‘భార’మవుతున్న ప్రేమ! | Love heavy stakes | Sakshi

‘భార’మవుతున్న ప్రేమ!

Published Sun, May 31 2015 1:18 AM | Last Updated on Fri, Oct 5 2018 8:28 PM

‘భార’మవుతున్న ప్రేమ! - Sakshi

‘భార’మవుతున్న ప్రేమ!

ప్రేమికులు గుడ్డిగా చిత్ర విచిత్ర నమ్మకాలు పాటిస్తుంటారు. పారిస్‌లోని సైన్ రివర్‌పై గల పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జికి తాళాలు వేయడం కూడా వీటిలో ఒకటి. అయితే.. అక్కడికి వచ్చే పర్యాటకులలో చాలా మంది తమ ప్రేమ శాశ్వతం అవుతుందంటూ ప్రేమ తాళాలు వేస్తుండటంతో రోజురోజుకూ భారం పెరిగిపోయి బ్రిడ్జి కుంగిపోతోందట. తాళాల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటగా, బరువు 45 టన్నులకు చేరిందట. దీంతో వంతెనకు ముప్పు కలుగుతోందంటూ అధికారులు సోమవారం నుంచి వాటన్నింటినీ తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ తాళాల బరువు వల్లే గతేడాది వంతెనకు చెందిన ఫుట్‌బ్రిడ్జిలో ఓ భాగం కూలిపోయిందట.

తాళాల బరువు ఇలాగే పెరుగుతూ పోతే 155 మీటర్ల పొడవైన ఈ చారిత్రక వంతెనకు ముప్పు తప్పదని, అందుకే వాటన్నింటినీ తొలగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, ఇక్కడ తాళాలు వేసిన ప్రేమికులు తమ ప్రేమ బద్దలవుతోందంటూ తెగ ఫీలయిపోతున్నారు. కానీ ఎక్కడైతే ఏముంది? అంటూ చాలా మంది ప్రేమికులు నగరంలోని ఇతర ప్రాంతాల్లోని వారధులకూ ప్రేమ తాళాలు వేయడం ఇప్పటికే మొదలుపెట్టారు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement