
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: పంజగుట్ట చౌరస్తాలో పాదచారుల వంతెన నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం ప్రారంభమయ్యాయి. పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తవుతుందని ఇంజనీర్లు చెప్పారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టారు.
అడుగడుగునా పైప్‌లైన్లు అడ్డురావడం ఆటంకంగా మారింది. ఆరు వారాల్లో పూర్తి కావాల్సిన పనులు ఏడాదిన్నర గడిచినా పిల్లర్ల వద్దే నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్‌కు లిక్విడిటీ డ్యామేజ్ కింద రూ.లక్ష జరిమానా విధించారు. సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా తీవ్ర జాప్యం చేయడంతో ఈ జరిమానా విధించినట్లు ఇంజనీర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment