N.Shankar
-
తోట బావిలో...
యాంకర్ రవి, గౌతమి జంటగా నటిస్తున్న చిత్రం ‘తోట బావి’. గద్వాల్ కింగ్ సమర్పణలో ఆలూర్ ప్రకాశ్‌గౌడ్ నిర్మించారు. అంజి దేవండ్ల దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేసి మాట్లాడుతూ– ‘‘రవిని చాలాకాలంగా టీవీలో చూస్తున్నాను. మంచి టైమింగ్ ఉన్న నటుడు’’ అన్నారు. ‘‘రవి ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు అంజి దేవండ్ల. ‘‘యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో మా దర్శకుడు సినిమాను ఇంట్రస్టింగ్‌గా తీశారు. మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకునిలా తీశారు’’ అన్నారు ప్రకాష్ గౌడ్. ఈ చిత్రానికి దౌలు, చిన్నస్వామి, అభిషేక్ .బి సహనిర్మాతలు. -
కేసీఆర్‌ను కలిసిన దర్శకుడు శంకర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ దర్శకుడు ఎన్.శంకర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా స్టూడియో నిర్మాణం నిమిత్తం హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లిలో 5 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే విశాఖ శారదా పీఠానికి రెండెకరాలు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం 30 జిల్లాల్లో స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం జరిగింది. -
అమెరికా వెళుతున్నాం!
సునీల్ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్. శంకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న సినిమా షూటింగ్ ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎన్. శంకర్ మాట్లాడుతూ – ‘‘అమెరికాలో మాగ్జిమమ్ సినిమా షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘2 కంట్రీస్’కి తెలుగు రీమేక్ ఇది. మన నేటివిటీకి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశాం. మలయాళ చిత్రానికి సంగీతం అందించిన గోపీసుందర్, తెలుగు చిత్రానికీ స్వరాలు సమకూరుస్తున్నారు’’ అని చెప్పారు. నరేశ్, షాయజీ షిండే, పోసాని కృష్ణమురళి, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, కళ: ఏఎస్ ప్రకాశ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: సి. రాంప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి రమణ. -
నమ్మబుద్ధి కావటం లేదు....
హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి మరణవార్తను నమ్మబుద్ధి కావటం లేదని దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్నారు. మారుమూల ప్రాంతం నుంచి స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి చక్రి అని శంకర్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి సంగీతాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలో ఇంత షాక్‌ను... ఎప్పుడూ ఫీల్ అవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు సంగీతంతో పాటు చక్రి మరోవైపు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని శంకర్ తెలిపారు. స్నేహానికి ప్రాణం ఇచ్చేవారని, స్నేహితులను ఎంతగానో ప్రేమించేవారని చెప్పారు. 'జై భోలో తెలంగాణ' చిత్రానికి చక్రి అందించిన సంగీతం ఎంతో ఆదరణ పొందిందని శంకర్ తెలిపారు. -
23 మంది జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాధులతో పాటు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 23 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఎన్.శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్‌అలీలు ఆదివారం తెలిపారు. పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి పత్రాన్ని సమర్పించామని, దానికి స్పందించి ఆయన పెన్షన్ మంజూరు చేస్తు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా 8మంది జర్నలిస్టుల చికిత్సకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కేటాయించిందని తెలిపారు.