
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ దర్శకుడు ఎన్.శంకర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా స్టూడియో నిర్మాణం నిమిత్తం హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లిలో 5 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే విశాఖ శారదా పీఠానికి రెండెకరాలు, అదేవిధంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల కోసం 30 జిల్లాల్లో స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment