Viral: బ్రిడ్జ్‌ కింద ఇరుక్కుపోయిన విమానం.. అసలేమైంది? | Air India Scrap Plane Stuck Under Foot Over Bridge In Delhi Viral Video | Sakshi
Sakshi News home page

Viral: బ్రిడ్జ్‌ కింద ఇరుక్కుపోయిన విమానం.. అసలేమైంది?

Published Sun, Oct 3 2021 9:07 PM | Last Updated on Mon, Oct 4 2021 11:34 AM

Air India Scrap Plane Stuck Under Foot Over Bridge In Delhi Viral Video - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గాల్లో ఎగిరే విమానాలు సాధారణ రోడ్లపై కనిపిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అలాంటి ఘటన ఆదివారం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ కింది ఎయిర్‌ ఇండియా విమానం ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడయాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టు సమీపంలోని గురుగ్రామ్‌-ఢిల్లీ హైవేపై జరిగింది. ఆ విమానం ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ కింద చిక్కుకొని కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యంతో చూశారు.

బ్రిడ్జ్‌ కింద రోడ్డుపై విమానం చిక్కుకొని ఉండగా.. దాని పక్కనుంచే వాహనాలు వెళ్లుతున్నాయి. దీనిపై ఎయిర్‌ ఇండియా సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. అది ఓ పాత చెడినపోయిన విమానం అని, దాన్ని చాలా రోజుల కింద అమ్మివేసినట్లు తెలిపారు. దీంతో సదరు యజమాని ఆ రెక్కలు లేని విమానాన్ని రోడ్డు మార్గంలో తీసుకెళ్లుతున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement