
సాక్షి, అమరావతి : అమరనాథ్ యాత్రలో ఏపీ వాసి దుర్మరణం పాలైయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామానికి చెందిన గన్నమని కోటేశ్వరరావు గుండెపోటుతో చనిపోయాడు. ఐదు రోజుల కిృతం స్నేహితులతో కలిసి అమరనాథ్ యాత్రకు వెళ్లారు. దర్శనం అనంతరం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలో గుండెపోటు రావడంతో కోటేశ్వరరావు మృతి చెందాడు. పార్థివ దేహం మంగళవారం రాత్రి విశాఖపట్నం చేరుకుంటుందని, బుధవారం ఉదయానికి అతని స్వగ్రామానికి చేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వరరావు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.