
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘బ్యాచ్’. నేహా పటాన్ హీరోయిన్. శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌లో సాత్విక్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి మంచి కథలో నటించే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్.
సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నందుకు హ్యాపీ’’ అన్నారు. ‘‘సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు శివ. ‘‘మా సినిమాకు వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది’’ అన్నారు రమేష్. ‘‘ఈ సినిమాను 1000 థియేటర్స్‌లో విడుదల చేసి రమేష్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. హీరోహీరోయిన్లుగా బాగా చేశారు’’ అన్నారు నటుడు, సంగీతదర్శకుడు రఘు కుంచె.
Comments
Please login to add a commentAdd a comment