ఫ్లోరిడా : మియామిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 9 మందికి తీవ్ర గాయాలుకాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జి కింద పదుల సంఖ్యలో వాహనాలు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సిటీ ఆఫ్ స్వీట్‌వాటర్‌ను అనుసంధానించి విద్యార్థులు దాటేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించగా.. తాజాగా దీనిని ప్రారంభించారు. సెల్ఫ్ ప్రొపెల్డ్ మాడ్యూలర్ ట్రాన్స్ పోర్టేషన్ విధానంలో అమెరికాలో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే కావటం గమనార్హం.
ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Continuing to monitor the heartbreaking bridge collapse at FIU - so tragic. Many brave First Responders rushed in to save lives. Thank you for your courage. Praying this evening for all who are affected.
— Donald J. Trump (@realDonaldTrump) March 15, 2018
Comments
Please login to add a commentAdd a comment