి సమస్యను వివరించామన్నారు. కాగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు రోడ్డెక్కడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అక్కడి నుంచి పంపించారు. -
పుట్ ఓవర్‌బ్రిడ్జి కలేనా?
సంవత్సరాల తరబడి జాప్యం ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్న రైల్వే శాఖ ఇబ్బందులు పడుతున్న ప్రజలు ప్రమాదకర పరిస్థితిలో ప్రజలు పట్టాలు దాటుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. నిర్మించిన రెండు బ్రిడ్జిలు ప్రజలకు ఉపయోగపడటంలేదు. నిధులు మంజూరైనా నిర్మాణం చేపట్టకపోవడంపై సామాజిక వేత్తలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అనుకోని ఘటన జరగకముందే అధికారులు చర్యలు తీసుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జిన నిర్మించాల్సిన అవసరం ఉంది. జహీరాబాద్ టౌన్:జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్‌బ్రిడ్జిని నిర్మించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణం చేపట్టడంలేదు. దీంతో నిత్యం ప్రయాణికులు, పట్టణ ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. పట్టణం విస్తరించడంతో ప్రస్తుతం రైల్వేస్టేషన్ పట్టణం నడిమధ్యలో ఉంది. దీంతో రాకపోకలు సాగించేందుకు పట్టాలను దాటాల్సి వస్తుంది. ప్రమాదమని తెలిసినా విధిలేని పరిస్థితుల్లో ప్రజలు పట్టాలను దాటుకుంటూ వెళుతున్నారు. ఫ్లాట్ఫాంపైకి వెళ్లాలంటే వృద్ధులు, మహిళలు, చిన్నారుల ఇబ్బంది వర్ణనాతీతం. ఒక్కోసారి గూడ్సు రైలు ఆగి ఉన్నసమయంలో రైలుకింద నుంచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏడాది క్రితం రైలు కింద నుంచి వెళుతున్న మహిళ అకస్మాత్తుగా రైలు కదలడంతో రైలు కింద పడి మృతిచెందింది. మరో ఘటనలో ఆరునెలల క్రితం ఓ వృద్ధుడు పట్టాలు దాటుతుండగా రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. స్టేషన్ మాస్టర్ గమనించి ఆ వృద్ధుడిని పక్కనెట్టి ప్రాణాలు కాపాడాడని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేఅధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జితో సౌకర్యం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తే ప్రయాణికులు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. గతంలో రైల్వే గేటును మూసి వేస్తే శాంతినగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, బాగారెడ్డి పల్లి, రాంనగర్, గాంధీనగర్, డైవ్రర్ కాలనీ, హమాలి కాలనీ వాసులు రాక పోకలు సాగించేందుకు ఇబ్బందులు పడేవారు. ప్రత్యామ్నాయంగా పట్టణం చివరన బ్రిడ్జిని నిర్మించారు. ఇది పట్టణ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకుండా పోయింది. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా అండర్ బ్రిడ్జిలను నిర్మించారు. ఇవి వాహన చోదకులకు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నాయి. పాదచారులకు ఉపయోగపడడం లేదు. దీంతో అరకిలోమీటరు అదనంగా నడవాల్సి వస్తోంది. దీంతో పాదచారులు రైలు పట్టాలను దాటుతూ రాకపోకలు సాగిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం గత నాలుగేళ్ల క్రితం నిధులు మంజూరైనా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. జహీరాబాద్ రైల్వే స్టేషన్‌ను 2010లో అప్పటి రైల్వే శాఖ సహాయమంత్రి కె.హెచ్.మునియప్ప ప్రారంభించారు. ఆదర్శ రైల్వే స్టేషన్ నిర్మాణంలో భాగంగా జహీరాబాద్ రైల్వే స్టేషన్‌కు రైల్వే శాఖ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సైతం మంజూరు చేసింది. అయినా పనులు ప్రారంభించే విషయంలో మాత్రం రైల్వే శాఖ తీవ్ర జాప్యం చేస్తుండటంపై ప్రయాణికులు, ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మోకాలికి దెబ్బతగిలింది రైల్వే గేటు మూయడంతో పట్టాలు దాటుకుంటు పోతున్నాం. ఫ్లాట్ ఫాం ఎత్తుగా ఉండడంతో కాలు జారిపడ్డా. దీంతో మోకాలికి దెబ్బతగిలింది. అయినా తప్పని పరిస్థితిలో పట్టాలను దాటుతూ వస్తూపోతున్నాం. అధికారులు చొరవతీసుకుని బ్రిడ్జి నిర్మిస్తే చాలా బాగుంటుంది. -జనార్థన్, శాంతినగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. రైలు పట్టాల అవతల వైపుఉన్న శాంతినగర్, బాగారెడ్డిపల్లి, హౌసింగ్‌బోర్డు, హమాలీ కాలనీ తదితర కాలనీ ప్రజలు రైలు పట్టాలు దాటుకుంటు రాకపొకలు చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్బాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి బ్రిడ్జిని నిర్మించాలి. -నాగరాజ్, శాంతినగర్ -
223 అడుగుల ఎత్తులో ఫుట్‌పాత్
ప్రతి నిత్యం ఏదో ఒక కారణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే చైనీయులు తాజాగా.. తమ సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి పదును పెట్టారు. ప్రపంచంలోనే ఎత్తైన ఫుట్‌పాత్ నిర్మించి సంచలనం సృష్టించారు. నేలకు 223 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ఫుట్‌పాత్ నైరుతీ చైనాలోని చోంగ్ పింగ్ నగరంలో ఉంది. ఒక అపార్ట్మెంట్, షాపింగ్‌మాల్‌ను కలుపుతూ ఈ నిర్మాణం జరిగింది. అపార్ట్మెంట్లోని ప్రజలు నేరుగా షాపింగ్ మాల్‌లోకి వెళ్లేలా ఈ ఫుట్‌పాత్‌ను రూపొందించామని..దీనివల్ల ప్రజలు రోడ్లపైకి వచ్చే అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఓ రెసిడెన్సియల్ అపార్ట్ మెంట్లోని 22వ అంతస్తు నుంచి ఈ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జిని నిలిపి ఉంచేందుకు 75 అడుగుల పొడవు, 13 అగులు వెడల్పు ఉన్న 8 ఉక్కు కేబుల్స్ నిర్మించారు. బ్రిడ్జి పై నుంచి కిందికి చూసేందుకు విండోస్ వంటి కంతలను ఏర్పాటు చేశారు. భూమికి అంత ఎత్తులో ఉన్న ఈ ఫుట్‌పాత్‌పై నడిచేందుకు భయం కలగటం లేదా అని అడిగితే.. ఎందుకు లేదూ ఇక్కడి నుంచి చూస్తే.. సరాసరి.. కింద ఉన్న కార్ పార్కింగ్ లాట్ కనిపిస్తుంది. కళ్లు తిరుగుతాయ్ అంటూ అపార్ట్ మెంట్ వాసి చెంగ్ బదులిచ్చాడు. ఒక్కోసారి ఈ బ్రిడ్జి మీద నడవాలంటేనే భయంగా ఉందని ఆయన తెలిపాడు. మరోవైపు అధికారులు మాత్రం ఇది ప్రపంచంలో కెల్లా కూలెస్ట్ బ్రిడ్జ్ అంటూ మురిసిపోతున్నారు. అంతేకాదు.. ఈ బ్రిడ్జివల్ల బోలెడు సమయం కలిసొస్తుందని అంటున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ పెరిగిపోవటంతో దాన్ని దాటుకుని షాపింగ్ మాల్ లోకి వెళ్లేందుకు చాలా సమయం పడుతోందని.. ఈ షార్ట్ కట్ బాగుందని యూత్ చెబుతున్నారు. ఈ కూల్ ఫుట్‌పాత్ గత ఏడాది డిసెంబర్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. -
వచ్చేస్తున్నాయ్!
5 ఎఫ్‌ఓబీలు.. 103 బస్‌బేలు రూ. 9.18 కోట్లతో నిర్మాణం టెండర్ల ఆహ్వానం త్వరలో పనులు ప్రారంభం సిటీబ్యూరో: విశ్వనగరంలో భాగంగా జీహెచ్ఎంసీ 103 బస్‌బేలు, 5 ఎఫ్ఓబీ (ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి)ల నిర్మాణానికి సిద్ధ మవుతోంది. తాజాగా దీనికి టెం డర్లు పిలిచింది. మొత్తం రూ.9.18 కోట్లతో ఐదు ఎఫ్ఓబీ/సబ్‌వేలు, 103 బస్‌బేల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. త్వరలోనే నూతన విధానంలో వీటిని నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న బస్‌బేలు రోడ్డుపైకొంతభాగాన్ని ఆక్రమించడంతో బస్సులు రహదారిపైఆగుతున్నాయి. రెండు మూడు బస్సులు ఒకేసారి వస్తే వెనుకనున్న దాన్ని ప్రయాణికులు చూసే లోపునే అక్కడి నుంచి కదిలిపోతోంది. రోడ్డుపైనే బస్సులు ఆగుతుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు రోడ్డుపైనే కాకుండా... ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట ప్రధాన రహదారికి కొంత దూరంగా... దాదాపు అర్థవలయాకారంలో వీటిని నిర్మించనున్నారు. దీని కోసం మొత్తం 340 ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. 103 ప్రాంతాల్లో తొలిదశలో నిర్మిస్తారు. ఇందుకు గాను రూ.5.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. పాదచారులు రోడ్డు దాటేందుకు లిఫ్టులతో కూడిన 150 ఎఫ్‌ఓబీలను నిర్మించాలనేది యోచన. ఐదు ఎఫ్‌ఓబీలకు ఇదివరకే టెండర్లు పూర్తయ్యాయి. కొత్తగా మరో 5 ఎఫ్‌ఓబీలకు టెండర్లు పిలిచారు. వీటి అంచనా వ్యయం రూ.4.03 కోట్లు. ఈ లిఫ్టుల నిర్వహణ బాధ్యతను వికలాంగులకు అప్పగిస్తారు. తద్వారా వారికి ఉపాధి లభిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ యోచిస్తున్నారు. సిగ్నల్ రహిత ప్రయాణానికి త్వరలోఎస్సార్డీపీ కింద రూ.2,631 కోట్లతో ఫ్లై ఓవర్లు తదితరమైన వాటికి టెండర్లు పిలవనున్నారు. ఈ పనులను ఒక్కొక్కటిగా ప్రారంభించనున్నారు. ఎఫ్‌ఓబీలు నిర్మించే ప్రాంతాలు 1. ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజి 2. శంషాబాద్ బస్ స్టాప్ 3. ఐఎస్ సదన్, సంతోష్ నగర్ 4. నెహ్రూ జూలాజికల్ పార్కు 5. నేషనల్ పోలీస్ అకాడ మీ (శివరాంపల్లి) బస్‌బేలు నిర్మించే ప్రదేశాలు కాప్రా సర్కిల్లో.. 1.శ్రీరాంనగర్‌కాలనీ 2.రాధికా జంక్షన్ 3. తిరుమల నగర్ రోడ్ 4. హౌసింగ్ బోర్డు కాలనీ 5. నాచారం 6.చక్రిపురం చౌరస్తా(కుషాయిగూడ). ఉప్పల్ సర్కిల్లో.. 7. గాంధీ విగ్రహం 8. ఉప్పల్ చౌరస్తా (ఉప్పల్-నాగోల్) 9. కుమ్మరిబస్తీ 10. ఉప్పల్ చౌరస్తా (ఉప్పల్-హబ్సిగూడ) 11. నాగోల్(ఎల్బీనగర్-ఉప్పల్) . ఎల్బీనగర్ సర్కిల్లో.. 12. కర్మాన్‌ఘాట్ (భూపేశ్‌గుప్తా నగర్) 13. వీఎంహోమ్(సరూర్‌నగర్). సర్కిల్-4లో.. 14. సైదాబాద్ (ప్రింటింగ్‌ప్రెస్ రోడ్డు) 15. గడ్డిఅన్నారం 16. టీవీ టవర్ 17. సైదాబాద్ (సరూర్‌నగర్-సైదాబాద్)18. దోబీఘాట్ 19. సైదాబాద్ (సరూర్‌నగర్ చెరువు-ఏసీపీ కార్యాలయం) 20. చాదర్‌ఘాట్ 21. బార్కాస్ 22. చాంద్రాయణగుట్ట 23 నుంచి 25 వరకు డీఆర్డీ ల్ వద్ద 26.మిథాని బస్ డిపో(మిథాని-చాంద్రాయణగుట్ట) 27. కేంద్రీయ విద్యాలయ సర్కిల్- 5లో .. 29, 30. జుమ్మేరాత్ బజార్ 31. గోడేకి ఖబర్ 32. మోతిగల్లి రాజేంద్రనగర్ సర్కిల్లో.. 33, 34 రాజేంద్రనగర్ 35.మైలార్‌దేవ్‌పల్లి 36, 37. బుద్వేల్ ఎక్స్టెన్షన్ బస్ స్టాప్ 38. దుర్గానగర్ చౌరస్తా 39, 40 ఆరాంఘర్ చౌరస్తా 41. శివారంపల్లి (ఎన్పీఏ). సర్కిల్ -7లో.. 42. టీఎన్జీవో భవనం(మాసాబ్ ట్యాంక్ రోడ్డు) 43.నానల్‌నగర్ చౌరస్తా 44.దిల్‌షాద్‌నగర్ కాలనీ. సర్కిల్-8లో.. 45. ఇంటర్మీడియట్ బోర్డు పక్కన 46. నిజాం కాలేజి 47. హజ్‌హౌస్ 48. ఎన్ఎస్రోడ్(అబిడ్స్) 49. బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ (జీపీవో పక్కన). సర్కిల్-9లో.. 50. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ 51. సీపీఎల్ రోడ్ 52. వైఎంసీఏ చౌరస్తా 53. విజ్ఞాన్‌పురి (ఓయూ రోడ్డు) 54.బాగ్‌లింగంపల్లి రోడ్డు 55. నల్లకుంట 56. ఎస్వీఎస్ స్కూల్ 57. ముషీరాబాద్ 58. విద్యానగర్ 59.ఓయూ క్యాంపస్ 60. ఫీవర్ హాస్పిటల్ రోడ్ 61, 62, 63. నారాయణగూడ 64. విజయనగర్ కాలనీ 65.అంబర్‌పేట 66. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు (ముషీరాబాద్) 67. శివం రోడ్డు. సర్కిల్-10లో.. 68. సనత్‌నగర్ 69. ధరంకరణ్ రోడ్డు శేరిలింగంపల్లి-1 సర్కిల్లో.. 70. కొండాపూర్ 71 నుంచి 78 వరకు గచ్చిబౌలి జాతీయ రహదారి శేరిలింగంపల్లి-2 సర్కిల్లో... 79.కొత్తగూడ 80.మాదాపూర్ ఖైరతాబాద్ సర్కిల్లో... 81 నుంచి 86 వరకు నేషనల్ హైవే, కూకపట్పల్లి రోడ్డు కుత్బుల్లాపూర్ సర్కిల్లో... 87.ఐడీపీఎల్కాలనీ 88. సూరారం 89. షాపూర్ నగర్ చౌరస్తా 90, 91. చింతల్ 92.సుచిత్ర జంక్షన్ 93. జీడిమెట్ల. అల్వాల్ సర్కిల్లో.. 94. అల్వాల్ మెయిన్ రోడ్డు 95. కౌకూరు 96. యాప్రాల్ 97. కౌకూర్విలేజ్ సికింద్రాబాద్ సర్కిల్లో.. 98.మినిస్టర్ రోడ్ 99. తార్నాక 100. లాలాపేట 101.బోయిగూడ రోడ్డు 102. చిలకలగూడ రోడ్డు 103. నార్త్‌లాలాగూడ రోడ్డు. ఇది వరకే టెండర్లు ఆహ్వానించిన ఎఫ్‌ఓబీలు 1. టిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్‌హౌస్ 2. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం 3. మహావీర్ హాస్పిటల్, మాసాబ్‌ట్యాంక్ 4. కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్ 5. గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్, గ్రీన్హౌస్. -
‘భార’మవుతున్న ప్రేమ!
ప్రేమికులు గుడ్డిగా చిత్ర విచిత్ర నమ్మకాలు పాటిస్తుంటారు. పారిస్‌లోని సైన్ రివర్‌పై గల పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జికి తాళాలు వేయడం కూడా వీటిలో ఒకటి. అయితే.. అక్కడికి వచ్చే పర్యాటకులలో చాలా మంది తమ ప్రేమ శాశ్వతం అవుతుందంటూ ప్రేమ తాళాలు వేస్తుండటంతో రోజురోజుకూ భారం పెరిగిపోయి బ్రిడ్జి కుంగిపోతోందట. తాళాల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటగా, బరువు 45 టన్నులకు చేరిందట. దీంతో వంతెనకు ముప్పు కలుగుతోందంటూ అధికారులు సోమవారం నుంచి వాటన్నింటినీ తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ తాళాల బరువు వల్లే గతేడాది వంతెనకు చెందిన ఫుట్బ్రిడ్జిలో ఓ భాగం కూలిపోయిందట. తాళాల బరువు ఇలాగే పెరుగుతూ పోతే 155 మీటర్ల పొడవైన ఈ చారిత్రక వంతెనకు ముప్పు తప్పదని, అందుకే వాటన్నింటినీ తొలగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, ఇక్కడ తాళాలు వేసిన ప్రేమికులు తమ ప్రేమ బద్దలవుతోందంటూ తెగ ఫీలయిపోతున్నారు. కానీ ఎక్కడైతే ఏముంది? అంటూ చాలా మంది ప్రేమికులు నగరంలోని ఇతర ప్రాంతాల్లోని వారధులకూ ప్రేమ తాళాలు వేయడం ఇప్పటికే మొదలుపెట్టారు! -
గోరేగాంలో ఎఫ్ఓబీ ప్రారంభం
ముంబై: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గోరేగావ్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్‌బ్రిడ్జిని శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఎలాంటి అర్భాటం లేకుండా ఈ బ్రిడ్జిని ప్రారంభించడంపై ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జికి దక్షిణ, ఉత్తర దిశల్లో ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాలు ఉన్నాయి. దీంతో రైల్వే స్టేషన్లో రద్దీ త్వరగా తగ్గనుందని పశ్చిమ విభాగ రైల్వే అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్టేషన్లో ప్రస్తుతం మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి నిరంతరం రద్దీగానే ఉంటున్నాయి. రద్దీ కారణంగా ప్రయాణికులు సుమారు ఐదారు నిమిషాలపాటు బ్రిడ్జి ఎక్కడానికి వేచి చూడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా, ప్లాట్‌ఫాం నం. 02, 04 చాలా దారుణంగా ఉన్నాయి. ఒకేసారి రెండు రైళ్లు ప్లాట్‌ఫాంపైకి వస్తే విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఈ కొత్త ఎఫ్ఓబి నిర్మాణంతో మిగతా ఎఫ్‌ఓబీలపై ప్రయాణికుల భారం కొంత మేర తగ్గనున్నట్లు అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ స్టేషన్లో పశ్చిమ దిశలో హార్బర్‌లైన్ రైళ్లకోసం కొత్తగా ప్లాట్‌ఫాం నిర్మిస్తున్నారు. దీనికి ఎఫ్ఓబీని కలపనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ఇది పూర్తిగా ఉపయోగం లోకి వచ్చిన తర్వాత దీనిని తిరిగి గోరేగావ్ పశ్చిమంలో ఉన్న ఎమ్మెమ్మార్డీఏ స్కైవాక్‌తో కూడా కనెక్ట్ చేయనున్నారు. దీని ద్వార వే లాదిమంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా ఐదవ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి కానున్నదని చెప్పారు. దీనిని కూడా మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. దీనిపై టికెట్ బుకింగ్ విండోను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ.. రద్దీ కారణంగా క్యూలో నిల్చోవడం ఎంతో కష్టంగా ఉందన్నారు. దీంతో కొత్త ఎఫ్‌ఓబీలను ఏర్పాటు చేయాలని పలు మార్లు ఫిర్యాదు చేశామన్నారు. ఇటీవల ఇక్కడ వాణిజ్య, గృహ సముదాయాలు ఎక్కువగా ఏర్పడ్డాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. -
ఫుట్ ఓవర్ బ్రిడ్జీల పనులు వేగిరం
* హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం * మరి.. సర్వీసు రోడ్లు ఎప్పటికి పూర్తయ్యేనో.. * నేటికీ పూర్తికాని భూసేకరణ చౌటుప్పల్ మండలం మల్కాపురం నుంచి కృష్ణాజిల్లా నందిగామ వరకు 181.5కి.మీ.ల మేర బీఓటీ పద్ధ్దతిన జీఎంఆర్ కాంట్రాక్ట్ సంస్థ నాలుగులేన్ల రహదారి విస్తరణను రూ.2200కోట్ల వ్యయంతో ఏడాదిన్నర క్రితం పూర్తి చేసింది. కానీ, నేటికీ సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. పాదచారులు కూడా రోడ్డును దాటేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. డివైడర్‌పైనున్న బారీకేడ్లను దాటుతూ పడరానిపాట్లు పడుతున్నారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ పాదచారుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చౌటుప్పల్‌లో 2, చిట్యాలలో 1, కేతేపల్లిలో 1 చొప్పున, ఒక్కోదాన్ని రూ.1.05కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. చౌటుప్పల్‌లోని బస్టాండ్ వద్ద, భాస్కర్ థియేటర్ వద్ద మరోటి నిర్మిస్తున్నారు. చిట్యాలలో కూడ ఒకదాని నిర్మాణం పూర్తికావొచ్చింది. మరోటి నిర్మాణంలో ఉంది. కేతేపల్లిలో కూడ పూర్తి కావొచ్చింది. కాగా, చౌటుప్పల్, చిట్యాలలో ఏర్పాటు చేయద ల్చిన ఎట్ గ్రేడ్ జంక్షన్ల నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు. సర్వీసు రోడ్లు ఎప్పుడో... చౌటుప్పల్, చిట్యాల, మునగాల, నల్లబండగూడెం, పిల్లలమర్రి, రాయినిగూడెం, నకిరేకల్‌లలో రోడ్డును విస్తరించినా సర్వీసురోడ్ల నిర్మాణం చేపట్టడం లేదు. చౌటుప్పల్‌లో రెండు వైపులా నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసినప్పటికీ, తంగడపల్లి క్రాస్‌రోడ్డు ఎదురుగా ఉన్న ఓ భవనం యజమాని కోర్టుకెళ్లడంతో, అధికారులు ఆ భవనం వైపు కన్నెత్తి చూడడం లేదు. బస్టాండ్ సమీపంలో సమాధులను కూడా తొలగించలేదు. సర్వీసు రోడ్డు వేసేందుకు ప్రస్తుతం మట్టిపనులు జరుగుతున్నా, ఇవి మాత్రం అడ్డంకిగా మారాయి. చిట్యాల మండల కేంద్రంలోనూ ఒక వైపు సర్వీసురోడ్డు నిర్మాణం పూర్తయింది. మరోవైపు కిలోమీటరున్నర మేర భూసేకరణ పూర్తికాక, భవన నిర్మాణాలే కూల్చివేయలేదు. నిర్వాసితులు కోర్టుకెళ్లడమే ఇందుకు కారణం. ఫలితంగా వర్షం కురిస్తే, వరద నీరు రోడ్లవెంటే నిల్వ ఉంటోంది. రోడ్డుకంటే తక్కువ ఎత్తులో భవన నిర్మాణాలుండడంతో, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరుతోంది. చౌటుప్పల్‌లోనూ ఇదే పరిస్థితి. ప్రమాదాలు నిత్యకృత్యం గతంలో ఉన్న ఇరుకు రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపులుండేవి. డేంజర్ జోన్లని బోర్డులుండేవి. హైవే విస్తరణ సమయంలో క్రాసింగ్‌లన్నింటినీ సరిచేస్తామని ఇరువైపులా భూసేకరణ కూడా అధికంగా చేశారు. కానీ కొన్నిచోట్ల డేంజర్ జోన్లు కాదు.. ఏకంగా డెత్ క్రాసింగ్‌లుగా మారాయి. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి దిగగానే వాహనాలు తిరగలేని మూలమలుపు ఉంది. హైవే విస్తరణతో 120కిలోమీటర్లకు మించి వేగంతో వస్తున్న వాహనదారులు నేరుగా వచ్చి బోల్తా కొడుతున్నారు. చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న మూలమలుపు పరిస్థితి అంతే. నార్కట్‌పల్లిలో బైపాస్ చివర, నార్కట్‌పల్లి నుంచి వచ్చే వాహనాలు కలిసే చోట జంక్షన్‌ను సరిగ్గా వేయలేదు. బ్రిడ్జి దిగే క్రమంలో వాహనాలు అతివేగంగా వస్తుంటాయి. ఇదే సమయంలో ఇక్కడ ఇరువైపులా నుంచి వచ్చే వాహనదారులు రోడ్డు దాటాలంటే ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. సర్వీసురోడ్లు పూర్తికాకపోవడంతో ఇప్పటి వరకు చౌటుప్పల్‌లో 10మందికిపైగా, చిట్యాలలో 15 మందికిపైగా మంది మృత్యువాతపడ్డారు. -
ఆదాయం ఉన్నా.. అభివృద్ధి శూన్యం
- ప్రధాన స్టేషన్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కరువు - వరంగల్,కాజీపేటలో లిఫ్టులు లేవు - డోర్నకల్‌లో వేధిస్తున్న ప్లాట్‌ఫాం సమస్య - హామీలకే పరిమితమవుతున్న రైళ్ల హాల్టింగ్ సాక్షి, హన్మకొండ :‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది దక్షిణ మధ్య రైల్వేకు మన జిల్లా. వివరాల్లోకెళితే.. దక్షిణ మధ్య రైల్వేకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడంలో వరంగల్ జిల్లా ముందంజలో ఉంది. కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకంజలో ఉంది. నిత్యం వరంగల్ జిల్లా నుంచి సగటున రైల్వేకు *20లక్షలవరకు ఆదాయం సమకూరుతోంది. కానీ జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లైన వరంగల్, కాజీపేట, డోర్నకల్ మహబూబాబాద్, జనగామలలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రైల్వే ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రయాణీకులు అవాక్కవుతున్నారు. 40వేల మంది రాకపోకలు జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్లు అయిన కాజీపేట స్టేషన్ నుంచి సగటున 12వేల మంది, వరంగల్ నుంచి సగటున 27 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీటికి పోస్టాఫీసు రిజర్వేషన్లు, ఆన్లైన్ రిజర్వేషన్లు కలుపుకుంటే జిల్లా కేంద్రం నుంచి రైళ్లలో రాకపోకలు సాగించే వారి సంఖ్య 40వేలుగా ఉంది. వీటితో పాటు మహబూబాబాద్, జనగామ, డోర్నకల్ వంటి ఇతర స్టేషన్లను సైతం కలుపుకుంటే ఈ సంఖ్య సగటున దాదాపుగా డెబ్భైవేలుగా ఉంది. తద్వారా ప్రతిరోజు జిల్లాలో సగటున *20 లక్షల వరకు టిక్కెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. కానీ రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇబ్బందుల్లో ప్రధాన స్టేషన్లు ప్రధాన రైల్వేస్టేషన్లయిన వరంగల్, కాజీపేటలలో ఆదాయానికి తగ్గ అభివృద్ధి లేదు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ భారతదేశాలకు గేట్వేగా ఉన్న కాజీపేట స్టేషన్లో సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయి. మూడు ప్లాట్‌ఫారాలు మాత్రమే ఉన్న ఈ స్టేషన్లో ఒక్కటంటే ఒక్కటే బ్రిటిష్ హయంలో నిర్మిం చిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులో ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండురైళ్లు రెండు ప్లాట్‌ఫారాల మీదకు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి కిక్కిరిసిపోతుంది. ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారమ్ మీద నుంచి రెండు, మూడుఫ్లాట్ఫారమ్లకు చేరుకునేలోపు రైళ్లు వెళ్లిపోతున్నాయి. ఈ హాడావుడిలో ప్రయాణికులు ప్రాణాలకు తెగించి పట్టాలు దాటి రైళ్లు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. రెండేళ్ల కిందే కాజీపేట స్టేషన్‌కు రెండో ఫుట్ ఓవర్‌బ్రిడ్జితో పాటు వృద్ధులు, వికలాంగుల కోసం లిఫ్టులు సైతం మంజూరు అయ్యాయి. అమలుకు నోచుకోని లిఫ్టుల పనులు అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న వరంగల్ స్టేషన్‌కు లిఫ్టు లు రెండేళ్ల కిందే మంజూరయ్యాయి. కానీ వాటి పనులు అమలుకు నోచుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు డోర్నకల్ జంక్షన్ ఏర్పాటులో జరిగిన లోపం వల్ల ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించకుండా నేరుగా ప్రయాణికు లు ప్లాట్‌ఫారమ్ మీదకు చేరుకోలేరు. దానితో ఈ సమస్య ను నివారించేందుకు రెండేళ్ల కిందే స్టేషన్లో లక్షలాది రూపాయల వ్యయంతో కొత్తగా ఫ్లాట్‌ఫారమ్‌లు నిర్మించారు. రెం డేళ్లు గడుస్తున్నా ఈ ఫ్లాట్ఫారమ్ను ప్రారంభించడం లేదు. ఈ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి పదేళ్ల క్రితం ప్రారంభించిన కాజీపేటటౌన్ స్టేషన్‌పై రైల్వే అధికారులు సవతితల్లి ప్రేమ చూపుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా సింగరేణి పాస్ట్‌ప్యాసింజర్, పెద్దపల్లి ప్యాసింజర్లు తప్ప మరోరైలుకు ఇక్కడ హాల్టింగ్ కల్పించడం లేదు. నగరంలో కలిసిపోయినట్లుగా ఉన్న హసన్‌పర్తిలో రైల్వేస్టేషన్లో సైతం ఇంటర్సిటీ, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలంటూ అనేక సార్లు రైల్వేశాఖకు వినతిపత్రాలు సమర్పించారు. కనీసం కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఇక్కడ హాల్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డోర్నకల్‌లో పద్మావతి, మహబాద్‌లో హౌరా, జీటీ, రఫ్తీసాగర్కు హాల్టింగ్ ఇవ్వాలి డోర్నకల్ రైల్వేస్టేషన్లో పద్మావతి, హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మహబూబాబాద్‌లో గ్రాండ్‌ట్రంక్, రఫ్తీసాగర్ రైళ్లకు హాల్టిం గ్ ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. డోర్నకల్ స్టేష న్లో రెండు, మూడోనంబరు ప్లాట్‌ఫారమ్‌లపై కనీసం మూ త్రశాలలు లేకపోవడం వల్ల ప్రయాణికలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భువనగిరి-సికింద్రాబాద్‌ల నడుమ నడుస్తోన్న మెమూ రైళ్లను జనగామ వరకు పొడిగించాల్సిన అవసరం ఉంది. సరిపడా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి జిల్లాలో ప్రధానంగా వరంగల్, మహబూబాబాద్ రైల్వేస్టేషన్లు పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్ల మధ్యలో ఉన్నాయి. ఇక్కడ సరిపడా ఫుట్ఓటర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఆయా ప్రాంతాల్లోని ప్రయాణీకులు కోరుతున్నారు. కొన్ని సమయాల్లో టీసీల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. వీటితో పాటు కాజీపేట స్టేషన్లో బోడగుట్టను కలుపు తూ మరో బైపాస్ ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మిం చాలని ఏళ్ల తరబడి ప్రజలు కోరుతున్నారు. పిట్‌లైన్, అదనపు ప్లాట్‌ఫాంపై మెలిక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై పెరిగిపోతున్న భారాన్ని తగ్గించేందుకు కాజీపేట స్టేషన్ ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. అందులో భాగంగా కాజీపేటలో ప్రస్తుతం ఉన్న నాలుగు, ఐదు ప్లాట్ ఫారమ్‌లకు బదులుగా కొత్తగా మూడో నంబరు ప్లాట్‌ఫారమ్‌కు సమాంతరంగా మరో రెండు ప్లాట్‌ఫారమ్‌లు నిర్మించాలని నిర్ణయించారు. రైళ్ల మెయింటనెన్స్‌లో భాగంగా అదనపు పిట్లైన్లు సైతం మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. ఈలోగా రైల్వే అధికారులు కొత్త మెలికలు పెడుతున్నారు. కాజీపేట స్టేషన్ కొత్తిపిట్లైన్లు నిర్మించేందుకు అనువుగా లేదంటూ సరికొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టి పిట్లైన్లతో పాటు అదనపు ప్లాట్‌ఫారమ్‌లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాజీపేటకు పీఓహెచ్ దక్కేనా? ఓకే అయితే మూడు వేలమందికి ఉపాధి కాజీపేట రూరల్ : కాజీపేటలోని డిజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్లకు పీరియాడికల్ ఓవర్ హాలింగ్(పీఓహెచ్) అనుమతి కోసం రైల్వే కార్మికులు, జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈనెల 8న పార్లమెంట్లో రైల్వే మంత్రి సదానంద గౌడ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వేబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గౌడ బడ్జెట్లో కాజీపేట జంక్షన్‌కు న్యాయం జరుగుతుందని కార్మికులు కోటి ఆశలతో ఉన్నారు. కాజీపేట ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్లలో పీఓహెచ్ ఏర్పాటు చేస్తే రైల్వేలకు లాభంతో పాటు సుమారు మూడు వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక్కడ పీఓహెచ్ షెడ్లు లేకపోవడంతో రైల్వే అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. డీజిల్ లోకోషెడ్.. డీజిల్ లోకోషెడ్‌లో 142 డీజిల్ ఇంజిన్ల నిర్వహణ జరుగుతోంది. ఇందులో 800 మంది ైరె ల్వే కార్మికులు పని చేస్తున్నారు. డీజిల్ లోకోషెడ్ కేంద్రంగా దేశ వ్యాప్తంగా తిరుగుతున్న రైలు ఇంజిన్లకు ప్రతీ ఆరేళ్లకు ఒకసారి లేదా 60వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పీఓహెచ్ చేయాలి. పీఓహె చ్ అంటే ఇంజిన్ టాప్ తప్ప అన్ని భాగాలు విప్పి సర్వీస్ చేసేవిధానం. డీజిల్ ఇంజిన్లకు తమిళనాడులో గోల్డెన్రాఖ్, ఒడిషాలో ఖరగ్‌పూర్, పంజాబ్‌లో పాఠియాలలో పీఓ హెచ్లున్నాయి. కాజీపేటలో పీఓహెచ్ లేక డీజిల్ ఇంజిన్లను ఈ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఎలక్ట్రిక్ లోకోషెడ్.. కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో 143 ఇంజిన్ల నిర్వాహణ జరుగుతోంది. ఇందులో 450 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఇంజిన్ జీవిత కాలం 36 ఏళ్లు. మహారాష్ట్రలో బుసావల్, పశ్చిమబెంగాల్లో కంచీరపార, చెన్నైలో పెరంబూర్‌లోని పీఓహెచ్కు ప్రతీ తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను తీసుకెళ్లాలి. ఇక్కడ ఇంజిన్‌ను విప్పి మేజర్ సర్వీస్ చేస్తారు. రైల్వేకు లాభం.. నిరుద్యోగులకు ఉపాధి దక్షిణ మధ్య రైల్వేలో వందల కొలది డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లు తిరుగుతున్నాయి. మనదగ్గర పీఓహెచ్ లేకపోవడంతో వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లను తీసుకెళ్తే 30 రోజుల్లో పీఓహెచ్ చేసి ఇవ్వాలని కార్మికులు అంటున్నారు. అయితే ఇప్పడు 50 రోజుల వరకు సమయం తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఒక్క రోజుకు ఒక ఇంజిన్ నడవకుంటే రైల్వేకు రూ.2 లక్షలు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఇంత పెద్ద సంఖ్యలో ఇంజిన్లు నడవకుంటే నష్టం భారీ స్థాయిలోనే ఉంటుంది. మన వద్ద నుంచి పీఓహెచ్కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు 10 రోజుల వరకు సమయం పడుతుంది. అదికూడా ఖాళీగానే వెళ్లి రావలసి ఉంటుంది. లక్నోలో మాదిరిగా కాజీపేటలో డీజిల్‌షెడ్, ఎలక్ట్రిక్ షెడ్లను పీఓహెచ్లుగా చేస్తే రైల్వేకు లాభంతో పాటు ఉద్యోగాల అవకాశాలు పెరగడంతోపాటు, ఇంజిన్లకు కావల్సిన కాంపోనెంట్లు, ఆక్సిలరీ భాగాలకు చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పడి వే లాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొంటున్నారు. -
పాదచారీ... నీకు కొత్తదారి
సాక్షి, సిటీ బ్యూరో: రయ్ రయ్‌మంటూ ఒకదాని వెంట ఒకటిగా దూసుకు వచ్చే వాహనాలు... రోడ్డు మీద కాలు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితులు...ఏ వైపు నుంచి ఏ వాహనం దూసుకు వస్తుందో... ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలసిపోతాయో తెలియని భయానక వాతావరణం... ఇది నగర వాసులకు అనుభవైక వేద్యం. ఇలా రోడ్డు దాటే క్రమంలో ఏడాది వ్యవధిలో సుమారు 40 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దుస్థితి నుంచి నగర వాసులను బయట పడేసేందుకు జీహెచ్ఎంసీ ముందుకు వచ్చింది. నగరంలో సుమారు పది ప్రాంతాల్లో ఎఫ్ఓబీ(ఫుట్ ఓవర్ బ్రిడ్జి)లను నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీని కోసం గతంలోనే సర్వేలు పూర్తయ్యాయి. దాదాపు రూ.10 కోట్లు ఖర్చవుతుందని ఏడాది క్రితం సంబంధిత అధికారులు అంచనాలు వేశారు. కానీ పనులుప్రారంభించలేదు. కొత్తవి చేపట్టలేదు సరికదా, మెట్రో రైలు పనులకు అడ్డుగా ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఎఫ్‌ఓబీలను తొలగించారు. దీంతో పాదచారుల సమస్యలు మరింత పెరిగాయి. తాజాగా మరోసారి ఈ అంశంపైజీహెచ్ఎంసీ దృష్టి సారించింది. పాదచారులు రోడ్లు దాటేందుకు పడుతున్న అవస్థలను తొలగించేందుకు రద్దీ ప్రాంతాల్లో అవసరమైనన్ని ఎఫ్‌ఓబీలు నిర్మించేందుకు సిద్ధమైంది. ఇలా సుమారు 50 ఎఫ్ఓబీల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మరోసారి సర్వే చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో పోలీసు, అస్కి అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్‌తో లిఫ్టులు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వీటిని ఏర్పాటు చేసేందుకు తక్కువ వ్యవధి పట్టడంతో పాటు ఒక చోటు నుంచి మరోచోటుకు మార్చే అవకాశం కూడా ఉండటంతో వీటి వైపుమొగ్గు చూపారు. పాదచారులకు ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు లిఫ్ట్ సదుపాయం ఉండేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. మెట్రో రైలు మార్గాల్లో వంతెనకు ఎగువ భాగంలో గానీ, దిగువ భాగంలో గానీ వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయమై కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఖర్చుకు వెనుకాడేది లేదని, ప్రజావసరాల దృష్ట్యా స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన వెంటనే ఈ పనులు చేపడతామన్నారు. -
త్వరలో మూడు ఎఫ్‌ఓబీలు
గుర్గావ్: హర్యానా పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) నగరంలో త్వరలో మూడు పాదచార వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి)లను నిర్మించనుంది. హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ వద్ద నిర్మించతలపెట్టిన ఈ బ్రిడ్జిల కోసం రూ. 7.44 కోట్లను వెచ్చించనుంది. సదరు ప్రతిపాదనను ఆమోదంకోసం హుడా ఉన్నతాధికారి పీసీ మీనా వద్దకు పంపింది. ఆమోదం లభించిన తర్వాత వీటి నిర్మాణానికి మూడు నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని హుడా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎ.కె.మాకెన్ వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్... నగరంలోకెల్లా అత్యంత కీలకమైన ప్రదేశమన్నారు. సిగ్నేచర్ టవర్స్, ఇఫ్కో చౌక్, సుభాష్ చౌక్, సెక్టార్-56 తదితర కీలక ప్రదేశాలను ఇది కలుపుతుందన్నారు. ఈ ప్రాంతంలోనే అనేక బహుళ జాతి సంస్థలకు చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయన్నారు. ఫోర్టిస్ ఆస్పత్రి, ఎపిక్ సెంటర్, ఇండస్ట్రియల్ సెక్టార్ 44 కూడా దీనికి అత్యంత సమీపంలోనే ఉన్నాయన్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ స్టేషన్ సమీపంలో రహదారులను దాటడం అత్యంత ప్రాణాంతకమన్నారు. ఫోర్టిస్ ఆస్పత్రి, ఎపిక్ సెంటర్, ఇండస్ట్రియల్ సెక్టార్ 44లకు వెళ్లదలుచుకున్నవారు విధిలేని పరిస్థితుల్లో నగరవాసులు రహదారులను దాటుతున్నారని, అదే ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. ఈ కారణంగా అనేకమంది చనిపోతున్నారన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కాగా ట్రాఫిక్ పోలీసులు అందించిన గణాంకాల ప్రకారం గడచిన మూడు సంవత్సరాల కాలంలో 1,403 మంది పాదచారులు రోడ్లు దాటుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాదచార వంతెనలను నిర్మించాలంటూ అనేకమంది హుడాను అభ్యర్థించారని మాకెన్ తెలిపారు. ఈ ఎఫ్‌ఓబీలను హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్‌తోపాటు మేదాంత మెడిసిటీ, సెక్టార్ 39లోగల మార్కెట్ వద్ద నిర్మించనున్నారు. -
దాదర్, పరేల్ స్టేషన్లలో స్కైవాక్‌లు
సాక్షి, ముంబై: దాదర్, పరేల్ స్టేషన్లలో స్కైవాక్‌లు నిర్మించాలని మధ్య రైల్వే పరిపాలనా విభాగం నిర్ణయించింది. దాదర్ మాదిరిగానే పరేల్ స్టేషన్లో కూడా ప్రయాణికుల రద్దీ నానాటికీ పెరిగిపోతోంది. రైలు దిగిన ప్రయాణికులు వెంటనే ప్లాట్‌ఫాం నుంచి బయటపడాలంటే భారీ కసరత్తు చేయాల్సిందే. దాదర్‌లో తగినన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ)లు ఉన్నప్పటికీ రద్దీ కారణంగా అవి సరిపోవడం లేదు. పరేల్‌లో రెండు ఎఫ్‌ఓబీలు ఉన్నప్పటికీ అందులో ఒక టి నిరుపయోగంగా మారింది. అందుబాటులో ఉన్న ఒక్కటీ అందరికీ సరిపోవడం లేదు. దీంతో గత్యంతరం లేక ప్రయాణికులు తమ ప్రాణాలను ఫణంగాపెట్టి పట్టాలు దాటుతున్నారు. ప్రస్తుతం పరేల్, ఎల్ఫిన్స్టన్ రోడ్ ప్రాంతాలు బిజినెస్ హబ్‌గా మారాయి. మూతపడిన మిల్లు స్థలాల్లో అనేక వాణిజ్య సంస్థలు, టవర్లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, బిగ్ బజార్ లాంటి సంస్థలు వెలిశాయి. ఇవేకాకుండా ఈ పరిసరాల్లో వాడియా, కేం. టాటా, గాంధీ ఆస్పత్రులున్నాయి. దీంతో ఉద్యోగులతోపాటు రోగులు, వారి బంధువుల రాకపోకలతో నిత్యం ఈ ప్రాంతమంతా బాగా రద్దీగా ఉంటుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని పరేల్ స్టేషన్‌ను టెర్మినస్‌గా అభివృద్థి చేయాలనే ప్రతిపాదన గతంలో తెరపైకొచ్చింది. అయితే అనివార్య కారణాలవ ల్ల ఈ ప్రతిపాదన అటకెక్కింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ ఇక్కడ స్కై వాక్‌ను నిర్మించాలనే ప్రతిపాదనను తెర పైకి తెచ్చారు. ఈ మేరకు పరేల్, దాదర్ స్టేషన్లకు కలిపేవిధంగా భారీ స్కైవాక్ నిర్మించాలని సూద్ యోచిస్తున్నారు. ఒకవేళ కార్యరూపం ధరించి అందుబాటులోకి వస్తే ఇటు పరేల్, అటు దాదర్ స్టేషన్‌కు చేరుకోవడం ప్రయాణికులకు సులభమవుతుంది. ఎలా నిర్మిస్తారంటే... రైలు పట్టాలకు సమాంతరంగా పరేల్-దాదర్ స్టేషన్లను కలిపే విధంగా భారీ స్కైవాక్‌ను నిర్మిస్తారు. దీని వెడల్పు 12 అడుగులు ఉంటుంది. మార్గ మధ్యలో ప్రయాణికులు అక్కడక్కడా దిగేందుకు వీలుగామెట్లు నిర్మిస్తారు. దీంతో ప్రయాణికులకు ఇటు పరేల్ లేదా అటు దాదర్ స్టేషన్‌కు వెళ్లడం సులభతరమవుతుంది. -
పుట్ ఓవర్ బ్రిడ్జి కూలి ఇద్దరికి గాయాలు
-
పుట్ ఓవర్ బ్రిడ్జి కూలి ఇద్దరికి గాయాలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండంలో శనివారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. దాంతో విద్యుత్ వైర్లు తెగిపడటంతో చెన్నై-ఢిల్లీ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. మరోవైపు ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
సైన్-పన్వేల్ హైవేపై పది ఫుట్ఓవర్ బ్రిడ్జిలు
సాక్షి, ముంబై: పాదచారుల భద్రత దృష్ట్యా సైన్-పన్వేల్ హైవేపై కొత్తగా పది ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. నిరంతరం రద్దీగా ఉండే ఈ 23 కిలోమీటర్ల బ్రిడ్జిపై ప్రజాపనుల విభాగం ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మించేందుకు కీలకమైన 10 స్థలాలను గుర్తించింది. అయితే సైన్-పన్వేల్ విస్తరణ ప్రాజెక్టు (రూ.1,220 కోట్లు)లో భాగంగా ఈ పనులను చేపట్టనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఈ పది ఫుట్ఓవర్ బ్రిడ్జిలను వాషిలోని వకార్డ్ ఆస్పత్రి, మాన్కుర్డ్ స్టేషన్, సాన్పాడాలోని పీడబ్ల్యూడీ కార్యాలయం సమీపంలో, సీవుడ్-వాషీల మధ్య ఉన్న ఆక్ట్రాయ్ నాకా, సీబీడీ బేలాపూర్‌లోని భారతి విద్యాపీఠ్ సమీపంలో, ఖార్గర్ ఫ్లైఓవర్, కోపర్ విలేజ్, నలంబోలిలో ఉన్న మెక్‌డొనాల్డ్, డి.వై.పాటిల్ స్టేడియం వద్ద ఉన్న తుర్బే ఫ్లైఓవర్ వద్ద ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపడతామని పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ అగవానే తెలిపారు. 2015 వరకు ఈ పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతకు మొదటగా ప్రాముఖ్యత ఇస్తామన్నారు. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జిపై వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకుపోవడంతో చాలా ప్రమాదాలు సంభవించి పాదాచారులు మృతి చెందుతున్నారు. అయితే ఈ బ్రిడ్జిలను నిర్మించిన తర్వాత ఈ ప్రమాదాలను కొంతమేర అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సైన్-పన్వేల్ రోడ్డును ఆరు నుంచి 12 లేన్ల వరకు విస్తరించనున్నారు. ఎనిమిది ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ఇప్పటికే అనుమతి లభించిందని, మరో రెండు బ్రిడ్జిలకు కూడా గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉంద’న్నారు. వచ్చే ఏడాదిలోపు ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. -
లింక్ ఎఫ్వోబీ పనులు ముమ్మరం
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) లో చేపడుతున్న భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ) మార్చి ఆఖరు వరకు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అన్ని ప్లాట్‌ఫాంలతో కలుపుతుండటం వల్ల లోకల్ రైలు దిగిన ప్రయాణికులు మెయిల్, ఎక్స్‌ప్రెస్ ైరె ళ్లు బయలుదేరే అన్ని ప్లాట్పారాలపైకి సులభంగా చేరుకోవచ్చు. ఇది వినియోగంలోకి వస్తే సీఎస్టీలోనే అత్యంత పొడవైన ఎఫ్వోబీగా గుర్తింపు లభించనుంది. సీఎస్టీలో మొత్తం 18 ప్లాట్‌ఫారాలున్నాయి. ఇందులో ఒకటి నుంచి ఎనిమిది వరకు లోకల్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. తొమ్మిది నుంచి 18 వరకు దూరప్రాంతాల రైళ్లు బయలుదేరుతాయి. ఇందులో 14 నుంచి 18 వరకు ప్లాట్‌ఫారాలు సెయింట్ జార్జ్ ఆస్పత్రి దిశలో ఉన్నాయి. లోకల్ రైళ్ల ప్లాట్‌ఫారాలకు, దూరప్రాంతాల రైళ్లు వెళ్లే ప్లాటుఫారాలకు కనెక్టింగ్ ఎఫ్వోబీ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టేషన్లో రోజూ కొన్ని లక్షలమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉంటారు. వీరందరూ దూరప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చి మళ్లీ ముంబైలో ఉండే తమ కార్యా లయాలకు వెళ్లడానికి లోకల్ రైళ్లు ఎక్కుతుంటారు. ఈ క్రమంలో వారు సమయంతోపాటు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కాగా, ప్రస్తుతం ఉన్న ప్లాట్ ఫాంల వల్ల రైలు మారి రైలు ఎక్కడానికే వారు ఎక్కువ సమయం కేటాయిం చాల్సి వస్తోంది. అలాగే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మామూలు ప్రయాణికులు సైతం చిన్నపిల్లలు, లగేజీతో లోకల్ రైలు దిగిన ప్రయాణికులు ప్లాట్ఫారం ఆ చివర నుంచి ఈ చివరివరకు నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. మళ్లీ దూర ప్రాంతాల రైళ్లు బయలుదేరే ప్లాట్‌ఫారాలకు చేరుకోవాలంటే మళ్లీ ఈ మూల నుంచి ఆ చివరకు అంటే దాదాపు కి.మీ. మేర నడవాల్సి ఉంటుంది. అదే ఒకటో నంబర్ మొదలుకుని చివరనున్న 18వ నంబర్ ప్లాట్ఫారం వరకు కలిపే భారీ ఎఫ్వోబీ నిర్మిస్తే లోకల్ రైలు దిగిన ప్రయాణికులు అటు నుంచి అటే తామెక్కాల్సిన రైలు ఉన్న ప్లాట్‌ఫాంపైకి నేరుగా చేరుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికుల విలువైన సమయంతోపాటు వ్యయప్రయాసాలు కూడా ఎంతో తగ్గుతాయి. ఈ ఎఫ్వోబీ ఐదు మీటర్ల వెడల్పు, 270 మీటర్లు ఎత్తులో ఉంటుంది. దీని నిర్మాణానికి రైల్వే పరిపాలన విభాగం రూ.ఏడు కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయని సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శుక్రవారం సెంట్రల్ రైల్వే చీఫ్ ప్రజా సంబంధాల అధికారి అతుల్ రాణే చెప్పారు. -
అమెరికా జట్టుకి తెలుగుదనం
ఫుట్సాల్... ఈ పేరు మనకి కొత్తదే... ఈ ఆట మాత్రం మన కాలెరిగినదే!! పాశ్చాత్యదేశాల్లో ఫుట్బాల్ని ఇలా కూడా పిలుస్తారు. ఎందుకలా పిలవడం..? ఆ సందేహాన్ని కొద్దిసేపు పక్కన పెడితే... వచ్చే నెల స్పెయిన్‌లో... వరల్డ్ ఫుట్సాల్ చాంపియన్‌షిప్ ఉంది. అయితే ఏంటి?... అంటారా! అక్కడికే వస్తున్నాం!! అందులో ఆడుతున్న తెలుగువాడే సాత్విక్... సాత్వికత పేరులోనే... బాల్ని గోల్ చేయడంలో కాదు! ఎడాపెడా గోల్స్ కొట్టేసి యుఎస్ టీమ్‌లో ఒకడయ్యాడు. అన్న కార్తీక్‌తో కలిసి ఫుట్సాల్ నేర్చుకున్నాడు సాత్విక్. అమ్మ మాధురి... నాన్న సుధీర్ వీళ్లకి ఆట నేర్పించారు. ఆ వివరాలే ఈ వారం మన లాలిపాఠం!! సాత్విక్ రెడ్డి... పన్నెండేళ్ల కుర్రాడు, అమెరికాలో పుట్టి పెరుగుతున్నాడు. అన్న కార్తీక్‌తో కలిసి ఐదారేళ్లుగా ఫుట్సాల్ ఆటను ఆడుతున్నాడు. గడచిన సెప్టెంబరులో అమెరికా ఫుట్సాల్ ఆటలో నెగ్గాడు. అండర్ 12 కేటగిరీలో యుఎస్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డిసెంబర్లో జరిగే వరల్డ్ ఫుట్సాల్ చాంపియన్షిప్కి యుఎస్ తరఫున ఆడనున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న సాత్విక్ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు సాక్షితో చెప్పిన విషయాలు... మనవాడే అమెరికా తరఫున ఆడుతున్నాడు! ‘‘మా అమ్మాయి మాధురి సాఫ్ట్వేర్ ఇంజనీర్. 1994లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. మా అల్లుడు వంగాటి సుధీర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చేసి అమెరికాలో ఎం.ఎస్ చదివాడు. ఇప్పుడు ఇద్దరూ అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ కాలిఫోర్నియాలో ఉంటున్నారు. వాళ్లపిల్లలే సాత్విక్, కార్తీక్. ఇద్దరూ సాకర్ ప్లేయర్లే. ఇప్పుడు అమెరికా జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నది చిన్నవాడు సాత్విక్. డిసెంబర్లో స్పెయిన్ దేశపు రాజధాని మాడ్రిడ్ నగరంలో జరిగే వరల్డ్ ఫుట్సాల్ చాంపియన్‌షిప్‌లో అమెరికా తరఫున ఆడుతాడు’’ అన్నారు సాత్విక్ అమ్మమ్మ భారతి. టీవీ అంటే సాకర్ చానలే! ఫుట్‌బాల్, సాకర్, ఫుట్సాల్... ఈ పదాల్లో అయోమయాన్ని తొలగించారు శిశుపాల్‌రెడ్డి. ‘‘మనం ఫుట్‌బాల్ అంటాం, అమెరికాలో సాకర్ అంటారు. ఈ సాకర్ గేమ్నే కొద్దితేడాతో జట్టుకు ఐదుగురు ఆటగాళ్ల చొప్పున ఇండోర్‌లో ఆడితే ఫుట్సాల్ అని, హాల్ ఫుట్‌బాల్ అని, మినీ ఫుట్‌బాల్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఫుట్సాల్తో ఆట మొదలుపెట్టిన చాలామంది క్రీడాకారులు పెద్దయ్యేసరికి సాకర్ ఆటవైపే మొగ్గు చూపి సాకర్ ప్లేయర్లుగా స్థిరపడుతుంటారు. ఇక్కడ మనకు క్రికెట్ మీద ఉన్నంత మోజు అమెరికాలో ఈ ఆట మీద ఉంది. ఈ ఆటకు అక్కడి స్కూళ్లలో మంచి ప్రోత్సాహం ఉంది. కేవలం సాకర్ ఆటను ప్రసారం చేయడానికే అక్కడ ఒక టెలివిజన్ చానెల్ ఉంది. కార్తీక్, సాత్విక్ ఇద్దరికీ టీవీ చూడడం అంటే సాకర్ చానెల్ చూడడమే. మా అల్లుడు సుధీర్‌కీ సాకర్ అంటే ఇష్టం. దాంతో పిల్లలకు స్కూల్లో స్పోర్ట్స్ అవర్‌లో ఆడే ఆటతో సరిపెట్టకుండా స్పెషల్ కోచింగ్ ఇప్పించారు’’ అన్నారాయన. శ్లోకాలూ నేర్చుకున్నారు! పిల్లలకు విద్యేతర కార్యక్రమాల్లో శిక్షణనిప్పించాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా... వాళ్ల దినచర్యలో పిల్లలను కోచింగ్‌లకు తీసుకెళ్లడమూ ఒక భాగంగా చేసుకోవాలి. ‘‘మా అమ్మాయి మాధురికి బ్యాంకులో ఉద్యోగం. ఉదయం ఆరుగంటలకే వెళ్తుంది. అల్లుడుగారు ఆఫీసుకు వెళ్తూ పిల్లల్ని స్కూల్లో దించుతారు. మా అమ్మాయి ఇంటికి వస్తూ పిల్లల్ని పికప్ చేసుకుంటుంది. తల్లీపిల్లలు సాయంత్రం నాలుగ్గంటలకు ఇంటికి వస్తారు. ఆ తర్వాత పిల్లల్ని చెస్ క్లాసులకు తీసుకెళ్తుంది. పిల్లలకు తెలుగు రావాలని ఆ క్లాసులకూ తీసుకెళ్తుంది, మా మనవళ్లిద్దరూ శ్లోకాలు కూడా నేర్చుకుంటున్నారు. శని, ఆదివారాలు స్కూలుకు సెలవు. ఆ రోజుల్లో సాకర్ శిక్షణ తరగతులకు తీసుకెళ్తుంది. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలలో ఎంతగా నిమగ్నమైనప్పటికీ చదువుని అశ్రద్ధ చేయనివ్వదు మా అమ్మాయి. పిల్లలిద్దరూ ఏ గ్రేడ్‌లో ఉంటారు’’ అంటారు భారతి. ఖర్చుతో కూడిన వ్యవహారమైనా..! సాత్విక్, కార్తీక్ ఇద్దరూ రెండోతరగతి నుంచే ఫుట్సాల్ అడుతున్నారు. చాలా టోర్నమెంట్లలో స్కూలుకి ప్రాతినిధ్యం వహించి గెలిచారు. అయితే సాకర్ కోచింగ్ ఖర్చుతోకూడిన వ్యవహారం. యుఎస్లాంటి దేశాల్లో క్రీడాకారులకు ఆర్థిక సహాయం చేయడానికి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపిస్తారు. అయితే ఎవరికైనా తొలిదశలో స్పాన్సర్షిప్ లభించడం కష్టమే. ‘‘స్పాన్సర్షిప్ రావాలంటే జూనియర్ స్థాయి దాటాలి. అయితే మా మనవళ్లకి రెండు-మూడు కంపెనీలు స్పాన్సర్ చేశాయి, కానీ కోచింగ్‌కి, ప్రాక్టీస్‌కి సరిపోయేంత మొత్తం కాదు. అక్కడ కోచ్‌ల ఫీజు ఎక్కువ. స్టేడియంని గంటల లెక్కన తీసుకుంటారు. స్టేడియానికి చెల్లించాల్సిన డబ్బు కూడా శిక్షణ తీసుకునే ఆటగాళ్ల దగ్గరే వసూలు చేయాలి. ఫీజు ఎక్కువ అనేగానీ, అక్కడ కోచ్‌లు డబ్బుకు పనిచేస్తున్నట్లు కాక ఆటే జీవితం అన్నట్లు ఉంటారు. ఆటగాడు రాణిస్తే కోచ్‌కి కూడా పేరు వస్తుందనే ఒక్క విషయంలోనే కాదు... ఆటగాడిని తయారు చేయడమే తమ లక్ష్యం అన్నట్లు శ్రద్ధ తీసుకుంటారు. గ్రౌండ్లో ఆట నేర్పించడంతోపాటు మెటీరియల్ ఇచ్చి థియరీ నేర్పిస్తారు. క్రీడాకారులు పాటించాల్సిన ఆహార నియమాల లోనూ అంతే శ్రద్ధగా ఉంటారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినవద్దని, విటమిన్లతో కూడిన ఆహారం, హెల్త్డ్రింకులను సూచిస్తారు’’ అన్నారు శిశుపాల్ రెడ్డి. నా కల మనవళ్లతో తీరింది! సాత్విక్ రెడ్డి తాతగారు శిశుపాల్ రెడ్డి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మెయింటెనెన్స్ ఇంజినీర్. ఆయన తన క్రీడాసక్తిని గుర్తు చేసుకుంటూ... ‘‘నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్దగా ఆడలేకపోయాను కానీ ఇష్టం మాత్రం తగ్గలేదు. నా ఉద్యోగమైనా క్రికెట్‌కు దగ్గరగా ఉండాలని క్రికెట్ స్టేడియంలో చేరాను. మా అబ్బాయి శ్రీకాంత్‌ని క్రికెట్ ప్లేయర్‌ని చేద్దామని ఉండేది. శ్రీకాంత్ స్కూల్ లెవెల్ వరకు ఆడాడు కానీ తనకు ఆట మీద పెద్దగా ఆసక్తి లేదు. పెద్ద చదువులకు లండన్ వెళ్లడంతో ఆటను కొనసాగించలేదు. ఇప్పుడు నా మనవళ్లు క్రీడాకారులవుతుంటే చాలా సంతోషంగా ఉంది’’ అన్నారాయన. నైపుణ్యానికి ప్రోత్సాహం తోడైతే..! సాత్విక్, కార్తీక్ అమ్మమ్మ, నానమ్మ ఇద్దరూ హైదరాబాద్‌లోనే ఉండడంతో ఈ సోదరులిద్దరూ సెలవులకు వచ్చినప్పుడు హైదరాబాద్‌లోనే గడుపుతారు. సాత్విక్ నానమ్మ విజయకుమారి, తాతయ్య బల్వంత్‌రెడ్డి. వీరి పెద్దబ్బాయి సుధీర్ పిల్లలు సాత్విక్, కార్తీక్. ‘‘సాత్విక్‌కి ఫుట్‌బాల్ ఎంతిష్టం అంటే... చిన్నప్పుడు కూడా ఇంట్లో నా వైపుకి బాల్ వేస్తూ నన్ను కూడా ఆడమనేవాడు. మేము యుఎస్ వెళ్లినప్పుడు పిల్లలతోపాటు సాకర్ కోచింగ్ ఇచ్చే స్టేడియాలకు వెళ్లేవాళ్లం. అక్కడి వాతావరణం క్రీడాకారులు తయారవడానికి అనువుగా ఉంటుంది. స్కూళ్లలో కూడా పెద్ద పెద్ద క్రీడాప్రాంగణాలు ఉంటాయి. ఇండోర్ప్రాంగణాలు చాలా విశాలంగా ఉంటాయి. పిల్లల్లో క్రీడాస్ఫూర్తి ఉండి, దానికి తల్లిదండ్రుల సహకారం తోడైతే చాలు. చక్కటి క్రీడాకారులు తయారుకావచ్చు. నేను టీచర్‌గా ఇక్కడ చాలామంది విద్యార్థులను చూశాను. చాలామందిలో నైపుణ్యం ఉంటుంది, కానీ సౌకర్యాలు, అనువైన వాతావరణం లేకపోవడంతో రాణించలేకపోయేవారు. కాలిఫోర్నియాలో మా కోడలు, కొడుకు ఇద్దరూ వీకెండ్స్‌లో ఇంట్లో ఉండడమే తక్కువ. ఒక్కోసారి పిల్లలిద్దరికీ వేర్వేరు స్టేడియాలలో ట్రైనింగ్ పడుతుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులిద్దరూ చెరో పిల్లాణ్ని తీసుకువెళ్లి ఏ రాత్రికో తిరిగి వస్తారు. మా అబ్బాయికి ఉద్యోగరీత్యా టూర్లు ఉంటాయి. మా కోడలి మల్టీటాస్కింగ్తోనే అంతా సజావుగా సాగుతోంది.’’ అన్నారు విజయకుమారి. దేవుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు. పిల్లల్లో దాగిన నైపుణ్యం ఏంటో తెలుసుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకిస్తాడు. దానిని సరిగా గుర్తించమని తల్లిదండ్రులకు పరీక్ష కూడా పెడతాడు. సాత్విక్ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల మాటలు వింటే మాధురి, సుధీర్ ఇద్దరూ దేవుని పరీక్షలో పాస్ అయ్యారనే చెప్పాలి. తల్లిదండ్రులు తమ కోసం ఇంతగా శ్రమిస్తుంటే ఏ పిల్లలూ చూస్తూ ఊరుకోరు. అమ్మానాన్నల శ్రమను, శ్రద్ధను గౌరవిస్తారు. తాము గెలిచి, అమ్మానాన్నలను కూడా గెలిపిస్తారు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మా కోడలు ‘సాకర్ మామ్’! పిల్లల్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో మా కోడలు మాధురి పాత్ర కీలకమైనది. అమెరికాలో పిల్లల్ని కోచింగ్‌లకు తీసుకెళ్లడమే పెద్దపని. అక్కడ కోచ్‌లు రోజూ ఒకే స్టేడియంలో శిక్షణనివ్వరు. ఏరోజు ఏ స్టేడియం బుక్ చేసుకుంటే పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లాలి. తల్లిదండ్రులే తీసుకెళ్లి, క్లాసు పూర్తయ్యే వరకు ఉండి పిల్లల్ని తీసుకురావాలి. ఇంత శ్రద్ధ తీసుకునే తల్లులను అక్కడ ‘సాకర్ మామ్స్’ అంటారు. మా కోడలు కూడా మంచి సాకర్ మామ్ అనే చెప్పాలి. - బల్వంత్‌రెడ్డి, సాత్విక్ తాతగారు