shankarpalli
-
కాసులు కురిపించిన మోకిలా.. ప్లాట్లకు మూడు రెట్ల ధర.. గజం రూ.1,05,000
సాక్షి, హైదరాబాద్: మోకిలాలోని హెచ్ఎండీఏ ప్లాట్లకు సోమవారం నిర్వహించిన ఆన్లైన్ వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. చదరపు గజం అత్యధికంగా రూ.1,05,000, కనిష్టంగా రూ.72,000 చొప్పున ధర పలికింది. సగటున రూ.80,397 చొప్పున ఆన్లైన్ బిడ్డింగ్‌లో విక్రయించినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. మొత్తం 50 ప్లాట్లపైన హెచ్ఎండీఏకు రూ.121.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ప్లాట్లకు చదరపు గజానికి రూ.25 వేల చొప్పున కనీసధర నిర్ణయించగా, దానికి మూడురెట్లు వేలంలో డిమాండ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. నార్సింగి–శంకర్పల్లి మార్గంలో ఉన్న మోకిలాలో భూములు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడం విశేషం. హెచ్ఎండీఏకు ఇక్కడ 165 ఎకరాల భూమి ఉంది. వీటిలో 15,800 చదరపు గజాల్లో విస్తరించి ఉన్న 50 ప్లాట్లకు సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా అధికారులు వేలం నిర్వహించారు. ఒక్కో ప్లాట్ 300 గజాల నుంచి 500 గజాల వరకు ఉంది. ఇటీవల కోకాపేటలో నియోపోలీస్ రెండో దశ భూముల తరహాలోనే మోకిలాలోనూ హెచ్ఎండీఏ ప్లాట్లకు భారీ డిమాండ్ రావడం గమనార్హం. ఈ లే అవుట్లో త్వరలో రెండోదశ ప్లాట్లకు కూడా ఆన్లైన్ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. చదవండి: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు -
ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఓల్డ్ నిజాంపేట్‌కు చెందిన దివ్య, ఆమె స్నేహితులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. చదవండి: కాజీపేటలో దారుణం.. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి -
బొలెరో వాహనం, బైక్ ఢీ..
శంకర్పల్లి: బొలెరో వాహనం బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగాపురం గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌కు చెందిన జలేందర్, నాగరాజు(34)లు సంగారెడ్డిలోని కనకదుర్గ చిట్‌ఫండ్‌లో కలెక్షన్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. శంకర్‌పల్లిలోని ఓ వ్యక్తి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు మధ్యాహ్నం బైక్‌పై శంకర్‌పల్లికి వస్తుండగా సింగాపురం శివారులో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, జలేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బొలెరో వాహనం వేగంగా ఉండటంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. బొలేరో డ్రైవర్ నావిద్ఖాన్(38) తీవ్రంగా గాయపడగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్ రైటర్
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు దాడి చేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటికే ఆయన పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అంతేగాక తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు సదరు వ్యక్తులు ఆయనపై దాడికి యత్నించారని ఆరోపిస్తూ తాజాగా చిన్ని కృష్ణ శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్, ముఖ్య అతిథిగా.. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే చిన్ని కృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించారు. స్టార్ హీరోల సినిమాలకు కథలు అందించి ప్రముఖ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కథ అందించిన చిత్రాల్లో అల్లు అర్జున్ ‘గంగోత్రి’, బాలకృష్ణ ‘నరసింహనాయుడు’, చిరంజీవి ‘ఇంద్రా’ సినిమాలు ఉన్నాయి. అవి ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. వీటితో పాటు ఆయన మరిన్ని సినిమాలకు కూడా కథలు అందించారు. -
తహశీల్దార్ కార్యాలయానికి అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: పుష్ప సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో సందడి చేశారు. శంకర్పల్లి మండలంలోని జన్వాడలో బన్నీ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం శుక్రవారం బన్నీ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ పనులు పూర్తి అయిన తరువాత ప్రొసీడింగ్ ఆర్డర్‌ను శంకర్పల్లి తహశీల్దార్ సైదులు బన్నీకి అందజేశారు. చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ అయితే ఎమ్మార్వో కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎమ్మార్వో సిబ్బంది, అభిమానులు బన్నీతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సైతం 6 ఎకరాల భూమి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా అదే శంకరపల్లి మండలంలో భూమిని కొన్నారు. చదవండి: ‘పుష్ప’లో అదిరిపోయే ఐటెం సాంగ్, బాలీవుడ్ భామ షాకింగ్ రెమ్యూనరేషన్! ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘ఫుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వరదలో కొట్టుకుపోయిన నవవధువు
-
ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లిన ఎన్టీఆర్.. ఆ భూమి కొనేందుకేనట!
Jr NTR: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రిజిస్ర్టేషన్ పనుల కోసం ఎన్టీఆర్ స్వయంగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఎన్టీఆర్‌తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తారక్‌తో సెల్ఫీలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్‌తో పాటు రామ్‌చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యారు తారక్. త్వరలోనే ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. -
చుట్టపుచూపుగా వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న మహిళ
సాక్షి, శంకర్పల్లి: అన్నదమ్ముల ఘర్షణలో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోకిల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట్ పెంటయ్య, భిక్షపతి అన్నదమ్ములు. వీరికి ఇంటి స్థలం విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. గ్రామ పెద్దలు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు వీరి ఇద్దరి మధ్య ఇటీవల రాజీ కుదిర్చారు. బుధవారం సాయంత్రం భిక్షపతి నిర్మిస్తున్న ఇంటిపై ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ఇటుక బయటకు విసిరారు. ఆ ఇటుక.. ఇంటి పక్కన కూర్చున్న పెంటయ్యపై పడింది. దీంతో తనను చంపడానికే భిక్షపతి ఇటుక వేశాడంటూ అతడు నానా గొడవ చేశాడు. విషయం తెలుసుకున్న పెంటయ్య కుమారులు శ్రీనివాస్, శ్రీకాంత్, పద్మారావు భిక్షపతిపై దాడికి దిగారు. దీంతో భిక్షపతి భార్య పద్మతో పాటు ఐదు నెలల గర్భిణి అయిన ఆమె మనుమరాలు లావణ్య(22)లు వచ్చి గొడవ ఆపేందుకు ప్రయత్నించారు. ఆ ఘర్షణలో లావణ్య కడుపుపై శ్రీనివాస్ తన్నడంతో ఆమె స్పహ తప్పి పడిపోగా శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు పేర్కొన్నారు. లావణ్య స్వగ్రామం శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామం కాగా.. పటాన్చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన సత్యంతో ఆమెకు వివాహమైంది. లావణ్య రెండు రోజుల కిందట అమ్మమ్మ ఇంటికి చుట్టపుచూపుగా వచ్చింది. బంధువుగా వచ్చిన ఆమె ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, ఈ ఘటనలో పెంటయ్య, శ్రీనివాస్, శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నామని, పద్మారావు పరారీలో ఉన్నాడని సీఐ గోపీనాథ్ తెలిపారు. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. భారీగా పోలీసుల మోహరింపు మృతురాలు లావణ్య స్వగ్రామం కొండకల్ నుంచి, అత్తవారు గ్రామం పెద్దకంజర్ల నుంచి గ్రామస్తులు, బంధువులు గురువారం మోకిలకు చేరుకోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: మృతదేహం మాయం: టీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముట్టడి -
కేసీఆర్‌ను కలిసిన దర్శకుడు శంకర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ దర్శకుడు ఎన్.శంకర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా స్టూడియో నిర్మాణం నిమిత్తం హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లిలో 5 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే విశాఖ శారదా పీఠానికి రెండెకరాలు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం 30 జిల్లాల్లో స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం జరిగింది. -
శంకర్‌పల్లితో వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధం
శంకర్పల్లి : శంకర్‌పల్లితో మాజీ ప్రధాని అటల్‌బిహరీ వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధం ఉంది. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో ఉన్న వాజ్‌పేయిని 1982 మార్చి 13న శంకర్పల్లి పట్టణ వ్యాపారస్తులు శంకర్‌పల్లికి పిలిపించుకొని తులాభార కార్యక్రమం నిర్వహించారు. వాజ్‌పేయ్ రాష్ట్ర పర్యటకు వచ్చినప్పుడు వ్యాపారులు పాండురంగం గుప్తా, మిర్యాల కాశీనాథం, దండు రాజేశ్వర్ గుప్తా, సాత ఆత్మలింగం, సాత విశ్వనాథం, సత్యనారాయణ, ప్రకాశ్‌గుప్తా, మిర్యాల సత్యనారాయణ, మిర్యాల కవిత, సుధా, నళిని, గార్లపాటి వీరేశం తదితరులు బంగారు లక్ష్మణ్ సహకారంతో వాజ్‌పేయిని శంకర్‌పల్లికి తీసుకొచ్చారు. మంచి వ్యక్తిత్వం గల మనిషిని సన్మానించాలని తీసుకువచ్చామని వ్యాపారులు తెలిపారు. శంకర్‌పల్లికి వచ్చిన ఆయనను ఘనంగా ఉరేగించి స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో తులాభారం నిర్వహించారు. రూపాయి నాణేలతో తులాభారం వేయగా వాజ్‌పేయి 82 కేజీలు తుగారు. మొత్తం రూ.10వేలను పార్టీ నిధికి విరాళం ఇచ్చారు. -
శిరీష హత్య కేసులో కొత్తకోణం
సాక్షి, శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలంలోని ప్రగతి రిసార్టులో జరిగిన శిరీష హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మజిద్ అనే యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సాయిప్రసాద్ స్వగ్రామమైన కొత్తూరు మండలం తిమ్మాపురం వాసిగా గుర్తించారు. మజీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సహకరించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. శిరీష, ఆమె ప్రియుడు సాయిప్రసాద్‌ను మజీద్ కారులోనే ప్రగతి రిసార్ట్స్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ హత్య కేసులో మొదట సాయిప్రసాద్ మాత్రమే నిందితుడని పోలీసులు భావించారు. అయితే హత్య అనంతరం సాయిప్రసాద్ కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయడంతో మజీద్ విషయం తెలిసింది. శిరీషను హత్య చేసిన అనంతరం నిందితుడు సాయి మొదటగా మజీద్‌కే ఫోన్ చేసి విషయం చెప్పినట్లు విచారణలో తేలింది. పోలీసులకు సమాచారం అందించకుండా మజీద్ అక్కడ నుంచి కారులో పారిపోయినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేశారు. మజిద్ నుంచి ఫోర్డ్ కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయిప్రసాద్, అదే మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన శిరీష(21) పరిచయస్తులు. గతంలో వీరు ప్రేమించుకున్నారు. అయితే, కొంతకాలంగా శిరీష సాయిప్రసాద్‌కు దూరంగా ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిప్రసాద్ ఆమెపై ఒత్తిడి తీసుకురాగా యువతి నిరాకరించింది. దీంతో అతడు శిరీషపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలని పథకం వేశాడు. గత గురువారం శంకర్పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్టులో ఆన్లైన్లో గది బుక్ చేశాడు. అయితే, పథకం ప్రకారం సాయిప్రసాద్ తనతో ఓ కత్తి తెచ్చుకున్నాడు. నిర్వాహకులు ఎలాంటి తనిఖీలు చేయలేదు. వారి గుర్తింపు కార్డులను సైతం చెక్ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గదిలోకి వెళ్లిన తర్వాత సాయిప్రసాద్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో శిరీష నిరాకరించింది. దీంతో అతడు కత్తితో ఆమె గొంతు కోసం చంపేశాడు. నిర్వాహకులు గుర్తించేసరికి పారిపోయాడు. అనంతరం పోలీసులు బృందాలుగా ఏర్పడి అతడిని మరుసటి రోజు చిలుకూరు చౌరస్తాలో పట్టుకొని కటకటాల వెనక్కి పంపారు. -
పెళ్లికి నిరాకరించిందని...
శంకర్పల్లి/చేవెళ్ల: తనను ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిగా మారి యువతిని దారుణంగా పొడిచి చంపేశాడు. తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కలకలం సృష్టించిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రగతి రిసార్ట్స్‌లో చోటు చేసుకుంది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ స్వామి, శంకర్పల్లి సీఐ శశాంక్‌రెడ్డితో కలసి డీసీపీ పద్మజ విలేకర్లకు కేసు వివరాలు వెల్లడించారు. ప్రేమగా మారిన పరిచయం.. కొత్తురు మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన పీర్లగూడెం శిరీష(21) డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇన్స్టిట్యూట్లో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయిప్రసాద్ ఎన్‌టీడీఎఫ్ కళాశాలలో డిప్లమా చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. శిరీషకు సాయిప్రసాద్ ఇంటర్లో సీనియర్. వీరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలకు తెలియడంతో శిరీష కుటుంబీకులు గతంలో యువకుడిని హెచ్చరిం చారు. ఇటీవల వీరి మధ్య మాటలు తిరిగి మొదల య్యాయి. తనను పెళ్లి చేసుకోవాలని తరచూ సాయి ప్రసాద్ శిరీషను అడిగేవాడు. ఆమె అంగీకరించక పోవడంతో శిరీష ఇతరులతో స్నేహంగా ఉంటోందని, మాట్లాడుతోందని, అందుకే తనను నిరాకరించిందని అనుమానం పెంచుకున్నాడు. హత్యకు గురైన శిరీష పథకం ప్రకారమే.. ఈ నేపథ్యంలో తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదని శిరీషను అంతం చేయాలని సాయి ప్రసాద్ నిర్ణయించుకున్నాడు. ఆమెతో ప్రేమగా ఉంటున్నట్టు నటించసాగాడు. గురువారం ఆన్లైన్ ద్వారా ప్రగతి రిసార్ట్స్‌లో కాటేజీ నంబర్ 11 బుక్ చేసిన సాయిప్రసాద్.. ఆమెను మభ్యపెట్టి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కారులో అక్కడికి తీసుకొచ్చాడు. కాటేజీలో పెళ్లి విషయంపై ఇరువురి మధ్యా వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో శిరీష బాత్రూమ్కి వెళ్లగా.. అదే అదునుగా భావించిన సాయిప్రసాద్ పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో లోపలికి వెళ్లి గొంతు కోసి చంపేశాడు. కుటుంబసభ్యులకు కాల్ చేసి.. అనంతరం తన చేతిని సైతం కోసుకున్న సాయిప్రసాద్.. కుటుంబీకులకు కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. ప్రగతి రిసార్ట్స్‌లో ఉన్నట్లు చెప్పడంతో కుటుంబీకులు వెంటనే రిసార్ట్స్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అయితే, అప్పటికే సాయిప్రసాద్ గదిలో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రూమ్ తెరిచి చూడగా శిరీష రక్తపు మడుగులోపడి ఉంది. ఘటనాస్థలంలో నిందితుడు ఉపయోగించిన కత్తి, ఇతర ఆధారాలను సేకరించారు. హత్య తర్వాత సాయిప్రసాద్ పారిపోవడంతో పోలీసులు మూడు టీమ్‌లుగా ఏర్పడి బాలాజీ టెంపుల్ రోడ్డు చౌరస్తాలో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సాయిప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. కాగా, శిరీష రిసార్ట్‌కు ఎప్పుడు వచ్చింది.. సాయిప్రసాద్‌తో పాటు మరెవరైనా ఉన్నారా అని ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
వాగు దాటుతున్న ఇసుక!
చేవెళ్ల/మొయినాబాద్ రూరల్: చేవెళ్ల డివిజన్ పరిధిలోని షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల నుంచి ఈసీ, మూసీ వాగులు ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివారులో ఉన్న హిమాయత్‌సాగర్, గండిపేటల్లోకి నీరు చేరుతుంది. వర్షాలు కురిసి వాగులు ప్రవహించినప్పుడు ఇసుక కూడా భారీగా వచ్చి చేరుతుంటుంది. ఇసుక అధికంగా ఉన్నచోట భూగర్భజలాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో మూసీ, ఈసీ వాగులు నాలుగైదు సార్లు నిండుగా ప్రవహిస్తే వేసవిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. సాగుతాగు నీటికి ఇబ్బంది ఉండదు. కాగా.. కొందరు అక్రమార్కులు ఈసీ, మూసీ వాగుల నుంచి తమ ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకను వాగు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక తరలింపుతో వాగుల్లో గుంతలు ఏర్పడి వర్షం కురిసినప్పుడు భూగర్భంలోకి నీరు ఇంకకుండా దిగువకు ప్రవహిస్తుంటుంది. అక్రమార్కుల ఇసుక వ్యాపారంతో జలసిరి పాతాళంలోకి పోతోంది. సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు.. ఈసీ, మూసీ వాగులు ప్రవహిస్తున్న షాబాద్ మండలంలోని నాగరగూడ, రుద్రారం, తాళ్లపల్లి, మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, అమ్డాపూర్, చిన్నమంగళారం, వెంకటాపూర్, అప్పోజీగూడ, మోత్కుపల్లి, శంకర్పల్లి మండలంలోని రావులపల్లి, పొద్దటూరు, ఫత్తేపూర్, మోకిల, టంగటూరు, గోపులారం, ఎల్వర్తి, జన్వాడ, తదితర గ్రామాల సమీపంలోంచి అక్రమార్కులు ఇసుక తరలిస్తున్నారు. నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1800-2200 వరకు దండుకుంటున్నారు. వాగుల్లో ప్రవాహం లేనప్పుడు అక్రమార్కులు ఇసుకను తరలించి డంప్ చేసుకుంటున్నారు. అక్రమార్కుల భరతం పట్టాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా అధికారులు కళ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాల్టా చట్టానికి తూట్లు.. ఇసుకను అక్రమంగా తరలిస్తే అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని వాల్టా చట్టం చెబుతోంది. ప్రభుత్వ అవసరాలకు మాత్రం సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని ఇసుక తరలించుకోవచ్చు. దీంతోపాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అధికారులు పర్మిట్లు జారీచేశారు. ఇదే అదనుగా అక్రమార్కులు అవసరానికి మించి ఇసుకను తరలించి డంప్ చేసుకున్నారు. -
ఉప్పొంగిన మూసీ
శంకర్పల్లి, న్యూస్‌లైన్: మండలంలోని ఫత్తేపూర్ వద్ద మూసీ వాగు ఉప్పొంగి ప్రవహించింది. ఈ ఏడాది ఇంత పెద్ద ఎత్తున సుమారు 12 గంటల పాటు ప్రవహించడం ఇదే మొదటిసారి. ఏకధాటిగా ప్రవహించడంతో జనజీవనం స్తంభించింది. వాహనాల రాకపోకలలు పూర్తిగా నిలిచిపోయాయి. హెలెన్ తుపాన్ ప్రభావంతో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మూసీవాగు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వంతెనపై నుంచి ప్రవాహం ప్రారంభమైంది. ఉద్ధృతి క్రమంగా పెరిగి ఉదయం 6 గంటల తర్వాత నీటి ప్రవాహం మరింత పెరుగుతూ వచ్చింది. వరద నీరు వికారాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఉద్ధృతంగా రావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ వరద ప్రవాహం కొనసాగింది. ఆ తర్వాత వరద ఉద్ధృతి తగ్గడంతో రాకపోకలు కొనసాగాయి. ఫత్తేపూర్ మూసీ నుంచి అర కిలోమీటర్ మేర వాగు ప్రవహించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సుమారు 12 గంటల పాటు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు చందిప్ప వరకే.. కంది-షాద్‌నగర్ లింకు రోడ్డు కావడంతో శంకర్పల్లి మీదుగా ప్రతి నిత్యం వందల లారీలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఆదివారం మూసీ వాగు ధాటికి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిం ది.పోలీసులు ముందు జాగ్రత్తగా లారీ లను పట్టణంలోకి రానీయకుండా కిలో మీటర్ దూరంలోనే నిలిపివేశారు. సుమారు 12 గంటల పాటు వందల లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చేవెళ్ల నుంచి శంకర్‌పల్లికి వచ్చే ఆర్టీసీ బస్సులు చందిప్ప వరకే రానిచ్చారు. మూసీవాగు ప్రవాహంతో అవతలి వైపు గ్రామల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడా ్డరు.కూరగాయలు,పాలు తీసుకువచ్చే రై తులు సుమారు 10 కిలో మీటర్ల దూరం పొద్దుటూర్ మీదుగా శంకర్‌పల్లికి చేరుకున్నారు.కాగా మూసీవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రజలు తిల కించడానికి ఫత్తేపూర్ వాగు వద్దకు వచ్చారు.