pilgrim
-
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు
-
వైష్ణో దేవి యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి
జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ యాత్రికుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.పంచి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ బండరాళ్లు ఒక్కసారిగా కిందపడటంతో ఓవర్ హెడ్ ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతింది. సమాచారం అందుకున్న వైష్ణోదేవి ఆలయ బోర్డుకు చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.ప్రమాదంలో గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో వైష్ణో దేవి మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర సమయంలో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని సూచించారు. -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు.. మోదీ పేరుమీద మొదటి పూజ
డెహ్రాడూన్: భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తలుపులు ఈ రోజు ఓపెన్ చేశారు. ఆరు నెలల విరామం తరువాత ఆలయ తలుపులు తెరిచి పూజలు నిర్వహించారు. మొదటి పూజ ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద నిర్వహించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో ఆలయ తలుపులు తెరిచి భక్తులందరికీ స్వాగతం పలికారు. చార్ధామ్ తీర్థయాత్రకు బయలుదేరే వారందరికీ సురక్షితమైన, సంతృప్తికరమైన ప్రయాణం కోసం ప్రార్థనలు చేశారు.దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు, యాత్రికులు ఈ తీర్థ యాత్ర కోసం వేచి ఉంటారు. ఈ కారణంగానే చాలామంది భక్తులు పెద్ద ఎత్తున దర్శనం కోసం వచ్చారు. వారందరికీ నా శుభాకాంక్షలు సీఎం ధామి శుభాకాంక్షలు తెలిపారు.నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బాబా కేదార్ ఆలయ పునరాభివృద్ధికి సంబంధించిన పనులు మూడు దశల్లో జరుగుతున్నాయి, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి తాము కృషి చేస్తున్నట్లు ధామి పేర్కొన్నారు. చలికాలంలో ఆరు నెలల విరామం తరువాత దైవ దర్శనానికి ఆలయ తలుపు తెలిచారు. అయితే బద్రీనాథ్ ఆలయ తలుపులు మే 12న ఓపెన్ చేస్తారు.#WATCH | Rudraprayag: After the opening of the doors of Shri Kedarnath Dham temple, Uttarakhand CM Pushkar Singh Dhami says, "Devotees and pilgrims keep waiting for this Yatra. That holy day arrived day and the doors opened. Devotees have arrived here in large numbers. All… pic.twitter.com/dC50GyXSTC— ANI (@ANI) May 10, 2024 -
వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు
దేశంలోని చాలామంది తీర్థయాత్రలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తుంటారు. తమకు మంచి జరగాలని కోరుకుంటూ దేవాలయాలకు వెళ్లి, దేవుని దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వస్తున్న భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు యాత్రను కొద్దిసేపు నిలిపివేసింది. కొద్దిసేపటి తరువాత భక్తుల రద్దీని నియంత్రించి, దర్శనాలకు అనుమతినిచ్చింది. మాతా వైష్ణో దేవి ఆలయం జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో త్రికూట పర్వతంపై ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు! #WATCH | Reasi, J&K: Devotees throng the Holy Cave Shrine of Shri Mata Vaishno Devi temple in Katra pic.twitter.com/Z0R1fYy3Zj — ANI (@ANI) January 1, 2024 -
కేదార్నాథ్ యాత్రలో అపశ్రుతి.. సెల్ఫీ తెచ్చిన ముప్పు..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ యాత్రకు వెళ్తున్న ఓ వ్యక్తి నదిలో జారిపడ్డాడు. ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నక్రమంలో సెల్ఫీ తీసుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కేధార్నాథ్ యాత్ర మార్గమధ్యలోని రాంబాడ సమీపంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో మందాకిని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది మీదుగా యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అంతలోనే కాలు జారి నదిలో పడిపోయాడు. కొంచం దూరం కొట్టుకుపోయిన తర్వాత బండరాళ్లను పట్టుకుని ఆగిపోయాడు. Video: Kedarnath Pilgrim Slips Into River While Taking Selfie, Saved Later https://t.co/nvqy95fj1p pic.twitter.com/FeK21URcOY — NDTV (@ndtv) September 5, 2023 పరిస్థితిని గమనించిన స్థానికులు రంగంలోకి దిగారు. తాళ్లతో ఒకరినొకరు పట్టుకుని బాధితున్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భయానక దృశ్యాలను చూసి నెటిజన్లు భారీగా స్పందించారు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే..
ఇస్లాంలో హజ్ యాత్రను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇస్లాంను అనుసరించే ప్రతీఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని భావిస్తారు. ఇస్లాంను అనుసరించేవారు తప్పనిసరిగా ఐదు విధులు పాటించాలని ఆ మత పెద్దలు చెబుతారు. దానిలో ఒకటే హజ్ యాత్ర. మిగిలినవి కల్మా, రోజా, నమాజ్, జకాత్. ముస్లింలు తమ జీవితంలో వీటిని పాటించేందుకు ప్రయత్నిస్తారు. యాత్ర ఎన్నాళ్లు సాగుతుంది? ఇస్లాంను అనుసరిస్తున్న పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం 628వ సంవత్సరంలో తొలిసారి పాగంబర్ మొహమ్మద్ తన 1,400 మంది అనుచరులతో ఒక పవిత్ర యాత్ర చేశారు. ఇస్లాంను నమ్మేవారు దీనినే తొలి తీర్థయాత్రగా చెబుతారు.ఈ యాత్ర ద్వారానే పాగంబర్ ఇబ్రహీమ్ ఇస్లాం సంప్రదాయాలను పునరుద్ధరించారని అంటారు. తరువాతి కాలంలో దీనినే హజ్ అంటూ వచ్చారు. ప్రతీయేటా ప్రపంచంలోని ఇస్లాం మతస్థులు సౌదీ అరబ్‌లోని మక్కాకు హజ్ కోసం వెళుతుంటారు. ఈ పవిత్ర హజ్ యాత్ర 5 రోజులు కొనసాగుతుంది. ఈ యాత్ర ఈద్ ఉల్ అజహ అంటే బక్రీద్‌తో పూర్తవుతుందని చెబుతారు జిల్-హిజాలోని 8వ తేదీన.. ఈ యాత్ర అధికారికంగా ఎప్పుడు ప్రారంభవుతుందనే విషయానికి వస్తే ఇస్లాం మాసం జిల్-హిజాలోని 8వ తేదీన ప్రారంభమవుతుంది. ఇదే రోజున హాజీ మక్కా నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరాన ఉన్న మీనా పట్టణానికి వెళ్లారని చెబుతారు. అక్కడ హాజీ రాత్రంతా గడిపారని అంటారు. మర్నాడు హాజీ అరాఫత్ మైదానానికి చేరుకున్నారట. ఈ అరాఫత్ మైదానంలో నిలుచుని హజ్‌యాత్రికులు అల్లాను గుర్తుచేసుకుంటారు. తాము చేసిన తప్పులను మన్నించాలని వేడుకుంటారు. తరువాత సాయంత్రానికి సౌదీ అరబ్‌లోని ముజదల్ఫా పట్టణం చేరుకుంటారు. రాత్రంతా అక్కడే ఉంటారు. మర్నాటి ఉదయం మీనా పట్టణానికి చేరుకుంటారు. హజ్‌యాత్రలో ముస్లింలు ఏం చేస్తారంటే.. హజ్ యాత్రకు వెళ్లిన ముస్లింలు ఒక విధానాన్ని ఫాలో అవుతారు. బీబీసీ రిపోర్టును అనుసరించి ముందుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హజ్ యాత్రికులు ముందుగా జోద్దా పట్టణంలో కలుసుకుంటారు. సరిగ్గా మక్కాకు ముందుగా ఉన్న ఒక ప్రాంతం నుంచి అధికారికంగా యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాన్ని మీకత్ అని అంటారు. ఈ ప్రాంతం మక్కాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అహ్రమ్, ఉమ్రాలకు ఎంతో ప్రాధాన్యం హజ్‌కు వెళ్లిన యాత్రికులంతా మీకత్కు చేరుకోగానే ఒక తరహా దుస్తులు ధరిస్తారు. దీనిని అహ్రమ్ అని అంటారు. అయితే కొందరు యాత్ర ప్రారంభించినది మొదలు అహ్రమ్ ధరిస్తారు. ఇది తెలుపు రంగు కలిగిన వస్త్రం. దీనిని సూదితో కుట్టరు. ఉమ్రా విషయానికొస్తే మక్కా చేరుకున్న ప్రతీ ముస్లిం తప్పనిసరిగా ఉమ్రా పాటించాల్సి ఉంటుంది. ఉమ్రా అనేది ఇస్లాంలోని ప్రముఖ ధార్మిక ప్రక్రియ. ఇది కేవలం హజ్ మాసంలోనే కాకుండా సంవత్సరం పొడవునా ఎప్పుడైనా చేయవచ్చు. అయితే చాలామంది హజ్‌యాత్రకు వెళ్లినప్పుడు ఉమ్రాను తప్పకుండా ఆచరిస్తారు. -
వనం చేరిన తల్లులు
