
శంకర్‌పల్లి: బొలెరో వాహనం బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగాపురం గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌కు చెందిన జలేందర్, నాగరాజు(34)లు సంగారెడ్డిలోని కనకదుర్గ చిట్‌ఫండ్‌లో కలెక్షన్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు.
శంకర్‌పల్లిలోని ఓ వ్యక్తి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు మధ్యాహ్నం బైక్‌పై శంకర్‌పల్లికి వస్తుండగా సింగాపురం శివారులో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, జలేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బొలెరో వాహనం వేగంగా ఉండటంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. బొలేరో డ్రైవర్ నావిద్‌ఖాన్(38) తీవ్రంగా గాయపడగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment