land kabja
-
టీడీపీ నేతల దందా.. ఐదు కోట్ల స్థలం హాంఫట్!
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ నాయకుల తీరు అడ్డగోలుగా ఉంది. చోటామోటా నాయకుని మొదలు పెద్ద స్థాయి నాయకుని వరకు తమకు ఎదురులేదన్నట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అవినీతి అక్రమాలకు పాల్పడే పనిలోనే ఉంటున్నారు. తాజాగా కలెక్టర్ బంగ్లాకు కిలోమీటరు దూరంలోనే కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు. టీడీపీ నాయకులే కొలతలు వేసుకుని ప్లాట్లుగా విభజించుకొని కర్రలు పాతారు. ఆ తర్వాత శాశ్వతంగా ఉండే విధంగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఏకంగా బేరం పెట్టి విక్రయించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనులన్నీ చకచకా చేసుకుంటూ పోతున్నారు. ఇంత జరుగుతున్నా ఒంగోలు రెవెన్యూ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంటే.. టీడీపీ నాయకులకు భయపడి పట్టించుకోవడం లేదా.? లేకుంటే ఇప్పటికే జేబులు నింపుకుని నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మార్కెట్ విలువ 10 కోట్ల పైనే..ఒంగోలు నగరంలో అగ్రహారం రైల్వే గేటు దాటగానే బాలాజీనగర్, ఆ తర్వాత దత్తాత్రేయకాలనీ వస్తుంది. దత్తాత్రేయకాలనీ ఎదురుగా సర్వే నంబర్–81లో ప్రభుత్వానికి చెందిన 1.36 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఈ భూమి విలువ ప్రైవేటుకు చెందిన రిజిస్ట్రేషన్ స్థలమైతే మార్కెట్లో దాదాపు రూ.10 కోట్లకుపైనే ఉంది. ప్రభుత్వానికి చెందిన అసైన్మెంట్ స్థలం కావడంతో ప్రస్తుత మార్కెట్లో ఒక్కో గది రూ.55 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంది. దాదాపు 816 గదుల స్థలం కావడంతో సరాసరిన ఒక్కో గదికి రూ.60 వేలు వేసుకున్నా.. సుమారు రూ.5 కోట్లు ఉంటుంది. ఇంత ఖరీదైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా టీడీపీ నేతలు కబ్జా చేసి మూడునాలుగు రోజులుగా ప్లాట్లు వేసుకుని ఏకంగా పిల్లర్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నారంటే.. తెరవెనుక పెద్ద తతంగమే నడిచి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.స్థానిక ఎమ్మెల్యే దామచర్ల హస్తం?కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేయడం వెనుక ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనే ప్లాట్లు వేసుకోమన్నాడంటూ ఒంగోలు నగర పాలక సంస్థలోని 16వ డివిజన్‌కు చెందిన టీడీపీ నాయకుడు, స్థానిక కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం అండతో తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి నేరుగా ప్లాట్లు వేసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రమేయం ఉండటంతోనే రెవెన్యూ అధికారులుగానీ, మండల సర్వేయర్గానీ, ఒంగోలు నగర పాలక సంస్థ సర్వేయర్గానీ కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ఉంగరాల రమణయ్య, ఆ పార్టీ నాయకులు పాదర్తి శింగయ్య, మాదాసు చంద్ర, కర్రి వాసు, సీహెచ్ సురేష్‌తో పాటు మరికొంతమంది కలిసి ప్లాట్లు వేసుకుని అమ్ముకుంటున్నట్లు సమాచారం. మామిడిపాలేనికి చెందిన ఒక పాస్టర్కు 50 గదులను ఒక్కో గదిని రూ.60 వేల చొప్పున విక్రయించినట్లు కూడా తెలిసింది. స్థలం కొనుగోలు చేసిన పాస్టర్ ఆగమేఘాలపై పిల్లర్లు వేసేందుకు అవసరమైన బాక్సులు తెప్పించి ఏకంగా స్థలం చుట్టూ ప్రహరీ గోడకు పిల్లర్లు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ పిల్లర్ల మధ్యలో పునాధులు తీసి ప్రహరీ నిర్మించడమే తరువాయి.టీడీపీ వస్తే ఇలానే.. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సర్వే నంబర్–81లో స్థలాన్ని కబ్జా చేసి గుడిసెలు కూడా వేశారు. అప్పట్లో ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి రంగంలోకి దిగి అక్రమంగా వేసిన గుడిసెలను పూర్తిగా తొలగించారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎవరూ ఆ స్థలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ పార్టీ నాయకుల కళ్లు ఖరీదైన ప్రభుత్వ స్థలంపై పడ్డాయి. ఇంకేముంది.. అనుకున్నదే తడవుగా పాగా వేసేశారు. జేబుల్లో కోట్ల రూపాయలు నింపుకుంటున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం.. నున్నా సురేష్, వీఆర్ఓ, బాలాజీ నగర్ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సమాచారం అందడంతో కట్టడాలు చేస్తున్న వారిని ప్రశ్నించాను. ప్రభుత్వం నలుగురికి పట్టాలు మంజూరు చేసిందని, ఆ నాలుగు పట్టాలకు సంబంధించిన స్థలంలో చర్చి నిర్మిస్తున్నామని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు తెలియజేస్తా. -
రిటైర్ట్ డీఎస్పీ భూమి కబ్జాకు టీడీపీ నేతల కుట్ర
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి మండలం శ్రీనివాసపురానికి చెందిన తన భూమిని కాజేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారని, అందులో నిర్మాణంలో ఉన్న దుకాణాన్ని 50 మంది రౌడీలతో వచ్చి అర్ధరాత్రి కూల్చివేశారని రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్‌నాయుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం భాస్కర్‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాసపురానికి చెందిన తాను 2012లో జిలకర సూర్యనారాయణ వద్ద సర్వే నంబర్ 255/1బిలో 21 సెంట్లను కొనుగోలు చేశానని తెలిపారు. అయితే, అప్పటి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ బినామీ పాండురంగ మొదలియార్ నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు కుట్రపన్నాడని తెలిపారు. ఆ భూమిపై 1974లో ఒక కేసు, 1991లో రెండు కేసులు, 2013లో ఒక కేసు కోర్టులో వేశారని, ఆ కేసుల్లో తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని భాస్కర్‌నాయుడు తెలిపారు. ఆపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్, అతని తమ్ముడు చాణక్య హైకోర్టులో తప్పుడు పత్రాలతో స్టేటస్కో తెచ్చారన్నారు. అధికారులను తప్పుదోవ పట్టించి ఇదే సర్వే నంబర్‌పై తప్పుడు పట్టాను పొందడంతో వీరితో పాటు అప్పటి ఇనాం డీటీ వరప్రసాద్, ఆర్డీవో బాబయ్యపై చిత్తూరు 2టౌన్లో క్రిమినల్ కేసులు సైతం నమోదైనట్టు తెలిపారు. అర్థరాత్రి అక్రమంగా కూల్చివేత కాగా.. ఆ స్థలంలో దుకాణం నిర్మాణాన్ని చేపట్టగా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్, అతని తమ్ముడు చాణక్య, విజయ్ (విజ్జు) నిర్మాణాల వద్దకు వచ్చారని భాస్కర్‌నాయుడు తెలిపారు. ఆ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగడంతో పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పారు. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు పత్రాలను పరిశీలించి ఆ భూమి తనదేనని తేల్చిచెప్పారన్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి టీడీపీ నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి పాల్పడినట్టు బాధితుడు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి సుమారు 50 మంది రౌడీలతో సంజయ్, చాణక్య, విజయ్ ఆ స్థలంలో నిర్మాణాన్ని అక్రమంగా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డయల్ 100కు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకోకుండా వారికే వత్తాసు పలికారని ఆరోపించారు. కాగా, జరిగిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ చిన్న గోవింద్ తెలిపారు.‘టీడీపీ వాడినైనా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదు’తాను డీఎస్పీగా పనిచేస్తున్నప్పటికీ మొదటినుంచీ తాను టీడీపీకి మద్దతుదారుడిగా ఉన్నానని రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్‌నాయుడు చెప్పారు. టీడీపీ అంటే ఎంతో అభిమానం అని.. పసుపు చొక్కా వేసుకోకపోయినా టీడీపీ కోసం పనిచేసినట్టు తెలిపారు. 1992 నుంచి టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న తనకు ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్, చాణక్య, విజయ్ మంచి బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాను ప్రహరీ నిర్మాణం, దుకాణ నిర్మాణం, త్రీఫేజ్ విద్యుత్ కనెక్షన్లు పొందానని, అప్పటి అధికార పార్టీ నాయకులు ఏనాడూ తనను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. టీడీపీ మద్దతుదారుడిగా ఉన్నప్పటికీ తన భూమిని టీడీపీ నాయకులే కబ్జా చేసేందుకు యత్నించడం దారుణమన్నారు. తనకు ప్రభుత్వం, అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు. -
ప్రకాశం జిల్లా వేంపాడులో టీడీపీ నాయకుల దౌర్జన్యం
-
రూ.250 కోట్ల మఠం భూమి హాంఫట్.. కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని గ్యాంగ్ అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోంది. అధికారమే అండగా రూ.250 కోట్ల విలువ చేసే దేవుడి మాన్యాన్ని అమాంతం మింగేసింది. నాని అనుచరులు.. అభ్యంతరం చెప్పిన దేవదాయశాఖ సిబ్బంది బట్టలు విప్పి, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టారు.. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నానాబూతులు తిట్టి నిర్బంధించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నా ‘డోంట్ కేర్’ అంటూ వారి ఎదుటే.. దేవుడి మాన్యానికి దర్జాగా ప్రహరీ నిర్మించారు. నానీస్ గ్యాంగ్ అక్రమాలపై ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన కథనం తిరుపతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లోనూ, దేవదాయ, రెవెన్యూ శాఖ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. అప్పనంగా కొట్టేసి.. సొమ్ము చేసుకోవడమే లక్ష్యం.. తిరుపతి రూరల్ మండలం అవిలాల లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 145, 147/1లో సుమారు 10 ఎకరాల విలువైన దేవుడి మాన్యం భూమిని నాని గ్యాంగ్ ఆక్రమించుకుంది. ఇక్కడ అంకణం కనీసం రూ.4 లక్షల వరకూ ఉంది. మొత్తం10 ఎకరాలు బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లు పలుకుతోంది. నాని గ్యాంగ్ దీన్ని అప్పనంగా కొట్టేసి, అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.250 కోట్లకు స్కెచ్ వేశారంటే అధికార పారీ్టలోని ఎవరో ‘ముఖ్య’నేత ప్రమేయం ఉండకుండా ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాకు మూడు.. మీకు ఏడు హథీరాంజీ మఠానికి చెందిన భూమిని స్వాదీనం చేసుకోవడానికి చూస్తున్న ముగ్గురు వ్యక్తులతో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి మఠం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. తనకు మూడెకరాలు కేటాయించాలని.. మీరు ఏడెకరాలు తీసుకోవాలని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. అంతటితో ఆగని నాని ఆ తర్వాత ఆ ఏడెకరాలను కూడా తానే కొనుగోలు చేసుకుంటానని చెప్పడంతో ఆ ముగ్గురు షాక్ అయ్యారు. ‘ఆ ఏడెకరాలకు రూ.25 కోట్లు ఇస్తా.. ఆ నగదును ముగ్గురు పంచుకోండి. దీంట్లో అమరావతి పెద్దలకు కూడా వాటా ఉంది’ అని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక ఆ ముగ్గురూ తెల్లముఖం వేశారని సమాచారం. పనులు ప్రారంభం ఆ పదెకరాలు చుట్టూ జూన్ 9న ఉదయం 7 గంటలకు ప్రహరీ గోడ వేయడానికి నానీస్ గ్యాంగ్ పనులు ప్రారంభించింది. ఈ సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అధికారులు, మఠం సిబ్బంది అందరూ కలిసి జూన్ 10న ఆ స్థలం వద్దకెళ్లి ప్రహరీ నిర్మించడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడ 100 మందికిపైగా నాని గూండాలు కాపుకాస్తున్నారు. ‘మేమెవరో తెలియదా?, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? మూసుకుని వెళ్లండి’ అంటూ బెదిరింపులకు దిగారు. అయితే మఠం అధికారులు పనులు ఆపాల్సిందేనంటూ గట్టిగా వాదించారు. దీంతో కోపోద్రిక్తులయిన టీడీపీ గూండాలు మఠం సిబ్బందిని తాత్కాలికంగా నిర్మించుకున్న గదిలోకి తీసుకెళ్లి బట్టలు ఊడదీయించారు. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టారు. దీంతో అధికారులు, సిబ్బంది ప్రాణ భయంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు కాళ్లా వేళ్లా పడి బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి మఠం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మఠం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చంద్రగిరి డీఎస్పీ జూన్ 11న నాని గ్యాంగ్‌ను, దేవదాయ శాఖ అధికారులను అక్కడకు పిలిపించుకున్నారు. పోలీస్ స్టేషన్లో సైతం గ్యాంగ్ ఓ దశలో అధికారులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో దేవదాయ అధికారులకు ‘నాని గ్యాంగ్’ వారి్నంగ్ ఇచి్చనట్లు తెలుస్తోంది. ఎక్కడా ఈ అంశంపై నోరు మెదపవద్దని మండిపడినట్లు సమాచారం. తమకు వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడానికి లేదని హుకుం జారీచేసినట్లు తెలుస్తోంది. ఆందోళనకు ప్రజా సంఘాలు సిద్ధం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఒక ఆర్యవైశ్య వ్యాపారి రూ.రెండు కోట్లు ఇవ్వనందుకు ఇటీవల రైస్‌మిల్లు మూయించారు. అదే క్రమంలో టీటీడీ కాంట్రాక్టర్ నుంచి రెండెకరాలు రాయించుకున్నారు. ఇప్పుడు రూ.250 కోట్ల విలువైన పదెకరాల మఠం భూమిని ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.ఆ భూమి హథీరాంజీ మఠందే.. తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైన భూమి హథీరాంజీ మఠానిదే. మఠానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకునేందుకు వెళ్లిన మఠం సిబ్బందిని వంద మంది గూండాలతో రూమ్‌లో బంధించి, బట్టలూడదీసి.. నానా దుర్భాషలాడుతూ అంతు చూస్తామని బెదిరించారు. ఈ మేరకు తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఈ భూకబ్జాలో ల్యాండ్ మాఫియా పాత్ర ఉంది. – రమేష్ నాయుడు, హథీరాంజీ మఠం పరిపాలనాధికారి భూములను సంరక్షించాలి.. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఉన్న హథీరాంజీ మఠం, పరకాల మఠం, దేవదాయ భూములను ప్రభుత్వం సంరక్షించాలి. తిరుపతి నగర నడిబొడ్డున 10 ఎకరాల భూమిని గత నెల నుంచి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసి అడ్డుకున్న మఠం అధికారులను బట్టలూడదీయించి.. నానా బూతులు తిడుతూ భయకంపితులను చేశారు. ఈ భూముల కబ్జాను తక్షణం ఆపాలని సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నా. – కందారపు మురళి, సీపీఎం నేత -
గిరిజన పాఠశాల భూమి కబ్జా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే టీడీపీ నేతలు బరి తెగించారు. ప్రభుత్వ స్థలాల కబ్జాకు తెర తీశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అండతో స్థానిక నేతలు చెలరేగిపోతున్నారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో టీడీపీ నాయకులకు ప్రభుత్వ భూమిపై కన్ను పడింది. అనుకున్నదే తడవుగా పట్ట పగలే జేసీబీ యంత్రంతో ఆ భూమిని చదును చేశారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో ప్రభుత్వ ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలకు ఆనుకుని సీజేఎఫ్ఎస్ భూములున్నాయి. ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల కోసం మరింత స్థలం కేటాయించాలని పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది కోరడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన వ్యక్తికి గతంలో సీజేఎఫ్ఎస్ పథకం కింద కేటాయించిన 1.25 ఎకరాల భూమిని పాఠశాల కోసం అప్పగించింది. వాస్తవానికి సీజేఎఫ్ఎస్ పథకం కింద కేటాయించిన భూమిపై ఏ వ్యక్తికీ అధికారం లేదు. ఈ భూమికి ఆర్డీవో హక్కుదారుగా ఉంటారు. సదరు వ్యక్తికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. అయితే ఇంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఎన్నికల్లో సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలవడం, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ టీడీపీ నేత అది తన భూమేనంటూ దౌర్జన్యపూరితంగా ఆక్రమించేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఒక గిరిజన పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించే సాహసం చేయడం చూస్తే టీడీపీ నేతలు ఏ విధంగా బరి తెగించారో అర్థమవుతోంది. ఈ భూఆక్రమణను ఆశ్రమ గిరిజన పాఠశాల ఉపాధ్యాయినులు అడ్డుకోబోతే వారిని సైతం బెదిరించారు. ఈ భూమి పాఠశాలకు కేటాయించారని చెప్పినా వినకుండా చదును చేశారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయతి్నంచగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
కేసీఆర్ అన్న కొడుకుపై కేసు నమోదు.. కారణం ఇదే..
సాక్షి, ఆదిభట్ల: తెలంగాణలో భూ కబ్జాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుతో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో, ఈ భూ కబ్జా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, అతడి గ్యాంగ్ ప్రయత్నించినట్టు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ అంశంపై ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో కన్నారావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఇక, బాధితుల ఫిర్యాదులో తమ భూమి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్ళు పెట్టినట్టు పేర్కొన్నారు. దీంతో, కన్నారావుతో పాటు అతని అనుచరులు బీఆర్ఎస్ నాయకులు 38 మందిపై 307,447,427.,436,148,149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 38 మందిలో ముగ్గురని పోలీసులు రిమాండ్‌లోకి తీసుకోగా మరో 35 మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కన్నారవు బెంగుళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. -
జమ్మికుంట కౌన్సిలర్ అరాచకం..
జమ్మికుంట: ప్రభుత్వ భూమి కబ్జా చేసి బోరు వేయడమే కాకుండా.. ఆక్రమణ సరికాదని అడ్డుచెప్పిన ముగ్గురు గ్రామస్తులపై కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రామన్నపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మూడోవార్డులోని రామన్నపల్లి ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంక్ సమీప సర్వే నంబర్ 422లో కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. అక్రమంగా బోరు వేసేందుకు యత్నిస్తుండగా , గ్రామస్తులు మర్రి మల్లయ్య, కోలకాని రాజు, మేడిపల్లి రమేశ్ అడ్డుకున్నారు. ఆగ్రహించిన కౌన్సిలర్ రవీందర్.. బుధవారం ఇనుప రాడ్‌తో ముగ్గురిపై విచక్షణ రహితంగా దాడిచేశాడు. దాడిలో మల్లయ్య, రాజుకు తీవ్రగాయాలు కాగా రమేశ్‌కు గాయాలయ్యాయి. మల్లయ్యను జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మిగిలిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, మల్లయ్య భార్య రజిత ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వి.రవి తెలిపారు. -
అడవివరంలో 20 ఎకరాలపై కన్నేసిన కబ్జాదారులు
సాక్షి, విశాఖపట్నం : అది సింహాచలం దేవస్థానానికి చెందిన అటవీ ప్రాంతం.. తాము అక్కడ నివాసముంటున్నామని పలువురు.. ప్రభుత్వ సర్వేయర్లు ఇచ్చిన రిపోర్టుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అఫిడవిట్ చూసిన జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అక్కడ నివాసం కాదు.. పూర్తి చెట్లతో నిండిన అడవి ఉందని గుర్తించారు. రూ.కోట్ల భూమిని కొట్టేసేందుకు వేసిన ఎత్తుగడకు సహకరించిన ప్రభుత్వాధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. అడవివరం గ్రామంలో సర్వే నెంబర్ 275లో 20.39 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమికి సంబంధించి హద్దులు నిర్ణయించడంతో పాటు అక్కడ ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నేపథ్యంలో రెవెన్యూ రికార్డులో తమ పేరుతో మార్చేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని బి.మంగతల్లితో పాటు మరో ఆరుగురు హైకోర్టులో రిట్‌పిటిషన్ వేశారు. పిటిషనర్ దరఖాస్తుపై నెల రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు విశాఖ రూరల్ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వే విభాగం అధికారులు సదరు భూమికి సర్వే నిర్వహించారు. 1903 సేల్ ప్రకారం అడవివరం గ్రామంలో సర్వే నెంబర్ 275లో ఉన్న 20.39 ఎకరాల భూమి మంగతల్లి కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉందని, వారు పొజిషన్లు ఉన్నారని నిర్ధారిస్తూ నివేదిక సమర్పించారు. సర్వే అధికారుల నివేదిక ఆధారంగా ఆ భూమి తమదేనని, సింహాచలం దేవస్థానం అధికారులు ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని మరోసారి మంగతల్లి మరో ఆరుగురు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్టాటస్ కో ఇచ్చింది. సర్వే నివేదిక తప్పంటూ దేవస్థానం పిటిషన్ సర్వే విభాగం ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ సింహాచలం దేవస్థానం అధికారులు 2021, అక్టోబర్ 20న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. సదరు నివేదిక సక్రమంగా లేదని, సర్వే నెంబర్ 275లో మొత్తం 5,279.57 ఎకరాల భూమి దేవస్థానం పరిధిలోనే ఉందని, ఈ సర్వే నంబర్‌కు సంబంధించి ఎలాంటి సబ్ డివిజన్లు లేవని పిటిషన్లో స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ విస్తీర్ణం మొత్తం 22ఏ జాబితాలో చేర్చడం జరిగిందని, ఆ భూమిలో దేవస్థానం కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా ఉందని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్.. జాయింట్ సర్వే బృందానికి, సర్వే, భూరికార్డుల శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. అప్పుడే సర్వే బృందం అవకతవకలు బయటపడ్డాయి. స్వయంగా పరిశీలించిన జేసీ 2021లో సర్వే చేసిన విశాఖ రూరల్ మండలం అప్పటి సర్వేయర్, ప్రస్తుత గోపాలపట్నం సర్వేయర్ డి.జగదీశ్వరరావు, సింహాచలం దేవస్థానం అప్పటి సర్వేయర్ కె.హరీష్‌కుమార్, అప్పటి గోపాలపట్నం సర్వేయర్, ప్రస్తుతం యలమంచిలి సర్వేయర్ సత్యనారాయణ, డీఐవోఎస్ కె.వేణుగోపాల్‌ను అధికారులు విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. అదేవిధంగా ఈ ఏడాది మే 15న భీమిలి ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, సింహాచలం దేవస్థానం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ఇతర అధికారులతో కలిసి జేసీ కేఎస్ విశ్వనాథన్ స్వయంగా ఆ భూమిని పరిశీలించి విస్తుపోయారు. పిటిషన్ వేసిన వారి భూ పత్రాల్లో సదరు భూమి గోపాలపట్నం మండలం మాధవధారలో ఉంది. కానీ వారు చూపిస్తున్న భూమి, వారి డాక్యుమెంట్లో ఉన్న భూమికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. దీని ప్రకారం సర్వే నెంబర్ 275లో ఉన్న భూమి సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉందని గుర్తించారు. ఆ భూమిలోనే పొజిషన్లో ఉన్నట్లు సర్వేయర్లు ఇచ్చిన నివేదిక తప్పు అని బట్టబయలైంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న సర్వే ఏడీ విజయ్‌కుమార్, డీఐవోఎస్ వేణుగోపాల్, ముగ్గురు సర్వేయర్లపై క్రమశిక్షణ చర్యలకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ భూమిని సింహాచలం దేవస్థానానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారిపై నార్సింగిలో కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కోకాపేట ల్యాండ్స్.. వివరాల ప్రకారం.. నార్సింగిలో భూవివాదంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్ ప్రతినిధి గుండు శ్రవణ్ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. అక్రమంగా తరలింపు.. అయితే, గోల్డ్‌ఫిష్ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతున్నట్టు గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేశారు. డీసీఎం వాహనాలను తీసుకువచ్చి కూలీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద కూలీలను వదిలేసి మరోసారి అక్కడికి వెళితే అంతేనంటూ హెచ్చరించి వెళ్లిపోయారు అని తెలిపారు. దీంతో, తాము పోలీసులను ఆశ్రయించినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో పాటుగా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హరీశ్వర్ రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం -
ఇదీ భూ కబ్జానే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కులాలవారీగా భూములు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కుల సంఘాలకు భూములు ఇవ్వడాన్ని కూడా కబ్జాగానే పరిగణించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 47పై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులకు విరుద్ధంగా జీవో ఉందని చెప్పింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించి ఉంటే వెంటనే ఆపాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వం గతంలో చేసిన ఇలాంటి భూ కేటాయింపును కూడా రద్దు చేశామంటూ సాయి సింధు ఫౌండేషన్‌అంశాన్ని ప్రస్తావించింది. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని అణగారిన వర్గాలకు భూమి ఇస్తే అర్థం చేసుకోవచ్చు గానీ.. ఆర్థికంగా బలంగా ఉన్న కులాలకు ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వమే కులాలను పెంచి పోషించేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్న న్యాయస్థానం.. హైటెక్ రాష్ట్రం తెలంగాణలో ఇదేం పద్ధతని తీవ్ర వాఖ్యలు చేసింది. కుల సంఘాల పేరిట రాజధాని నడిబొడ్డున అత్యంత విలువైన భూములను కేటాయించడం అసంబద్ధమైన విధానమంటూ తదుపరి విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య, ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్‌కు కుల సంఘ భవనాల నిర్మాణం కోసం 5 ఎకరాల చొప్పున హైటెక్ సిటీ సమీపంలో అత్యంత విలువైన భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కౌంటర్‌కు అనుమతి... ఈ పిటిషన్లో ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయని కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు ఎక్స్‌పార్టీ ఆదేశాలు జారీ చేస్తామని గత విచారణ సందర్భంగా ధర్మాసనం చెప్పింది. వెలమ అసోసియేషన్‌కు మాత్రం రెండు వారాలు సమయం ఇస్తున్నామంది. కమ్మ సంఘం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోవిడ్ కాలంలో తమకు నోటీసు అందలేదని, భూ కేటాయింపుపై విచారణ సాగుతున్న విషయం ప్రచార మాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు. ఈ క్రమంలో తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం అంగీకరించింది. కాగా, తమకు కేటాయించిన భూముల కబ్జా అయ్యే అవకాశం ఉందని, చుట్టూ ప్రహరీ కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కుల సంఘాల తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఈ భూ కేటాయింపే ఓ కబ్జా అని వ్యాఖ్యానించింది. ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన పేద విద్యార్థులకు ఆశ్రయం కోసం హాస్టళ్లను నిర్మించేందుకు భూమి కేటాయించడంలో అర్థం ఉంది కానీ.. ఇలా కుల సంఘాలకు కేటాయింపును సమర్ధించలేమని పేర్కొంది. అసలు ఆ కుల సంఘాలు ఆయా కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఎలా నిర్ణయించారని ప్రశ్నించింది. -
న్యాయం చేయకుంటే నక్సలైట్‌గా మారుతా!
ఇల్లెందు: ప్రజాప్రతిఘటన పార్టీలో దళ కమాండర్‌గా పనిచేసిన తన తండ్రి బొల్లి రామయ్య అలియాస్ దేవన్న లొంగిపోతే పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు కాజేశారని, రెవెన్యూ అధికారులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నా రని దేవన్న కుమారుడు సాత్విక్ ఆరోపించాడు. తమ కుటుంబానికి న్యాయం చేయకుంటే నక్సలైట్‌గా మారుతానని చెప్పాడు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సాత్విక్ విలేకరులతో మాట్లాడాడు. తన తండ్రికి ఇల్లెందు – ఖమ్మం రహదారిలోని సుభాష్‌నగర్ వద్ద 603 సర్వే నంబర్లో ప్రభుత్వం మూడు గుంటల భూమి ఇచ్చిందని చెప్పాడు. అయితే పట్టణానికి చెందిన రాము అనే వ్యక్తి తమ భూమితో పాటు పక్కనున్న 16 గుంటల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశాడని ఆరోపించాడు. తన తండ్రి దేవన్న మృతిచెందడంతో దొంగ పత్రాలు సృష్టించారని, రెవెన్యూ అధికారులు సైతం ఆయనకే వత్తాసు పలుకుతున్నారని చెప్పాడు. తన తండ్రి ఆయుధం వదిలినందుకు సర్కారు ఇచ్చిన స్థలాన్ని తిరిగి ఆయుధం పట్టుకుని కాపాడుకుంటానని సాత్విక్ తెలిపాడు. దీనిపై ఇల్లెందు తహసీల్దార్ కృష్ణవేణిని వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో విచారణ చేస్తామని తెలిపారు. -
జన్నారంలో చెరువు భూముల ఆక్రమణలపై స్పందించిన ఎమ్మెల్యే రేఖ నాయక్
-
అర్ధరాత్రి 70 మంది రౌడీలు న్యాయవాది ఇంట్లోకి చొరబడి..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ రోడ్ నం. 5లోని ఉమెన్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్న సుప్రీం కోర్టు న్యాయవాది విశ్వనాథరెడ్డి ఇంట్లోకి శుక్రవారం అర్ధరాత్రి 70 మంది భూకబ్జాదారులు, రౌడీలు చొరబడి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసి ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్లాట్ నం.85, 86లో వెయ్యి గజాల స్థలం 1990 నుంచి సుప్రీం కోర్టు న్యాయవాది విశ్వనాథరెడ్డి, ఆయన భార్య సురేఖారెడ్డి ముదిగంటి ఆధీనంలో ఉంది. ఇందులో ఇల్లు కట్టుకొని కొడుకు భరత సింహారెడ్డితో కలిసి ఉంటున్నారు. ప్రభుత్వానికి క్రమబద్దీకరణ కోసం కూడా దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించారు. అయితే పరమేశ్వర్‌రామ్ అనే విశ్రాంత గ్రూప్–1 అధికారి ఈ స్థలం తనదేనంటూ వాదిస్తూ అదే ప్రాంతంలో ఉండే ప్లాట్ నంబర్ 91కి చెందిన పత్రాలతో విశ్వనాథ్‌రెడ్డి ప్లాట్‌ను మరొకరికి డెవలప్మెంట్ అగ్రిమెంట్‌కు రూ.15 లక్షలు తీసుకొని ఇచ్చాడు. దీంతో సదరు వ్యక్తి అర్ధరాత్రి 70 మంది గూండాలను తీసుకొని కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించి కారంపొడి పొట్లాలు చల్లుతూ వీరంగం సృష్టించాడు. దీంతో తీవ్ర భయబ్రాంతులకు గురైన వాచ్‌మెన్‌తో పాటు విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో డయల్ 100కు కాల్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి రౌడీల్లో కొందరు పారిపోగా, మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించారు. శనివారం బంజారాహిల్స్ ఏసీపీ శ్రీధర్, సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి 'అమ్మానాన్న క్షమించండి.. నేను వెళ్లిపోతున్నా..' -
అద్దెకు.. టీడీపీ ఆఫీస్!
సాక్షి, అమరావతి: అధికారం ఉన్నా.. లేకున్నా.. టీడీపీ ‘భూ’ కబ్జాలు మాత్రం ఆగడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వాగు పోరంబోకు భూమిని టీడీపీ ప్రధాన కార్యాలయం కోసం కేటాయించిన చంద్రబాబు.. ఇప్పుడు జీవో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం ముందే దుకాణాలు నిర్మించి వాణిజ్య కార్యకలాపాలకు అద్దెకిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి భూమిని సైతం కబ్జా చేసేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద జరుగుతున్న ‘చంద్రబాబు చిలక్కొట్టుడు.. కబ్జా’ వ్యవహారం ఇప్పుడు బయటపడింది. కార్యాలయానికి.. వాగు పోరంబోకు భూమి చంద్రబాబు ప్రభుత్వం 2018లో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 392లో ఉన్న 3.65 ఎకరాలను టీడీపీ రాష్ట్ర కార్యాలయం కోసం కేటాయించింది. ఎకరాకు ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్లకు లీజు కింద కేటాయిస్తూ జీవో 228 జారీ చేసింది. ఆ భూమి పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకే వినియోగించాలని అందులో పేర్కొంది. ఇతరత్రా అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని కూడా స్పష్టం చేసింది. ఈ భూ కేటాయింపులో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదం కూడా అయ్యింది. వాగు పోరంబోకు భూమిని చంద్రబాబు టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్నారు. వాగులు, చెరువులు, నదులు ఇతర జలవనరులకు సంబంధించిన భూముల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ అందుకు విరుద్ధంగా వాగు పోరంబోకు భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్నారు. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. సహకరిస్తున్న ఎన్హెచ్ఏఐ అధికారి! ఈ ఆక్రమణలపై ఎన్హెచ్ఏఐ యంత్రాంగం ఉదాసీనంగా ఉండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డిప్యుటేషన్ మీద ఎన్హెచ్ఏఐలో పనిచేస్తున్న ఓ అధికారి టీడీపీకి వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేసినా.. ఆయన పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. ఇక టీడీపీ కార్యాలయంలో సమావేశాలు జరిగితే.. ఎన్హెచ్ఏఐకు చెందిన తూర్పు, పశ్చిమ సర్వీసు రోడ్లను పూర్తిగా ‘బ్లాక్’ చేస్తూ.. పార్కింగ్‌కు వాడేసుకుంటున్నారు. ఇష్టమొచ్చినట్లుగా సర్వీస్ రోడ్లపై కార్లు అడ్డంగా పెడుతుండటంతో ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు వాపోయారు. దర్జాగా ఆక్రమణలు.. దుకాణాల నిర్మాణం వాగు పోరంబోకు భూమి కేటాయింపుతో టీడీపీ అధినేత చంద్రబాబు సంతృప్తి చెందలేదు. పార్టీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి వచ్చే భూమిపైనా కన్నేశారు. నెమ్మదిగా దానిని ఆక్రమించడం మొదలుపెట్టారు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి కేటాయించిన భూమికి, ఎన్హెచ్ఏఐ సర్వీసు రోడ్డుకు మధ్యలో ఉన్న స్థలాన్ని ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టారు. ఏడాది క్రితం టీడీపీ కార్యాలయం ప్రధాన గేటు పక్కన ఓ దుకాణాన్ని నిర్మించి.. మైత్రి ఎంటర్‌ప్రైజస్ అనే పేరుతో ఒకరికి అద్దెకు కూడా ఇచ్చారు. తాజాగా మరో రెండు దుకాణాలను నిర్మించి.. వాణిజ్య కార్యకలాపాల కోసం ఇతరులకు అద్దెకిచ్చారు. రాజకీయ కార్యకలాపాల కోసమే వినియోగించాలని టీడీపీ ఆఫీస్‌కు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. దానికి విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా.. ఎన్హెచ్ఏఐ సర్వీసు రోడ్డు పరిధిలోకి చొరబడి మరీ వాణిజ్య నిర్మాణాలు చేపట్టారు. ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనే. -
ఫిలింసిటీ గోడలు బద్దలు కొడతాం.. రామోజీరావు కబ్జాకోరు, అరెస్టు చేసి జైల్లో పెట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ భూములను కబ్జా చేసి రామోజీరావు ఫిలింసిటీని నిర్మించారని.. ప్రభుత్వం దీనిపై కేసులు నమోదు చేసి, రామోజీని అరెస్టు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఫిలింసిటీ గోడలు బద్దలుకొట్టి ప్లాట్లు స్వాధీనం చేసుకుని, పేదలకు పంచుతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి సర్వే నంబర్ 189, 203లలో 675 మందికి ఇళ్లస్థలాలు కేటాయించాలని, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడారు. ‘‘రామోజీరావు భూకబ్జాకోరు. పేదల పాలిట రాక్షసుడు. తమకు కేటాయించిన స్థలాల్లోకి పేదలను రాకుండా రామోజీ అడ్డుకోవడం సరికాదు. పేదలు పోరాటాలు చేసి గుడిసెలు వేసుకుంటే కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు కేసు పెట్టాల్సింది రామోజీపై. రామోజీ లాంటి పెట్టుబడిదారులు భూములు ఆక్రమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం ఏమిటి?’’అని ప్రశ్నించారు. అధికారంలోకి రాక ముందు లక్ష నాగళ్లతో ఫిలింసిటీని దున్నిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మౌనం వహిస్తున్నారేమని విమర్శించారు. తెలంగాణలో భూదాన్, సీలింగ్, సర్కార్, పొరంబోకు భూములు పదిన్నర లక్షల ఎకరాలు ఉన్నాయని.. తమ ప్రాణాలు పణంగా పెట్టి అయినా పేదలకు స్థలాలు ఇప్పించే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. రామోజీ సొంత భూములేం అడగడం లేదు పేద ప్రజలు రామోజీ సొంత భూములేమీ అడగడం లేదని.. ఫిలింసిటీలోని 172 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వా లని కోరుతున్నామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ దారుల కోసమే అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ఐదున్నర లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్ పేర్కొన్నారు. తోపులాట.. ఉద్రిక్తత.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ వైపు దూసుకొస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు తోపులాట జరిగింది. కాసేపటికి సీపీఎం నేతలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కార్యకర్తలను చెదరగొట్టారు. తర్వాత 10మంది నేతలు, కార్యకర్తలు వెళ్లి అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.జగదీశ్, సామేలు, జిల్లా కమిటీ సభ్యుడు కందుకూరి జగన్, మండల కార్యదర్శి సీహెచ్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్లాట్‌లో కార్లు పార్కింగ్.. అడిగినందుకు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా..
సాక్షి ,బంజారాహిల్స్: తమ ప్లాట్‌లో అక్రమంగా కార్లు పార్కింగ్ చేయడమే కాకుండా తొలగించాలని చెప్పినందుకు వేధింపులకు పాల్పడుతున్న నిందితులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల సమాచార మేరకు... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 39లో క్రోమా బిల్డింగ్ వెనుకాల ప్లాట్ నెంబర్ 757లో యజమానురాలు ఇటీవల నిర్మాణ భూమి పూజ చేసేందుకు వెళ్లగా ఆ స్థలంలో పక్కనే సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే వ్యక్తి తన కార్లను పార్కింగ్ చేశాడు. ఇదేమిటని ఆమె ప్రశ్నించగా ఆమెపై దుర్భాషలాడాడు. కార్లు తొలగించను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ హెచ్చరించాడు. ప్లాట్ కబ్జా చేసేందుకు అడ్డదారుల్లో ప్రయత్నిస్తున్నాడని నిలదీసినందుకు తనపై హత్యాయత్నానికి కూడా వెనుకాడటం లేదని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన ప్లాట్‌ను ఆక్రమించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. దీంతో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె అంతు చూస్తానని బెదిరించిన సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ కేంద్రం యజమాని సయ్యద్ తౌసిఫ్, సయ్యద్ ఆసిఫ్‌లపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 447, 506, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Nupur Sharma నూపుర్ శర్మ ఫొటో షేర్ చేసినందుకు షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే -
ఆధారాలతో బయటప పెట్టిన ఇరిగేషన్ శాఖ
-
అయ్యన్న పాత్రుడు ఇంటి ముందు టీడీపీ నాయకుల డ్రామా
-
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్ రైటర్
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు దాడి చేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటికే ఆయన పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అంతేగాక తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు సదరు వ్యక్తులు ఆయనపై దాడికి యత్నించారని ఆరోపిస్తూ తాజాగా చిన్ని కృష్ణ శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్, ముఖ్య అతిథిగా.. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే చిన్ని కృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించారు. స్టార్ హీరోల సినిమాలకు కథలు అందించి ప్రముఖ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కథ అందించిన చిత్రాల్లో అల్లు అర్జున్ ‘గంగోత్రి’, బాలకృష్ణ ‘నరసింహనాయుడు’, చిరంజీవి ‘ఇంద్రా’ సినిమాలు ఉన్నాయి. అవి ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. వీటితో పాటు ఆయన మరిన్ని సినిమాలకు కూడా కథలు అందించారు. -
మూడెకరాల చెరువును చెరబట్టిన చంద్రబాబు పీఏ అండ్ కో
కుప్పం.. ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ముందుగా చంద్రబాబునాయుడు పేరే.. సొంతూరు చంద్రగిరిలో ఓడగొట్టినా.. వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించే రికార్డునిచ్చి.. ఓ విధంగా ఆయన పరువు నిలబెట్టిన ప్రాంతం కుప్పం. అయితే ఈ నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోని బాబు.. తాను అధికారంలో ఉండగా ఈ ప్రాంతాన్ని తన తాబేదార్లు, పీఏలకు అప్పజెప్పేశారు. దొరికిందే తడవుగా సదరు తాబేదార్లు ఇష్టారాజ్యంగా కుప్పాన్ని చెరబట్టేశారు. ఇందుకు ఉదాహరణే ఊరి నడి అంచున ఉన్న వెంకటరామయ్య చెరువు. నానుడిలో వెంకటప్పా చెరువుగా ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న ఈ చెరువు ఇప్పుడు రియల్ వెంచర్‌గా మారిన ‘అ’క్రమం ఎలాగంటే.. సాక్షి ప్రతినిధి, తిరుపతి : తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో అమరావతి, విశాఖల్లో జరిగిన భూ కుంభకోణాల గురించి అందరికీ తెలిసిందే. రాజధాని నగరాలైన అక్కడే అలా జరిగితే మరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తమ్ముళ్లు చూస్తూ ఊరుకుంటారా..? అందులోనూ.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కుప్పం ప్రాంతంలో కొన్నాళ్లుగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పక్క రాష్ట్రాల రియల్టర్లు కూడా ఆసక్తి చూపడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా చేసేశారు. భూములే కాదు చివరికి చెరువులను కూడా చెరబట్టేశారు. ఆ క్రమంలోనే కుప్పం బైపాస్ రోడ్ సమీపంలోని వెంకటప్పా చెరువును మింగేశారు. తప్పుడు సర్వే నంబర్లతో లే అవుట్లు సర్వే నం.226/2తో 3.58 ఎకరాల విస్తీర్ణం కలిగిన వెంకటప్పా చెరువు ఒకప్పుడు ఆ ప్రాంత రైతులకు జీవనాడి. అలాంటి చెరువుపై 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు కన్నేశారు. చంద్రబాబు పీఏ మనోహర్ అండ ఉండడంతో తప్పుడు సర్వే నంబర్లతో ఈ చెరువును లే అవుట్‌గా మార్చేశారు. కుప్పం సమీపంలోని సీనేపల్లి గ్రామ పంచాయతీలో ప్లాన్ అప్రూవల్ చేసుకోవడం.. ఆ ప్లాన్‌తో కుప్పంలోని సర్వే నం.226/2లోని చెరువులో నిర్మాణం చేసుకోవడం.. ఇలా టీడీపీ నేతలు, మనోహర్ సన్నిహితులు మతిన్ హజరత్, నజీర్, మణి బినామీ పేర్లతో చెరువును ప్లాట్లుగా చేసి తెగనమ్మేశారు. అప్పటి కుప్పం అధికారులకు అంతా తెలిసినా ఏమీ తెలియనట్టే వదిలేశారు. దీంతో స్థానికులు, రైతులు అప్పటి మదనపల్లె్ల సబ్ కలెక్టర్ వెట్రి సెల్వి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సబ్‌కలెక్టర్ 2017 ఆగస్టులో కుప్పం వచ్చి కబ్జాకు గురైన చెరువును పరిశీలించారు. అక్కడికక్కడే సర్వేకి ఆదేశించి.. హద్దులు ఏర్పాటు చేస్తుండగా.. అదే సమయంలో సదరు సబ్‌కలెక్టర్‌కు అమరావతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో నామమాత్రపు సర్వే చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతే ఆ తర్వాత అక్రమ కట్టడాల జోరు పెరిగిపోయింది. కేసు హైకోర్టులో ఉన్నప్పటికీ ఆగని అక్రమ నిర్మాణాలు చెరువులో అక్రమ నిర్మాణాలపై స్థానికులు, రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కబ్జాదారులే ముందుగా హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చారు. కోర్టుకు వాస్తవాలు వివరించి స్టే వెకేట్ చేయించాల్సిన అధికారులు సరైన సమయంలో అప్పీల్‌కు వెళ్లకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఇక వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో కనీసం నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఆ కేసు సాకుతో పట్టించుకోలేదనే చెప్పాలి. ఫలితంగా ఇప్పటికీ అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కుప్పం మండల టీడీపీ కోశాధికారి మణి బినామీ పేరిట అక్కడే మూడంతస్తుల బిల్డింగ్ నిర్మించేశారు. వాళ్లే కోర్టుకు వెళ్లే చాన్స్ ఇచ్చారు వాస్తవానికి అప్పట్లో చెరువు ఆక్రమణలను రెవెన్యూ అధికారులు వెంటనే తొలగించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అక్రమ నిర్మాణాలు వెంటనే కూల్చకుండా కాలయాపన చేశారు. ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లేలా కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. చెరువును రక్షించుకునేందుకు రెవెన్యూ వారితో కలిసి ఇరిగేషన్ శాఖాపరంగా చర్యలు చేపడుతుంది. – హరినాథరెడ్డి, ఇరిగేషన్ డీఈఈ చెరువులో రియల్ వెంచర్ దారుణం ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికీ చెరువుగానే చూపిస్తున్న ఆ భూమిలో రియల్ వెంచర్ వేయడం దారుణం. ఇప్పటికైనా అధికారులు హైకోర్టులో కేసు అంటూ కుంటి సాకులు చెప్పకుండా రూ.కోట్ల విలువైన చెరువు భూమి, చుట్టుపక్కల భూములను పరిరక్షించాలి. ఇది ప్రజలకు సంబం«ధించిన ఆస్తిగా గుర్తించి అధికారులు చర్యలు తీసుకోవాలి. – నరేంద్ర ఆజాద్, చెరువు దురాక్రమణ నిజమే వెంకటప్పా చెరువు దురాక్రమణ వాస్తవమే. కచ్చితంగా అది ప్రభుత్వ స్థలమే. వేరే సర్వే నంబర్‌తో అప్రూవల్ తీసుకుని 2019కి ముందు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన మాట నిజమే. అయితే ఈ రెండేళ్లుగా ఆ చెరువు ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకున్నాం. హైకోర్టులో స్టే ఉండడంతో స్టే వెకేషన్ కోసం ప్రయతి్నస్తున్నాం. ఆ తర్వాత హైకోర్టు తీర్పు మేరకు వ్యవహరిస్తాం. వాస్తవానికి చెరువు ఆక్రమణలను అడ్డుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఇరిగేషన్ అధికారులదే. ఆ శాఖ బాధ్యులు సరిగ్గా స్పందించాల్సిన అవసరం ఉంది. – సురేష్, తహసీల్దార్ చదవండి: అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి.. -
రూ. కోట్ల విలువైన భూమికి స్కెచ్.. బీజేపీ నేత అరెస్టు
సాక్షి, విశాఖపట్నం/మధురవాడ (భీమిలి): కొమ్మాదిలో రూ.కోట్ల విలువైన 12.26 ఎకరాల స్థలానికి తప్పుడు జీపీఏ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నించిన అల్లిపురానికి చెందిన బీజేపీ కోశాధికారి జరజాపు శ్రీనివాసరావును పీఎం పాలెం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తన భర్త పేరున ఉన్న ఈ భూమిని తప్పుడు పత్రాలు సృష్ణించి విక్రయించాలని చూస్తున్నారని గత బుధవారం పీఎంపాలెం పోలీసుస్టేషన్లో బాధితుడు కృష్ణచౌదిరి భార్య లక్ష్మీసూర్య ప్రసన్న ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. విశాఖ రూరల్ మండలం కొమ్మాది రెవెన్యు గ్రామం సర్వే నంబరు. 53/1 నుంచి 4 సబ్ డివిజన్లు, 54/2, 54/4, 54/5, 54/6 తదితర సబ్ డివిజన్లలో అమెరికాలో ఉంటున్న తుమ్మల కృష్ణ చౌదరికి 12.26 ఎకరాలు విలువైన భూమి ఉంది. సుమారు వంద కోట్లు విలువ చేసే భూమికి తప్పుడు జీపీఏ సృష్టించి అల్లిపురానికి చెందిన బీజేపీ కోశాధికారి జరజాపు శ్రీనివాసరావు బేరం పెట్టాడు. కొనుగోలుకు సిద్ధపడిన కొంతమంది దీనిపై పత్రిక ప్రకటన ఇచ్చారు. వారం రోజుల వరకు ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో భూమి కొనుగోలుకు వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రూ.3.49 కోట్లు అడ్వాన్సుగా అకౌంట్లో జమచేశారు. అయితే కృష్ణ చౌదరి పేరుమీద ఐసీఐసీఐ బ్యాంకు కూర్మన్నపాలెం బ్రాంచిలో తప్పుడు ధ్రువపత్రాలతో ఖాతా తెరిచాడు. ఈ ఖాతా నుంచి చౌదరి భార్య ఖాతాకు రూ.60 లక్షలు బదిలీ అవడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. భూ యజమాని అమెరికాలో.. ఈ భూమికి సంబంధించిన యజమాని అమెరికాలో ఉండడంతో జీపీఏని అమెరికాలో ఆగస్టు 5న తయారు చేయించి అక్కడ ఇండియా ఎంబసీలో అనుమతితో ఇండియాకు పంపించినట్లు తప్పడు పత్రాలు సృష్టించారు. గత నెల 23న జిల్లా రిజిస్ట్రార్ వేలిడేషన్ తర్వాత 26వ తేదీన మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది. దీనికి మార్కెట్ విలువ తక్కుగా వెయ్యడంతో డాక్యుమెంట్‌ను పెండింగ్‌లో పెట్టి సబ్ రిజిస్ట్రార్ దీనిపై పునఃపరిశీలన చేసి వాస్తవాలు పరిశీలించాలని జిల్లా రిజిస్ట్రార్‌కు గత నెల 31న పంపించారు. ఇది ఇలా ఉండగా పేపరు ప్రకటన తర్వాత భూ యజమాని భార్య తుమ్మల లక్ష్మి సూర్యప్రసన్న తెరమీదకు వచ్చారు. దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో రూ.3.49 కోట్లు ఐసీఐసీఐ బ్యాంకు కూర్మన్నపాలెం బ్యాంకులో తప్పుడుపత్రాలతో కృష్ణచౌదిరి పేరిట ఉన్న అకౌంట్లోకి జమ అయ్యాయి. ఈ అకౌంట్ నుంచి రూ.60 లక్షలు కృష్ణచౌదిరి భార్య ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఈకేసు కొత్త మలుపు తిరిగింది. ఈనగదు తాను సూర్య నుంచి అప్పుగా తీసుకున్నానని ఆమె బుకాయిస్తున్నప్పటికీ అందుకు తగిన ఆధారాలు లేవని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈనేపథ్యంలో బ్యాంక్ అధికారుల పాత్రతోపాటు ఈమె పాత్రకూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధ్యులందరినీ అరెస్టు చేస్తాం: సీఐ ఈ కేసులు తప్పుడు జీపీఏ సృష్టించి ప్రైవేటు భూమిని అమ్మేసేందుకు ప్రయత్నించిన అల్లిపురం, రామాలయం వీధికి చెందిన జరజాపు శ్రీనివాసరావు(51)ని ఐపీసీ 467, 468, 471, 120 కింద అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్టు పీఎంపాలెం పోలీసు సీఐ రవికుమార్ చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నారనేదానిపై లోతుగా విచారణ లోతుగా చేస్తున్నామని వారందరినీ కూడా అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. -
దేవుడు భూమిని మింగేస్తున్నారు..కాపాడండి
పలాసలో భూముల రేట్లతో పాటు భూదందాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా రికార్డులు మార్చేసి విలువైన భూములు కొట్టేయడానికి కొందరు మాస్టర్ ప్లాన్లు వేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ క్షుద్ర ప్రయత్నాలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను కాజేయడానికి చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పలాసలో భూ బకాసురుల ఆకలికి దేవుడి భూములు స్వాహా అయిపోయే లా ఉన్నాయి. బృందావన స్వామి, మదనమోహన స్వామి, వేణుగోపాల స్వామి, జగన్నాథ స్వామి ఆలయాలకు చెందిన దాదాపు రూ.వెయ్యి కోట్ల వి లువైన భూములపై కొందరి కన్ను పడింది. ఇప్ప టికే ఈ ఆలయాలకు సంబంధించిన కొన్ని భూ ములు ప్రైవేటు వ్యక్తుల పేరున అడంగల్లోకి ఎక్కిపోయాయి. కొన్నేళ్ల కిందటే ఇక్కడ రికార్డుల మా ర్పిడి జరిగిపోయింది. టీడీపీలో కీలక నేతలు సూ త్రధారులుగా వ్యవహరించారు. అధికారులు, అక్రమార్కులు కుమ్మక్కై దేవాలయ భూములు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. ఏ మాత్రం అలసత్వం వ హించినా దాదాపు 25ఎకరాల భూములు ప్రైవేటు వ్యక్తుల పరమవుతాయి. భూ దోపిడీ.. పలాసలో భూదందాలకు అంతులేకుండా పోయింది. దీనిపై ‘సాక్షి’ కథనాలను కూడా ప్రచురించింది. వీటిని శోధించే పనిలో ఉండగా దేవాలయాల భూ ముల కొట్టేసే పన్నాగం వెలుగు చూసింది. ఇక్కడ బృందావన స్వామి, మదనమోహనస్వామి, వేణుగోపాలస్వామి, జగన్నాథస్వామి దేవాలయాలకు సంబంధించిన 24.58 ఎకరాల భూములు ఉన్నా యి. పట్టణం నడిబొడ్డున, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదు రుగా ఇవి ఉన్నాయి. ప్రముఖ దేవాలయాలకు పు రోహిత ఇనాం భూములుగా ఉన్న వాటిని వ్యూహాత్మకంగా ప్రైవేటు వ్యక్తుల పేరున అడంగల్లోకి ఎక్కించేశారు. కొందరు అధికారులు వత్తాసు పలకడంతో కొన్నింటికి డిజిటల్ సిగ్నేచర్ కూడా అయిపోయింది. మరికొన్నింటికీ డిజిటల్ సిగ్నేచర్‌లో పెండింగ్‌లో పెట్టి ఉంచారు. మళ్లీ అధికారంలోకి వస్తే కొట్టేయవచ్చని ఎన్నికల ముందు పావులు కదిపారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో వారి ఆట లు సాగలేదు. చాలావరకు డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే, వాటినే పట్టుకుని ప్రస్తుతం కూడా లావాదేవీలు సాగిపోతున్నాయి. వందలకోట్లరూపాయల విలువైన భూములను దర్జాగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులేం చేస్తున్నారు..? దేవాలయాల భూములు అధికారుల కళ్ల ముందే ప్రైవేటు వ్యక్తుల పేరున రికార్డుల్లోకి ఎక్కిపోయా యి. వారసత్వం, డీ పట్టా భూముల కింద కొన్ని, కొనుగోలు కింద మరికొన్ని భూములు ప్రైవేటు వ్య క్తుల పేరున అడంగల్‌లో నమోదయ్యాయి. ఇంత జరిగినా అధికారులు చోద్యం చూడడం తప్ప ఏమీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి పురోహిత ఇనాం భూములు వారసత్వం కింద వ చ్చే అవకాశం లేదు. అలాగే, దేవాలయాల భూ ములను డీ పట్టాల కింద ఇవ్వడానికి లేదు. దేవాలయాల భూములకొనుగోలు కూడా నిషేధం. కానీ ఇక్కడ నిబంధనలన్నీ నీరుగారిపోయాయి. పక్కా గా రికార్డుల్లో వారసత్వం, కొనుగోలు, డీ పట్టా కింద ప్రైవేటు వ్యక్తుల పేరిట రాసేశారు. నిషేధిత భూ ముల జాబితాలో ఉన్న సర్వే నంబర్లపైన కూడా లావాదేవీలు జరిగిపోయాయి. ఇప్పుడవి చైన్ సిస్టమ్‌లా చేతులు మారిపోతున్నాయి. అనధికారికంగా వందల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు మేలుకోకుంటే దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూములు దేవుడికి కాకుండాపోతాయి. -
పట్టా పగ్గాల్లేని లేని అక్రమాలు..
సాక్షి, శ్రీకాకుళం : అధికారం ఉంటే చాలు.. అనర్హులు అర్హులైపోతారు. కార్యకర్తలు అధికారులైపోతారు. పొలాలు స్థలాలైపోతాయి. బందలు..బంధహస్తాల్లోకి వెళ్లిపోతాయి. టీడీపీ దశా బ్దాలుగా పాటిస్తున్న రాజకీయ సూత్రమిది. దానికి మరో స జీవ సాక్ష్యం కవిటి మండలం గొర్లెపాడు. ఆ ఊరిలో ఒకప్పటి చెరువులు ఇప్పుడు పట్టా భూములైపోయాయి. ఆ పట్టాలు కూడా ఊరిని ఏళ్లుగా ఏలుతున్న కుటుంబం పేరు మీదే ఉన్నాయి. గ్రామంలో సుదీర్ఘ కాలం పాలన చేసిన సదానంద రౌళో కుటుంబం ప్రభుత్వ చెరువులను అందరూ చూస్తుండగానే పట్టా భూమిగా మార్చేసింది. ప్రభుత్వ చెరువులను పట్టా భూములివ్వడానికి లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నా యి. కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను గుప్పెట్లో పెట్టుకుని రికార్డు లు మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సదానంద రౌళో సోదరుడు గతంలో అక్కడ వీఆర్ఓగా పనిచేశారు. ఇంకేముంది అన్నీ అనుకున్నట్టు జరిగిపోయాయి. చెప్పాలంటే అక్కడ ఒకే కుటుంబం పెత్తనం సాగింది. ఇప్పుడా పంచాయతీలో పాలన మారింది. సర్పంచ్ మారారు. అక్కడ జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా చెరువుల వ్యవహారం బయటపడింది. చెరువుల్లో ఉపాధి పనులు చేయిద్దామని ప్రస్తుత పాలకవర్గం అధికారులను విన్నవించగా, ఆ టీడీపీ నేత కుటుంబ సభ్యులు తమ భూములంటూ అడ్డు తగులుతున్నారు. cఅభివృద్ధి కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. 1912 జింకో సర్వే మద్రాస్ రికార్డులో చెరువులుగానే ఉంది. 1961 సర్వేలో కూడా ప్రభుత్వ చెరువులుగానే ఉన్నాయి. ఆ తర్వాత టీడీపీ నేత కుటుంబీకుల పేరున రికార్డుల్లోకి ఎక్కిపోయాయి. ఈ చెరువులపై గతంలో వివాదం చోటు చేసుకున్నప్పుడు 2004లో అప్ప టి తహసీల్దార్ జి.అప్పారావు కూడా ఇవి ప్రభుత్వ చెరువులుగానే గుర్తించి, ఎండార్స్మెంట్ లెటర్ కూడా రాశారు. అయినప్పటికీ దమాయించి ఆ చెరువులను వారి గుప్పెట్లో పెట్టుకున్నారు. పట్టా భూములుగా అనుభవిస్తున్నారు. -
చంద్రబాబు ఫాదర్ ఆఫ్ కరప్షన్: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో భూములను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కబ్జాకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భూకబ్జాదారుల్లో ఎక్కువగా టీడీపీ నేతలే ఉన్నారని గుర్తు చేశారు. విశాఖ నడిబొడ్డున సైతం భూములను ఆక్రమించారని మండిపడ్డారు. ఈ భూకబ్జాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ నేతల చేశారన్నారన్నారు. తప్పు చేసిన ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చదవండి: తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు: మంత్రి అవంతి -
కబ్జా పేరు వింటే కందికుంట గుర్తొస్తారు..!
సాక్షి, అనంతపురం (కదిరి): ఇతరుల ఆస్తిని కబ్జా చేయడం టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్ విమర్శించారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కదిరిలో కబ్జా పేరు వింటే అందరికీ కందికుంట పేరు గుర్తుకు వస్తుందన్నారు. పట్టణంలో ఎంతో మంది క్రిíస్టియన్ అనాథ పిల్లలు చదువుకునే స్కూల్‌ను కందికుంట కబ్జా చేసి కూల్చేసిన విషయం కదిరి ప్రాంత ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో తాను హిందూపురంలో 8 ఎకరాల ఆస్తిని నిబంధనల ప్రకారమే క్రిస్టియన్ పెద్దల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. అందులో 6 ఎకరాలను అప్పట్లోనే తాను సూచించిన వారి పేర్ల మీద రిజిష్టర్ కూడా చేయించారని వివరించారు. మిగిలిన రెండెకరాలు రిజిష్ట్రేషన్ చేయించడం ఆలస్యమైందని, ఆ భూమి విలువ పెరగడంతో రిజిష్ట్రేషన్ విలువ కూడా పెరిగిందన్నారు. అయితే ఆ భూమిని తాను కబ్జా చేసినట్లు ఇటీవల ఓ టీవీ చానల్లో ప్రసారం చేశారని, ఆ చానల్ యాజమాన్యంపై కోర్టులో పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వివరించారు. చదవండి: (మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం) చంపుతామంటే బెదిరేవాన్ని కాదు.. తనను చంపుతానంటే భయపడే వ్యక్తిని కాదని కందికుంటకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ పరికి షామీర్ హెచ్చరించారు. బెదిరింపులతో కదిరి ప్రజలను భయపెట్టి రాజకీయం చేయాలని కందికుంట చూస్తున్నారని, ఈ సంస్కృతిని కదిరి ప్రజలు అంగీకరించరన్నారు. డబ్బు ఆశ చూపి కొందరు యువకులను కందికుంట తన వెంట తిప్పుకుంటూ పెడదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. త్యాగరాజుపై పలు కేసులున్నాయి తమపై తప్పుడు కేసు పెట్టిన త్యాగరాజుపై పలు ప్రాంతాల్లో కేసులు ఉన్నాయని షాకీర్, షామీర్ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను వారు మీడియాముందుంచారు. సీఅండ్ఐజీ మిషన్ చర్చి చైర్మన్‌గా చెప్పుకుంటూ కందికుంటతో చేతులు కలిపిన త్యాగరాజు తప్పుడు పనులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. -
మనదేనయ్యా ఆ భూమి..
సాక్షి, రామచంద్రపురం: వెతుకుతున్న వస్తువు కాలికి తగిలినట్టు.. పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు భూమి కోసం అన్వేషిస్తుంటే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి అధికారుల కంట పడింది.. అసలు ఆ భూమి ఎవరిదని ఆరా తీస్తే... ప్రభుత్వానిదే అని నిర్ధారణ అయింది. చివరికి రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చొరవతో ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పరిధిలో రూ.1.50 కోట్ల విలువైన సుమారు 2.70 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 99, 100లో ఈ భూమి వెల్ల సావరం దగ్గర్లో ఉంటుంది. ద్రాక్షారామ రెవెన్యూ పరిధిలోని ఆ మెరక భూమిలో 40 ఏళ్ల నుంచి కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ ఫలాలను కొందరు అనుభవిస్తున్నారు. ఆ స్థలం సర్కారుదని ఎవరికీ తెలియదు. అంతేకాకుండా కొంత ఆక్రమణకు గురైంది. ఇదిలా ఉంటే పేదలందరికీ గూడు కల్పించేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ స్థలాలున్నాయో తెలుసుకునేందుకు అధికారులు జల్లెడ పట్టారు. అధికారులకు ద్రాక్షారామ పరిధిలోని ఆ భూమి కనిపించింది. అసలు ఎవరిదని అధికారులు రికార్డులు తిరగేశారు. చివరికి ప్రభుత్వానిదే అని తేలింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయన ఆయా సర్వే నంబర్లలోని భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి 2.70 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. పొక్లెయిన్‌తో చెట్లను తొలగించి చదును చేశారు. ద్రాక్షారామ పరిధిలోని ఇళ్లు లేని పేదలకు స్థలాలు కొనుగోలు చేసేందుకు అధికారులు ఎంతో శ్రమపడ్డారు. అనుకోకుండా విలువైన భూమిని గుర్తించి దానిని ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో సుమారు 135 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. ఈ స్థలాన్ని గుర్తించడంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో పేదలకు మేలు జరగనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రోల్‌మోడల్‌గా ఏపీ మా కంట పడింది.. గతంలో ఆ భూమిని ఎవరూ గుర్తించలేదు. ప్రస్తుతం సర్వే చేస్తుండగా మా కంట పడింది. ఎవరిదని ఆరా తీస్తే ప్రభుత్వానిదని తేలింది. రికార్డులన్నీ సక్రమంగానే ఉన్నారు. ఆ స్థలాన్ని పూర్తిగా సిద్ధం చేశాం. పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తాం. – పి.తేజేశ్వరరావు, తహసీల్దార్, రామచంద్రపురం -
భూ వివాదంలో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి
-
సిట్‌ను ఆశ్రయించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్టణం : నగరంలోని మధురవాడలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ గురువారం బీజపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సిట్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీని ఆశ్రయించి కబ్జాదారులు భూములను మింగేస్తున్నారని ఆరోపించారు. సిట్ ద్వారా ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములపై కూడా విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
తొలగనున్న ‘భూ’చోళ్ల ముసుగు
విశాఖ నగరంలో, జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాలను వెలికితీయాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు చోటుచేసుకున్న భూ అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నగరవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్ల కిందట నాటి తెలుగుదేశం సర్కారు సిట్ వేసినా అది కంటి తుడుపు చర్యగానే మిగిలిపోయింది. అసలు ఆ నివేదికే వెలుగుచూడలేదు. అప్పటి ప్రభుత్వం మీద.. ఆ దర్యాప్తు మీద నమ్మకం లేని చాలామంది బాధితులు భూదందాలను వెలుగులోకి తీసుకురాలేదు. ప్రయోజనం ఉండదని భావించి సిట్ దృష్టికి తీసుకువెళ్లలేదు. వారు ఊహించినట్టుగానే ఫిర్యాదు చేసిన బాధితుల్లో ఒక్కరికీ న్యాయం జరగలేదు. బడాబాబులెవరిపైనా కేసులు పెట్టలేదు. విశాఖ భూస్కాంపై పునర్విచారణ చేపట్టాలని, సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరిన్ని భూదందాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాక్షి, విశాఖపట్నం: ఐదేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి నిర్మాణం పేరిట విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వేలాది ఎకరాల పంట భూములను అడ్డగోలుగా.. అన్యాయంగా దోచేసిన పాలకులు ఆ తర్వాత విశాఖ నగరం మీద వాలిపోయారు. సుందరమైన సముద్రతీరంతో నవ్యాంధ్రలో ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖలో రూ.లక్షల కోట్ల విలువైన భూములను చెరబట్టారు. హుద్‌హుద్‌ను కూడా తట్టుకున్న విశాఖపట్నం... భూ బకాసురులుగా మారిన తెలుగుదేశం పాలకులు సృష్టించిన భూదందాల విలయంతో మాత్రం చిగురుటాకులా వణికిపోయింది. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళతామని చెప్పిన పాలకులే భూ మాఫియాకు ద్వారాలు తెరిచి పాతాళానికి నెట్టేశారు. డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా దేన్నీ వదల్లేదు. అధికారం అండతో ఖాళీగా కనిపిం చిన భూమినల్లా కబ్జా చేసేశారు. వీరితో కొందరు అధికారులు కూడా కుమ్మక్కుకాగా.. మరి కొందరి మెడపై అధికారమనే కత్తి పెట్టి పనులు చేయించుకున్నారు. ఇక రికార్డులు తారుమారు చేయడమనే సరికొత్త భూ దందా బహుశా దేశంలోనే మొదటిసారి ఇక్కడే బీజం పడిందన్నది జగమెరిగిన సత్యం. ఆక్రమణలో ఉన్న ఇనాం భూములు రికార్డులు గల్లంతుతో భూ కుంభకోణం బట్టబయలు 2017 మేలో భూ రికార్డుల మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొన్ని వేల భూ రికార్డులు కనిపించడం లేదని స్వయంగా అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. విశాఖలో 2,45,896 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్స్ (ఎఫ్ఎంబీ)లు ఉండగా ఇందులో 16,735 ఎఫ్‌ఎంబీలు కనిపించకుండా పోయాయి. 3022 ఆర్‌ఎస్‌ఆర్‌లు ఉండగా అందులో 379 అదృశ్యమయ్యాయి. 3022 గ్రామాలకు సంబంధించి క్లియర్ మ్యాపుల్లో 233 గ్రామాల మ్యాపులు కనిపించకుండా పోయాయి. ఇందులో చాలావరకు భీమిలి, మధురవాడ ప్రాంతాల్లోని భూములకు సంబంధించినవే ఉన్నాయి. ఇలా భూ కుంభకోణం బట్టబయలైంది. జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న నేతల్లో చాలామంది భూ దందాల ఆరోపణలు ఎదుర్కొన్న వారే. అప్పటి అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌పై ఏకంగా పోలీసు కేసు కూడా నమోదైంది. సిట్ నివేదిను తొక్కిపెట్టిన టీడీపీ సర్కారు విశాఖ భూ కుంభకోణంపై ప్రతిపక్షాల ఆందోళనను దిగొచ్చిన సర్కారు 2017 జూన్ 20న సిట్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో అప్పటి జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరించిన జి.సృజన సభ్యురాలిగా ఏర్పాటు చేసిన సిట్‌కు అందిన 2875 ఫిర్యాదుల్లో మూడొంతులు అధికార పార్టీకి చెందిన నేతలపైనే వచ్చాయి. వివిధ వర్గాల ప్రజలు, భూ బాధితులు కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల భూకబ్జాలపైనే సిట్‌కు ఫిర్యాదులు చేశారు. సుదీర్ఘంగా సాగిన సిట్ విచారణలో వందలాది డాక్యుమెంట్లు, వేలాది భూ రికార్డులను పరిశోధించి.. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 2018 జనవరి 29న సిట్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా తొక్కిపెట్టిన సర్కారు చివరికి అదే ఏడాది నవంబర్ 6న కేబినెట్‌కు ముందుకు తీసుకొచ్చింది. కానీ నేటికీ బహిర్గతం చేయకపోవడం గమనార్హం. టీడీపీ దందాలకు అధికారుల బలి మొత్తంగా భూ కుంభకోణంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్ అధికారులపై చర్యలకు సిట్ సిఫార్సు చేసినా పట్టించుకోని సర్కారు తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులను మాత్రం బలి చేసింది. తహసీల్దార్ నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఐఏఎస్ స్థాయి అధికారులకు సంబంధించి సుమారు 48 మందిపై క్రిమినల్ కేసుల నమోదుకు సిఫార్సు చేసింది. సుమారు 140 మంది వివిధ స్థాయి అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసింది. కొత్త సిట్ ఏర్పాటైతే.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విశాఖ భూ కుంభకోణంలో అక్రమాలను వెలికితీయడంతోపాటు దోషులేవరో నిగ్గుతేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భీమిలీ, మధురవాడ తదితర ప్రాంతాల్లో అత్యంత విలువైన భూ రికార్డులను తారుమారు చేసి కొందరు టీడీపీ నేతలు సొంతం చేసుకున్నట్లు పక్కా ఆధారాలున్నా వారి పేర్లు దోషుల జాబితాలో లేకుండా తప్పించినట్లు ఆరోపణలున్నాయి. అందువల్ల ఈ భాగోతంపై మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరిపించాలని ప్రస్తుత ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్న సదుద్దేశంతో నిజాయతీ గల ఐఏఎస్, లేదా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో విచారణ జరిపించాలని భావిస్తోంది. కొత్తగా సిట్ ఏర్పాటు చేస్తే జిల్లాలో జరిగిన భూదందాల్లో మరిన్ని వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణ, విచారణ విషయంలో పరిమితులను విధించింది. దీంతో కొన్ని దందాలకు మాత్రమే అప్పటి సిట్ పరిమితమైంది. సిట్‌కు పరిమితులు విధించొద్దంటూ ప్రజాసంఘాలు, బాధితులు ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోలేదు. దీంతో అనేక భూ దందాలు మరుగున పడిపోయాయి. ఇవన్నీ కొత్త సిట్ ద్వారా వెలుగులోకి వస్తాయని అందరూ భావిస్తున్నారు. -
ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి
-
సోమిరెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు
సాక్షి, వెంకటాచలం: అధికారాన్ని అడ్డుపెట్టుకొని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సాగించిన భూదందాపై కోర్టు ఆదేశాలతో మంగళవారం ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో పామర్రు పిచ్చిరెడ్డికి సర్వే నెంబరు 581 ప్రకారం 8.89ఎకరాలు, 583 ప్రకారం 4.42 ఎకరాలతో మొత్తం కలిపి 13.71ఎకరాల భూమి ఉంది. ఇందులో 10.94 ఎకరాలకు పంపకాలు సరిగా జరగలేదనే వివాదం ఉంది. దీంతో విషయం అప్పట్లో సోమిరెడ్డి దృష్టికి వెళ్లడంతో లేని రికార్డులను సృష్టించారు. సర్వే నంబరు 583 ప్రకారం ఉన్న 2.36 ఎకరాల భూమిని తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత భూమిని చెన్నై నగరానికి చెందిన మేఘనాథన్, ఏఎం జయంతిలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కాగా బాధితుడు ఏలూరు రంగారెడ్డిలో అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు మంగళవారం సోమిరెడ్డితోపాటు వీఆర్ మేఘనాథన్, ఏఎం జయంతి, సర్వేయర్ సుబ్బరాయుడులపై 471, 468, 447, 427, 397 సెక్షన్ల కింద పోలీసలు కేసు నమోదు చేశారు. -
మళ్లీ కబ్జా లొల్లి..!
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూముల కబ్జా ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. రూ.వందల కోట్ల విలువైన కాలేజీ ఆస్తులను కాపాడేందుకు కాలేజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా పోరాటాలు జరిగాయి. ఫలితంగా వివాదంలో లేని భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే, కోర్టు కేసుల్లో నానుతున్న స్థలాలకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసులు తెగకుండా కొందరు కేసుల మీద కేసులు వేస్తూ, ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని డిగ్రీ కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1964లో కామారెడ్డి కాలేజీ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించిన అప్పటి పెద్దలు కాలేజీ ఏర్పాటుకు సేకరించిన భూముల విలువ ఇప్పుడు రూ.వందల కోట్లకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చొరవతో కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విన్నవించారు. కలెక్టర్ సత్యనారాయణ చొరవ చూపడంతో కాలేజీకి సంబంధించిన 158.07 ఎకరాల భూమిని గవర్నర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే కాలేజీ ఆట స్థలంగా ఉన్న 8.25 ఎకరాల భూమికి సంబంధించి పాత పట్టాదారులు తమదేనంటూ కోర్టుల్లో కేసులు వేయడంతో ఆ భూమి వివాదంలో ఉంది. అప్పట్లో తమదేనంటూ కొందరు గ్రౌండ్‌ను దున్నేశారు కూడా. దీంతో విద్యార్థులు, ఉద్యమకారులు అడ్డు తగలడంతో వెనక్కు తగ్గారు. అలాగే మరో 6.38 ఎకరాల భూమి విషయంలోనూ రకరకాల వ్యక్తులు కోర్టులకు వెళ్లారు. ఇటీవల ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం 25 ఎకరాల భూమి విషయంలో కోర్టులో కేసులు వేసింది. తెర వెనుక బడాబాబులు.. కాలేజీ ఆస్తులకు సంబంధించి కేసులు నమోదు చేసే విషయంలో బడాబాబుల హస్తం ఉందని కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రూ.వందల కోట్ల విలువైన ఆస్తులపై కన్నేసిన కొందరు బడాబాబులు కోర్టు కేసులతో ఆ భూములను స్వాధీనం చేసుకుని లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. కాలేజీ ఆస్తులను ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశ్యంలో కొందరు పాత పట్టాదారులను ముందుకు తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం లీజుకు తీసుకున్న ప్రైవేటు యాజమాన్యం 25 ఎకరాల భూమిని తమ ఆధీనంలో తీసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. వారికి కూడా కొందరు స్థానికులు అండగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అంగులం కబ్జా కానివ్వం.. కాలేజీ ఆస్తుల విషయంలో దశాబ్దాల కాలంగా పోరాడుతున్నామని, అంగుళం భూమి కూడా కబ్జా కానిచ్చేది లేదని ఆస్తుల పరిరక్షణ కమిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా 158 ఎకరాల భూమిని ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేయించామని, మిగతా భూములను కూడా అలాగే స్వాధీనం చేసుకునే వరకు పోరాడుతామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో ఏ కాలేజీకి లేనంత భూమి ఇక్కడ అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేసి, కబ్జాదారుల నుంచి కాలేజీ భూములను కాపాడాలని వారు కోరారు. -
మాచర్లలో 23 ఎకరాలు కాజేసిన మాజీ కౌన్సిలర్
సాక్షి, మాచర్ల: ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు. ఆ నాయకుడు వాలిపోతాడు.. చుట్టూ కంచె వేసి.. ఆ తర్వాత దర్జాగా అమ్మేస్తాడు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో కౌన్సిలర్ పదవిలో ఉండి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు తెరతీశాడు. అప్పట్లో అధికారుల కళ్లకు గంతలు కట్టాడు. ఆ కబ్జాల బాగోతాన్ని ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఆయన కొనసాగిస్తున్నాడు. మాచర్ల పట్టణంలోని కోట్ల రూపాయల విలువ చేసే 23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు. ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలోని ఓ మాజీ కౌన్సిలర్ యథేచ్ఛగా ప్రభుత్వ భూములు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు సిద్ధమైనా రెవెన్యూ అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అధికారంలో ఉందని పది సంవత్సరాలు మొదట కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత టీడీపీ నాయకుడిగా వ్యవహరించిన మాజీ కౌన్సిలర్ 7వ వార్డులోని పలు చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించేశాడు. ప్రభుత్వ భూమి కనపడితే చాలు ముందు రాళ్లేయటం, ఆ తర్వాత అమ్మేయటం అలవాటుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నాయకుడు దాదాపుగా 10 ఎకరాలను కాజేశాడు. ఆ ప్రభుత్వంలో కౌన్సిలర్‌గా ఉండి తాను ఆక్రమించిన ఇళ్లకు ఇంటి పన్ను పేరుతో ఖాళీ స్థలాలకు పన్ను వేయించాడు. అంతటితో ఊరుకోలేదు. ఇదంతా తన స్థలమేనని వ్యాపారం చేశాడు. తిరిగి కాంగ్రెస్ అధికారం కోల్పోగానే టీడీపీలో చేరాడు. 12వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందాడు. ఆ తర్వాత 7వ వార్డులోని సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో 3 ఎకరాలు, సాయిబాబా దేవాలయం వెనుక 10 ఎకరాలు, 7వ వార్డుకు వెళ్లే రహదారిలో నాలుగున్నర ఎకరాలను స్వా«ధీనం చేసుకొని రియల్ఎస్టేట్ మొదలుపెట్టాడు. ఇంత దర్జాగా వ్యాపారం చేసినా రెవెన్యూ, పురపాలక అధికారులు పట్టించుకోలేదు. అయితే ఆ కౌన్సిలర్ అంతటితో ఆగకుండా తనకు అడ్డం వచ్చిన ఓ వ్యక్తిని హత్య చేయించి కేసులో ఇరుక్కున్నాడు. హైకోర్టు ఆదేశించినా.... పోలీసులు ఆ వ్యక్తిపై రౌడీషీట్ సైతం ఓపెన్ చేశారు. అయినా ఆక్రమణలను ఆపలేదు. చివరికి ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెండు నెలల క్రితం హైకోర్టు పోలీసులకు ఆదేశాల జారీ చేయటంతో కేసులు నమోదు చేశారు. అయినా ఇప్పటికీ ఆక్రమణలను కొనసాగిస్తూ మూడు రోజులుగా ఖాళీగా ఉన్న స్థలాలలో ట్రాక్టర్ల ద్వారా రాళ్లను తోలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖాధికారులు సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి మళ్లీ ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు అని చెప్పినా వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఆక్రమణలను గుర్తించాం పట్టణంలోని 7వ వార్డులో ఇప్పటికి 23 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించాం. కొంతమంది ఆక్రమణదారులపై పోలీసులకు సమాచారం ఇ చ్చాం. ప్రభుత్వ భూములను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేశాం. సాయిబాబా గుడి వెనుకాల 60 శాతం ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేశారు. మిగతా భూ ములలో బేస్ మట్టా లు, రాళ్లు వేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –సాంబశివరావు, ఆర్ఐ -
డబుల్ మోసం
సాక్షి,సిటీబ్యూరో: భూ కబ్జా వ్యవహారం ఓ నిండు ప్రాణం తీసింది. కష్టపడి సంపాదించిన డబ్బుతో ప్లాట్ కొనుగోలు చేసిన ఓ ఉపాధ్యాయుడు నిలువునా మోసపోయాడు. అప్పటికే ఆ ప్లాట్ వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయి ఉండడతో షాక్‌కు గురైన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కానీ న్యాయం జరగకపోగా అతనిపైనే ఎదురు కేసు నమోదైంది. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన భర్త రాజేందర్‌రెడ్డి రియల్ ఎస్టేట్ మోసంతోపాటు పోలీసు అధికారుల బెదిరింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని భార్య జయలక్ష్మి ఆరోపించింది. నగరంలో భూ కబ్జాల వ్యవహారం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. రియల్టర్లు, కొందరు అధికారులు కుమ్మక్కై అమాయకులను మోసం చేసి రూ. లక్షలు దండుకుంటున్నారు. అక్రమ సంపాదన కోసం అడ్డదారిలో వెళ్లే వారికి చట్టం సకాలంలో భరోసా కల్పించకపోవటంతో ఓ నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకి వెళితే కర్మాన్‌ఘాట్ మాధవనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బి.రాజేందర్‌రెడ్డి దంపతులు పొదుపు చేసుకున్న డబ్బుతో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఫిబ్రవరి 2106లో ప్లాటు కొనుగోలు చేశారు. ఇల్లు కట్టుకునేందుకు ఎల్ఆర్ఎస్ పాటు మున్సిపల్ అనుమతులు తీసుకున్నాడు. తీరా చూస్తే 2019 ఏప్రిల్15న అదే ప్లాట్‌ను వినోద్‌బాబు అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి ప్రహారీ నిర్మాణం చేపట్టాడు. ఈ విషయం తెలియడంతో రాజేందర్‌రెడ్డి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సిబ్బంది అక్కడికి వెళ్లి పనులను నిలిపివేయించారు. ఆపై కాగితాలు తీసుకురమ్మని ఆదేశించగా ఒరిజిల్స్ తీసుకువెళ్లిన దంపతులపై మే6న కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు సైతం రెండో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికే సహకరిస్తున్నారన్న అనుమానంతో కోర్టును ఆశ్రయించిన రాజేందర్‌రెడ్డి ఇంజెక్షన్ ఆర్డరు పొందారు. అయినా ఆ స్థలంలోకి వెళ్లేందుకు వీళ్లేదంటూ రాజేంద్రనగర్ పోలీసులు హుకుం జారీ చేయటం, ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చి ఇవ్వాలని ఆదేశించటంతో ఈ నెల 21న అన్ని సర్టిఫికెట్లు తీసుకువెళ్లి పోలీస్ అధికారికి అందజేశారు. సదరు అధికారి తీరుతో మనస్తాపానికిలోనైన రాజేందర్‌రెడ్డి ఈనెల 22న ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగిరాలేదు. తన భర్త కోసం గత వారం రోజులుగా గాలిస్తున్న జయలక్ష్మికి శనివారం మధ్యాహ్నం లింగంపల్లి సమీపంలో రైలు పట్టాలపై రాజేందర్‌రెడ్డి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందడంతో కుప్పకూలింది. పోలీసుల పాపమే: జయలక్ష్మి తాము కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాటును తమకు కాకుండా చేసేందుకు ఒక వ్యక్తితో కుమ్మక్కైన పోలీసు అధికారి బెదిరింపు కారణంగానే తన భర్త మరణించాడని మృతుడు రాజేందర్‌రెడ్డి భార్య జయలక్ష్మి ఆరోపించింది. ఉస్మానియా మార్చురీలో గుర్తుపట్టరాని స్థితిలో ఉన్న భర్త శవం వద్ద బోరుగా విలపిస్తూ ఇంత దారుణం చేస్తారని ఊహించలేదని కన్నీరుమున్నీరైంది. తన భర్త మృతిపై విచారణ చేపట్టాలని ఆమె పోలీస్ ఉన్నతాధికారులను కోరింది. -
తూర్పుగోదావరిలోనూ కోడెల లీలలు
-
కోడెల కుటుంబ కబ్జా పర్వం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సత్తెనపల్లి: అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ స్పీకర్ కోడెల కుటుంబం చేసిన దౌర్జన్యాల పర్వం రోజుకొకటి వెలుగు చూస్తోంది. తమకు చెందిన 17.52 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్, అతని పీఏ గుత్తా నాగప్రసాద్‌పై సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామానికి చెందిన 16 మంది బాధిత రైతులు గురువారం సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ మౌనిషాకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధిత రైతు గొడుగుల సుబ్బారావు మాట్లాడుతూ.. ధూళిపాళ్ల సమీపంలోని మొత్తం 17.52 ఎకరాల భూమిని 16 మంది రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. 1900 సంవత్సరం పూర్వం నుంచి తమ ముత్తాత తాతల నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి కుటుంబం కింద 7 గృహాలు ఉన్నాయన్నారు. అయితే ఈ స్థలంపై కోడెల కుమారుని కన్ను పడటంతో తమను వేధించడం మొదలు పెట్టారని వివరించారు. 2016 ఏప్రిల్ 2న రాత్రి 9.30 గంటల సమయంలో కోడెల శివప్రసాదరావు పీఏ గుత్తా నాగప్రసాద్, యెలినేడి శ్రీనుతోపాటు సుమారు 20 మంది రౌడీ షీటర్లు పౌల్ట్రీ ఫారంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలు పగుల గొట్టారన్నారు. రూ. 2 లక్షల డబ్బులు, 40 గ్రాముల గోల్డ్ చైన్ తీసుకొని ఇంట్లో మహిళలను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భూమిని వదిలి పెట్టి వెళ్లిపోకుంటే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. 2016 ఏప్రిల్ 4న కూడా కోడెల అనుచరులు పోలీసుల సహాయంతో దౌర్జన్యం చేశారని వివరించారు. రెండు పౌల్ట్రీ షెడ్లలో ఉన్న 10 వేల కోళ్లు, వందలాది పొట్టేళ్లను తీసుకెళ్లారని చెప్పారు. కోటిన్నర విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీరి వేధింపులు తాళలేక భయపడి ఇన్నాళ్లూ తమ కుటుంబం హైదరాబాద్‌లో తల దాచుకుందన్నారు. ప్రస్తుతం అందరూ కేసులు పెడుతున్నారని తెలిసి మేము ధైర్యంగా కేసు పెట్టామని, న్యాయం చేయాలని కోరారు. తూర్పుగోదావరిలోనూ కోడెల లీలలు కోడెల కుటుంబ అక్రమాలు తూర్పుగోదావరి జిల్లాలోనూ బయటపడుతున్నాయి. కోడెల శివరాం రాజానగరం గ్రామ రెవెన్యూ పరిధిలోని 10 ఎకరాల భూమిలో ఫార్మా ఉత్పత్తుల గోడౌన్ కోసం అడ్డగోలు నిర్మాణాలు ప్రారంభించారు. అటు పంచాయతీ నుంచిగానీ, ఇటు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారటీ (గుడా) నుంచి గాని ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అప్పట్లో ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా ఈ నెల 19న గుడా అధికారులు శివరామకృష్ణకు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని గుడా వైస్ చైర్మన్ అమరేంద్ర కుమార్ ‘సాక్షి’ వద్ద ధ్రువీకరించారు. -
టీడీపీ అరాచకాలు..11 ఎకరాల భూమి కబ్జా
-
దేవుడి ముసుగులో.. పర్యాటక స్థలం ఆక్రమణ
పూసపాటిరేగ: ఆడ పిల్ల.. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. అయితే ఇప్పుడు అధికార పార్టీ నాయకులు కూడా దీనినే అనుసరిస్తున్నారు. ఆక్రమించేందుకు ఏదైతే ఏం అన్న రీతిలో బరితెగిస్తున్నారు. చింతపల్లి సముద్రతీరంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పర్యాటక స్థలానికి నిర్మించి ఆక్రమించాడు. తొలుత పర్యాటక స్థలానికి ఆనుకొని గుడితో పాటు ప్రహరీ కూడా నిర్మించాడు. ఆ తరువాత పర్యాటకంగా ఆ ప్రదేశం అంతా అభివృద్ధి చెందడంతో గుడి చుట్టూ ఉన్న సుమారు 50 సెంట్లు స్థలంపై ఆయన కన్నుపడింది. వెంటనే స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి గేటు కూడా ఎత్తేశాడు. చింతపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 115లో వున్న పర్యాటక శాఖ స్థలానికి ఆనుకొని ఉన్న స్థలంలోనే ప్రహరీ నిర్మించాడు. ఈ నిర్మాణం జరిగి నెలలు గడుస్తున్నా పర్యాటక శాఖ అధికారుల్లో ఎటువంటి చలనం లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులకు తెలిసే నిర్మాణాలు జరిగా యా అని చర్చించుకొంటున్నారు. చింతపల్లి బీచ్‌కు వచ్చే పర్యాటకులు వాహనాలు పార్కింగ్‌కు ఉంచే స్థలంలో ని ర్మాణాల జరిగినా పట్టించుకోవడం లేదు. చింతపల్లి పం చాయతీలో అధికార పార్టీకి చెందిన కీలకనేత కావడంతో ప్రజలు అడిగే సాహసం చేయలేపోతున్నారు. పర్యాటకశాఖ అధికారులు నిర్లక్ష్యం తేటతెల్లం అవడంతో కన్ను పడిందే తడువుగా స్థలాన్ని కబ్జా చేశారు. విచారణ ఆదేశించాలని మత్స్యకార నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమించిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు నోరు మెదపలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పర్యాటకశాఖకు చెందిన స్థలాన్ని అధికారపార్టీ నాయకుడు నుంచి కాపాడాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ రామారావును వివరణ కోరగా, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలి చింతపల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. పర్యాటకశాఖ స్థలాన్ని కబ్జాచేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రెవెన్యూ, పర్యాటకశాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమణలు జరుగుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలి. – ఎం.శ్రీనువాసురావు, సామాజిక కార్యకర్త పర్యాటక భవనాలు ప్రారంభించాలి సుమారు కోటి రుపాయల నిధులతో నిర్మించిన పర్యాటక భవనాలు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారులు స్పందించి టూరిజం భవనాలు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలి. – మహంతి జనార్దనరావు, పూసపాటిరేగ -
రైతుల భూములపై మంత్రి కన్ను
-
భూమాయలో ఎన్నెన్ని సిత్రాలో!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ భూములను మాయం చేయడంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా బరితెగించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను వినియో గించుకుంటే, అవి తమవేనని నకిలీ పత్రాలు సృష్టించి, నష్టపరిహారం కాజేస్తున్నారు. అసైన్మెంట్ కమిటీలతో నిమిత్తం లేకుండా అసైన్డ్ పట్టాలు సృష్టించి సర్కారు భూములను మింగేస్తున్న వారు కొందరైతే వాటిని వంశపారంపర్యంగా సంక్రమించిన ప్రైవేటు జిరాయితీ పట్టా భూములుగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించి, అమ్మేసుకుంటున్న మాయగాళ్లు ఇంకెందరో! నిబంధనలతో, సర్కారు ఉత్తర్వులతో ఎలాంటి సంబంధం లేకుండా ముడుపులిస్తే చాలు రాత్రికి రాత్రే అసైన్మెంట్ పట్టాలు చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. అసైన్మెంట్ రిజిస్టర్లే మారిపోతున్నాయి. ఖాళీగా ఉన్న బంజరుకు ఎన్ని పట్టాలో... గతంలో అసైన్మెంట్ పట్టాలు తీసుకుని సాగు చేయకుండా బంజరుగానే ఉంచిన భూములు అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఇలాంటి భూములకు ప్రస్తుత అధికారులు, రిటైర్డు అధికారులు కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసి ఇతరులకు మళ్లీ పట్టాలు ఇచ్చేస్తున్నారు. దీంతో ఒకే భూమికి ఇద్దరు ముగ్గురి చేతుల్లో అసైన్డ్ పట్టాలు ఉంటున్నాయి. ఒక సర్వే నంబరు (కంపార్టుమెంట్)లో 50 ఎకరాల భూమి ఉంటే సబ్ డివిజన్ చేయకుండానే 130 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. సబ్ డివిజన్ చేయకుండా రెవెన్యూ కార్యాలయాల్లోని పుస్తకాల్లో నమోదు చేయకుండా రిటైర్డు అధికారులు నకిలీ పట్టాలు ఇవ్వడంవల్లే ఈ సమస్య ఏర్పడిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి, కాసులకు కక్కుర్తిపడి ఇలా చేస్తున్నారని ఒక జిల్లా కలెక్టర్ చెప్పారు. పట్టాలిప్పించే ముఠాల హల్చల్ డబ్బులు తీసుకుని అసైన్మెంట్ పట్టాలు సృష్టించి ఇచ్చే ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇలాంటి ముఠాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కొందరు రెవెన్యూ ఉద్యోగులతోపాటు కొందరు రిటైర్డు అధికారులు కీలక భూమిక పోషిస్తున్నారు. వారి వద్ద ఖాళీ పట్టాదారు పాసుపుస్తకాలు, భూయాజమాన్య హక్కు పత్రాలు, రెవెన్యూ కార్యాలయ స్టాంపులు ఉన్నాయి. నకిలీ పట్టాలు, రికార్డులు సృష్టించే ఈ ముఠాలకు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులు దక్కుతున్నాయి. అధికార టీడీపీ నాయకులు అడిగిన పనులు చేసిపెడుతూ భారీగా ఆర్జిస్తున్నారు. సర్కారు భూములపై నకిలీ హక్కు పత్రాలు ఇచ్చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంతోపాటు భూ అనుభవపత్రం (అడంగల్), భూ యాజమాన్యపత్రం (1బి)లో కూడా పేర్లు చేర్పిస్తున్నారు. వీటి జిరాక్స్ పత్రాలతో మీ–సేవలో, వ్యక్తిగతంగానూ తహసీల్దార్లకు దరఖాస్తు చేసి అన్ని రికార్డులు పక్కాగా ఉన్నాయంటూ మ్యుటేషన్ (వెబ్‌ల్యాండ్‌లో నమోదు) చేయిస్తున్నారు. చాలామంది తహసీల్దార్లకు ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు తెలిసినా వారికి ముట్టాల్సింది ముడుతున్నందున రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయంటూ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆన్లైన్ చేస్తున్నారు. జిరాయితీ జాబితాలో అసైన్డ్ భూములు అసైన్మెంట్ కమిటీల ఆమోదం లేకుండానే అసైన్మెంట్ (డీకేటీ) పట్టాలు ఇవ్వడమే కాదు, కొందరు అక్రమార్కులు మరో అడుగు ముందుకేసి ఈ డీకేటీ భూములను జిరాయితీ పట్టా భూములుగా వెబ్‌ల్యాండ్‌లో, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన జిరాయితీ పట్టా భూములని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. అసైన్డ్ భూములకు అనుభవ హక్కులు తప్ప విక్రయ హక్కులు ఉండవు. అందువల్ల అధికార పార్టీ నాయకులు అసైన్డ్ భూములను వంశపారంపర్యంగా సంక్రమించిన పట్టా భూములుగా మ్యుటేషన్ పేరుతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకుంటున్నారు. బినామీ పేర్లతో ఇలా కొట్టేసిన భూములను అమ్మేసి చోటా నాయకులు సైతం రూ.లక్షలు దండుకుంటున్నారు. ఫోర్జరీ పత్రాలతో నష్టపరిహారం స్వాహా వైఎస్సార్ జిల్లాలో గండికోట ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు బయటపడ్డాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం బుక్కపట్నం మాజీ సర్పంచి, టీడీపీ నాయకుడు చెక్కా పెద్ద ఓబుళరాజు, చెక్కా ఓబుళమ్మ, చెక్కా రత్నమ్మ, చెక్కా కాంతమ్మ, దాసరి జయలక్ష్మి( ఓబుళరాజు బంధువులు) పేర్లతో ప్రభుత్వ భూమికి నకిలీ డీకేటీ పట్టాలు సృష్టించారు. తమకే చెందిన ఈ భూములు గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యాయంటూ ప్రభుత్వం నుంచి రూ.27.78 లక్షల నష్టపరిహారం కొట్టేశారు. నాలుగు రోజుల క్రితమే వారిపై ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. ఆ రికార్డులన్నీ బోగస్ వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం కామకుంటలో డీవీ పార్థసారథి, చిలకపాటి రత్నకుమారికి స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద 19.50 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. వీరికి పాసు పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. ఇవే భూములకు అవే సర్వే నంబర్లతో దేవర్ల శివశంకర్‌రెడ్డి, కుంబాల భాస్కర్‌రెడ్డి, గాజులపల్లె చెన్నకేశవరెడ్డి, వర్ధిరెడ్డి శ్రీనివాసులు పేరిట స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద మళ్లీ పట్టాలు ఇచ్చారు. పైగా స్వాతంత్య్ర సమరయోధుల కోటా కింద పట్టాలు పొందిన వారెవరూ ఉన్న దాఖలాలు కూడా లేవు. దీన్నిబట్టి అప్పట్లోనే ఈ పట్టాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించినవేనని తేటతెల్లమవుతోంది. మాజీ సైనికులకు ఇచ్చిన పట్టాలైతే పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చనే వెసులుబాటు ఉంది. అందువల్లే ఇలా సృష్టించారు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల పేరిట జారీ చేసిన రికార్డులన్నీ బోగసేనని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. (బాక్స్‌లో పెట్టుకోవాలి) + నెల్లూరు జిల్లాలో ఒకే భూమిని తమ పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయాలంటూ ఇద్దరు ముగ్గురు అసైన్మెంట్ పట్టాలు తీసుకొచ్చి అర్జీలు పెడుతున్నారు. దీంతో ఏంచేయాలో తెలియని తహసీల్దారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుడు 100 ఎకరాల భూమికి బినామీ పేర్లతో అసైన్మెంట్ పట్టాలు పొందాడు. + విజయనగరం జిల్లాకు చెందిన ఒక స్వాతంత్య్ర సమరయోధుడికి ఇచ్చిన డి పట్టా భూమి తనదంటూ మరో మాజీ సైనికుడు అధికారులను ఆశ్రయించాడు. + విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ సైనికులకు చెందిన భూమిని అధికార పార్టీ నాయకులు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. + కృష్ణా జిల్లాలో ఒక మాజీ సైనికుడికి ఇచ్చిన పట్టా భూమికే తనకూ పట్టా ఉందంటూ ఒకరు వీలునామా రాయించారు. + వైఎస్సార్ జిల్లాలో ఒక వ్యక్తి సాగు చేసుకుంటున్న భూమి తనదంటూ మరొకరు పట్టాదారు పాసుపుస్తకం, భూమి హక్కు యాజమాన్య పత్రం అధికారుల వద్దకు తీసుకెళ్లాడు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి బాగోతాలు చోటుచేసుకుంటున్నాయి. -
ఏపీలో భూకబ్జాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు
-
భూ కబ్జా రుజువు చేస్తే ఉరి వేసుకుంటా: పొన్నాల
జనగామ: భూ కబ్జాలకు పాల్పడినట్లు తనపై తప్పుడు కేసు బనాయించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ కేసును రుజువు చేస్తే అసెంబ్లీ ముందు ఉరి వేసుకుంటానని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో ఆదివారం జరిగిన సభలో పొన్నాల మాట్లాడుతూ, తనపై తప్పుడు కేసు బనాయించడమే కాకుండా, అసెంబ్లీలో రెండున్నర గంటలపాటు తనపై చర్చించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్చ కు రాకుండా.. ఎందుకు వెనకేసుకు వస్తున్నారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. -
అధికారం అండగా కబ్జా కాండ
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం.. మళ్లీ తర్వాత గెలుస్తామో, లేదో.. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ద్వితీయ శ్రేణి నాయకులు, వారి అనుచరులు రాష్ట్రంలో ఖాళీగా కనిపించిన ప్రతి భూమినీ కబ్జా చేశారు. శ్మశానాలు, చెరువులు, గిరిజనుల భూములు, దళితుల భూములు, దేవుడి భూములు, ప్రభుత్వ భూములు.. ఇలా ఏదైనా కాదేదీ కబ్జాకు అనర్హం అనే రీతిలో చెలరేగిపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ పెద్దలు, అధికారుల అండతో రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ కబ్జా కాండ సాగించారు. వేలాది ఎకరాల భూములను చెరపట్టారు.. వాటికి తమ పేర్లు, బినామీల పేర్లతో దొంగ పత్రాలు సృష్టించారు.. వాటిని బ్యాంకుల్లో పెట్టి వందల కోట్ల రూపాయలను రుణాలుగా పొందారు. తిరిగి చెల్లించకుండా బ్యాంకులను నిండా ముంచారు. రాష్ట్ర విభజనతో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన రాష్ట్రాన్ని కబ్జాంధ్రప్రదేశ్గా మార్చేశారు. రాష్ట్రంలో పచ్చ నేతల భూదందాలను సాక్షి క్షేత్రస్థాయిలో పరిశీలించగా విస్మయపరిచే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. వాస్తవానికి వీటికి నాలుగింతలపైనే భూములు కబ్జాకు గురయ్యాయని బాధితులు, ప్రజలు చెబుతున్నారు.. రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో కొట్టేసిన భూములు, విశాఖలో రికార్డులు ట్యాంపరింగ్ చేసి నొక్కేసిన భూములు వీటికి అదనం... కబ్జా అన్న పదానికి అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పర్యాయపదంగా మారిపోయారు.రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములను తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. అధికారమే అండగా కార్యకర్త స్థాయి మొదలుకొని ‘ముఖ్య’నేత వరకు భూ దోపిడీలకు పాల్పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు పంపిణీనే లక్ష్యంగా అందినకాడికి ఆరగిస్తున్నారు. రాజధాని అమరావతి సాక్షిగా మొదలైన భూముల వేట.. జిల్లాల్లోని శ్మశానాల వరకు సాగింది. ఏ మాత్రం పాపభీతి లేకుండా దేవుడి భూములనూ చెరబట్టారు. చెరువులను సైతం మింగేసి.. మిగిలిన భూ ఆకలిని తీర్చుకోవడానికి దళితులకు చెందిన అసైన్డ్ భూములపై పడ్డారు. మాది ప్రభుత్వం.. మరి ప్రభుత్వ భూములు మావి కాకుండా పోతాయా? అన్నట్లు చెలరేగిపోయారు. అంతటితో ఆగకుండా అవే కబ్జా భూములను బినామీల ద్వారా బ్యాంకుల్లో పెట్టి కోట్లాది రూపాయలు రుణాలుగా పొందారు. ఇలా ఒకటా రెండా.. రాష్ట్రంలో పచ్చ నేతల విపరీత చర్యలు ప్రజలకు తీవ్ర వేదన మిగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతలు సాగిస్తున్న కబ్జాకాండపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... 1 సిక్కోలు గ్రానైట్ కొండను తవ్వేసిన ‘కళా’ బంధువు శ్రీకాకుళం జిల్లాలో మంత్రి కిమిడి కళా వెంకట్రావు బంధువుల చేతిలో ఒక గ్రానైట్ కొండే చిక్కుకుంది. వంగర మండలంలో మడ్డువలస సాగునీటి ప్రాజెక్టుకు ఆనుకొని ఇది ఉంది. కళా వెంకట్రావు మరదలు, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏడాదిన్నర క్రితం ఈ కొండ ప్రాంతంలో అక్రమంగా కొంతమంది తవ్వకాలు చేపట్టారు. కిమిడి కుటుంబానికి సమీప బంధువైన కిమిడి సీతబాబు ఈ తవ్వకాల వెనుక ఉన్నట్టు విమర్శలున్నాయి. వాస్తవానికి వంగర మండలం పటువర్థనం గ్రామ పంచాయతీ పరిధిలో ఓ కొండను వారు గ్రానైట్ తవ్వకాల కోసం లీజుకు తీసుకున్నారు. కానీ అక్కడకాకుండా మడ్డువలస గ్రామానికి, ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న పాండవుల కొండపై తవ్వకాలు మొదలెట్టారు. సుమారు ఐదెకరాల విస్తీర్ణం కలిగిన ఈ కొండ ప్రాంతంలో తవ్వకాల గురించి ‘సాక్షి’ 2016 నవంబర్లోనే కథనాలు రాసింది. దీంతో మైనింగ్ అధికారులు స్పందించి ఆ క్వారీని సీజ్ చేశారు. కానీ కొండ మాత్రం కిమిడి కుటుంబీకుల గుప్పెట్లోనే ఉంది. ఇక్కడున్న గ్రానైట్ విలువ దాదాపు రూ.10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. మరో విషయం ఏమిటంటే.. ఈ కొండను సీజ్ చేసిన సమయంలో 60 వరకూ గ్రానైట్ బండలు ఉండేవి. ప్రస్తుతం రెండు, మూడు మాత్రమే ఉన్నాయంటే మిగతావన్నీ ఏమైపోయాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోని కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భూసేకరణ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బినామీ పేర్లతో దాదాపు రూ.9 కోట్ల వరకూ పరిహారం కాజేశారు. దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమికి దొడ్డిదారిలో పట్టాలు సృష్టించి మార్గం సుగమం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో గొర్లె విజయ్‌కుమార్, గొర్లె లక్ష్మణరావు, కలిశెట్టి సహదేవుడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎచ్చెర్ల మండలంలోనే ఎస్ఎం పురం కొండ ప్రాంతంలో శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ దంపతుల కుమారుడు అవినాష్ రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి రంగం సిద్ధం చేశాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ మొత్తం 38 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉంది. వాటి విలువ సుమారు రూ.2 కోట్ల వరకూ ఉంటుంది. 2 తూర్పుగోదావరి హద్దే లేని పచ్చ నేతల భూదందా తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు భూ కబ్జాలతో రెచ్చిపోతున్నారనే ఆరోపణలున్నాయి. కాకినాడకు సమీపంలోని తూరంగిలో సర్వే నంబర్ 231లో తన బంధువుల పేరిట ఉన్న 47 ఎకరాలను ఆనుకుని ఉన్న రూ.5 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆకుల గోపయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ సంస్థ అనకాపల్లి సెటిల్మెంట్ కోర్టు ద్వారా న్యాయపరంగా కొనుగోలు చేసిన స్థలం తనదేనంటూ ఎమ్మెల్యే తన స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు అధికారాన్ని అడ్డుపెట్టి చేయని ప్రయత్నం లేదు. అదే సంస్థకు చెందిన 230/2 సర్వే నంబర్లోని మరో స్థలాన్ని కూడా సర్వే నంబర్లు మార్చి అనుచరుల పేరిట కట్టబెట్టేశారు. ఇక.. మహాలక్ష్మినగర్ ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారి స్థలం తనదంటూ అల్లరి మూకలతో వెళ్లి పొక్లెయిన్‌తో తవ్వించేసిన వ్యవహారంపై ఎమ్మెల్యే వనమాడి సోదరుడు సత్యనారాయణ, ఆయన కుమారుడు, కార్పొరేటర్ వనమాడి ఉమాశంకర్‌పై కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో పోలీసు కేసు కూడా నమోదవగా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో కేసును నీరుగార్చేశారు. ఇక కొవ్వూరు రోడ్డులోని మూడెకరాల అసైన్డ్ భూమి విషయంలో కూడా లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి ఎకరం స్థలాన్ని స్వాహా చేసి ఇళ్ల స్థలాలుగా అమ్మేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలం పరిధిలో ఉన్న కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామికి చెందిన 3.73 ఎకరాల భూమి సైతం ఆక్రమణల జాబితాలో చేరిపోయింది. అలాగే కడియం మండలం వేమగిరి పంచాయితీ పరిధిలో 172 సర్వే నెంబర్లో 80 సెంట్ల ప్రభుత్వ భూమిని తన సొంత భూమిగా చెప్పుకుని అధికార పార్టీ నేత ఒకరు గ్రావెల్ తవ్వకాలు సాగించారు. ఇక తుని నియోజకవర్గం తొండంగి మండలం పి.అగ్రహారంలో ఉత్తరాది మఠం రామచంద్రస్వామికి 410 ఎకరాల భూమి ఉంది. అప్పట్లో సాగు చేసుకోవడానికి స్థానిక రైతులకు మఠం లీజుకు ఇచ్చింది. ఈ భూములపై టీడీపీ నాయకుల దృష్టి పడింది. దీంతో రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి రైతులకు చెందిన భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట నమోదు చేసేసుకున్నారు. తొండంగి మండలం పి.అగ్రహారం పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 31, 32, 33 నుంచి 59 వరకు ఉన్న 410 ఎకరాల్లో సుమారు 80 ఎకరాలను టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు, అన్నవరం దేవస్థానం ధర్మకర్త యడ్ల భేతాళుడు, టీడీపీ వాణిజ్య విభాగం మండల ఉపాధ్యక్షుడు సిద్దా ముత్యాలు కుటుంబ సభ్యుల పేర్లతో ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. మార్కెట్ ధర ప్రకారం భూముల విలువ రూ.25 కోట్ల పైనే ఉంటుంది. సర్వే నంబర్ 33/1, 33/2లో సిద్ధా ముత్యాలు భార్య గంగా భవాని 16.50 ఎకరాలు, సర్వే నంబర్ 33/3, 33/4లో సిద్ధా అచ్చియ్యమ్మ 42 ఎకరాలు, సిద్ధా ముత్యాలు ఏడెకరాలు కబ్జా చేశారు. సర్వే నంబర్ 33/1, 31/591లో యడ్ల భేతాళుడు 8 ఎకరాలు, యడ్ల శ్రీనివాసరావు 4, గెడ్డం శ్రీకాంత్ 6 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. 3 విజయ నగరం భూబకాసురులు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడి నుంచి అందరూ భూములు ఆక్రమించడంలో ఆరితేరిపోయారు. విజయనగరం, పూసపాటిరేగ, సాలూరు, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి ప్రాంతాల్లో పేదల భూములు, గిరిజనుల భూములతోపాటు చేపల చెరువులు, కొండలు కూడా ఆక్రమించేశారు. వాటిలో తోటలు వేసి దర్జాగా సాగుచేసుకుంటున్నారు. విజయనగరం పట్టణ శివారు ప్రాంతం బొబ్బాదిపేట మండల పరిధిలో సర్వే నెంబర్ 4/3లోని 5 ఎకరాల స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా లే అవుట్ వేశారు. ఈ ప్రాంతం విజయనగరం మున్సిపాలిటీలో విలీనమై.. ప్రస్తుతం 26వ వార్డు పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో గజం స్థలం ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతోంది. ఇప్పటికీ లేఅవుట్‌ను క్రమబద్ధీకరించుకోని స్థల యజమానులు అడ్డదారిలో అమ్మకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం అధికార పార్టీకి చెందిన స్థానిక కౌన్సిలర్‌తో బేరం కుదుర్చుకున్నారు. లేఅవుట్ పక్కగుండా వెళ్లే 60 అడుగుల ఎర్రవాని చెరువు కాలువలో సింహభాగం ఆక్రమించేశారు. అంతటితో ఆగకుండా రెవెన్యూ యంత్రాంగం, మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్‌కి వెళ్లి వచ్చేందుకు రెండు రహదారులను నిర్మించేస్తున్నారు. ఎర్రవాని చెరువు ఆయకట్టు రైతులు ప్రతిఘటించటంతో స్థానిక కౌన్సిలర్ రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్థానికులు కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేస్తే రెవెన్యూ యంత్రాంగం వచ్చి లేఅవుట్‌కు సరిహద్దులు వేసి వెళ్లగా వాటిని అక్రమార్కులు యథేచ్చగా మార్చేసి విక్రయాలకు సిద్ధమవుతున్నారు. పార్వతీపురంలో వరహాలగెడ్డ పోరంబోకు సుమారు రెండెకరాలను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించాడు. గెడ్డ ప్రవాహ దిశను మార్చి రూ.2 కోట్లు విలువ చేసే స్థలాన్ని రియల్ ఎస్టేట్‌లో కలుపుకున్నాడు. అలాగే పార్వతీపురం నడిబొడ్డున ప్రవహిస్తున్న వరహాలగెడ్డను ఆక్రమించి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ నివాస గృహాన్ని నిర్మిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. సుమారు 20 సెంట్ల వరకు గెడ్డను ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారు. అలాగే, ఎమ్మెల్సీ సోదరుడు ద్వారపురెడ్డి రామ్మోహనరావు కూడా వరహాలగెడ్డలో సగం వరకు మట్టిని పోసి గెడ్డను చిన్న పిల్లకాలువలా తయారుచేశారు. చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో సర్వే నంబర్ 383లో ఆరెకరాల ప్రభుత్వ భూమిని ఆ గ్రామ టీడీపీ ఎంపీటీసీ భర్త కెల్ల రామారావు తన ఆధీనంలో ఉంచుకుని సాగు చేసుకుంటున్నాడు. నెల్లిమర్లలో మండలపరిషత్ కార్యాలయాన్ని ఆనుకుని సర్వే నంబర్ 75లో 2.65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ రూ.10 కోట్ల పైమాటే. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా ఉన్న మాన్సాస్ ట్రస్టు ఈ భూమిని ఆక్రమించుకుని బోర్డులు సైతం ఏర్పాటు చేసింది. అలాగే నెల్లిమర్ల మండలం మల్యాడలో అదే గ్రామానికి చెందిన గేదెల సత్యం అనే టీడీపీ నేత ఏకంగా 1.65 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. ఆక్రమిత భూమి విలువ రూ.35 లక్షల పైనే. అలాగే పూసపాటిరేగ మండలం కొల్లాయివలసలో సుమారు 24 ఎకరాల డీపట్టా భూమిని విశాఖకు చెందిన చిట్టిరాజుతోపాటు టీడీపీ ప్రజాప్రతినిధి దర్జాగా ఆక్రమించుకున్నారు. పెదబత్తివలస రెవెన్యూ పరిధిలో దాదాపు 150 ఎకరాల డీ పట్టా భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేశారు. పెదబత్తివలస పరిధిలోని సర్వే నెంబర్ 1లో ఉప్పులాపుకొండ పరిధిలో గతంలో దళితులకు ఇచ్చిన సుమారు రూ.4 కోట్లు విలువైన 8 ఎకరాల డీ పట్టా భూమి వలిరెడ్డి శ్రీరాములు నాయుడు పేరుకు మారింది. నిరుపేదలకు ఇచ్చిన 18.50 ఎకరాల ప్రభుత్వ డీపట్టా భూములను జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు కాజేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూసపాటిరేగ మండలం కొల్లాయివలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 12914పిలో 20 సెంట్లు, 12913సిలో 15.03 ఎకరాలు, 1303పిలో 0.30 సెంట్లు, 1236పిలో 3 ఎకరాలు ఆయన కబంధ హస్తాల్లో చిక్కుకోగా, ఆక్రమించిన భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట కొబ్బరి, జామి తోటలును వేసి ఫలసాయం కూడా పొందుతున్నారు. పూసపాటిరేగ ఎంపీపీగా ఆయనే కొనసాగుతుండటంతో రెవెన్యూ అధికారులు సైతం ఆయన ఆక్రమించిన భూముల వైపు కనీసం కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేకపోతున్నారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, ఆయన సోదరుడు ఏపీ భంజ్‌దేవ్ 40 ఎకరాల ప్రభుత్వ, గ్రామదేవత భూముల్లో చేపల చెరువు ఏర్పాటు చేశారు. ఆర్పీ భంజ్‌దేవ్ 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపలచెరువు సాగుచేస్తున్నట్టు రెవెన్యూ రికార్డులే ఉన్నాయి. ఆర్పీ భంజ్‌దేవ్ విశ్వనాథపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 142లో 15 ఎకరాల భూమిలో చేపల చెరువు నిర్మాణానికి దరఖాస్తు చేస్తే, భంజ్‌దేవ్ తమ్ముడైన ఏపీ భంజ్‌దేవ్ కూడా అదే సర్వే నంబర్ భూమిలో మరో 10 ఎకరాల 46 సెంట్ల భూమిలో చేపల చెరువుకు దరఖాస్తు చేశారు. 2015 నుంచి చేపలసాగు చేస్తున్నారు. అయితే ఆ రెండు సర్వే నంబర్లలోని 25 ఎకరాల భూమి ప్రభుత్వానిదని రెవెన్యూ వెబ్‌ల్యాండ్ స్పష్టం చేస్తోంది. ఏపీ భంజ్‌దేవ్ సర్వే నంబర్ 121లో 6 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఆ భూమి గ్రామదేవతకు చెందిన భూమిగా రెవెన్యూ అడంగల్‌లో నమోదై ఉండడం గమనార్హం. 4 విశాఖపట్నం కబ్జారాయుళ్ల ఖిల్లా.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రశాంతతకు నిలయమైన విశాఖ జిల్లా కబ్జారాయుళ్ల ఖిల్లాగా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార టీడీపీ నేతలు జిల్లాను చెరపట్టారు. ప్రభుత్వ, రెవెన్యూ, దేవాదాయ, ఇనాం, వక్ఫ్, అనాధీనం, అటవీ, ఎసైన్డ్ భూములే కాదు.. చివరకు ప్రైవేటు భూములను కూడా లిటిగేషన్లో పెట్టి మరీ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములను, బలహీనవర్గాల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను, జాతీయ రహదారికి ఇచ్చిన భూములను కుదవపెట్టి వందల కోట్ల రుణాలు కొల్లగొట్టి ఆపై బ్యాంకులకు ఎగనామం పెట్టారు. గత మూడేళ్లుగా ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన కథనాల నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ దర్యాప్తు నివేదిక మాత్రం ఇంతవరకు వెలుగు చూడలేదు. అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ఆయన కుటుంబ సభ్యులకు భూముల రికార్డుల ట్యాంపరింగ్‌లో సహకరించిన తహశీల్దార్లు బీవీ రామారావు, శంకర్రావులతోపాటు ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ గణేశ్వరరావులపై కేసులు నమోదయ్యాయి. ఈ రికార్డుల ట్యాంపరింగ్ కుంభకోణంలో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు తప్పించుకోగా మిగిలినవారంతా కటకటాలపాలయ్యారు. విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు. మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితుల పేరిట జిల్లాలో గత పదిహేనేళ్లలో పంపిణీ చేసిన 312 ఎకరాల్లో సుమారు 250 ఎకరాలను నకిలీ ఎన్వోసీలను అడ్డం పెట్టుకుని అనర్హులకు కేటాయింపులు జరిపారు. పేదలకు ఎసైన్ చేసిన భూముల్లో పెందుర్తి మండలం ముదపాక, నక్కపల్లి మండలం పెదగొడ్డుపల్లిలో 700 ఎకరాలను చంద్రబాబు తనయుడు నారా లోకేశ్.. ఒక జిల్లా మంత్రి తనయుడు, ఓ ఎమ్మెల్యేతో కలిసి కాజేసేందుకు పక్కా స్కెచ్ వేసి సర్వే చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముదపాకలో 350 ఎకరాల భూములకు చెందిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌ను ఎకరాకు రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చి కాజేసేందుకు యత్నించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువైన పరుచూరి భాస్కరరావు పద్మనాభం మండలం కృష్ణాపురంలో 20 ఎకరాల డీపట్టా భూములతోపాటు ఆనందపురంలో 11.34 ఎకరాల ప్రభుత్వ భూములను చక్కబెట్టేశారు. గంటా అనుచరుడు కాశీవిశ్వనాథ్ భీమిలిలో ఎస్సీలకు ఇచ్చిన 50 ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కొట్టేశాడు. మరో అనుచరుడు ఎన్.స్వామి సర్వే నెం.294లో 3.76 ఎకరాలు, సర్వే నెం.294/2లో 4.40 ఎకరాలు ఆక్రమించుకుని షెడ్లు వేయిస్తున్నాడు. పద్మనాభం మండల టీడీపీ అధ్యక్షుడు సూరిశెట్టి అప్పారావు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి 130 ఎకరాల ఇనాం భూములను స్వాహా చేసేశాడు. అనకాపల్లి ఆవకండంలో 55 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీని వెనుక అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఉన్నారని చెబుతున్నారు. అనకాపల్లి మండలం శారదా కాలనీలో చిన్నంనాయుడు అనే దివ్యాంగుడికి చెందిన 1.12 ఎకరాల స్థలాన్ని వివాదంలో పడేశారు. న్యాయం చేయాలని కోరితే రూ.8 కోట్ల విలువైన ఆ భూమిని కేవలం రూ.1.50 కోట్లకు సొంతం చేసుకున్నారు. కనీసం ఆ మొత్తం కూడా ఇవ్వకుండా బా«ధితుడ్ని మూడేళ్లుగా తిప్పించుకోవడంతోపాటు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు. భీమిలి బీచ్ రోడ్లో రామానాయుడు స్టూడియో దిగువన మాజీ సైనికులకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే మీసాల గీత భర్త శ్రీనివాసరావు, మంత్రి గంటా అల్లుడి పేర్లతో కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. 5 పశ్చిమ గోదావరి ఖాళీ జాగా కనిపిస్తే.. పశ్చిమ గోదావరిలో ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఇసుక, మట్టి దందాల్లో రాష్ట్రంలోనే ఆరితేరిన అధికార పార్టీ నేతలు ఖాళీ స్థలాలను కూడా వదలడం లేదు. ఎమ్మెల్యేలు మొదలుకుని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీడీపీ గ్రామ అధ్యక్షులు, సర్పంచ్‌లు, చివరకు జన్మభూమి కమిటీ సభ్యులు కూడా తమ పదవులను అడ్డుపెట్టుకుని అధికారం అండతో భూములను ఆక్రమించేస్తున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కన్ను ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం చెరువుపై పడింది. పోలవరం కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టితో ఈ చెరువును పూడ్చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే రెండు ఎకరాల 76 సెంట్ల వ్యవసాయ భూమికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దాన్ని ఒక పేద దళిత వ్యవసాయ కూలీ కొన్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటికే ఈ పొలాన్ని సాగు చేసుకుంటున్న రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి వేధించారు. బినామీ పేర్లతో ఉన్నా ఇప్పటికీ ఎమ్మెల్యే చేతిలోనే ఈ భూమి ఉంది. చింతలపూడి మండలంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దెందులూరుకు చెందిన ఒక సామాజికవర్గం వారి బినామీ పేర్లతో 125 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో కొంత అటవీ శాఖ భూమిని కూడా కలిపేసుకున్నారు. ఏలూరు శివారులోని వెంకటాపురం వార్డు సభ్యుడు సుంకరవారితోటలోని చెరువు భూమిని కబ్జా చేశారు. విశాలమైన చెరువు గట్టును ప్లాట్లుగా విభజించి అమ్ముకున్నారు. ఏలూరు వినాయక్‌నగర్‌లో కామన్సైట్ను ఆక్రమించి భవనాలు నిర్మించి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఎన్టీఆర్ కాలనీ ఎంపీటీసీ స్థానిక కొత్తూరు ఇందిరా కాలనీ, సుందరయ్య కాలనీల్లో ఖాళీ భూములను ఆక్రమించారు. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఒక్కొక్క ప్లాట్‌ను రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలకు అమ్ముకున్నారు. శనివారపుపేట శ్రీరామ్‌నగర్ 9, 10, 11 రోడ్డుల్లో రెవెన్యూ పోరంబోకు భూములను స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. తంగెళ్లమూడి బీడీ కాలనీ, నల్లగట్టు ప్రాంతాల్లో రెవెన్యూ భూములను గ్రామ టీడీపీ నాయకులు ముక్కలు చేసుకుని పంచేసుకున్నారు. వెంకటాపురం ఎంపీటీసీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడొకరు కలసి ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి భూమిని కబ్జా చేశారు. ఏలూరు శివారులో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. 6 కృష్ణా శ్మశాన వాటికలూ మాయం కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతలు శ్మశాన వాటికలనూ వదల్లేదు. జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం బైపాస్ రోడ్డులో గోపాల్‌నగర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 185లో 10.84 ఎకరాల్లో హిందూ శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. గతంలోనూ శ్మశాన వాటికను ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకోగా ఇటీవల రోడ్డు పక్కన ఉన్న విలువైన స్థలంలో ప్లాట్లు వేసి ముఖ్యమంత్రి అనుచరుడు, టీడీపీ ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం స్పందించి దీనిపై విచారణకు ఆదేశించారు. అనంతరం ఆక్రమణదారులు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం అలానే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.36 కోట్లు ఉంది. కృష్ణా – పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులోకి రెండు జిల్లాల నుంచి చేరే నీరు సముద్రంలోకి వెళ్లడానికి ఏకైక మార్గం ఉప్పుటేరు. గతంలో కలిదిండి మండలంలో ఉప్పుటేరు సమీపంలో సర్వే నెంబర్ 42లో ఉన్న డ్రెయినేజీ భూములను సమీప రైతులకు లీజు పద్ధతిలో ఇరిగేషన్ శాఖ అధికారులు కేటాయించేవారు. అయితే ఉప్పుటేరులో డ్రెజ్జింగ్ పనులు చేసే క్రమంలో స్థలం అవసరం కావడంతో భూములను లీజుకు ఇవ్వలేదు. అయితే టీడీపీ నేత నంబూరి లచ్చిరాజు అనే వ్యక్తి ఈ భూముల్లో 9 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నాడు. ఈ తొమ్మిది ఎకరాల విలువ దాదాపు రూ. 2 కోట్లు ఉంటుంది. హనుమాన్ జంక్షన్ రూరల్ మండలంలోని కోడూరుపాడులో సర్వేనెంబర్ 133లో 44.60 ఎకరాల్లో పెద్దికుంట చెరువు ఉండగా, అందులో 40 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైంది. దీన్ని గ్రామానికి చెందిన టీడీపీ నేత షేక్ ఖలీషా ఆక్రమించుకున్నాడని గ్రామస్తులు అంటున్నారు. అతనికి మంత్రులు, ఎమ్మెల్యే అండగా ఉండడంతో అధికారులు సైతం నోరు మెదపడం లేదు. సదరు నాయకుడు చెరువు భూమిని ఆక్రమించి పక్కాభవనం నిర్మించినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. బెజవాడలో బొండా మాయాజాలం విజయవాడ సింగ్‌నగర్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు కేసీరెడ్డి సూర్యనారాయణ కుటుంబానికి 5.16 ఎకరాల భూమి ఉంది. దీని విలువ రూ.50 కోట్లు. కాగా, టీడీపీ కార్పొరేటర్ గండూరి మహేష్ ఓ వ్యక్తికి రుణం ఇప్పిస్తానని చెప్పి సంతకాలు సేకరించారు. అలా సేకరించిన సంతకాలతో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని ఏకంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు భార్య సుజాత పేర రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇందులో కార్పొరేటర్ గండూరు మహేష్, ఎమ్మెల్యే అనుచరుడు మాగంటి బాబు పాత్ర ఉన్నట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ భూకబ్జా వ్యవహారంలో ఎమ్మెల్యే సతీమణి బొండా సుజాతను ఏ8గా చేర్చి సీఐడీ కేసు నమోదు చేసింది. 7 గుంటూరు కన్నుపడితే కబ్జానే.. గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులు యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల అండతో కనిపించిన స్థలాన్నల్లా కబ్జా చేసేస్తున్నారు. గుంటూరు నడిబొడ్డున నగరపాలక సంస్థకు చెందిన అతి విలువైన స్థలాన్ని ఆక్రమించి అధికార టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించింది. 1999లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అప్పట్లో అరండల్‌పేటలోని పిచుకులగుంట పక్కన టీఎస్ నంబర్ 826లో నగరపాలక సంస్థకు చెందిన వెయ్యి గజాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. కొన్నాళ్లు తర్వాత దీనిపక్కనే ఉన్న సర్వే నంబర్ 12/3లో మరో 1637 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించి చుట్టు ప్రహరీ నిర్మించారు. మార్కెట్ ధర ప్రకారం.. టీడీపీ కార్యాలయం కోసం ఆక్రమించిన స్థలం విలువ సుమారుగా రూ.40 కోట్లు. రేపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుచరుడు సురేంద్రబాబు ప్రభుత్వ భూమిని తన సొంత భూమిగా 1బీ అడంగళ్లులో నమోదు చేయించుకున్నారు. నిజాంపట్నం మండలం దిండి, కేసనవారిపాలెం, జంపనివారిపాలెం, యామినేనివారిపాలెం, పరిశావారిపాలెం, నర్రా వారిపాలెం, నక్షత్రనగరం గ్రామాల పరిధిలోని 875 సర్వే నంబర్లో 416.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని చెరపట్టి తమకు అనుకూలురైన టీడీపీ నేతలు, కార్యకర్తల పేరిట రికార్డుల్లో నమోదుచేశారు. చింతలరేవులో 583 సర్వే నంబర్లో ఉన్న 15.13 ఎకరాల అటవీ భూమిని అధికార పార్టీకి చెందిన ఆరుగురికి అక్కడి తహసీల్దారు రాసిచ్చేశారు. ’సాక్షి’లో 2014, డిసెంబర్ 3న అక్రమ పట్టాలు పొందిన అంశంపై వచ్చిన కథనంతో ఉలిక్కిపడ్డ అధికార యంత్రాంగం తప్పును సరిచేసుకుంటూ అక్రమంగా అటవీ భూములకు ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా సత్తెనపల్లిలో వడ్డవల్లి రఘురామ్‌నగర్‌లోని వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన సర్వీసుదారుల మాన్యం భూమి 25 సెంట్లలో అధికార పార్టీ ముఖ్యనేతకు ఓ కాంట్రాక్టర్ విలాసవంతమైన ఇల్లు నిర్మించి ఇచ్చాడు. ఇది సర్వీసుదారుల మాన్యం అని తెలిసినా అధికారులు ఎవరూ అడ్డు చెప్పలేని దుస్థితి. వ్యవసాయ అనుబంధ పాడిపరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అప్పట్లో సంగం డెయిరీని ఏర్పాటు చేస్తే దానికి సంబంధించిన పది ఎకరాల భూమిని ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్టుకు స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అప్పగించి సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెదకాకాని మండలం నంబూరులో సర్వే నంబర్ 274లోని 3.89 ఎకరాల భూమి (వాగు పోరంబోకు)ని ఎమ్మెల్యే అనుచరుడు కట్టాపుల్లయ్య చౌదరి ముగ్గురు పేర్లతో జీపీ విక్రయం జరిపి సొంతం చేసుకున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి నేత నుంచి ఎమ్మెల్యే, మంత్రులు సైతం తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించినా అధికారులు అడ్డుచెప్పలేని పరిస్థితి. ప్రైవేటు భూములను ఆక్రమించారంటూ బాధితులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. అడంగళ్‌లో పేర్లు మార్చడం, తర్వాత తమ అనుచరులతో భూమిలోకి దిగి చుట్టూ ఫెన్సింగ్‌లు వేయడం, అడ్డుకోవాలని వచ్చే బాధితులను పోలీసుల ద్వారా నిలువరించడం జిల్లాలో నిత్యం జరుగుతున్నదే. తమ భూమిని ఆక్రమించారని బాధితులు కోర్టులకు వెళ్లినా వారికి ఉన్నది ఉన్నట్లుగా రికార్డులు చూపే అధికారే కరువయ్యారు. 8 ప్రకాశం అన్నదాతల భూములు పచ్చ నేతల పాలు ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భూములపై అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలుతున్నారు. అధికారమే అండగా అక్రమంగా భూములను వశం చేసుకుంటున్నారు. కొందరు నేతలు ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జా చేస్తే.. మరికొందరు పేద రైతుల భూములనూ వదలడం లేదు. అధికారులను మచ్చిక చేసుకుని కబ్జా చేసిన భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో బాధితులు తమ భూములు కోల్పోయి లబోదిబోమంటున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గం యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలం నర్సింగాపురం రెవెన్యూ పరిధిలోని వెల్లంపల్లిలో 118 ఎకరాల రైతుల భూములను అధికార పార్టీ నేతలు తమ వశం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. వెల్లంపల్లి పరిధిలో 110, 11డి10, 11డి 5, 1డి7, 11డి9, 1సీడీ, 16,171, 173, 18, 1818, 1853, 1856, 1డీ2, 21, 211, 2111, 213బీ, 22, 221, 238, 232, 25, 2635, 2642, 264, 3, 301, 3010బీ, 305, 306, 31, 32, 34, 35, 351, 36, 85 సర్వే నెంబర్ల పరిధిలో 118 ఎకరాల శోత్రియం భూములు ఉన్నాయి. ఈ భూములు పి.లక్ష్మీనర్సింహారావు స్వాధీనంలో ఉన్నాయి. ఈ భూముల్లో 90 ఎకరాల భూములను 1980–90 మధ్య లేళ్లపల్లి, వెల్లంపల్లి గ్రామాలకు చెందిన 70 మంది రైతులకు అమ్మి రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి నుంచి ఆ భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం లక్ష్మీనర్సింహారావు కోడలు రమణకుమారి ఆ భూములు తమవేనని, ఆన్లైన్ చేయాలంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగింది. రైతుల పేరు మీద ఉన్న భూములను రమణ కుమారి పేరుమీద ఆన్లైన్ చేసేందుకు తొలుత రెవెన్యూ అధికారులు నిరాకరించారు. ఆ తర్వాత మొత్తం 118 ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత రూ.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ భూములను తన పేర మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పథకం ప్రకారం ముందు రమణ కుమారి పేరున ఆన్లైన్లో నమోదు చేయించాలని నిర్ణయించారు. ఇందుకు తొలుత త్రిపురాంతకం రెవెన్యూ అధికారులు సహకరించక పోవడంతో ఏకంగా రెవెన్యూ శాఖా మంత్రి పేషీ నుంచి జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు ఫోన్ చేయించారు. ఒక దశలో రెవెన్యూ మంత్రి కలెక్టర్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు తహశీల్దార్ జైపాల్ 118 ఎకరాల భూమిని రమణ కుమారి పేరున ఆన్లైన్ చేశారు. ఆ తర్వాత ఈ భూములను పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద మీరం గ్రామానికి చెందిన సత్య కంపెనీ అధినేత వీరసత్యకు విజయవాడలో రిజిస్ట్రేషన్ చేశారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు తహశీల్దార్ కార్యాలయంతోపాటు జిల్లా కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల వద్ద గతంలో ఆందోళనలు సైతం నిర్వహించారు. ఆన్లైన్, రిజిస్ట్రేషన్ చేయడంపై బాధితులు తహశీల్దార్‌ను నిలదీయగా కలెక్టర్, ఆర్డీవోల ఒత్తిడి మేరకే తాను ఆన్లైన్ చేయాల్సి వచ్చిందని తహసీల్దార్ వారికి చెప్పారు. భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీ అధికార పార్టీ మంత్రి, ముఖ్యనేతకు బినామీగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీ.. భూములను ఆన్లైన్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. 9 నెల్లూరు అడ్డగోలుగా భూదందాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ భూములు, తీర ప్రాంతాలు, సీజేఎఫ్ భూములను అందిన మేరకు ఆక్రమించి రెవెన్యూ యంత్రాంగం సహకారంతో వాటికి పట్టాలు సృష్టిస్తున్నారు. కొందరు భూములను ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటుండగా మరికొందరు సాగు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలో జలవనరుల శాఖకు చెందిన పదుల సంఖ్యలో స్థలాలు అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే స్వయంగా రంగంలోకి దిగి భూములు ఆక్రమించి పట్టాలు సృష్టించగా మరికొన్ని చోట్ల మంత్రుల అనుచర గణం భూదందా సాగిస్తోంది. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 21 ఎకరాల నిషేధిత ప్రభుత్వ భూమిని తన తండ్రి, అత్త పేరుతో నమోదు చేసేందుకు రికార్డులు సిద్ధం చేయించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ కోట్ల రూపాయల్లో ఉంది. ఎమ్మెల్యే పోలంరెడ్డి ఆక్రమణ ఇలా.. కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం కమ్మపాళెం పంచాయతీ బొడ్డువారిపాళెం మజరాలోని పైడేరు కట్ట పక్కన దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ నిషిద్ధ భూమి ఉంది. ఇందులో 20.76 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. సర్వే నంబర్ 664–2ఏలో 1.51 , 658–2ఏలో .500 , 651–1లో 7, 656–1ఏలో 1.55 , 664–2బీలో 0.40 సెంట్లు, 656–1బీలో 0.93, 664–1లో 1.90, 657–2లో 2.07, 656–3లో 2.13, 656–2లో 2.57 ఎకరాల నిషేధిత భూమి ఆక్రమణకు గురైంది. ప్రభుత్వ నిషేధిత భూమిని కబ్జా చేసింది సాక్షాత్తూ కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి పోలంరెడ్డి వెంకురెడ్డి, అత్త కోటంరెడ్డి పద్మావతి. ఆక్రమణ చేసిన భూమిలో 664–2ఏలో 1.51, 658–2ఏలో .500 , 651–1లో 7, 656–1ఏలో 1.55 ఎకరాల భూమి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి వెంకురెడ్డి పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. అలాగే 664–2బీలో 0.40 సెంట్లు, 656–1బీలో 0.93, 664–1లో 1.90, 657–2లో 2.07, 656–3లో 2.13, 656–2లో 2.57 ఎకరాల భూమి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అత్త కోటంరెడ్డి పద్మావతమ్మ (భార్య పోలంరెడ్డి అరుణ తల్లి) పేరిట రెవెన్యూ రికార్డు 1బీలో నమోదు చేసి ఉంది. నిషేధిత భూమిని ఇరువురూ కొనుగోలు చేసినట్లుగా తహశీల్దార్ వెంకటేశ్వర్లు ధ్రువీకరిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 18న 1బీలో పొందుపరిచారు. భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను కూడా మంజూరు చేశారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. అలాగే ఆలూరు మండలం ఇసుకపల్లి పంచాయితీలోని పట్టపుపాలెంలో ఉన్న లబ్బీపాలెంలో టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సోదరులు 30 ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమించి ఆక్వా సాగు చేశారు. అలాగే జిల్లాలోని సూళ్లూరుపేట, కావలి, ఉదయగిరి, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో టీడీపీ నేతలు, వారి అనుచరులు కనిపించిన ఖాళీ స్థలాలను ఆక్రమించి పట్టాలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో దళితులకు కేటాయించిన 93,500 ఎకరాల సీజేఎఫ్ భూముల్లో 30 శాతానికిపైగా అధికార పార్టీ నేతల అధీనంలోనే ఉన్నాయి. 10 కర్నూలు యథేచ్ఛగా భూకబ్జాలు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో సర్వే నంబర్ 452, 106, 35, 114 సర్వే నంబర్లలోని 14 ఎకరాల ప్రభుత్వ భూములను గోనెగండ్ల మండల టీడీపీ మాజీ కన్వీనర్ టి.నాగేశ్వరరావు అలియాస్ టి.నాగేష్‌నాయుడు సహకార బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాన్ని పొందాడు. ఈ విషయాన్ని పోలీసులు ఆలస్యంగా తెలుసుకొని కేసు నమోదు చేశారు. ఎమ్మిగనూరు షరాఫ్‌బజార్‌లో ఐదు దశాబ్దాల నాటి పోతురాజుస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి పట్టణ నడిబొడ్డున ఆదోని – కర్నూలు నాలుగు లైన్ల బైపాస్ రోడ్డుకు ఇరువైపులా 6.83 ఎకరాల భూమి ఉంది. ఇందులో 0.95 ఎకరాలు బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బీ శాఖ స్వాధీనం చేసుకొని అందుకు పరిహారం కూడా అందజేసింది. దేవాలయానికి సంబంధించిన పరిహారం కావడంతో కోర్టులో డిపాజిట్ చేశారు. ప్రస్తుతం సర్వే నెం.4401లో 2.53 ఎకరాలు, 4403లో 3.35 ఎకరాల దేవాలయ భూమి మిగిలి ఉంది. ఈ భూమిని బారికి హనుమంతు, బారికి గోపాల్, బారికి భూపాల్, చిన్న గోపాల్ అనే వ్యక్తులు మూకుమ్మడిగా పవన్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ తరఫున మేనేజింగ్ పార్టనర్ అయిన కేఈ ప్రతాప్‌కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్లకు పట్టాదారు టైటిల్ డీడీ, రెవెన్యూ అడంగల్, నాన్ అసైన్మెంట్ ల్యాండ్ ధ్రువీకరణలను తీసుకునే రిజిస్ట్రేషన్ అధికారులు దేవదాయ భూమి రిజిస్ట్రేషన్‌లో మాత్రం ఇవేమీ లేకుండానే పనికానిచ్చేశారు. అది కూడా దేవదాయ భూమిపై హైదరాబాద్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు నడుస్తుండగా చట్ట వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్లు చేయించడం గమనార్హం. ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. ఇలా చెప్పుకుంటే పోతే కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఎక్కడ ఖాళీ స్థలాలు, బీడు భూములు ఉంటే అక్కడ ఆక్రమించేశారు. మాన్యం, పోరంబోకు, అసైన్మెంట్, వక్ఫ్ భూములు, ప్రభుత్వ ఇలా ఏ భూమి కనిపించినా తమ జెండా పాతేశారు. జిల్లావ్యాప్తంగా 1000 ఎకరాల భూములు టీడీపీ నాయకుల అక్రమణలో ఉన్నాయని అంచనా. వీటి విలువ సుమారుగా రూ.500 కోట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 11 ‘అనంత’ ఆక్రమణలు అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. ఈ భూములను కొందరు అధికార పార్టీ నేతలు తమ బంధువుల పేరుతో నకిలీ పట్టాలు సృష్టించి స్వాహా చేస్తే, కొందరు కార్యకర్తల పేర్లతో వందల, వేల ఎకరాల భూమిని రాయించుకున్నారు. ఈ మొత్తం భూముల విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుందని అంచనా. ‘అనంత’లో ఆక్రమణలను పరిశీలిస్తే.. శింగనమల నియోజకవర్గంలోని ఆకులేడు, తరిమెల, కొరిపల్లి, జూలా కాలవలో మొత్తం 37 సర్వే నెంబర్లలో 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు నకిలీ పట్టాలు సృష్టించి కబ్జా చేశారు. ఇదే తరహాలో ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో కూడేరు, కమ్మూరు, మరుట్ల, గుటుకూరు, జల్లిపల్లి గ్రామాల్లో 500 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అనంతపురం కార్పొరేషన్ చుట్టూ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గం ఉంది. ఎక్కడ చూసినా సెంటు రూ.6–రూ.10 లక్షల వరకు ఉంది. అంటే ఈ లెక్కన ఎకరా కనీసం రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది. సోములదొడ్డి సమీపంలో 2013లో పేదలకు పట్టాలిచ్చిన 4.90 ఎకరాల భూమిలో మంత్రి పరిటాల సునీత అనుచరుడు పామురాయి వెంకటేశ్, పరిటాల పేరుతో ఏకంగా జెండాలు పాతారు. నిత్యం ఏదో ఒకచోట కబ్జా రాయుళ్లు విరుచుకుపడుతున్నా అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. రెవెన్యూ అధికారులు ధిక్కార స్వరం వినిపించకుండా మౌనంగా ఉండిపోతున్నారు. అధికారులు అనధికారికంగా అనుమతి ఇచ్చిన తర్వాత వారికి కొంత ముట్టజెప్పి స్వాహాకు దిగుతున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు అధికారుల కబ్జాలకు రూట్‌మ్యాప్ ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 12 తిరుపతి రూ.1,962 కోట్ల మఠం భూముల హాంఫట్ తిరుపతి రూరల్ మండలం అవిలాల సర్వే నెంబర్ 13లో 109 ఎకరాల భూమి హథీరాంజీ మఠానికి చెందిన పట్టా భూమిగా రికార్డుల్లో ఉంది. ఓ వైపు తిరుపతికి, మరోవైపు పూతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారికి అనుకుని ఉంది. ఇక్కడ అంకణం రూ.1.50 లక్షకు పైగానే పలుకుతుంది. అంటే ఈ భూమి విలువ ప్రస్తుతం 1,962 కోట్లు. అత్యంత విలువైన ఈ భూములను కళాపోషకుడు అయిన ఓ ఎంపీ బంధువులు, వేదాంతపురంకు చెందిన టీడీపీ నాయకుడు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన ప్రణాళిక సంఘం సభ్యుడు చెరపట్టారు. ఎవరికి అనుకూలంగా ఉన్న చోట వారు అక్రమ లేఅవుట్లను వేసుకున్నారు. అంకణాల చొప్పున అమ్మేసుకుని కోట్లకు పడగలెత్తారు. మఠానికి చెందిన కొందరు సిబ్బంది అక్రమార్కులకు అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో జేసీగా పనిచేసినప్పుడు ఈ భూముల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపిన ప్రస్తుత కలెక్టర్ ప్రద్యుమ్న ఇప్పుడు చర్యలకు వెనుకాడుతున్నారు. 13 వైఎస్సార్ అగస్త్యేశ్వరుని ఆస్తులకు ఎసరు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో అగస్త్యేశ్వరుని ఆస్తులకు అధికార పార్టీ నాయకులు ఎసరు పెట్టారు. పట్టణంలోని వినాయకనగర్‌లో సర్వే నంబర్ 450ఏబీ, 451ఏబీ, 452ఏబీలలో మొత్తం 25 సెంట్ల స్థలం దేవదాయ శాఖకు చెందింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. ఈ 25 సెంట్ల స్థలం దాదాపు రూ.3 కోట్లు చేస్తోంది. ఇందులో 6.25 సెంట్లను అధికార పార్టీకి చెందిన పట్టుపోగుల పుల్లయ్య ఆక్రమించి భారీ భవనం నిర్మించుకున్నాడు. ఈయన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి వర్గీయుడు. తమ స్థలంలో గృహాలు నిర్మించుకోవడంతో దేవదాయశాఖ ట్రిబ్యునల్‌లో కేసు వేసింది. ట్రిబ్యునల్ దేవాలయ భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించాలని తీర్పు ఇచ్చింది. అయినా ఇప్పటివరకు దేవదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఈ భూమిలో 13 మంది ఆక్రమణలకు పాల్పడగా, రాజకీయ అండ లేని సి.లక్ష్మీనారాయణమ్మ, వి.చిన్నపుల్లయ్యకు చెందిన గృహాలను మాత్రమే దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని అధికార పార్టీకి చెందినవారిని వదిలేశారు. -
అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల భూకబ్జా
-
కలెక్టర్ ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని దేవతలగుట్టపై ఉన్న ఆలయాలను కూల్చి 150 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆ స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిసినా కళ్లు మూసుకుని ఉండటమో.. నిద్రపోవడమో చేస్తుంటారని మండిపడింది. జరు గుతున్న వ్యవహారం చూస్తుంటే రాజకీయ నేతల చేతుల్లో అధికారులు డమ్మీలుగా మారిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించింది. సర్కారు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ భూములను మూడు నెలల్లో స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధా కృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.. దేవతలగుట్టపై ఉన్న వీరభద్రస్వామి, ఇతర దేవాలయాలను కూల్చేయడమే కాకుండా 150 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రైడ్ ఇండి యా బిల్డర్స్ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతోందని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని దేవతలగుట్ట పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు నాం రామ్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు నిర్మాణదారులు కూడా రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేశ్‌కుమార్.. దేవతలగుట్టపై ఆక్రమణల గురించి ధర్మాసనా నికి వివరించారు. కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వై.రామారావు కోర్టుకు తెలిపారు. హెచ్ఎండీఏకు ఏం సంబంధం: కోర్టు పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం తీవ్రం గా స్పందించింది. కబ్జాదారులపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తుంటే భూముల ఆక్రమణలు ఎందుకు జరుగుతాయని నిలదీసింది. కలెక్టర్ మొదట్లోనే చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహారాల్లో నిర్ణయాధికారం ఎవరిదని ధర్మాసనం ప్రశ్నించ గా.. ఆ అధికారం కలెక్టర్‌దేనని, అయితే ఆ ప్రాంతం హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. కోర్టు స్పందిస్తూ.. ‘హెచ్ఎండీఏకి ఏం సంబంధం. అది ఓ అభివృద్ధి సంస్థ మాత్రమే. చట్ట ప్రకారం వ్యవహరించాల్సింది కలెక్టరే. దీనికి హెచ్ఎండీఏను బాధ్యులను చేయడం తగదు’ అని వ్యాఖ్యానించింది. తమ నిర్మాణాలున్న భూమి ప్రభు త్వ భూమి కాదని, నాలుగేళ్ల క్రితమే తమ నిర్మాణాల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్నామన్ని నిర్మాణదారుల తరఫు న్యాయవాదులు తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. ప్రభు త్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టొద్దని గతం లో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. పూర్తయిన నిర్మాణాల క్రమబద్ధీకరణపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని హెచ్ఎండీఏ కమిషనర్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు నివేదికివ్వాలని కలెక్టర్, హెచ్ఎండీఏ కమిషనర్లను.. ఆ నివే దికలను పరిశీలన కోసం సీజే ముందుంచాల ని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. దీనికి సంబంధించిన వ్యాజ్యాలను మూసేసింది. -
దర్జాగా కబ్జా..!
వరంగల్ : అధికారుల పట్టింపులేనితనం.. అక్రమార్కులకు వరంగా మారింది. కోరిన కోర్కెలు తీర్చే దేవుడి భూమినే కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నప్పటికీ పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. ఫలితంగా రూ. కోట్లు విలువ చేసే స్థలం రోజు రోజుకూ కనుమరుగవుతోంది. వరంగల్ నగరంలోని నర్సంపేట రోడ్డుకు ఆనుకుని ఉన్న గోపాలస్వామి ఆలయానికి చెందిన సుమారు 800 గజాల భూమిని ఆలయ నిర్వాహకులు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా గోపాలస్వామి గుడికి దేవుని మాన్యం కింద సర్వే నంబర్ 381, 388/ఆ, 499, 500, 396, 493, 392/2లో 4.22 ఎకరాల భూమి ఉంది. ఈ మేరకు 1954–55 నుంచి శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. ఈ సర్వే నంబర్ల పరిధిలో తోట మైదానం, గుడి, డాక్టర్స్‌కాలనీ–1, డాక్టర్స్‌కాలనీ–2లో భూమి మొత్తం ఉంది. అయితే సర్వే నంబర్ 392/2లో ఉన్న పంప్‌హౌస్ సమీపంలోని లక్ష్మీగార్డెన్స్ పక్కన ఎంత భూమి ఉందో దేవాదాయ శాఖ అధికారులకే తెలియాల్సి ఉంది. ఇందులో మిత్రమండలి పేరుతో ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ స్కూ ల్ ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికి చెం దడం లేదు. వారు అద్దె చెల్లిస్తున్నారా... ఎంత చెల్లిస్తున్నారు.. అన్న విషయాలు మాత్రం ఆల య కమిటీ, శాఖ అధికారులకే తెలుస్తోంది. గుడి పేరుతో పాఠశాల నిర్వహణ.. ఆలయానికి ఆనుకుని గోపాలస్వామి గుడి స్కూల్ పేరుతో ఎయిడెడ్ పాఠశాలను ప్రారంభించారు. 1965లో అప్పటి మునిసిపాలిటీ అధికారులు స్కూల్‌కు ఇంటి నంబర్ 13– 696ను కేటాయించారు. అదే పేరుతో రికార్డుల్లో నమోదైంది. అయితే ఏమాయ జరిగిందో తెలియదుకానీ.. 1975లో గోపాలస్వామి టెంపుల్ స్కూల్ పేరు కాస్తా ఇదే నంబర్‌తో శేషాచారిగా మునిసిపల్ రికార్డుల్లోకి మారింది. విషయం తెలియడంతో 1984లో ఈ పాఠశాల ప్రభుత్వ ప్రైమరీ ఎయిడెడ్ స్కూల్‌గా పేరు మారి రికార్డుల్లో నమోదైంది. 1993లో వరంగ ల్ మునిసిపాలిటీ కాస్తా మునిసిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కావడంతో నగరంలో కొత్తగా ఇంటి నంబర్లు కేటాయించారు. దీంతో ఆలయానికి సంబంధించిన భూమిలో ఉన్న ప్రభు త్వ ప్రైమరీ ఎయిడెడ్ స్కూల్ నంబర్ కాస్తా ఇంటి నంబర్ 13–4–157గా మారింది. అప్ప టి నుంచి అదే పేరుతో ఉన్న పాఠశాల పేరు కాస్తా 2016లో మారింది. ప్రభుత్వ పాఠశాల స్థానంలో అరుట్ల శేషాచారి పేరు గ్రేటర్ కార్పొరేషన్ రికార్డుల్లోకి ఎక్కింది. అప్పటి నుంచి పా ఠశాల భూమిని అమ్మేందుకు పలుసార్లు ప్రయత్నాలు చేసినా కొంత మంది దేవాలయ భూ మిని మీరు ఎట్లా విక్రయిస్తారని అడ్డుకోవడంతో సాధ్యం కాలేదు. దీంతో ఈ స్థలంలో ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులకు ప్రమాదకరంగా మా రింది. వి షయాన్ని గుర్తించిన అధికారులు పాఠశాల ను వేరేచోటికి తరలించారు. తర్వాత భవనం కూ లిపోవడంతో ఎవరు స్థలాన్ని పట్టించుకోలేదు. గుడి భూమి విక్రయం..? గుడి భూమిని ఇటీవల విక్రయించినట్లు తెలి సింది. దీంతో విశ్వ హిందూ పరిషత్ మహా నగర కమిటీ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని అర్బన్ కలెక్టర్, ఆర్డీఓ, వరంగల్ తహసీల్దార్, గ్రేటర్ వరంగల్ కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన కలెక్టర్ వరంగల్ తహసీల్దార్‌తో మాట్లాడి భూముల రికార్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, గుడి పక్కనే ఉన్న పాఠశాల భూమిలో ఇటీవల పునాదులు తీయ డం ప్రారంభమైంది. ఈ భూమిని ఆలయ నిర్వాహకులు అమ్మారని కొందరు.. పాఠశాల నిర్వాహకులు విక్రయించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆలయ ఇన్చార్జి ఈఓ ధనుంజయను వివరణ కోరేందుకు ‘సాక్షి’ సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
నా చావుకు టీడీపీ నేతే కారణం
కదిరి: అనంతపురం జిల్లా కదిరికి చెందిన మాజీ సైనికుడు అల్లా బక్ష్ గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ సురయాభాను భర్త బాబ్జానే తన చావుకి కారణమని సూసైడ్ నోట్ రాశాడు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. అల్లా బక్ష్‌కు నేహా ఫంక్షన్ హాల్ దగ్గర సర్వే నం.800లో 12 సెంట్ల స్థలం ఉంది. ఆ పక్కనే 3 సెంట్ల వంక పోరంబోకు స్థలం ఉంది. చైర్మన్ భర్త బాబ్జాన్ ఆ స్థలాన్ని కబ్జా చేసి బినామీ పేర్ల మీద రిజిస్టర్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న అల్లా బక్ష్.. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేయగా బలవంతంగా తరలించేశారు. మనస్తాపం చెందిన అతడు గురువారం ఉదయం తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన భార్య వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించింది. బాబ్‌జాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీకే చెందిన కౌన్సిలర్ మైనుద్దీన్ తదితరులు డిమాండ్ చేశారు. -
నెల్లూరులో రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు
-
వందల్లో చెల్లించి.. కోట్లలో కొట్టేసి..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను కొట్టేయడానికి దీపక్‌రెడ్డి, శైలేశ్ తదితరులు భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో ‘పరిచయం’చేస్తూ సదరు స్థలంపై జీపీఏలు, సేల్డీడ్లు తయారు చేయించారు. అతడికి వందల్లో చెల్లిస్తూ కోర్టులకు బోగస్ పేర్లతో తిప్పి వందల కోట్ల స్థలాలను కబ్జా చేసే కథ నడిపారు. అత్తాపూర్‌లోని రామ్‌బాగ్ ప్రాంతానికి చెందిన శివభూషణం ఎంజే మార్కెట్లోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వివిధ రకాలైన పత్రాలు విక్రయిస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే తరచుగా అక్కడకు వచ్చే మొఘల్‌పురకు చెందిన న్యాయవాది శైలేశ్ సక్సేనాతో 2000లో ఇతడికి పరిచయమైంది. తనకు అవసరమైనప్పుడల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి తాను చెప్పిన పేరుతో సంతకాలు చేయాలని కోరడంతో శివభూషణం అంగీకరించాడు. దీనికి ప్రతిఫలంగా శివభూషణంకు ఉన్న అప్పులు తీర్చడంతో పాటు కుమార్తె, కుమారుడి వివాహాలకు అవసరమైన సాయం చేస్తానంటూ శైలేశ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2004లో గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో ఉన్న రూ.300 కోట్లకు పైగా ఖరీదైన 78 ఎకరాల రెండు గుంటల స్థలంపై శైలేశ్ కన్నేశాడు. ఈ స్థలాన్ని దాని యజమాని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ తనకు విక్రయించినట్లు రికార్డులు రూపొందించి సివిల్ సూట్స్ వేశాడు. తాను నిర్వహిస్తున్న స్థల యజమాని ఇస్లాం ఖాన్ లేడని, కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడానికి అతడి సంతకాలు కావాలంటూ శివభూషణంతో శైలేశ్ చెప్పాడు. దీనికి ముందే ఇక్బాల్ ఇస్లాంఖాన్ తన పేరిట రాశాడంటూ ఓ బోగస్ జీపీఏ సృష్టించిన శైలేశ్ దాన్ని శివభూషణానికి చూపాడు. ఇక్బాల్ ఇస్లాంఖాన్‌గా నటించేందుకు శివభూషణం అంగీకరించడంతో బోగస్ పత్రాల ఆధారంగా 2004లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో భోజగుట్ట స్థలానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన శైలేశ్... శివభూషణాన్ని కోర్టుకు తీసుకువెళ్ళి ఇక్బాల్ ఇస్లాంఖాన్‌గా చూపించారు. న్యాయస్థానంలో ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా సంతకాలు సైతం చేయించారు. కోర్టు వాయిదాలు ఉన్నప్పుడల్లా శివభూషణాన్నే ఇస్లాం ఖాన్‌గా న్యాయస్థానానికి హాజరయ్యేలా శైలేశ్ ఏర్పాట్లు చేశాడు. ఈ సమయంలో అతడి వెంట సక్సేనా అనుచరుడితో పాటు దీపక్‌రెడ్డి కూడా ఉండేవారు. ఒక్కో వాయిదాకు రూ.500 నుంచి రూ.700 శివభూషణంకు చెల్లించేవాడు. 2006 మార్చిలో దీపక్, శైలేశ్లు మరోసారి శివభూషణాన్ని ఉపయోగించుకున్నారు. గుడిమల్కాపుర్‌లో ఉన్న 78 ఎకరాల 22 గుంటలు, మాదాపూర్‌లోని ఎకరం స్థలంపై వీరి కన్ను పడింది. శివభూషణంతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు ఈ స్థలాలను ఎన్‌హెచ్ శైలజ, బి.ప్రకాశ్‌చంద్ సక్సేనా, జి.దీపక్‌రెడ్డిలకు విక్రయించినట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. వీటిపై శివభూషణంతో పాటు శైలేశ్ సక్సేనా, దీపక్‌రెడ్డి తీసుకువచ్చిన మరో ఐదుగురు వ్యక్తులు సంతకాలు చేశారు. అతడే ఖాన్.. అతడే ఠాకూర్ వివిధ సందర్భాల్లో వినియోగించడానికి శివభూషణానికి బోగస్ గుర్తింపు కార్డు అవసరమైంది. దీంతో శైలేశ్, దీపక్‌రెడ్డి సంయుక్తంగా శివభూషణం ఫొటోతో, రాధాకృష్ణన్ ఠాకూర్ పేరుతో బోగస్ ఓటర్ ఐడీ రూపొందించారు. దీని ఆధారంగా శివభూషణాన్ని ఠాకూర్‌గా మార్చే శారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.12లో ఉన్న రూ.100 కోట్ల ఖరీదైన స్థలం ‘క్రయ విక్రయాల్లో’ఈ ఐడీని వాడారు. శివభూషణంను హైదరా బాద్ (సౌత్) జాయింట్ సబ్–రిజిస్ట్రార్ ఆఫీస్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సదరు స్థలాన్ని విక్రయిస్తున్నట్లు ఠాకూర్ పేరుతో శివభూషణం సంతకం చేయగా, ఖరీదు చేస్తున్నట్లు దీపక్‌రెడ్డి సంతకం చేశారు. దీనికి ప్రతిఫలంగా శైలేశ్ రూ.వెయ్యి శివభూషణంకు ఇచ్చాడు. జీపీఏలో పొరపాటు దొర్లిందని చెప్పిన సక్సేనా 2008 అక్టోబర్‌లో మరోసారి శివభూషణంను రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించాడు. దీపక్‌రెడ్డి పేరుతో మరో డీడ్ చేయించి రూ.500 చెల్లించాడు. ఈ వ్యవహారాలకు సంబంధించి నమోదైన మొత్తం ఆరు కేసుల్ని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గతేడాది శివభూషణంని అరెస్టు చేశారు. మావూరి శివభూషణం మృతి దీపక్‌రెడ్డి కబ్జాల కేసులో కీలక నిందితుడు భోజగుట్టసహా నగరంలో ఉన్న రూ.వందల కోట్ల భూములకు ‘పేపర్ యజమాని’, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేశ్ సక్సేనాలు రంగంలోకి దింపిన ‘నకిలీ దాదా’మావూరి శివభూషణం మంగళవారం మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అత్తాపూర్‌లోని ఇంట్లో చనిపోయాడు. భోజగుట్ట భూ కబ్జా కేసులో దీపక్‌రెడ్డి, శైలేశ్లతో పాటు గతేడాది సీసీఎస్ పోలీసులకు భూషణం చిక్కాడు. కాగా ఈ కేసుపై సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘సాధారణంగా ఎలాంటి కేసులోనూ నిందితులు న్యాయమూర్తి ముందు తమ నేరం అంగీకరిస్తూ వాంగ్మూలం (164 స్టేట్మెంట్) ఇవ్వరు. అయితే శివభూషణం మాత్రం గతంలోనే న్యాయస్థానంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసు విచారణపై ఆయన మరణ ప్రభావం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇతడికి కుమారుడిగా నటించిన బషీర్ సైతం ఈ కేసుల్లో కీలకం’అని మహంతి చెప్పారు. -
ఎమ్మెల్యే అనుచరుడా.. మజాకా!
పినిశెట్టి కుమారి.. ముగ్గురు పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. దువ్వాడలో దయాళ్‌నగర్‌లో 133 గజాలు కొనుగోలు చేసింది. కొనుక్కున్న స్థలంలో 2017లో రేకుల షెడ్డు వేసింది. ఈ జాగాపై అధికార పార్టీకి చెందిన నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు కన్నేశాడు. మార్చి 29, 2018లో సుమారు 30 మందితో ఆమె ఇంట్లోలేని సమయం చూసి తన అనుచరులతో కలిసి ఆ ఇంటిని నామరూపాల్లేకుండా కూల్చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు దువ్వాడ పోలీస్ స్టేషనుకు ఫిర్యాదు చేసింది. ఇలా అనేక రకాలు భూ కబ్జాలు, రాత్రికి రాత్రే నిర్మాణాలు వంటి అనేక ఫిర్యాదులు ఉన్నాయని స్వయంగా అధికార పార్టీ నాయకులే తలలు పట్టుకుని కూర్చుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : తలసరి ఆదాయంలోనే కాదు.. స్థూల వృద్ధి రేటులో కూడా గాజువాక నెం.1. అంతేకాదు.. అధికార టీడీపీ నేతల దందాలు..భూకబ్జాల్లో కూడా అదే స్థానంలో నిలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో ఆయన అనుచరగణం జాగా కన్పిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే మీ అంతుచూస్తాం అంటూ బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. ఇక్కడ అధికారులు సైతం వీరి అడుగులకు మడుగులొత్తుతున్నారు. గాజువాకకు కూతవేటు దూరంలో 65వ వార్డు పరిధిలోని హరిజనజగ్గయ్యపాలెంలో ఉన్న మాజీ సైనికుల కాలనీలోని సర్వే నంబర్ 117/3లో సుమారు 15 సెంట్లకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. మార్కెట్లో రూ.2 కోట్లకు పైగా పలుకుతున్న ఈ ప్రభుత్వ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్నేశాడు. ఎలాగైనా కాజేయాలని పక్కా స్కెచ్ వేసి దర్జాగా కబ్జా చేశాడు. పైగా తన బంధువైన ఓ అంగన్వాడీ కార్యకర్త పేరిట దొంగపత్రాలు సృష్టించాడు. టౌన్‌ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టాడు. గతంలో ఈ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదుపై పరిశీలించేందుకు వచ్చిన ఆర్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడంతో అటువైపు చూసేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. గతంలో ఇతగాడి భూకబ్జాలపై ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిసారి హడావిడి చేయడం.. కొద్దికాలం పాటు నిర్మాణాలు ఆపమని ఉచిత సలహాలు ఇవ్వడం తప్ప అధికారులు ఏనాడు చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. డిప్యూటీ తహసీల్దార్ అండదండలతో... ఇటీవల గాజువాక తహసీల్దార్ బదిలీ అయ్యారు. అప్పటికే ఖాళీగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ పోస్టులో తన పీఏగా పని చేస్తున్న చేతన్‌కు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోస్టింగ్ ఇప్పించారు. ఇన్చార్జి తహసీల్దార్ బాధ్యతలు కూడా ఆయనకే కట్టబెట్టేలా ఎమ్మెల్యే చక్రం తిప్పారు. ఇక 65వ వార్డు నాయకుడికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్లాన్ అప్రూవల్స్ అంటూ పొంతన లేని ఫ్లెక్సీలు నిర్మాణం వద్ద ప్లాన్ అప్రూవల్స్‌తో పాటు ఇతర అనుమతులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ప్రదర్శించాలి. కానీ అందర్ని అయోమయానికి గురిచేసే విధంగా పొంతన లేని నోటీసులు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు క్రమబద్ధీకరించే అంశం సంబంధిత అధికారుల పరిధిలో ఉందంటూ కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఆర్డర్, హౌసింVŠ శాఖ రుణాలు మంజూరు చేసినట్టుగా మరొకటి పొంతన లేని నోటీసులను భారీ ఫ్లెక్సీగా ఏర్పాటు చేసి అందర్నీ అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక వీఆర్వో నుంచి జోనల్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ వరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ యంత్రాంగం నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి వచ్చి పరిశీలించింది. అంతే వారిపై వీరంగం సృష్టించటంతో అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. అధికారులు సదరు నాయకుడి అక్రమాలపై విచారణ జరిపి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని గ్రామానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు ఈ వ్యవహారంపై డిప్యూటీ తహసీల్దార్ చేతన్‌ను వివరణ కోరగా అది పూర్తిగా ప్రభుత్వ స్థలమేనని, ఆ భూమి ఎవరికి కేటాయించలేదని, వాటిలో నిర్మాణాలకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, పైగా తమకు ఎలాంటి ఫిర్యాదులు ఇప్పటి వరకు రాలేదని చెప్పుకొచ్చారు. అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా తమ దృష్టికే రాలేదంటూ దాటవేశారు. ఆ నాయకుడి ఆగడాలకు అంతేలేదు అధికారపార్టీ నాయకుడు అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి పక్కనే నా ఇల్లు జీవీఎంసీ అనుమతులతో ఉంది. నా ఇంటి మరమ్మతు కోసం గోడను తొలగించాను. తిరిగి కట్టుకుందామని అనుకుంటే అధికారపార్టీ నాయకుడు జీవీఎంసీ అధికారులతో ఇంటిని కట్టకుండా నరకాన్ని చూపిస్తున్నాడు. బిల్డింగ్ ఇన్స్‌స్పెక్టర్ నాయకుడు చెప్పినట్టు విని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. – పి.ఈశ్వరమ్మ, బాధితురాలు అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే తిరిగి తమమీదే తప్పులు ఎత్తిచూపుతున్నారు. ఆ నాయకుడు అక్రమనిర్మాణం చేపట్టడమే కాకుండా అధికారులతో భయభ్రాంతులకు గురి చేయిస్తున్నాడు. – వై.శ్యామల, స్థానికురాలు -
జెండాపై పరిటాల !
పేదలు ఓ గుడిసె వేసుకుందామనుకునే లోపు అక్కడ ఓ పచ్చని జెండా రెపరెపలాడుతుంది. అందునా దానిమీద పరిటాల పేరు. ఇంకేముంది.. ఆ వైపు వెళ్లేందుకు కూడా సామాన్యులు జంకే పరిస్థితి. నగర శివారులో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూముల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. పోనీ అధికారులకు చెప్పుకుందామంటే వాళ్లూ అందులో భాగస్వాములే. నాయకుల వద్దకు వెళ్దామంటే వ్యవహారమంతా వారి కనుసన్నల్లోనే. విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కుతున్నా ఫలితం లేకపోతోంది. రాప్తాడులో కబ్జాల రెపరెపలు సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం చుట్టుపక్కల అధికార పార్టీ నేతల భూ దందా యథేచ్ఛగా సాగుతోంది. రూరల్ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలాల్లో పాగా వేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అనంతపురం కార్పొరేషన్‌కు అతి సమీపంలోని ఈ భూముల విలువ రూ. కోట్లలో ఉంటోంది. అయితే అధికారులు కూడా ఈ దందాను అడ్డుకోలేకపోతుండటం గమనార్హం. ఇందులో భాగంగా అక్రమార్కులు ముందుగానే అధికారులతో మంతనాలు సాగిస్తున్నారు. ఆ తర్వాత అంతోఇంతో ముట్టజెప్పి తమ పని కానిచ్చేస్తున్నారు. నగరం చుట్టూ బుక్కరాయసముద్రం మినహా తక్కిన ప్రాంతమంతా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నగర శివారులో ఎక్కడ చూసినా సెంటు స్థలం రూ.7లక్షల నుంచి రూ.15లక్షల పైమాటే. ఆయా ప్రాంతాల్లో ఖాళీ జాగా కనిపిస్తే టీడీపీ నేతలు అక్కడ వాలిపోతున్నారు. ఈ పంచాయతీల పరిధిలోని వీఆర్వోలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఖాళీ స్థలాల సమాచారం పసిగడుతున్నారు. ఆ తర్వాత బడా నేతల ఆశీర్వాదంతో జెండా పాతేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన కబ్జాలన్నీ ఇదే తరహాలోనివే. బీసీ భవన్ తెరమరుగేనా? సోములదొడ్డి ప్రాంతంలో ఓబుళయ్య, తిరుపాలు, నారాయణస్వామి, వెంకటేశ్ అనే నలుగురు వ్యక్తులకు 4.09 ఎకరాల పొలం ఉంది. వీళ్ల పూర్వీకులకు ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది. ఇందుకు పాసు పుస్తకాలను కూడా జారీ చేసింది. సర్వే నెంబర్ 97–1లోని ఈ పొలంలో ఓబుళయ్య, తిరుపాలు పేరుతో 0.82 ఎకరాలు, నారాయణస్వామి, వెంకటేశ్ పేరుతో 1.63 ఎకరాల పొలం ఉంది. ఇళ్లులేని పేద కుటుంబాలు ఇళ్ల స్థలాల కోసం కొందరు గ్రామపెద్దల సమక్షంలో ఈ నలుగురిని సంప్రదించారు. ఈ ప్రాంతంలో ఖాళీ స్థలాలు లేవని, మీ పొలాలను ఇళ్లస్థలాల కోసం ఇస్తే ఆ భూములను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇందుకు వారు అంగీకరించారు. 2012లో 4.09 ఎకరాల భూమిలో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని, ఈ భూమిని తిరిగి ప్రభుత్వానికే స్వాధీనం చేస్తూ పాసుపుస్తకాలు, సంబంధిత రికార్డులు, తహసీల్దార్‌కు సమర్పించారు. ఆ మేరకు 129 మందికి 2013 మార్చి 15న అప్పటి తహసీల్దార్ బలరామిరెడ్డి, ఆర్డీఓ హుస్సేస్సాహెబ్ ఒక్కొక్కరికి 1.5 సెంట్ల చొప్పున ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. 4.09 ఎకరాల కొనుగోలు సొమ్మును ఈ 129 మంది కలిసి చెల్లించారు. స్థలాలు రావడంతో ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే నిర్మించుకోవచ్చని జన్మభూమిలో ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ స్థలాన్ని పామురాయి వెంకటేశ్ పేరుతో జెండాలు పాతి స్వాధీనం చేసుకోవాలని యత్నించారు. ఇంతలో ఆ స్థలాన్ని అప్పటి కలెక్టర్ శశిధర్ బీసీ భవన్ నిర్మాణానికి కేటాయించారు. అయితే ప్రభుత్వం బీసీ భవన్ ప్రతిపాదనను పక్కనపెట్టింది. ఈ భూమిలో కొంతమంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని, బీసీ భవన్‌కు మరోచోట స్థలం ఇవ్వొచ్చని ఓ ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇళ్లస్థలాల పేరుతో అస్మదీయులకు స్థలాన్ని కట్టబెట్టేందుకే బీసీ భవన్ ప్రతిపాదనను పక్కనపెట్టినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో మరికొన్ని కబ్జాలు ఇవే.. ఆత్మకూరు మండలం బి.యాలేరులో 4.40 ఎకరాల అసైన్డ్ భూమిని ఈ గ్రామంలోని దళితులు ఇళ్లస్థలాల కోసం కొనుగోలు చేశారు. ఆ భూమిని తహసీల్దార్‌కు స్వాధీనం చేసి ఆ స్థలంలో పట్టాలు తీసుకోవాలని భావించారు. ఈ తంతు 2014కు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత పట్టాలివ్వకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. పైగా భూమిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఈ భూమిలో పట్టాలివ్వాలని భావిస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించి స్థలం కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు. జేఎన్టీయూ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల పొలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి నారాలోకేశ్‌బాబు కాలనీగా నామకరణం చేశారు. ఈ స్థలం విలువ కోట్లలోనే ఉంటుంది. అనంతపురం సమీపంలోని కక్కలపల్లి వద్దనున్న ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాలు గుడిసెలు వేసుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వారికి పట్టాలిప్పిస్తామని అప్పట్లో పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత 2014లో మొత్తం ఇళ్లను పోలీసుల అండతో కూల్చేశారు. మంత్రి బంధువులు మురళీ, మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో ఇళ్లను కూల్చేసి నీడలేకుండా చేశారని అప్పట్లో బాధితులు ఆరోపించారు. ఈ ఫొటోలో పరిటాల, పామురాయి వెంకటేశ్ పేరుతో కనిపిస్తున్న పచ్చ జెండాలు అనంతపురం రూరల్ పరిధి సోములదొడ్డి ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ఏడాదిన్నర కిందట నాటారు. 2013లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం పట్టాలిచ్చిన 4.90 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఈ కబ్జాకు తెగించారు. ూ కక్కలపల్లిలోని ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో ఏడాది కిందట కొందరు టీడీపీ నేతలు పరిటాల రవీంద్రకాలనీ పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. దాదాపు 200 గుడిసెలు వేయించారు. పట్టాలిప్పిస్తామని కొందరు భారీగా దండుకున్నారు. ఇందులో రెండెకరాలు పేదలకు ఇచ్చి, మూడెకరాలను స్వాధీనం చేసుకునే కుట్రతోనే ‘తమ్ముళ్లు’ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. బీసీ భవన్ స్థలాన్ని రద్దు చేయలేదు సోములదొడ్డి రెవెన్యూ గ్రామంలో బీసీ భవన్ కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేయలేదు. ఆ స్థలాన్ని గతంలో ఇంటి పట్టాలు మంజూరు చేశాం. అయితే నిర్ణీత గడువులోపు ఎవరూ ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పట్టాలను రద్దు చేసి ఆ స్థలాన్ని బీసీ భవన్ కోసం కేటాయించాం. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించిన రైతులు కోర్టులో కేసు వేశారు. విచారణ జరుగుతోంది. – మలోల, ఆర్డీఓ -
బొబ్బిలి రాజుల భూ దాహం..!
బొబ్బిలి రాజుల వద్ద పరిమితికి మించి ఉన్న భూమిని దశాబ్దాల కిందట ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానిని పేద గిరిజన రైతులకు పంచిపెట్టింది. ఇప్పుడు ఆ భూమి ధర కోట్ల రూపాయలు పలుకుతుండడంతో బొబ్బిలి రాజుల కన్నుపడింది. అంతే.. అధికారం అడ్డం పెట్టుకుని, రాజరికపు విలువలను పక్కన పెట్టి పేదల భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఓ ఎకరా భూమిని సొంతం చేసుకున్నారు. మిగిలిన భూమినీ లాక్కొనేందుకు ప్రయత్నిస్తుండడంతో గిరిజన రైతులు గగ్గోలు పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : పేద గిరిజన రైతులకు దానం చేసిన భూములు ఇప్పుడు కోట్ల రూపాయల ధర పలుకుతుండటంతో టీడీపీ మంత్రి కన్నుపడింది. కుతంత్రాలు చేసి వాటిని తిరిగి లాక్కున్నారు. ఆరు నెలల కిందట చేసిన ఈ ప్రయత్నం వెలుగులోకి రావడంతో గిరిజనుల్లో పార్టీకి చెడ్డపేరు వస్తోందంటూ పార్టీ జిల్లా నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా తను ఆ భూములను లాక్కోనని అప్పట్లో మం త్రి బహిరంగ సభలోనే వివరణ ఇచ్చుకున్నారు. తెరవెనుక ప్రయత్నాలు మాత్రం యథావిధిగానే సాగించారు. ఎకరా భూమి రూ.2 కోట్లు ధర పలి కే బొబ్బిలిలో ఎనిమిది ఎకరాలను ముందుగా ప్రభుత్వానికి స్వాధీనం చేయించి తర్వాత తన సొంతం చేసుకోవాలనే పన్నాగం రచించారు. ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసేందుకు బేరాలు సాగిస్తూ, ఇప్పటికే ఎకరా విక్రయించేశారు. ఇదీ పరిస్థితి... విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాతంలో నాలుగు దశాబ్దాల కిందట భూ పరిమితి చట్టం ప్రకారం మంత్రి కుటుంబీకుల వద్ద అదనంగా ఉన్న 166.50 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే వాస్తవానికి తాము ఇవ్వాల్సింది 158.50 ఎకరాలు మాత్రమేనని, సర్వే నెం.45లో సింహాలతోట ఎదురుగా ఉన్న ఎనిమిది ఎకరాలు అదనంగా ఇచ్చేశామని వారు వాదిస్తున్నారు. కానీ తాము సక్రమ మార్గం లో,నిబంధనల ప్రకారమే 166.50 ఎకరాలు స్వా« దీనం చేసుకున్నామని ప్రభుత్వం చెబుతూ వ స్తోంది. ఈ వివాదం తేలకముందే ఆ భూముల్లో కొన్నిటిని గొల్లపల్లి, మల్లంపేట, పనుకుపేట, పె దభోగిల, రామన్న అగ్రహారం గ్రామాల గిరిజన రైతులు,పేదలకు డి పట్టాలతో సహా ప్రభుత్వం పంచి పెట్టింది. వారికి పాసు పుస్తకాలు, భూ యాజమాన్య హక్కు పత్రాలు కూడా మం జూరు చేసింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కొంతమంది పేదలకు ఈ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చారు. ధర పెరగడంతో... ఈ ప్రాంతంలో ఇప్పుడు భూమి విలువ ఎకరా సుమారు రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్ల వరకూ పలుకుతోంది. దీంతో మంత్రికి ఆశపుట్టింది. వీటిని పేదల నుంచి లాక్కోవాలని పావులు కదిపారు. 32 మంది గిరిజనులకు నోటీసులు జారీ చేశారు. డి–పట్టా పొందిన తర్వాత మూడేళ్ల లోపు ఎలాంటి పంట సాగు చేయని కారణంగా భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామం టూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, పట్టా పొందిన వెంటనే ఆ భూ ముల్లో పంటలు పం డించామని, కొంతకాలం తర్వాత రెండు పంటల సాగుకు సాగునీరు లేకపోవడంతో వర్షాధార పంటలైన కందులు, మినుములు సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. రాజకీయ కుతంత్రం.. మంత్రి ప్రయత్నంపై విమర్శలు రావడంతో ప్రయత్నాన్ని విరమించినట్లు ప్రకటించినా చాపకింద నీరులా తన పని చేసుకుపోయారు. పట్టా దారుల నుంచి సమాధానం వచ్చే వరకూ వేచి చూడకుండా కొంత భూమిని తమ పేరున రాయించేసుకున్నారు. 247–2ఏలో 1.7ఎకరాలు మంత్రి పేరిట ఉంది. భూ బదలాయింపు అన్నది నోటిఫికేషన్ ద్వారా జరగాలి. ఇక్కడ అలా జరగలేదు. ఇందులో 247–2లో ఎకరా స్థలాన్ని టీచర్స్ సిండికేట్‌గా వ్యవహరించే రియల్ ఎస్టేట్ దారులకు విక్రయించేసినట్టు సమాచారం. ఆ తరువాత భూమిని పూర్తిగా రాజుల పేరున నేరుగా రాయించేందుకు బొబ్బిలిలో తహసిల్దార్‌గా పనిచేసిన బి.సుదర్శన దొరను పార్వతీపురం ఆర్డీఓగా నియమించేందుకు రాజు లు కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. స్వాధీనం చేసుకున్న భూ అమ్మకానికి తెర తీసినట్టు బోగట్టా. నాకు తెలియదు.. సర్వే నంబర్ 45లో 13 ఎకరాలు ప్రభుత్వం పేరిట ఉంది. ఇతర వివరాలేవీ నాకు తెలియదు. ఈ భూమిపై వివాదాలున్న విషయం కూడా ఎవరూ చెప్పలేదు. నేను ఈ మధ్యనే విధుల్లో చేరాను. ఇక్కడ పూర్తి స్థాయి తహసీల్లార్ లేరు. – ఆర్.సాయికృష్ణ, ఇన్చార్జి తహసీల్దార్, బొబ్బిలి కొండల్లోకి వెళ్తామా.. నాకు అప్పట్లో భూమి ఇచ్చారు. ఆ భూమిని చదును చేసుకుంటున్నప్పుడు అధికారులు వచ్చి అడ్డగించారు. ఆ భూమిని ఇప్పుడు తీసేసుకుని వేరే భూమి ఇస్తారని విన్నాం. మాకు భూమి ఎక్కడుందో అక్కడే కావాలి. వేరే కొండల్లో భూమి ఇస్తామంటే వెళ్తామా? మాకు న్యాయం కావాలి. – చల్ల సీతమ్మ, డీ–పట్టాదారు, పుల్లేరు వలస కొత్త తహసీల్దార్ వస్తే అప్పుడు చూద్దామన్నారు మా భూమి లాక్కుంటున్నట్టు తెలిసి అడిగేందుకు వెళ్లాం. మాతో బేబీ నాయన మాట్లాడారు. ఇప్పుడు తహసీల్దార్ లేరు. కొత్త తహసీల్దార్ వస్తే అప్పుడు మీకు భూమి ఎక్కడిస్తామన్నదీ చెబుతామన్నారు. ఆ తరువాత మరో మధ్యవర్తిని పెట్టారు. ఆ మధ్యవర్తి వద్దకు మరోసారి వెళ్తే పదేపదే రాకండి. నాకు ఎప్పుడు వీలయితే అప్పుడు మాట్లాడతామని ఆయన హెచ్చరించారు. మా భూమిని వదులుకోం. – ముంగి నర్సింహులు, డీ పట్టా యజమాని, పుల్లేరు వలస కోర్టు కెళ్తాం... మా భూములు సాగుకు మేం యత్నిస్తే రాజుల భూము లంటూ అప్పట్లో వీఆర్వో మమ్మల్ని అడ్డుకున్నారు. పాత తహసీల్దార్ సూర్యనారాయణ కూడా రాజుల భూమిగా చెప్పారు. దిబ్బగుడ్డివలçసకు చెందిన ఓ న్యాయవాది మా తరఫున మాట్లాడారు. కోటలోకి పిలిచి బేబీనాయన ( మంత్రి సుజయకృష్ణ రంగారావు సోదరుడు), ఆయన అనుచరులు ఏ భూమి? దేనికి వచ్చారు? అంటూ తెలియనట్టు మాట్లాడారు. మా భూములను మేం వదులుకోం. న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తాం. – చల్లాగోపాలం, డీ పట్టా భూమి వారసుడు, పుల్లేరువలస, బొబ్బిలి హైకోర్టులో పిల్ వేస్తాం.. డీ పట్టా దారులను వెళ్లగొట్టడం దారుణం. ఈ విషయాన్ని ఇప్పటికే సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశాం. ఇప్పుడు ఫైనల్‌గా హైకోర్టులో పిల్ వేస్తాం. భూ లగాన్‌లో మంత్రి కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై గిరిజనులకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం. – పోల అరుణ్‌కుమార్, న్యాయవాది, బొబ్బిలి -
టీడీపీ నేతలు భూమి కబ్జా చేశారు
ఒంగోలు వన్‌టౌన్ : ‘నాలుగు ఎకరాల మా సొంత భూమిని రెండు సంవత్సరాల నుంచి స్థానిక టీడీపీ నేతలు ఆక్రమణలో ఉంచుకున్నారు. అక్రమంగా మట్టి తవ్వి అమ్ముకుంటున్నారు. అడ్డగించిన నన్ను, నా భర్త వెంకటప్రసాద్‌పై నార్నె వెంకటేశ్వర్లు, అడుసుమల్లి శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు కత్తులతో దాడికి తెగబడ్డారు. మమ్మల్ని ప్రభుత్వ అధికారులు గానీ, నాయకులు గానీ పట్టించుకోవడం లేదు’ అని బోడెంపూడి శోభారాణి వైఎస్ జగన్ వద్ద చెప్పుకుంది. కూలి రూ. 150 లే అన్నా.. అద్దంకి వన్‌టౌన్: అద్దంకి మండలం అలవలపాడు గ్రామానికి చెందిన ఇటుక బట్టీల మహిళా కూలీలు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. తాము దర్శి, గంగవరం, కుంకుట్లపల్లి, బల్లికురవ కాకినాడల నుంచి వలస వచ్చి అలవలపాడు ఇటుక బట్టీల వద్ద కూలీ పని చేసుకుంటున్నామని తెలిపారు. సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఉండే ఇటుక బట్టీల పనిలో రోజుకు రూ. 150 కూలి మాత్రమే వస్తుందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఇటుక బట్టీలు కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపాలని కోరారు. -
బొండాగిరిలో రెవెన్యూ సిబ్బందికి ఉచ్చు
విజయవాడ: స్వాతంత్య్ర సమరయోధుని స్థలం కబ్జా వ్యవహారంలో బొండాగిరి ఒత్తిడికి తలొగ్గి చేసిన అవకతవకల్లో రెవెన్యూ సిబ్బంది మెడకు ఉచ్చుబిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అడంగల్స్ మార్పులో అధికార పార్టీ నేతల తీవ్ర ఒత్తిడి వల్ల రియల్ ఎస్టేట్ మాఫియా చెప్పినట్లు చేయటంతో రెవెన్యూ యంత్రాగం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో తహసీల్దార్ గురువారం నుంచి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. తొలుత నాలుగు రోజులు సెలవు పెట్టిన ఆయన సోమవారం నుంచి దీర్ఘకాలికంగా సెలవు పొడిగిస్తారని రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన కుమార్తె అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లినట్లు ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉండగా తహసీల్దార్ సెలవుపై వెళ్లడంతో అడంగల్స్‌లో పేర్లు మార్చిన కిందిస్థాయి సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ వ్యవహారంలో సర్వేయర్, వీఆర్ఓ, వీఆర్ఏ, ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దార్ భయంతో వణుకుతున్నారు. అడంగల్స్‌లో పేర్లు మార్చటం వల్లే బొండా అనుచరులు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు ఆస్కారం ఏర్పడిందని భావిస్తున్నారు. మ్యూటేషన్‌లో నిబంధనలకు పాతర మ్యూటేషన్ (అడంగల్‌లో పేర్లు మార్పు) చేసేటప్పుడు తాజా నిబంధనలు పరిగణలోకి తీసుకోలేదని వెల్లడైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దరఖాస్తులపై స్వాతంత్య్ర సమరయోధుని భూమికి సంబంధించి అడంగల్స్ మార్చటంలో నిబంధనలకు పాతరేసినట్లు విమర్శలు వస్తున్నాయి. 2016 వరకు స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణ ఆయన కుటుంబసభ్యుల పేరుతో అడంగల్స్‌లో ఉన్నాయి. ఆర్ఎస్ నెం.7/2 లో ఎ1.00 సెంట్లు భూమి కేశిరెడ్డి సూర్యనారాయణ పేరుతో, ఆర్ఎస్ నెం. 6/1లో ఎ.1.50సెంట్లు కేశిరెడ్డి సూర్యారాయణ కోడలు జోగా రత్నం పేరుతో అడంగల్స్ ఉన్నాయి. ఈ భూమిని 2016లో కృష్ణలంకకు చెందిన రామిరెడ్డి కోటేశ్వరరావు పేరున రెవెన్యూ అధికారులు మార్చారు. 1988లో నకిలీ డాక్యుమెంటు ఆధారంగా రెవెన్యూ అధికారులు రామిరెడ్డి కోటేశ్వరరావు పేరున అడంగల్స్ మార్చారు. అడంగల్స్ మార్చిన తరువాత ఆ భూమిని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరుడు రియల్టర్ మాగంటి బాబుకు కోటేశ్వరరావు డవలప్మెంట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూమి తనది కాదని తనకు తెలియకుండా మాగంటి బాబు మోసం చేసి డవలప్మెంట్ అగ్రిమెంటు తాను రాసినట్లు రిజిస్ట్రేషన్ చేయించాడని సీఐడీ అదికారులకు చెప్పాడు. స్వాతంత్య్ర సమరయోధుని భూమికి సంబంధించి ఆర్ఎస్.నెం.32లో ఎ.1.50 సెంట్లు, ఆర్ఎస్.నెం40లో ఎ.1.70సెంట్లు అబ్దుల్ మస్తాన్ పేరుతో కేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన భూమిని అడంగల్స్లోకి మార్చారు. తాడిగడపకు చెందిన అబ్దుల్ మస్తాన్ 1988లో స్వాతంత్య్ర సమరయోధుని కుటుంబం నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్ల సృష్టించారు. ఈ భూమిలో కొంత భాగం సెంట్రల్ ఎమ్మెల్యే భార్య బొండా సుజాత, వారి అనుచరుడు రియల్టర్ మాగంటి బాబులు డవలప్మెంట్ అగ్రిమెంటు రాయించుకున్నారు. సీఐడీ విచారణతో బొండా సుజాత ఆ అగ్రిమెంటును రద్దు చేసుకున్నారు. 1997 వరకు జీవో లేదు స్వాతంత్య్ర సమరయో«ధులకు కేటాయించిన భూమిని విక్రయించేందుకు 1997లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 1997కు ముందు అటువంటి భూములు క్రయవిక్రయాలు జరపాలంటే జిల్లా కలెక్టర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంది. బొండాగిరిలో 2016లో అడంగల్స్ పేర్లు మార్చేటప్పుడు కనీస నిబంధనలు పాటించకపోవటం గమనార్హం. మ్యూటేషన్ చేసేటప్పుడు అనుభవదారులుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధుని కుటుంబసభ్యులను కనీసం విచారించలేదు. 1988 నకిలీ డాక్యుమెంటు ఆధారంగా పేర్లు మార్చారు. ఆ డాక్యుమెంట్లు ఎంత వరకు సరైనవో చూడకుండా అడంగల్స్ ఇష్టారాజ్యంగా మార్చటం రెవెన్యూ అధికారుల మెడకు ఉచ్చు పడింది. -
పెడన మున్సిపాలిటీలో టీడీపీ నేతల భూకబ్జా
-
దేవుడు భుములు కబ్జా!
-
వైఎస్సార్ జిల్లాలో అధికార పార్టీ నేత కబ్జా
-
ఎంపీ నిమ్మల కిష్టప్ప మా భూమి కబ్జా చేశాడు
అనంతపురం సెంట్రల్ : హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తమ భూమిని కబ్జా చేశాడని, న్యా యం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని గోరంట్ల మండలం బూదిలి గ్రా మానికి చెందిన మల్లేçశప్ప, కదిరప్ప కుటుంబసభ్యు లు వాపోయారు. సోమవారం రెవెన్యూభవన్‌లో జ రుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతంకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కదిరప్ప, మల్లేసు కుటుం బసభ్యులు లక్ష్మీదేవి, హరీష్‌కుమార్, మీనాక్షి, కమ ల, దినేష్ మాట్లాడుతూ బూదిలి గ్రా మ పొలంలో స ర్వేనెంబర్ 476 లో 4.32 సెంట్లు, 3.30 సెంట్లు హిం దూపురం ఎంపీ నిమ్మలకిష్టప్ప కుమారులు నిమ్మల శిరీష్, నిమ్మల ఆమ్రేష్ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వివరించారు. రెవెన్యూ అధికారుల అండతో వెబ్‌ల్యాండ్‌లో తమ పే ర్లను తొలగించారని వారు ఆవేద న వ్యక్తం చేశారు. అలాగే ఆయన అనుచరులు చంపేస్తామని బెదిరి స్తున్నారన్నారు. భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీని ఇప్పించండి నగరంలో పాతూరులోని ప్రభాకర్స్కూల్, అబ్దుల్‌కలాం ఉర్దూ స్కూల్, కస్తూరిబా మున్సిపల్స్కూల్స్కు మధ్యాహ్న భోజన ఏజెన్సీ బాధ్యతలు ఇప్పించాలని అంబారపు వీధికి చెందిన జె.రమణమ్మ, జేసీ చలపతి దంపతులు ప్రజావాణిలో అధికారులకు విజ్ఞప్తి చేశారు. 12 సంవత్సరాలు ఏజెనీస నిర్వహిస్తున్నామని, ఇటీవల ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని వారు ఫిర్యాదు చేశారు. -
తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
♦ ప్రభుత్వ పాఠశాల స్థలం కబ్జా ♦ మరుగుదొడ్లు కూల్చివేసి పొలాల్లోకి రోడ్డు వేస్తున్న వైనం ♦ విమర్శలు గుప్పిస్తున్న గ్రామస్తులు తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. భావి భారత పౌరులను తయారు చేసే పాఠశాల స్థలంపై కన్నేశారు. అనుకున్నదే తడవుగా అక్కడ ఉన్న మరుగుదొడ్లు కూల్చివేశారు. ఆ స్థలంలో తమ పొలాలకు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనిపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అనంతపురం రూరల్ : అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. గతంలో పనిచేసిన కలెక్టర్ జనార్దన్‌రెడ్డి పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యం కోసం అదనంగా 1.17 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. పాఠశాలలో అభివృద్ధి పనుల కోసం రూ.7.5లక్షలతో ప్రణాళికలు పంపడంతో ప్రస్తుతం రూ.4.5 లక్షల నిధులు మంజూరుయ్యాయి. వాటితో పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. ప్రహరీ గోడ ఏర్పాటు చేస్తే తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి ఉండదనే స్వార్థంతో కొందరు తెలుగు తమ్ముళ్లు పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే జేసీబీల సాయంతో పాఠశాలలోని మరుగుదొడ్లను కూల్చివేశారు. పాఠశాల స్థలంలోనే రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లను కూల్చివేసి రోడ్డు ఎందుకు వేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలిజ ప్రశ్నిస్తే మా పొలాల్లోకి వెళ్లడానికి దారి ఏర్పాటు చేయాలని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన అనుమతితోనే మరుగుదొడ్లను కూల్చివేసి రోడ్డు వేస్తున్నామని సమాధానం ఇచ్చారు. అనుమతి పత్రాలు చూపాలని హెచ్ఎం కోరితే దాటవేస్తున్నారు. విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లు కూల్చివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల చర్యలను నీతిమాలినవిగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’ తహశీల్దార్ మహబూబ్‌బాషాను వివరణ కోరింది. రహదారి నిర్మించుకోవాలని ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పాఠశాల స్థలాన్ని పరిశీలించి ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల దర్జా కబ్జా
-
కబ్జాలు చేస్తే ఖబడ్దార్
సివిల్ వివాదం అనుకోవద్దు చట్టంలో అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులనూ వదలం సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు విజయవాడ సిటీ : భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కబ్జాదారుల పనిపట్టేందుకు చట్టంలో అన్ని రకాల ప్రొవిజన్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. సోమవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ..రాజధాని నేపథ్యంలో పెరిగిన భూముల ధరలను ఆసరాగా చేసుకుని నయా బ్రోకర్లు తయారయ్యారని చెప్పారు. ఏదో విధంగా వివాదం సృష్టించి కబ్జాకు పాల్పడడం..లేదంటే రాజీపేరిట డబ్బు గుంజడం చేస్తున్నారన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అవతారం ఎత్తినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఖాళీ భూములకు ఫోర్జరీ డాక్యుమెంట్లు, లేని భూములకు పట్టాలు సృష్టించి క్రయ విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించామన్నారు. ఇందుకు డాక్యుమెంటు రైటర్లు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. ఇటీవల కానూరులో జరిగిన భూ వివాదంలో ప్రభుత్వ ఉద్యోగులు సహా పలువురిపై చట్టపరంగా చర్యలు చేపట్టామన్నారు. ఓ మతిస్థిమితం లేని వృద్ధురాలి ఆస్తికి జీపీఏ తయారు చేసి విక్రయించిన వైనం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సివిల్ వివాదంగా పరిగణించి వదిలేస్తామనుకుంటే పొరపాటని, కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టంలో అన్ని అవకాశాలు ఉన్నాయనే విషయం గుర్తించాలని సీపీ హెచ్చరించారు. చిట్‌ఫండ్ సంస్థల్లో డిపాజిట్ చేయొద్దు.. రిజిస్టర్ చిట్‌ఫండ్ సంస్థల్లో చిట్స్ మాత్రమే వేయాలి తప్ప.. డిపాజిట్లు చేయరాదని పోలీసు కమిషనర్ సూచించారు. కేవలం చిట్స్ మాత్రమే నిర్వహించే సంస్థలు దివాళా తీయడం లేదని, అలా కాక డిపాజిట్లు సేకరించి ఇతర వ్యాపారాల్లో మదుపు చేసే సంస్థలు మాత్రమే మూతపడుతున్నాయన్నారు. 498(ఎ) కేసులపై ప్రత్యేక శ్రద్ధ వివాహ వ్యవస్థ అపహాస్యం కాకుండా మహిళల రక్షణను దృష్టిలో ఉంచుకొని వేధింపుల కేసు(సెక్షన్ 498(ఎ))ల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఏటా సగటున 1200 వరకు వేధింపుల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోయి 70శాతం మంది తప్పుడు కేసులు పెడుతున్నారని గుర్తించినట్టు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని సమాజనిర్మాణానికి, వ్యక్తిత్వ వికాసానికి కారణమైన వివాహ వ్యవస్థను ఛిన్నాభిన్నం కాకుండా చూడాలనేది తమ అభిప్రాయమన్నారు. నేరాల నియంత్రణపై చర్యలు నగరంలో ఆస్తి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్మాని తెలిపారు.సీసీఎస్‌లోని నేర నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కాలనీలు, రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ వద్ద నేరాలు జరిగే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇదే విధంగా నేరాలు జరిగే విధానాలపై పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి ప్రజల్లో అవగాహనకు కృషి చేస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో డీసీపీ(పరిపాలన) జి.వి.జి.అశోక్‌కుమార్, అదనపు డిసీపీ(క్రైం) యం.నాగేశ్వరరావు, ఎసిపి(సిసియస్) గుణ్ణం రామకృష్ణ, సెంట్రల్ టి.లావణ్యలక్ష్మీ పాల్గొన్నారు. సమస్యల నివారణ వ్యవస్థకు స్పందన నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది, అధికారుల శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి గత నెల 8వ తేదీన నెలకొల్పిన పోలీసు సమస్యల నివారణ వ్యవస్థ(పోలీసు గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్)కు మంచి స్పందన వచ్చిందన్నారు. పరిపాలనా డీసీపీ జి.వి.జి.అశోక్‌కుమార్ నేతృత్వంలో రూపొందించిన ఈ విధానం ద్వారా ప్రత్యేక ఫోన్ నంబర్‌కు 102మంది సంక్షిప్త సందేశాలు పంపగా, 94 సమస్యలను పరిష్కరించి తగిన సమాధానాలు పంపడం జరిగిందన్నారు. హెచ్ఆర్ఎ, జీపీఎఫ్, రుణాల మంజూరు, ట్రావెలింగ్ అలవెన్స్‌లు సహా ఇతర సమస్యల పరిష్కారానికి సిబ్బంది, అధికారులు కమిషనరేట్‌కు రాకుండానే యస్యంయస్ ద్వారా పరిష్కరించుకునేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తున్నట్టు తెలిపారు.