ఇల్లెందు: ప్రజాప్రతిఘటన పార్టీలో దళ కమాండర్‌గా పనిచేసిన తన తండ్రి బొల్లి రామయ్య అలియాస్ దేవన్న లొంగిపోతే పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు కాజేశారని, రెవెన్యూ అధికారులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నా రని దేవన్న కుమారుడు సాత్విక్ ఆరోపించాడు. తమ కుటుంబానికి న్యాయం చేయకుంటే నక్సలైట్‌గా మారుతానని చెప్పాడు.
శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సాత్విక్ విలేకరులతో మాట్లాడాడు. తన తండ్రికి ఇల్లెందు – ఖమ్మం రహదారిలోని సుభాష్‌నగర్ వద్ద 603 సర్వే నంబర్‌లో ప్రభుత్వం మూడు గుంటల భూమి ఇచ్చిందని చెప్పాడు. అయితే పట్టణానికి చెందిన రాము అనే వ్యక్తి తమ భూమితో పాటు పక్కనున్న 16 గుంటల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశాడని ఆరోపించాడు.
తన తండ్రి దేవన్న మృతిచెందడంతో దొంగ పత్రాలు సృష్టించారని, రెవెన్యూ అధికారులు సైతం ఆయనకే వత్తాసు పలుకుతున్నారని చెప్పాడు. తన తండ్రి ఆయుధం వదిలినందుకు సర్కారు ఇచ్చిన స్థలాన్ని తిరిగి ఆయుధం పట్టుకుని కాపాడుకుంటానని సాత్విక్ తెలిపాడు. దీనిపై ఇల్లెందు తహసీల్దార్ కృష్ణవేణిని వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో విచారణ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment