heart attact
-
చప్పుడు విందాం.. చటుక్కున మేల్కొందాం! లేదంటే క్షణాల్లో ప్రాణాల మీదకు
చంద్రమౌళిరెడ్డి. వయస్సు 28 సంవత్సరాలు. ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగంలో స్థిరపడి పెళ్లికి సిద్ధమవుతున్న వేళ కార్డియాక్ అరెస్టుతో జీవితం అర్ధాంతరంగా ముగిసింది. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడైన చంద్రమౌళి మృతి ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. .. ఏది గుండెనొప్పి, ఏది కార్డియాక్ అరెస్టు.. కరోనా నేపథ్యంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది. వ్యాక్సిన్ వేసుకోవడమే ఇందుకు కారణమా? ఎంతో చురుకుగా వ్యాయామం చేస్తున్నా.. రోజువారీ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆహార నియమాలు పాటిస్తున్నా.. రేపటి మీద నమ్మకం కలగని పరిస్థితి. కొత్త వేరియంట్లతో సరికొత్త భయం ఉదయిస్తోంది. జిల్లా డెస్క్,కర్నూలు: కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తుమ్మినా.. దగ్గినా.. ఒంట్లో వేడి చేసినా.. మూలం కరోనాతో ముడిపడుతోంది. రోజుకో వార్త.. పూటకో ప్రచారం.. కరోనా రూపం మార్చుకోవడం ఏమో కానీ.. మనిషి ఆరోగ్యం మాత్రం దినదిన గండం అవుతోంది. చైనా మొదలుకొని.. మారుమూల పల్లె వరకు ఇప్పుడు ఇదే చర్చ. అసలేమవుతోంది.. ప్రపంచంలో ఏం జరుగుతోంది.. ఇలాంటి ఆలోచనలతో గుండె వేగం పెరుగుతోంది. ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా కార్డియాక్ అరెస్టు కొత్త ప్రశ్నలను తీసుకొస్తోంది. యువతను గందరగోళంలోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో గుండెవ్యాధుల నిపుణుల సలహాలు, సూచనలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పెద్దాసుపత్రితో గుండె పదిలం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో 10 ఐసీయూ, 20 జనరల్ వార్డు పడకలు ఉన్నాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ విభాగానికి కేథలాబ్ యూనిట్, హార్టింగ్ మిషన్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సేవలందిస్తున్నారు. ఈసీజీ, 2డి ఎకో పరీక్షలతో పాటు టీఎంటీ, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి స్టెంట్స్ సైతం ఇక్కడే వేస్తున్నారు. ఇక కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఈ విభాగం దాదాపు రూ.5 కోట్లతో ఆధునీకరించి 2016 జులైలో పునః ప్రారంభించారు. అత్యాధునిక మాడులర్ ఆపరేషన్ థియేటర్, పది పడకలున్న ఐసీయూ విభాగం కార్పొరేట్ స్థాయిలో సేవలందిస్తోంది. ఇప్పటివరకు అన్ని రకాల గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్సలు 600 దాకా నిర్వహించారు. తరచుగా గుండె పరీక్షలు ► 25 నుంచి 30 ఏళ్లలోపు వారు గుండెపోటు బారినపడటానికి ప్రధాన కారణం ధూమపానం, స్థూలకాయం. ► కుటుంబంలో ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చి ఉన్నా, తక్కువ వయస్సులో షుగర్ వచ్చినా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు అధికం. ► కోవిడ్‌కు గురైన వారిలో గుండెపోటు కేసులు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. ► కరోనా సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడిన వాళ్లు గుండె పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ► రక్తనాళాల్లో ఏవైనా సమస్యలుంటే అవసరమైన చికిత్స తీసుకుంటే గుండెపోటుకు గురికాకుండా చూసుకోవచ్చు. కార్డియాక్ అరెస్టు అంటే.. కార్డియాక్ అరెస్ట్ ఆకస్మికంగా వస్తుంది. శరీరంలో ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. సాధారణంగా గుండెలో ఏర్పడే అలజడితో పాటు అప్పటికే శరీరంలో ఉన్న ఇతర అనారోగ్య కారణాలు ఇందుకు తోడు కావడం. గుండె కొట్టుకోవడంలో సమతుల్యం దెబ్బతినడం, రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా మెదడు, గుండె, శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. ఫలితంగా కొద్ది క్షణాల్లోనే రోగి అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఎలాంటి వయస్సులోనైనా.. యువకుల్లోనే కాదు ఎవరిలోనైనా సడన్‌గా కార్డియాక్ అరెస్టు రావచ్చు. కరోనా వచ్చిన వారిలోనే కార్డియాక్ అరెస్టు అధికంగా ఉంటుందనే ప్రచారం అవాస్తవం. కార్డియాక్ అరెస్టుకు, గుండెపోటుకు సంబంధం లేదు. వీటిని ముందుగా గుర్తించడం కొద్దిగా కష్టం. ఈసీజీ, ఎకో పరీక్షల్లో కనిపించవు. ఎంఆర్ఐ, పెట్సా్కన్ చేసి నిర్ధారించవచ్చు. జిమ్ చేస్తున్న సమయంలో, తీవ్రమైన భావోద్వేగాలు, మానసిక ఆందోళన కారణంగా కరోనరి ధమనులు మూసుకుపోతాయి. దీనివల్ల సడన్‌గా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. 40 ఏళ్లలోపు వారే అధికం గుండె జబ్బు బారిన పడుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో వారానికి రెండు రోజులు ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 ఉంటోంది. నెలకు ఇన్‌పేషంట్లుగా 400 మంది దాకా చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోజుకు 20 మందికి పైగా రోగులు గుండెపోటు చికిత్స పొందుతున్నారు. 40 ఏళ్లలోపు వారే అధికం గుండె జబ్బు బారిన పడుతున్న వారిలో అధిక శాతం 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజి విభాగంలో వారానికి రెండు రోజులు ఓపీ ఉంటుంది. ప్రతి ఓపీ రోజున రోగుల సంఖ్య 250 నుంచి 300 ఉంటోంది. నెలకు ఇన్‌పేషంట్లుగా 400 మంది దాకా చికిత్స పొందుతున్నారు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోజుకు 20 మందికి పైగా రోగులు గుండెపోటు చికిత్స పొందుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి వ్యాయామం దినచర్యలో భాగం కావాలి. పనిలో శారీరక శ్రమ తప్పనిసరి. సైకిల్ తొక్కడంతో పాటు వాకింగ్ చేయాలి. గుండె జబ్బులకు ప్రధాన కారణాల్లో స్థూలకాయం ఒకటి. కొవ్వు శాతం అధికంగా ఉండే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పండ్లు, తాజా కూరగాయలకు భోజనంలో చోటు కల్పిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యోగా చేయడం ద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళనలను దరి చేయనీయకపోవడం ఉత్తమం. వ్యాక్సిన్ గుండెపై ప్రభావం చూపుతుందా? కరోనా వైరస్ నేరుగా గుండె కండరాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టేతత్వం ఎక్కువ అవుతుంది. దీంతో పాటు ఊపిరితిత్తుల్లో, ఇతర అవయవాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టవచ్చు. కాళ్లలో కొన్నిసార్లు రక్తం గడ్డకట్టి అది ఊపిరితిత్తుల్లో ఎక్కడైనా చేరవచ్చు. దీనివల్ల రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడి హార్ట్ ఎటాక్‌కు దారితీస్తుంది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నç³్పుడు కూడా గుండెపై ప్రభావం చూపుతుంది. కోవిడ్ వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం లేదు. హార్ట్ ఎటాక్ లక్షణాలు ఉదయం వేళల్లో ఎడమ దవడ కింది భాగంలో నొప్పి ప్రారంభమై పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత నొప్పి క్రమేపీ ఛాతీ వైపునకు, అక్కడి నుంచి ఎడమ భుజం, చేతి వేళ్ల వైపునకు వస్తుంది. కార్డియాక్ అరెస్టు లక్షణాలు గుండె పనితీరులో ఆకస్మిక తేడాతో స్పృహ కోల్పోవడం లేదా శ్వాసను కోల్పోవడం జరుగుతుంది. గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం, ఆ వెంటనే ఇతర అవయవాలకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. గుండె చప్పుడు ఆధారంగా చికిత్స హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రికి వచ్చిన రోగి గుండెచప్పుడును పరీక్షించి చికిత్స ప్రారంభిస్తాం. ముందుగా ధమనులలో అడ్డంకులు కరగడానికి, నొప్పి ఉపశమనానికి మందులు ఇస్తాం. అధిక రక్తపోటు ఉన్నట్లయితే అందుకు తగిన చికిత్స చేస్తాం. రక్తనాళాలలోని అడ్డంకులు, గుండె జబ్బు పరిధి, నొప్పి తీవ్రత, రోగి వయస్సు మీద ఆధారపడి అప్పటికప్పుడు నిర్ణయం ఉంటుంది. కరోనరీ యాంజియోప్లాస్టీ, బెలూన్ ఉపయోగించి రక్తనాళాలను విస్తరింపజేయడం లేదా కరోనరీ బైపాస్ సర్జరీ చేస్తాం. – డాక్టర్ ఎ.వసంతకుమార్, సీనియర్ కార్డియాలజిస్టు, కర్నూలు -
తీవ్ర విషాదం: గుండెపోటుతో మూడోతరగతి విద్యార్థి మృతి
సాక్షి, రాజన్న సిరిసిల్ల: దీపావళి పండుగను సంబరంగా జరుపుకొని మరునాడు పాఠశాలకు వెళ్లిన ఓ చిన్నారి గుండె అకస్మాత్తుగా ఆగింది. అప్పటిదాకా తోటి విద్యార్థులతో ఆడిపాడిన బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలి కన్నుమూశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వెంకట్రావుపల్లికి చెందిన బుర్ర కుషిత– సతీశ్ దంపతులకు కొడుకు కౌశిక్(9), కుమార్తె మేఘన ఉన్నారు. కౌశిక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో క్యూలైన్లో నిలుచుని ఉన్న కౌశిక్ హఠాత్తుగా కిందపడిపోయాడు. గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయుడి వాహనంలోనే కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కౌశిక్ అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. బాలుడు కొంతకాలంగా ఫిట్స్, గుండె సంబంధిత(హార్ట్ వీక్) వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కౌశిక్ మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. చదవండి: డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు -
భూమి పోతోందని.. పొలంలోనే గుండెపోటుతో రైతు మృతి
రామడుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ కాలువ లొల్లి మరొకరిని బలితీసుకుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లికి చెందిన మిట్టపల్లి రాధమ్మ(55)కు చెందిన పొలంతోపాటు షెడ్లు కాళేశ్వరం అదనపు కాలువ నిర్మాణంలో పోతున్నాయి. దీంతో రాధమ్మ మనోవేదనకు గురవుతోంది. ఈక్రమంలో ఎప్పటిలాగే సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లింది. గుండెపోటుకు గురై చనిపోయింది. గ్రామస్తులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. రాధమ్మ భర్త శివయ్య గత ఫిబ్రవరిలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వీరికి ముగ్గురు కుమారులు. వీరి భీవండిలో చేనేత పనులు చేస్తున్నారు. మృతదేహం వద్ద చొప్ప దండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం నివాళులర్పించారు. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10 రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఒంటెల రాఘవరెడ్డి మనోవేదనతో మృతి చెందారు. -
కుప్ప‘కూలి’న ప్రాణం
నంగునూరు (సిద్దిపేట): వడ్లు ఆరబెడుతున్న క్రమంలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురికాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా నంగుననూరు మండలం బద్దిపడగలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడ్లూరి రాములు (42)కు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. గ్రామానికి చెందిన దండ్ల ఎల్లయ్య తన చేనులో వరిపంట కోసే సమయం నుంచి అమ్మేంత వరకు కూలికి రావాలని రాములుకు చెప్పాడు. దీంతో వరి కోత అనంతరం కొనుగోలు కేంద్రం సమీపంలో రాములు వడ్లను ఆరబెడుతున్నాడు. గురువారం సాయంత్రం భార్యతో కలసి వడ్లు కుప్ప పోస్తున్న రాములు ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి రైతులు అంబులెన్స్‌లో సిద్దిపేటకు తరలిస్తుండగానే మృతి చెందాడు. -
Puneeth Rajkumar: ఆ ఇష్టమే రాజ్‌కుమార్‌కు కంటకంగా మారిందా?
Puneeth Rajkumar Death Reason: ఫిట్‌నెస్‌కు మారుపేరు పునీత్ రాజ్‌కుమార్. ఆయన చేసే కఠినమైన వ్యాయామ విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవి. ఫిట్ నెస్ కోసం ప్రాణం పెట్టి మరీ వర్కవుట్స్ చేస్తారు. వర్కౌట్ చేయపోతే ఆ రోజు వృథా అయినట్టే అనేది పునీత్ అభిప్రాయం. అంత ఫిట్‌గా ఉండే రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించడం విస్మయానికి గురిచేయడంతో పాటు పలు అనుమానాలకు దారితీసింది. ఫిట్నెస్ కోసం కఠిన వ్యాయామం చేయడమే పునీత్‌కు కంటకంగా మారిందా? వర్కౌట్లు, వ్యాయామంపై రాజ్‌కుమార్‌కు ఉన్న ఇష్టమే ఆయన ప్రాణం తీసిందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వ్యాయామం కోసం రాజ్‌కుమార్‌కు స్పెషల్‌గా ఒక జిమ్ సెంటర్ ఉంది. అందులో ఆధునిక వ్యాయామ సామగ్రిని అమర్చారు. నిత్యం ఒకటి రెండు గంటల పాటు అక్కడే గడిపేవారు. కరోనా సమయంలోనూ ఆయన వ్యాయామం చేయడం ఆపలేదు. ఆయన చేసి కఠినమైన వ్యాయామ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకసార్లు వైరల్ అయ్యాయి. ఫిట్‌నెస్‌పై ఆయనకు ఉన్న ఇష్టమే ప్రాణాలు తీసిందని, కఠిన వ్యాయామం చేయడమే పునీత్‌కు కంటకంగా మారిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే గుండెలోని రక్తనాళాలు చిట్లిపోవడం వల్లే పునీత్ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. జిమ్ సమయంలో కార్డియాక్ అరెస్ట్ జరిగి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. -
మృత్యువులోనూ వీడని పేగుబంధం
కరీమాబాద్: మృత్యువులోనూ తల్లీకొడుకులు పేగుబంధం వీడలేదు. అనారోగ్యానికి గురై గుండెపోటుతో కుమారుడు మృతిచెందగా.. ఆ మృతదేహం వద్ద రాత్రంతా ఏడ్చిన తల్లి సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందిన సంఘటన నగరంలోని వరంగల్ అండర్ రైల్వేగేట్ రంగశాయిపేటలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. బంధువులు, స్థానికుల కథనం ప్రకారం... నగరంలోని రంగశాయిపేటకు చెందిన ఆటో డ్రైవర్ కందగట్ల సూరన్న(53)కు గతంలో బైపాస్ సర్జరీ జరిగింది. ఈ క్రమంలో ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందడంతో బుధవారం ఉదయం వరకు కొడుకు మృతదేహం వద్ద ఏడ్చిన తల్లి కందకట్ల వెంకటలక్ష్మి(65) సొమ్మసిల్లి పడిపోయి తీవ్ర అస్వస్తతకు గురైంది. ఈ క్రమంలో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి వెంకటలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తిరిగి రంగశాయిపేటకు చెందిన అంబులెన్స్‌లో వెంకటలక్ష్మి మృతదేహాన్ని తీసుకొచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. రంగశాయిపేటలో విషాదం.. గుండెపోటుతో మృతి చెందిన కొడుకు సూరన్న, ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పడిపోయి తల్లి వెంకటలక్ష్మి కూడా మృతి చెందడంతో రంగశాయిపేటలో వి షాదఛాయలు అలుముకున్నాయి. ఓ పక్క కొడు కు మృతదేహాన్ని పాడెపై పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయగానే తల్లి కూడా మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తిరిగి ఆమె మృతదేహాన్ని కూడా పాడెపై పెట్టి బంధువులు, కుటుంబ సభ్యులు మోసుకెళ్తున్న దృశ్యం అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ లేవ లేనిస్థితిలో ఉన్న వెంకటలక్ష్మి భర్త సాంబయ్య దుఖాన్ని ఆపే శక్తి ఎవరికీ లేని పరిస్థితి ఏర్పడింది. -
కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నెహ్రూ–గాంధీల కుటుంబానికి విధేయుడిగా పేరొందిన గురుదాస్ కామత్(63) బుధవారం తీవ్రగుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో బుధవారం ఉదయం ఏడింటికి తీవ్రగుండెపోటుకు గురైన కామత్‌ను హుటాహుటిన చాణక్యపురి ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన వెంట కుటుంబసభ్యులు ఎవరూ లేరు. విషయం తెలియగానే ముంబై నుంచి కామత్ కొడుకుసహా కుటుం బమంతా ఆస్పత్రికి వచ్చిం ది. బుధవారం సాయంత్రం కామత్ పార్థివదేహాన్ని ముంబైకి తరలించారు. గురువారం ముంబైలో కామత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. న్యాయవాది నుంచి కేంద్ర మంత్రిదాకా.. వృత్తిరీత్యా న్యాయవాది అయిన కామత్ తొలుత ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతగా ఎదిగారు. ఇందిరా గాంధీ హయాంలో 1976 –80 వరకు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా చేశారు. 1987లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగానూ చేశారు. ముంబై నుంచి ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఆయన గతంలో హోం వ్యవహారాల సహాయ మంత్రిగా, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన గుజరాత్, రాజస్తాన్‌లలో పార్టీ సంక్షిష్ట సమయాల్లో, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్‌లలో పార్టీ వ్యవహారాలు చూసు కున్నారు. కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేపట్టాక గత కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ప్రముఖుల నివాళులు కామత్ మరణం వార్త తెలియగానే యూపీఏ చీఫ్ సోనియా గాంధీ ఢిల్లీలో ఆస్పత్రికి వచ్చి కామత్‌కు నివాళులర్పించారు. ‘సీనియర్ నేత కామత్ మరణం పార్టీకి తీరని లోటు. ముంబైలో కాంగ్రెస్ పునర్వైభవానికి ఆయన ఎంతగానో కృషి చేశారు’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాంగ్రెస్ నేత మల్లి కార్జున్ ఖర్గేలు కామత్ మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కామత్ గొప్ప పార్లమెం టేరియన్, సమర్థుడైన మంత్రి అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. మాస్ లీడర్ అయిన కామత్ ముంబైకర్ల సమస్యలపై పార్లమెంటు వేదికగా పోరాడేవారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. -
అమరనాథ్ యాత్రలో ఏపీ వాసి మృతి
సాక్షి, అమరావతి : అమరనాథ్ యాత్రలో ఏపీ వాసి దుర్మరణం పాలైయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామానికి చెందిన గన్నమని కోటేశ్వరరావు గుండెపోటుతో చనిపోయాడు. ఐదు రోజుల కిృతం స్నేహితులతో కలిసి అమరనాథ్ యాత్రకు వెళ్లారు. దర్శనం అనంతరం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలో గుండెపోటు రావడంతో కోటేశ్వరరావు మృతి చెందాడు. పార్థివ దేహం మంగళవారం రాత్రి విశాఖపట్నం చేరుకుంటుందని, బుధవారం ఉదయానికి అతని స్వగ్రామానికి చేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వరరావు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
భోజనం చేస్తూనే కుప్పకూలిన వైష్ణవ్
సాక్షి, హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ పుత్రశోకంతో తల్లడిల్లిపోయారు. ఏకైక కుమారుడు వైష్ణవ్(21) మంగళవారం అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు. రాత్రి 10.30 గంటల సమయంలో వైష్ణవ్ తన తండ్రి దత్తాత్రేయ, తల్లి వసంత, సోదరి విజయలక్ష్మీ కలసి ఇంట్లో భోజనం చేస్తున్నారు. వైష్ణవ్ ఒక్కసారిగా పక్కనే ఉన్న సోదరిపైన కుప్పకూలిపోయాడు. ఫిట్స్ వచ్చి ఉండవచ్చని భావించిన కుటుంబసభ్యులు వైష్ణవ్‌ను హుటాహుటిన ముషీరాబాద్ గురునానక్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ‘మీరు అవసరం లేదు, మేము చూసు కుంటాం’అని వైద్యులు దత్తాత్రేయకు నచ్చచెప్పి ఇంటికి పంపించేశారు. ఆసుపత్రికి వచ్చే సమయానికే వైష్ణవ్ పల్స్‌రేటు పూర్తిగా పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. అత్యవసర వైద్యసేవలను అందజేసినా గుండె స్పందించలేదు. తాత్కాలికంగా ఫేస్మేకర్ అమర్చినా ఎలాంటి స్పందన కనిపించలేదు. చివరకు వెంటిలేటర్ అమర్చారు. వైష్ణవ్‌ను కాపాడేందుకు 15 మంది వైద్యులు సుమారు 2 గంటలపాటు అన్ని విధాలుగా శ్రమించారు. అయినా అతన్ని కాపాడలేకపోయారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ‘సడెన్ కార్డియాక్ అరెస్టు’తో వైష్ణవ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఉదయం వరకు తెలియదు... కుమారుడు చనిపోయిన విషయాన్ని చెబితే పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించిన వైద్యులు ఉదయం వరకూ ఆ విషయాన్ని దత్తాత్రేయకు చేరవేయలేదు. తీవ్ర అనారోగ్యం, గుండె బలహీనతతో బాధపడుతున్న దత్తాత్రేయ సతీమణి వసంతకు కూడా కొడుకు చనిపోయిన సంగతి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. రెండు, మూడు రోజుల్లో ఆమెకు ఫేస్మేకర్ అమర్చాల్సి ఉంది. చివరకు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మరణవార్త చెప్పడంతో వెంటనే దత్తాత్రేయ, వసంత, ఇతర కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని కుమారుడి భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి వారిని ఓదార్చడానికి విఫలయత్నం చేశారు. ఉదయం 7 గంటలకు వైష్ణవ్ భౌతికకాయాన్ని రాంనగర్‌లోని నివాసానికి తరలించారు. అనంతరం దత్తన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంతి మయాత్ర సాగింది. మధ్యాహ్నం సైదాబాద్‌లోని ధోబీఘాట్ శ్మశానవాటికలో దత్తాత్రేయ చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగాయి. కుమారుడి కడసారి వీడ్కోలు సందర్భంగా దత్తాత్రేయతోపాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందొచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో దత్తాత్రేయ సతీమణి గర్భశోకంతో తల్లడిల్లింది. అంత్యక్రియలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖుల సంతాపం... దత్తాత్రేయ కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాంనగర్ వచ్చి వైష్ణవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. దత్తాత్రేయను ఓదార్చారు. కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, సంతోష్ గాంగ్వర్, పలువురు రాష్ట్ర మంత్రులు దత్తాత్రేయను పరామర్శించారు. సీఎం సంతాపం దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దత్తాత్రేయకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చక్రి'కి సినీ ప్రముఖుల నివాళి
-
అన్నయ్యకు హాస్పటల్ అంటే భయం..
హైదరాబాద్ : డాక్టర్లు, హాస్పటల్ అంటే భయంతోనే చక్రి హాస్పటల్‌కు వెళ్లలేదని నటి హేమ అన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలని తాను చాలాసార్లు అన్నయ్యకు చెప్పేదాన్ని అని,... ఇదే విషయాన్ని వదిన (శ్రావణి)తో చాలాసార్లు అన్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల ఎర్రబస్సు ఆడియోలో కలిసినప్పుడు అన్నయ్యను హాస్పటల్ కి తీసుకు వెళుతున్నానని, సర్జరీ చేయిద్దామనుకుంటున్నట్లు... ఇకనుంచి గ్లామర్ గా కనిపిస్తారంటూ వదిన చెప్పిందని హేమ తెలిపారు. చక్రి మరణవార్తను తాను నమ్మలేదని...ఈ విషయాన్ని సుమారు పదిమందికి ఫోన్ చేసి మరి నిర్ధారణ చేసుకున్నట్లు హేమ చెప్పారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని చక్రి కుటుంబ సభ్యులు చెప్పినా... రేపు వెళదామంటూ చెప్పారని ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకోవటం దురదృష్టకరమన్నారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరమని హేమ అన్నారు. నిజానికి సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో చక్రి ఓమాదిరిగా వుండేవాడు. అయితే ఆ తర్వాత ఆహార అలవాట్లలో మార్పు, సినీ పరిశ్రమలో తీరికలేని పనులు అతని శరీరంపై తీవ్ర ప్రభావం చూపించాయి. దానికి తోడు చక్రికి మంచి భోజనప్రియుడనే పేరుంది. అది కూడా తోడవడంతో తక్కువ కాలంలో బాగా లావయిపోయాడు. లైపోసెక్షన్ లాంటి చికిత్స చేయించుకోవాలని భావించినా ఎందుకో భయపడ్డాడని అతని సన్నిహితులు చెప్తుంటారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా అర్ధరాత్రి వరకు రికార్డింగ్ పనుల్లో అతను బిజీగా వున్నట్లు తెలుస్తోంది. రికార్డింగ్ పూర్తయిన తర్వాత బాగా పొద్దుపోయిన సమయంలో ఇంటికి వచ్చి నిద్రపోయారు. అయితే నిద్రలోనే తీవ్రమైన గుండెపోటుకు గురై..తుది శ్వాస విడిచినట్టు డాక్టర్లు చెప్తున్నారు. -
స్వర 'చక్రి'కి ప్రముఖుల నివాళి
-
సాయంత్రం పంజాగుట్ట శ్మశాన వాటికలో చక్రి అంత్యక్రియలు
హైదరాబాద్: సినీ సంగీత దర్శకుడు చక్రి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరగనున్నాయి. తొలుత ఆయన మృతదేహాన్ని ఇంటికి తరలించి అక్కడ్నుంచి ఫిల్మ్ చాంబర్ కు తీసుకువెళ్తారు. అనంతరం పంజాగుట్ట శ్మశాన వాటికలో చక్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోమవారం చక్రి (40) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయనకు అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1974 జూన్ 15న చక్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంభాలపల్లిలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాధ్ దర్శకత్వం వహించిన 'బాచీ' సినిమాతో..... టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సత్యం, ఢీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చక్రి ఆకస్మిక మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర ద్రిగ్భాంతికి గురైంది. -
సంగీత 'చక్ర'ధరుడు ఇకలేరు
-
చక్రి మృతికి స్థూలకాయమే కారణమా?
నలభై ఏళ్ళ చిన్న వయసులోనే సంగీత దర్శకుడు చక్రి కన్నుమూయడానికి కారణం ఏమిటి? వ్యక్తిగతంగా అందరితో స్నేహంగా వ్యవహరించే చక్రి తన ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టలేదా? సినీ వర్గాలు ఆ మాటే అంటున్నాయి. సినీ రంగానికి వచ్చిన తొలిరోజుల్లో పాతికేళ్ళ పైచిలుకు వయసులో ఆయన ముద్దుగా, బొద్దుగా ఉండేవారు. అయితే, క్రమంగా ఆహార విహారాల్లోని మార్పు, సినీ రంగంలో తీరిక లేని పనితో వేళాపాళా లేని జీవనవిధానం కొంత దెబ్బతీశాయని చెప్పవచ్చు. క్రమంగా అది స్థూలకాయానికి దారి తీసింది. భోజన ప్రియత్వం కూడా అందుకు తోడైంది. హిందీ చిత్రసీమలోని బప్పీలహరి లాగా చక్రి కూడా లావుగా తయారైనా, తనదైన ప్రత్యేక శైలి దుస్తులు, చేతికి లావాటి బంగారు గొలుసులతో వినూత్నంగా కనిపించేవారు. క్రమంగా ఆయన రూపంతో పాటు, ముఖం రంగులో కూడా కొంత మార్పు వస్తూ వచ్చింది. అయితే, అన్ని విధాలుగా తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చక్రి ఎప్పుడూ ఉత్సాహంగా చెప్పేవారు. లైపోసక్షన్ లాంటివి చేయించుకోవాలనుకున్నా, దుష్ఫలితాలు ఉంటాయేమోనని చక్రి బాధపడ్డారు. అయితే, శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ కావడం చివరకు ఆయనకు ప్రాణాంతకంగా పరిణమించినట్లు కనిపిస్తోంది. చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆదివారం కూడా అర్ధరాత్రి దాటే వరకు చక్రి తన రికార్డింగ్ పనుల్లో బిజీగా గడిపినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఇంటికి తిరిగొచ్చిన ఆయన నిద్ర పోయారు. ఆ నిద్రలోనే తీవ్రమైన గుండెపోటుకు గురై ఆయన కన్నుమూసినట్లు వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గించుకోవాలని గతంలో పలువురు సన్నిహితులు సలహా ఇచ్చినా, చివరకు అది చక్రికి ప్రాణాంతకంగా పరిణమించిందని భావించవచ్చు. -
నమ్మబుద్ధి కావటం లేదు....
హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి మరణవార్తను నమ్మబుద్ధి కావటం లేదని దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్నారు. మారుమూల ప్రాంతం నుంచి స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి చక్రి అని శంకర్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి సంగీతాన్ని అందించారని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలో ఇంత షాక్‌ను... ఎప్పుడూ ఫీల్ అవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు సంగీతంతో పాటు చక్రి మరోవైపు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని శంకర్ తెలిపారు. స్నేహానికి ప్రాణం ఇచ్చేవారని, స్నేహితులను ఎంతగానో ప్రేమించేవారని చెప్పారు. 'జై భోలో తెలంగాణ' చిత్రానికి చక్రి అందించిన సంగీతం ఎంతో ఆదరణ పొందిందని శంకర్ తెలిపారు. -
సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో మృతి
-
సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో మృతి
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను మరో విషాదం వెంటాడింది. సంగీత దర్శకుడు చక్రి (40) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చక్రి పూర్తి పేరు చక్రధర్ గిల్లా. 1974 జూన్ 15న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంభాలపల్లిలో జన్మించారు. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాధ్ దర్శకత్వం వహించిన 'బాచీ' సినిమాతో..... టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, సత్యం, ఢీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మ్యూజిక్‌లో తనకంటై ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చక్రి...... ఇప్పటివరకు దాదాపు 85 చిత్రాలకుపైగా సంగీతదర్శకత్వం వహించారు చక్రి. బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్రహీరోలతో పాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, తరుణ్, సుమంత్ లాంటి యువ హీరోలకు కూడా సంగీతమందించారు. వెంకటేష్, చిరంజీవి మినహా దాదాపు అందరి స్టార్లకు సంగీతాన్ని అందించిన ఘనత చక్రికే దక్కింది. స్టార్ హీరో రవితేజ సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ అందించారు చక్రి. పూరి జగన్నాథ్, చక్రి, రవితేజలది టాలీవుడ్లో హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి చిత్రాలు..... టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి.