
సాక్షి, విశాఖపట్టణం : నగరంలోని మధురవాడలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ గురువారం బీజపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సిట్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీని ఆశ్రయించి కబ్జాదారులు భూములను మింగేస్తున్నారని ఆరోపించారు. సిట్ ద్వారా ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములపై కూడా విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment