St Georges Hospital
-
లిఫ్ట్‌లో నర్సు మృతదేహం
ముంబై : ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్‌కు దగ్గరలోని సెంట్ జార్జీ ఆసుపత్రిలో కరోనా విధులు నిర్వహిస్తున్న 45 ఏళ్ల నర్సు శవం ఆసుపత్రి లిఫ్ట్‌లో అనుమానాస్పద స్థితిలో లభించింది. కాగా మహిళ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ ఆకాశ్ కిబ్రాగడే తెలిపిన వివరాలు ప్రకారం.. చనిపోయిన 45 ఏళ్ల మహిళ గత ఆరేళ్లుగా ముంబైలోని సెంట్ జార్జీ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. తాజాగా కరోనా నేపథ్యంలో ఆమెకు కోవిడ్-19 స్పెషల్ డ్యూటీ వేశారు. కాగా గత కొన్ని రోజులుగా అన్ని రకాల షిఫ్ట్‌ల్లో అందుబాటులో ఉంటున్న ఈమె చనిపోవడానికి ముందు సెకెండ్ ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కింది. ఆ తరువాత చూస్తే ఆమె శవంగా కనిపించిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారమందించామని, మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్లు తెలిపారు. అయితే సదరు మహిళ బహుశా లిఫ్ట్ ఎక్కేటప్పుడు లేక దిగేటప్పుడు ఆమె తల డోర్లో చిక్కుకుపోవడంతో బలమైన దెబ్బ తగలడంతోనే మృతి చెందినట్లు పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. అయినప్పటికి పోస్టుమార్టం తర్వాతే ఆమె మృతికి గల కారణాలు బయటపడతాయని పేర్కొన్నారు. అంతవరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి మృతి -
ఇక బ్రెయిన్ స్ట్రోక్‌లకు భయం లేదు
లండన్: వైద్య విజ్ఞానరంగంలో విప్లవాత్మక మార్పులు వేగంగా వస్తున్నాయి. ఆంజియోగ్రామీ ద్వారా గుండెనాళాల్లోని రక్తపు గడ్డలను శుద్ధి చేసినట్లుగా మెదడు నరాల్లోని బ్లడ్ క్లాట్లను ఇక సులభంగానే తొలగించవచ్చు. కొత్తగా కనుగొన్న ఈ విధానాన్ని వైద్య పరిభాషలో 'మెకానికల్ త్రోంబెక్టమీస్' అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో అనుభవజ్ఞులైన కొంత మంది న్యూరాలజిస్టులు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో రక్తం గడ్డగట్టిన మెదడు రక్తనాళంలోకి కాథెరిన్ (మెత్తటి గొట్టం లాంటి పరికరం) పంపిస్తారు. అనంతరం అందులోకి స్టెంట్ లేదా వైర్ మెష్‌ను పంపిస్తారు. అది రక్తం గడ్డకట్టిన ప్రాంతానికి వెళ్లిన తర్వాత మెష్ విస్తరించిన గడ్డ కట్టిన రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అనంతరం కాథెరిన్ నుంచి స్టెంట్ లేదా వైర్ మెష్‌ను తొలగిస్తారు. సాధారణంగా అనస్థిషియా బదులు సెడిషన్ (మత్తించే మందులు) డ్రగ్స్ ఇచ్చి ఈ వైద్య ప్రక్రియను చేపడుతున్నారు. రక్తాన్ని పలుచపరిచే మందుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగులు 30 శాతం కోలుకుంటుంటే ఈ 'మెకానికల్ త్రోంబెక్టమీస్' వల్ల 80, 90 శాతం కోలుకునే అవకాశం ఉందని లండన్ వైద్యులు చెబుతున్నారు. రంగ్బీ మ్యాచ్‌లో గాయపడి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన కార్నర్ లైన్స్ అనే 14 ఏళ్ల బాలుడికి మాట, కాళ్లు, చేతులు పడిపోవడంతో ఆ బాలుడికి 2015, మార్చి నెలలోనే ఈ కొత్త విధానం ద్వారా బ్లడ్ కాట్స్ను తొలగించారు. అనతికాలంలోనే కోలుకున్న ఆ బాలుడికి మాటతో సహా అన్ని అవయవాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ విధానం ప్రస్తుతానికి లండన్‌లోని సెంట్ జార్జి ఆస్పత్రి సహా 24 న్యూరోసైన్స్ సెంటర్లకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఈ విధానాన్ని ప్రోత్సహించడం కోసం నేషనల్ హెల్త్ స్కీమ్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆమోదిస్తామని, వీటి వల్ల వచ్చే ఏడాది నుంచి కనీసం వెయ్యి మంది రోగులకు ఇలాంటి చికిత్స అందించవచ్చని భావిస్తున్నామని సీఈవో సైమన్ స్టీవెన్స్ తెలిపారు. ఇంగ్లండ్‌ను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్స్ ఒకటి. చనిపోతున్న వారిలో నాలుగొంతుల మంది చావుకు బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతోంది. ఈ కారణంగా ఏడాదికి ఎన్హెచ్ఎస్పై 300 కోట్ల పౌండ్ల భారం పడుతోంది. మెకానికల్ త్రోంబెక్టమీస్ తరహాలోనే ఇప్పుడిప్పుడే గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన బ్లడ్ క్లాట్స్‌ను తొలగిస్తున్నారు. -
లింక్ ఎఫ్వోబీ పనులు ముమ్మరం
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) లో చేపడుతున్న భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ) మార్చి ఆఖరు వరకు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అన్ని ప్లాట్‌ఫాంలతో కలుపుతుండటం వల్ల లోకల్ రైలు దిగిన ప్రయాణికులు మెయిల్, ఎక్స్‌ప్రెస్ ైరె ళ్లు బయలుదేరే అన్ని ప్లాట్పారాలపైకి సులభంగా చేరుకోవచ్చు. ఇది వినియోగంలోకి వస్తే సీఎస్టీలోనే అత్యంత పొడవైన ఎఫ్వోబీగా గుర్తింపు లభించనుంది. సీఎస్టీలో మొత్తం 18 ప్లాట్‌ఫారాలున్నాయి. ఇందులో ఒకటి నుంచి ఎనిమిది వరకు లోకల్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. తొమ్మిది నుంచి 18 వరకు దూరప్రాంతాల రైళ్లు బయలుదేరుతాయి. ఇందులో 14 నుంచి 18 వరకు ప్లాట్‌ఫారాలు సెయింట్ జార్జ్ ఆస్పత్రి దిశలో ఉన్నాయి. లోకల్ రైళ్ల ప్లాట్‌ఫారాలకు, దూరప్రాంతాల రైళ్లు వెళ్లే ప్లాటుఫారాలకు కనెక్టింగ్ ఎఫ్వోబీ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టేషన్లో రోజూ కొన్ని లక్షలమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉంటారు. వీరందరూ దూరప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చి మళ్లీ ముంబైలో ఉండే తమ కార్యా లయాలకు వెళ్లడానికి లోకల్ రైళ్లు ఎక్కుతుంటారు. ఈ క్రమంలో వారు సమయంతోపాటు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కాగా, ప్రస్తుతం ఉన్న ప్లాట్ ఫాంల వల్ల రైలు మారి రైలు ఎక్కడానికే వారు ఎక్కువ సమయం కేటాయిం చాల్సి వస్తోంది. అలాగే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మామూలు ప్రయాణికులు సైతం చిన్నపిల్లలు, లగేజీతో లోకల్ రైలు దిగిన ప్రయాణికులు ప్లాట్ఫారం ఆ చివర నుంచి ఈ చివరివరకు నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. మళ్లీ దూర ప్రాంతాల రైళ్లు బయలుదేరే ప్లాట్‌ఫారాలకు చేరుకోవాలంటే మళ్లీ ఈ మూల నుంచి ఆ చివరకు అంటే దాదాపు కి.మీ. మేర నడవాల్సి ఉంటుంది. అదే ఒకటో నంబర్ మొదలుకుని చివరనున్న 18వ నంబర్ ప్లాట్ఫారం వరకు కలిపే భారీ ఎఫ్వోబీ నిర్మిస్తే లోకల్ రైలు దిగిన ప్రయాణికులు అటు నుంచి అటే తామెక్కాల్సిన రైలు ఉన్న ప్లాట్‌ఫాంపైకి నేరుగా చేరుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికుల విలువైన సమయంతోపాటు వ్యయప్రయాసాలు కూడా ఎంతో తగ్గుతాయి. ఈ ఎఫ్వోబీ ఐదు మీటర్ల వెడల్పు, 270 మీటర్లు ఎత్తులో ఉంటుంది. దీని నిర్మాణానికి రైల్వే పరిపాలన విభాగం రూ.ఏడు కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయని సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శుక్రవారం సెంట్రల్ రైల్వే చీఫ్ ప్రజా సంబంధాల అధికారి అతుల్ రాణే చెప్పారు.