ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు దాడి చేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటికే ఆయన పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అంతేగాక తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు సదరు వ్యక్తులు ఆయనపై దాడికి యత్నించారని ఆరోపిస్తూ తాజాగా చిన్ని కృష్ణ శంకర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్, ముఖ్య అతిథిగా..
ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే చిన్ని కృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించారు. స్టార్ హీరోల సినిమాలకు కథలు అందించి ప్రముఖ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కథ అందించిన చిత్రాల్లో అల్లు అర్జున్ ‘గంగోత్రి’, బాలకృష్ణ ‘నరసింహనాయుడు’, చిరంజీవి ‘ఇంద్రా’ సినిమాలు ఉన్నాయి. అవి ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. వీటితో పాటు ఆయన మరిన్ని సినిమాలకు కూడా కథలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment