శంకర్‌పల్లి, న్యూస్‌లైన్: మండలంలోని ఫత్తేపూర్ వద్ద మూసీ వాగు ఉప్పొంగి ప్రవహించింది. ఈ ఏడాది ఇంత పెద్ద ఎత్తున సుమారు 12 గంటల పాటు ప్రవహించడం ఇదే మొదటిసారి. ఏకధాటిగా ప్రవహించడంతో జనజీవనం స్తంభించింది. వాహనాల రాకపోకలలు పూర్తిగా నిలిచిపోయాయి. హెలెన్ తుపాన్ ప్రభావంతో వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మూసీవాగు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వంతెనపై నుంచి ప్రవాహం ప్రారంభమైంది. ఉద్ధృతి క్రమంగా పెరిగి ఉదయం 6 గంటల తర్వాత నీటి ప్రవాహం మరింత పెరుగుతూ వచ్చింది. వరద నీరు వికారాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఉద్ధృతంగా రావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ వరద ప్రవాహం కొనసాగింది. ఆ తర్వాత వరద ఉద్ధృతి తగ్గడంతో రాకపోకలు కొనసాగాయి. ఫత్తేపూర్ మూసీ నుంచి అర కిలోమీటర్ మేర వాగు ప్రవహించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సుమారు 12 గంటల పాటు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆర్టీసీ బస్సులు చందిప్ప వరకే..
కంది-షాద్‌నగర్ లింకు రోడ్డు కావడంతో శంకర్‌పల్లి మీదుగా ప్రతి నిత్యం వందల లారీలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఆదివారం మూసీ వాగు ధాటికి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిం ది.పోలీసులు ముందు జాగ్రత్తగా లారీ లను పట్టణంలోకి రానీయకుండా కిలో మీటర్ దూరంలోనే నిలిపివేశారు. సుమారు 12 గంటల పాటు వందల లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చేవెళ్ల నుంచి శంకర్‌పల్లికి వచ్చే ఆర్టీసీ బస్సులు చందిప్ప వరకే రానిచ్చారు. మూసీవాగు ప్రవాహంతో అవతలి వైపు గ్రామల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడా ్డరు.కూరగాయలు,పాలు తీసుకువచ్చే రై తులు సుమారు 10 కిలో మీటర్ల దూరం పొద్దుటూర్ మీదుగా శంకర్‌పల్లికి చేరుకున్నారు.కాగా మూసీవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రజలు తిల కించడానికి ఫత్తేపూర్ వాగు వద్దకు వచ్చారు.
ఉప్పొంగిన మూసీ
Published Mon, Nov 25 2013 1:26 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement