Satvik
-
న్యాయం చేయకుంటే నక్సలైట్‌గా మారుతా!
ఇల్లెందు: ప్రజాప్రతిఘటన పార్టీలో దళ కమాండర్‌గా పనిచేసిన తన తండ్రి బొల్లి రామయ్య అలియాస్ దేవన్న లొంగిపోతే పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు కాజేశారని, రెవెన్యూ అధికారులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నా రని దేవన్న కుమారుడు సాత్విక్ ఆరోపించాడు. తమ కుటుంబానికి న్యాయం చేయకుంటే నక్సలైట్‌గా మారుతానని చెప్పాడు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సాత్విక్ విలేకరులతో మాట్లాడాడు. తన తండ్రికి ఇల్లెందు – ఖమ్మం రహదారిలోని సుభాష్‌నగర్ వద్ద 603 సర్వే నంబర్లో ప్రభుత్వం మూడు గుంటల భూమి ఇచ్చిందని చెప్పాడు. అయితే పట్టణానికి చెందిన రాము అనే వ్యక్తి తమ భూమితో పాటు పక్కనున్న 16 గుంటల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశాడని ఆరోపించాడు. తన తండ్రి దేవన్న మృతిచెందడంతో దొంగ పత్రాలు సృష్టించారని, రెవెన్యూ అధికారులు సైతం ఆయనకే వత్తాసు పలుకుతున్నారని చెప్పాడు. తన తండ్రి ఆయుధం వదిలినందుకు సర్కారు ఇచ్చిన స్థలాన్ని తిరిగి ఆయుధం పట్టుకుని కాపాడుకుంటానని సాత్విక్ తెలిపాడు. దీనిపై ఇల్లెందు తహసీల్దార్ కృష్ణవేణిని వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో విచారణ చేస్తామని తెలిపారు. -
శ్రీచైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్య ఘటనపై స్పందించిన విద్యాశాఖ
-
నేడు ప్రైవేటు ఇంటర్ కాలేజీ యాజమాన్యాలతో సబిత భేటీ
సాక్షి, హైదరాబాద్/మణికొండ/ షాద్‌నగర్ రూరల్: ప్రైవేటు ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపక సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం భేటీ అవుతా రు. ఇంటర్, పోటీ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సమీక్షించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల మానసిక స్థితిగతులు, యాజమాన్యాల నుంచి విద్యార్థులకు మార్కుల కోసం వస్తున్న ఒత్తిడిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ విద్యాశాఖ కార్యదర్శి కరుణ హాజరవుతారు. సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర నివేదిక ఇటీవల నార్సింగ్ పరిధిలోని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ అధికారులను సబిత ఆదేశించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారి ప్రాథమిక నివేదిక అందజేశారు. విద్యార్థి తను చదువుతున్న కాలేజీలో కాకుండా, అదే కాలేజీకి చెందిన మరో క్యాంపస్‌లో మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. వేరే క్యాంపస్‌కు అతను ఎందుకు వెళ్లాడు? అతని అడ్మిషన్ ఎక్కడ? ఆత్మహత్యకు గల కారణాలపై సోమవారం సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి సాత్విక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఆస్పత్రిపై అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక సమర్పించారని మృతుడి తల్లిదండ్రులు నాగుల రాజు, అలివేలు ఆరోపించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం చేస్తే, గాం«దీలో చేసినట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని, తమ కుమారుడు అసలు శ్రీ చైతన్య కాలేజీలో చదవడం లేదని రిపోర్టు ఇచ్చి ఇచ్చారని ఆరోపించారు. ఆ నివేదికపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
శభాష్ సాత్విక్
సాక్షి, అమలాపురం: కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ప్రతిష్టాత్మక థామస్ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు కావడం పట్ల ఈ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్స్‌లో సాత్విక్.. చిరాగ్ శెట్టితో కలిసి ఆడాడు. గతంలో కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టు తరఫున బంగారు, రజత పతకాలు సాధించాడు. ఒలింపిక్స్‌లో పతకం త్రుటిలో చేజారింది. అయినా వెరవకుండా పలు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నాడు. సాత్విక్ విజయం పట్ల అమలాపురంలో పలువురు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. సాత్విక్ ఎదుగుదల వెనుక అతడి తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ పాత్ర కీలకం. కాశీ విశ్వనాథ్ పాఠశాలలో పీడీగా పని చేస్తూ హెచ్ఎంగా పదోన్నతి పొందాక రిటైరయ్యారు. పైగా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇదే క్రీడలో స్టేట్ రిఫరీగా పని చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ అమలాపురం ఆఫీసర్స్ క్లబ్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందారు. చిన్నవాడైన సాత్విక్ క్రీడను సీరియస్‌గా తీసుకుని రాణించాడు. 2015 నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మ్యాచ్ గెలుస్తానని అనుకోలేదు తొలి సెట్లో ఓడిపోయాం. రెండో సెట్లో 20–17 తేడాతో వెనుకబడ్డాం. ఆ సమయంలో ప్రత్యర్థులు చేసిన చిన్న తప్పిదం మాకు అనుకూలంగా మారింది. ఆ సెట్ గెలిచాం. అదే ఊపులో మూడో సెట్ కూడా గెలిచాం. నాన్న, అమ్మ ఆ సమయంలో తిరుపతిలో ఉన్నారు. స్వామి కరుణించారు. అందుకే కలలో కూడా ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను గెలిచాననే ఆనందం కన్నా భారత జట్టు విజయం సాధించడం రెట్టింపు సంతోషాన్నిస్తోంది. – సాత్విక్ చిన్నప్పటి నుంచీ ఆటపై మక్కువ సాత్విక్ నాలుగో సంవత్సరం నుంచే నాతో పాటు స్టేడియానికి వచ్చేవాడు. స్థానిక క్లబ్లో శిక్షణ శిబిరాలు నిర్వహించడం, నాతో పాటు అక్కడకు రావడం వల్ల సాత్విక్‌కు ఆటపై మక్కువ పెరిగింది. జిల్లా స్థాయిలో తొలిసారి అండర్–9కు ఎంపికయ్యాడు. అక్కడి నుంచి ఆరంభమైన కెరీర్ అంతర్జాతీయ స్థాయి వరకూ వెళ్లడం మాకు చాలా సంతోషాన్నిస్తోంది. మంచి క్రీడాకారుడవుతాడని ఆశించాను కానీ ఈ స్థాయిని ఊహించలేదు. థామస్ కప్ గెలవడం సాత్విక్ కెరీర్లో గొప్ప విజయంగా నిలిచిపోతుంది. మొదట్లో సాత్విక్‌తో కలిసి ఆడిన కృష్ణప్రసాద్ కూడా ఇప్పుడు గెలిచిన జట్టులో ఉండడం చాలా సంతోషాన్నిస్తోంది. – రంకిరెడ్డి కాశీవిశ్వనాథ్, సాత్విక్ తండ్రి ఆ మ్యాచ్ చూడలేదు సాత్విక్ ఆడిన ఫైనల్ మ్యాచ్ మేము చూడలేదు. ఆ సమయంలో మేమిద్దరం (సాత్విక్ తల్లిదండ్రులు) తిరుమలలో స్వామి వారి కల్యాణంలో ఉన్నాము. బయటకు రాగానే విషయం తెలిసింది. ఈ విజయం ఊహించలేదు. సాత్విక్ ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల తల్లిదండ్రులుగా చాలా ఆనందంగా ఉంది. దీనిని మాటల్లో వర్ణించలేం. భారత జట్టుకు అభినందనలు. కోచ్‌లకు, క్రీడాభిమానులకు కృతజ్ఞతలు. – రంకిరెడ్డి రంగమణి, సాత్విక్ తల్లి దటీజ్ కృష్ణప్రసాద్ థామస్ కప్ గెలిచిన షటిల్ బాడ్మింటన్ బృందంలో మరో ఆటగాడు కాకినాడకు చెందిన గరగ కృష్ణప్రసాద్ తండ్రి గంగాధర్ ప్రోద్బలంతో షటిల్ బ్యాడ్మింటన్‌లో ప్రవేశించాడు. గంగాధర్ గత డిసెంబర్లో అనారోగ్యంతో మృతి చెందారు. తన కొడుకును అంతర్జాతీయ క్రీడాకారునిగా తీర్చిదిద్దేందుకు ఆయన అహర్నిశలూ కృషి చేశారు. గంగాధర్ సైతం షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. గతంలో ఆంధ్రా యూనివర్సిటీ బ్యాడ్మింటన్ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. క్రికెట్లో సైతం రాణించారు. తండ్రి గంగాధర్‌తో కృష్ణప్రసాద్ తండ్రి బాటలోనే కొడుకు కృష్ణప్రసాద్ కూడా షటిల్ బ్యాడ్మింటన్‌లో రాణించడం విశేషం. కృష్ణప్రసాద్‌కు మొదటి నుంచీ పట్టుదల ఎక్కువ. సాత్విక్‌తో కలిసి పలు టోర్నీలు ఆడిన కృష్ణప్రసాద్ 2011లో గోపీచంద్ అకాడమీలో చేరాడు. తొలుత సింగిల్స్ ఆడిన కృష్ణప్రసాద్ 2015 నుంచి డబుల్స్‌పై దృష్టి పెట్టాడు. మూడేళ్లలోనే జూనియర్ డబుల్స్ విభాగం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎదిగాడు. 2019లో దక్షిణాసియా బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. తాజా విజయం పట్ల దటీజ్ కృష్ణప్రసాద్.. అంటూ ఈ ప్రాంత షటిల్ క్రీడాకారులు కొనియాడుతున్నారు. అందరికీ గర్వకారణం థామస్ కప్ సాధించిన భారత బ్యాడ్మింటన్ బృందంలో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్ గౌడ్ కూడా ఉన్నాడు. ఈ చరిత్రాత్మక గెలుపుపై ‘సాక్షి’ విష్ణువర్ధన్ గౌడ్ తల్లిదండ్రుల స్పందన కోరగా వారు తమ బిడ్డ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్ టీమ్ సాధించిన గెలుపు భారతీయులందరికీ గర్వకారణమన్నారు. గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది. మాది క్రీడా కుంటుంబం. ఓ క్రీడాకారుడిగా నా కుమారుడు ప్రపంచ కప్ గెలిచిన టీంలో ఉండడం గర్వంగా ఉంది. 73 ఏళ్ల తర్వాత ఈ క్రీడలో భారత్‌కు కప్ రావడం అందులో నా కుమారుడు ఉండడం అదృష్టం. – విష్ణువర్ధన్‌గౌడ్ తండ్రి వెంకటేశ్‌గౌడ్ సంతోషంగా ఉంది నా కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో ఆడి భారత దేశానికి కప్ తీసుకురావడం సంతోషంగా ఉంది. ఎంతో పట్టుదలతో శిక్షణ పొందాడు. కుటుంబమంతా అన్ని విధాలా అండగా అన్ని వేళలా ప్రోత్సహించాం. దానికి తగ్గ ఫలితం వచ్చింది. – విష్ణువర్ధన్‌గౌడ్ తల్లి సుహాసిని -
‘మా సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నందుకు హ్యాపీ’
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘బ్యాచ్’. నేహా పటాన్ హీరోయిన్. శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌లో సాత్విక్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి మంచి కథలో నటించే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నందుకు హ్యాపీ’’ అన్నారు. ‘‘సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు శివ. ‘‘మా సినిమాకు వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది’’ అన్నారు రమేష్. ‘‘ఈ సినిమాను 1000 థియేటర్స్‌లో విడుదల చేసి రమేష్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. హీరోహీరోయిన్లుగా బాగా చేశారు’’ అన్నారు నటుడు, సంగీతదర్శకుడు రఘు కుంచె. -
ఫైనల్లో సైనా, సమీర్ వర్మ
లక్నో: భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, సమీర్ వర్మ సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరితో పాటు పురుషుల డబుల్స్‌లో తెలుగబ్బాయి సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి–చిరాగ్ శెట్టి, మహిళల డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీలు కూడా తుదిపోరుకు అర్హత సాధించాయి. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సైనా 12–21, 21–7, 21–6తో రుసేలి హర్తవాన్ (ఇండోనేసియా)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సమీర్ వర్మ 21–13, 17–21, 21–8తో చికో ద్వి వార్దోయో (ఇండోనేసియా)పై గెలిచి ఫైనల్‌కు చేరాడు. దీంతో సమీర్ వర్మ ఏడాది ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. నేడు జరుగనున్న ఫైనల్లో ఆరో సీడ్ లూ గాంగ్జూ (చైనా)తో సమీర్... హాన్ యు (చైనా)తో సైనా తలపడనున్నారు. అదరగొట్టిన సాత్విక్, సిక్కి... పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 22–20, 25–23తో లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేతలు మథియాస్ బో–కార్స్టెన్ మోగెన్సన్ (డెన్మార్క్) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్ సెమీస్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 21–18, 21–16తో ఎకతెరీనా బొలోతోవా–అలీనా దవ్లెతోవా (రష్యా) జోడీపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లో సాత్విక్–అశ్విని ద్వయం ఓడింది. -
ముగిసిన భారత్ పోరు
బిల్బావో (స్పెరుున్): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్‌లో బరిలో మిగిలిన చివరి ఆశాకిరణం సాత్విక్ సారుురాజ్-కుహూ గార్గ్ ద్వయం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్-కుహూ జంట 21-13, 12-21, 19-21తో తాంగ్ జీ చెన్-ఈ వీ తో (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోరుుంది. -
పాముకాటుతో బాలుడి మృతి
నర్మేట మండలం తరిగొప్పుల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పడుకున్న సొంటెక్క సాత్విక్(6) అనే బాలుడిని పాము కాటేసింది. దీంతో తల్లిదండ్రులు బాలుడిని జనగాం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
మనీషా-సాత్విక్ జంటకు ‘మిక్స్డ్’ టైటిల్
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ముంబై: ఆద్యంతం నిలకడగా రాణించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కె.మనీషా-సాత్విక్ సాయిరాజ్ ద్వయం టాటా ఓపెన్ ఇండియన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ మనీషా-సాత్విక్ జంట 21-13, 21-16తో రెండో సీడ్ అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (భారత్) జోడిపై విజయం సాధించింది. శనివారం టాప్ సీడ్ జంటను బోల్తా కొట్టించిన మనీషా-సాత్విక్ అదే జోరును ఫైనల్లోను కనబరిచారు. సమన్వయంతో ఆడుతూ తమ ప్రత్యర్థికి ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. విజేతగా నిలిచిన మనీషా-సాత్విక్ జోడికి 1,185 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 79 వేలు)తోపాటు 4000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మనీషా కెరీర్లో ఇది రెండో అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ టైటిల్. గతంలో ఆమె నందగోపాల్‌తో కలిసి 2013లో మాల్దీవ్స్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో మనీషా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో మనీషా-సిక్కి రెడ్డి జంట 11-21, 21-15, 13-21తో టాప్ సీడ్ చలాద్‌చలమ్ చాయనిత్-ఫతైమాన్ మ్యున్‌వోంగ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో మనీషా రన్నరప్‌గా నిలవడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది మేఘనతో కలిసి ఫైనల్ ఆడిన మనీషాకు ఓటమి ఎదురైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. తన సోదరుడు సౌరభ్ వర్మతో జరిగిన ఫైనల్లో సమీర్ వర్మ 21-11, 21-18తో విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ (భారత్) జోడీ 14-21, 9-21తో వానవత్-ఇస్రియానాతె (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే విజేతలకు ట్రోఫీలను అందజేశారు.