పాముకాటుతో బాలుడి మృతి
నర్మేట మండలం తరిగొప్పుల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పడుకున్న సొంటెక్క సాత్విక్(6) అనే బాలుడిని పాము కాటేసింది. దీంతో తల్లిదండ్రులు బాలుడిని జనగాం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.