అమెరికా వెళుతున్నాం! | Sunil Healthcare sets up unit in Mexico | Sakshi

అమెరికా వెళుతున్నాం!

Published Mon, Feb 13 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

అమెరికా వెళుతున్నాం!

అమెరికా వెళుతున్నాం!

సునీల్‌ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్‌ పతాకంపై ఎన్‌. శంకర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న సినిమా షూటింగ్‌ ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎన్‌. శంకర్‌ మాట్లాడుతూ – ‘‘అమెరికాలో మాగ్జిమమ్‌ సినిమా షూటింగ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మలయాళంలో సూపర్‌ హిట్టయిన ‘2 కంట్రీస్‌’కి తెలుగు రీమేక్‌ ఇది. మన నేటివిటీకి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశాం.

మలయాళ చిత్రానికి సంగీతం అందించిన గోపీసుందర్, తెలుగు చిత్రానికీ స్వరాలు సమకూరుస్తున్నారు’’ అని చెప్పారు. నరేశ్, షాయజీ షిండే, పోసాని కృష్ణమురళి, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్‌ సీపాన, కళ: ఏఎస్‌ ప్రకాశ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: సి. రాంప్రసాద్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కొర్రపాటి రమణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement