అన్నయ్యకు హాస్పటల్ అంటే భయం.. | music director chakry dies, hema comments on his health | Sakshi
Sakshi News home page

అన్నయ్యకు హాస్పటల్ అంటే భయం..

Published Mon, Dec 15 2014 2:18 PM | Last Updated on Thu, Jul 25 2019 5:25 PM

అన్నయ్యకు  హాస్పటల్ అంటే భయం.. - Sakshi

అన్నయ్యకు హాస్పటల్ అంటే భయం..

హైదరాబాద్ : డాక్టర్లు, హాస్పటల్ అంటే  భయంతోనే చక్రి హాస్పటల్కు వెళ్లలేదని నటి హేమ అన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలని తాను చాలాసార్లు అన్నయ్యకు చెప్పేదాన్ని అని,... ఇదే విషయాన్ని వదిన (శ్రావణి)తో చాలాసార్లు అన్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల ఎర్రబస్సు ఆడియోలో కలిసినప్పుడు అన్నయ్యను హాస్పటల్ కి తీసుకు వెళుతున్నానని, సర్జరీ చేయిద్దామనుకుంటున్నట్లు... ఇకనుంచి గ్లామర్ గా కనిపిస్తారంటూ వదిన చెప్పిందని హేమ తెలిపారు.

చక్రి మరణవార్తను తాను నమ్మలేదని...ఈ విషయాన్ని సుమారు పదిమందికి ఫోన్ చేసి మరి నిర్ధారణ చేసుకున్నట్లు హేమ చెప్పారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని చక్రి కుటుంబ సభ్యులు చెప్పినా... రేపు వెళదామంటూ చెప్పారని ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవటం దురదృష్టకరమన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరమని హేమ అన్నారు.

నిజానికి సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో చక్రి ఓమాదిరిగా వుండేవాడు. అయితే ఆ తర్వాత ఆహార అలవాట్లలో మార్పు, సినీ పరిశ్రమలో తీరికలేని పనులు అతని శరీరంపై తీవ్ర ప్రభావం చూపించాయి. దానికి తోడు చక్రికి మంచి భోజనప్రియుడనే పేరుంది. అది కూడా తోడవడంతో తక్కువ కాలంలో బాగా లావయిపోయాడు.

లైపోసెక్షన్‌ లాంటి చికిత్స చేయించుకోవాలని భావించినా ఎందుకో భయపడ్డాడని అతని సన్నిహితులు చెప్తుంటారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా అర్ధరాత్రి వరకు రికార్డింగ్‌ పనుల్లో అతను బిజీగా వున్నట్లు తెలుస్తోంది. రికార్డింగ్‌ పూర్తయిన తర్వాత బాగా పొద్దుపోయిన సమయంలో ఇంటికి వచ్చి నిద్రపోయారు. అయితే నిద్రలోనే తీవ్రమైన గుండెపోటుకు గురై..తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement