నమ్మబుద్ధి కావటం లేదు.... | Director N.shankar express shock over charki dies | Sakshi
Sakshi News home page

నమ్మబుద్ధి కావటం లేదు....

Published Mon, Dec 15 2014 8:55 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

నమ్మబుద్ధి కావటం లేదు....

నమ్మబుద్ధి కావటం లేదు....

హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి మరణవార్తను నమ్మబుద్ధి కావటం లేదని దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు.  ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్నారు. మారుమూల ప్రాంతం నుంచి స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి చక్రి అని శంకర్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి సంగీతాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు.


తన జీవితంలో ఇంత షాక్ను... ఎప్పుడూ ఫీల్ అవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు సంగీతంతో పాటు చక్రి మరోవైపు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని శంకర్ తెలిపారు. స్నేహానికి ప్రాణం ఇచ్చేవారని, స్నేహితులను ఎంతగానో ప్రేమించేవారని చెప్పారు. 'జై భోలో తెలంగాణ' చిత్రానికి చక్రి అందించిన సంగీతం ఎంతో ఆదరణ పొందిందని శంకర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement