సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) లో చేపడుతున్న భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్‌వోబీ) మార్చి ఆఖరు వరకు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అన్ని ప్లాట్‌ఫాంలతో కలుపుతుండటం వల్ల లోకల్ రైలు దిగిన ప్రయాణికులు మెయిల్, ఎక్స్‌ప్రెస్ ైరె ళ్లు బయలుదేరే అన్ని ప్లాట్‌పారాలపైకి సులభంగా చేరుకోవచ్చు. ఇది వినియోగంలోకి వస్తే సీఎస్టీలోనే అత్యంత పొడవైన ఎఫ్‌వోబీగా గుర్తింపు లభించనుంది. సీఎస్టీలో మొత్తం 18 ప్లాట్‌ఫారాలున్నాయి.
ఇందులో ఒకటి నుంచి ఎనిమిది వరకు లోకల్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. తొమ్మిది నుంచి 18 వరకు దూరప్రాంతాల రైళ్లు బయలుదేరుతాయి. ఇందులో 14 నుంచి 18 వరకు ప్లాట్‌ఫారాలు సెయింట్ జార్జ్ ఆస్పత్రి దిశలో ఉన్నాయి. లోకల్ రైళ్ల ప్లాట్‌ఫారాలకు, దూరప్రాంతాల రైళ్లు వెళ్లే ప్లాటుఫారాలకు కనెక్టింగ్ ఎఫ్‌వోబీ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టేషన్‌లో రోజూ కొన్ని లక్షలమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉంటారు. వీరందరూ దూరప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చి మళ్లీ ముంబైలో ఉండే తమ కార్యా లయాలకు వెళ్లడానికి లోకల్ రైళ్లు ఎక్కుతుంటారు.
ఈ క్రమంలో వారు సమయంతోపాటు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కాగా, ప్రస్తుతం ఉన్న ప్లాట్ ఫాంల వల్ల రైలు మారి రైలు ఎక్కడానికే వారు ఎక్కువ సమయం కేటాయిం చాల్సి వస్తోంది. అలాగే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మామూలు ప్రయాణికులు సైతం చిన్నపిల్లలు, లగేజీతో లోకల్ రైలు దిగిన ప్రయాణికులు ప్లాట్‌ఫారం ఆ చివర నుంచి ఈ చివరివరకు నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. మళ్లీ దూర ప్రాంతాల రైళ్లు బయలుదేరే ప్లాట్‌ఫారాలకు చేరుకోవాలంటే మళ్లీ ఈ మూల నుంచి ఆ చివరకు అంటే దాదాపు కి.మీ. మేర నడవాల్సి ఉంటుంది. అదే ఒకటో నంబర్ మొదలుకుని చివరనున్న 18వ నంబర్ ప్లాట్‌ఫారం వరకు కలిపే భారీ ఎఫ్‌వోబీ నిర్మిస్తే లోకల్ రైలు దిగిన ప్రయాణికులు అటు నుంచి అటే తామెక్కాల్సిన రైలు ఉన్న ప్లాట్‌ఫాంపైకి నేరుగా చేరుకోవచ్చు.
దీనివల్ల ప్రయాణికుల విలువైన సమయంతోపాటు వ్యయప్రయాసాలు కూడా ఎంతో తగ్గుతాయి. ఈ ఎఫ్‌వోబీ ఐదు మీటర్ల వెడల్పు, 270 మీటర్లు ఎత్తులో ఉంటుంది. దీని నిర్మాణానికి రైల్వే పరిపాలన విభాగం రూ.ఏడు కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయని సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శుక్రవారం సెంట్రల్ రైల్వే చీఫ్ ప్రజా సంబంధాల అధికారి అతుల్ రాణే చెప్పారు.
లింక్ ఎఫ్‌వోబీ పనులు ముమ్మరం
Published Fri, Feb 14 2014 11:08 PM | Last Updated on Fri, Oct 5 2018 8:28 PM
Advertisement
Advertisement