సాక్షిప్రతినిధి, వరంగల్: నాలుగు రోజులపాటు లక్షల మంది భక్తులను ఆశీర్వదించిన వనదేవతలు జనం నుంచి వనంలోకి వెళ్లారు. మేడారంలో గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను పూజారులు వనంలోకి తీసుకెళ్లారు. ఈ ఘట్టంతో మేడారం మహా జాతర ముగిసింది. జనసంద్రమైన అడవులు మళ్లీ మామూలుగా మారాయి. కిక్కిరిసిన భక్తులతో కాలు కదిపేందుకు వీలుగాని గద్దెల ప్రాంతం ఖాళీ అయ్యింది. ఆదివాసీ వాయిద్యాలు, సంప్రదాయాలతో పూజారులు (వడ్డెలు) శనివారం సాయంత్రం ఆరుగంటలకు వనప్రవేశ ప్రక్రియను ప్రారంభించారు. ఉద్విగ్నంగా ఈ ఘట్టం సాగింది. జాతర చివరి రోజు దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆఖరి రోజున భారీగా జనం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవతల వనప్రవేశం తర్వాత సైతం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీర, సారె, బంగారం, పసుపు కుంకుమలను మేడారం వాసులు తీసుకున్నారు. దేవతల ప్రసాదాన్ని(బెల్లం) తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దీంతో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. దర్శనాల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన తర్వాత దేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభించారు. గోవిందరాజును దబ్బగట్ల గోవర్ధన్, పొదెం బాబు నేతృత్వంలోని పూజారుల బృందం మేడారం గద్దెల నుంచి 7:20 తరలించారు. వీరు అర్ధరాత్రి ఏటూరునాగారం మండలం కొండాయికి చేరుకున్నారు. అనంతరం 7:18 గంటలకు సమ్మక్కను గద్దెల నుంచి తరలించారు. కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్ నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించి సమ్మక్కను అక్కడి నుంచి కదిలించింది. గద్దెల సమీపంలోని ఎదుర్కోళ్ల ప్రదేశం వద్ద మేక బలితో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సమ్మక్కను చిలకలగుట్టకు చేర్చారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును7:20 గంటలకు వడ్డెల నేతృత్వంలోని పూజారుల బృందం మేడారం నుంచి కొత్తగూడ మండ లం పూనుగొండ్లకు వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం వీరు గమ్యాన్ని చేరుకోనున్నారు. మేడారం గద్దెపై ఉన్న సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, సోలం వెంకటేశ్వర్లు నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మెంటె (వెదురు బుట్ట) ను 7:21 గంటలకు తీసుకుని జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. దేవతల వనప్రవేశంతో మేడా రం మహా జాతర అధికారికంగా ముగిసింది. కాగా, వచ్చే బుధవారం మేడా రం పూజారులు చేసే తిరుగువారం పండుగతో మహా జాతర అంకం పరిసమాప్తమవుతుంది. మేడారం రావడం సంతోషంగా ఉంది: గవర్నర్ మేడారంలో సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మేడారం చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే సీతక్క పుష్పగుచ్ఛంతో ఆమెకు స్వాగతం పలికారు. తర్వాత గవర్నర్ నిలువెత్తు బంగారాన్ని తల్లుల కు సమర్పించుకున్నారు. అనంతరం పట్టువస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకున్నట్లు తెలిపారు. కాగా, గవర్నర్ రాకకు కొద్దిముందే.. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ కృష్ణాదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి.. మేడారం జాతర విజయవంతమైనట్టు ప్రకటించారు. గవర్నర్ వచ్చే సమయానికి వీరు లేరు. దీంతో జేసీ ఒక్కరే స్వాగతం పలికారు. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: బండి సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విషయంలో ప్రొటోకాల్ పాటించకుండా ఘోరంగా అవమానించినందుకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేడారంలో మంత్రులు, అధికారులెవరూ గవర్నర్ కార్యక్రమానికి హాజరుకాలేదని ఆరోపించారు. -
దక్షిణ కాశీగా పేరు.. కన్నడిగులతో కిక్కిరిస్తున్న కోవెల.. ఎక్కడంటే?
వైఎస్ఆర్ జిల్లా(సంబేపల్లె): దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ వీరభద్రస్వామి రాచవీడు రేడుగా విరాజిల్లుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి పట్టణ నడిబొడ్డున 11వ శతాబ్దంలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రాలయం నెలకొని దినదినాభివృద్ధి చెందుతోంది. 8వ శతాబ్దపు రాజరాజచోళుడు, 11వ శతాబ్దపు కాకతీయ గణపతిదేవుడు, శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్ర అభివృద్ధికి బాటలు వేసినట్లు శాసనాలు చెబుతున్నాయి. వీరభద్రస్వామి వీరశైవులకు ఇలవేల్పుగా వెలుగొందుతున్నారు. ఈ ఆలయంలో ప్రతి యేటా మాఘమాస బహుళ ఏకాదశి నుంచి స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి స్థానిక భక్తులతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా వస్తుంటారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన అగ్నిగుండప్రవేశం, మహానైవేద్యం, రథోత్సవం కార్యక్రమాలు కీలకం. అంతేకాకుండా ప్రతి అమావాస్య నాడు కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటుంటారు. 1980లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో కొన్ని అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీరభద్రాలయానికి పశ్చిమాన రాజగోపురం నిర్మాణంతో పాటు సాలహారం నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.58 కోట్లను మంజూరు చేయించగా మరో రూ.38 లక్షలతో విమాన గోపురం, గర్భాలయ అభివృద్ధి పనులను చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల రాకను దృష్టిలో ఉంచుకున్న వీరభద్రాలయ అధికారులు ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేసి బస సౌకర్యాలను కల్పిస్తున్నారు. చదవండి: శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం -
అమరనాథ్ యాత్రలో ఏపీ వాసి మృతి
సాక్షి, అమరావతి : అమరనాథ్ యాత్రలో ఏపీ వాసి దుర్మరణం పాలైయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి గ్రామానికి చెందిన గన్నమని కోటేశ్వరరావు గుండెపోటుతో చనిపోయాడు. ఐదు రోజుల కిృతం స్నేహితులతో కలిసి అమరనాథ్ యాత్రకు వెళ్లారు. దర్శనం అనంతరం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలో గుండెపోటు రావడంతో కోటేశ్వరరావు మృతి చెందాడు. పార్థివ దేహం మంగళవారం రాత్రి విశాఖపట్నం చేరుకుంటుందని, బుధవారం ఉదయానికి అతని స్వగ్రామానికి చేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటేశ్వరరావు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
తీర్థయాత్రా స్పెషల్
రాజమహేంద్రవరం సిటీ: కార్తికమాసంలో పంచారామాలు, శ్రీశైలం తీర్థయాత్రలకు, నవంబర్‌లో శబరిమల వెళ్లే భక్తుల కోసం 490 ప్రత్యేక బస్ సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక సర్వీసులకు నిర్ణయించిన ధరల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. నవంబరు 23, 29 తేదీలలో శబరిమలకు 4 రోజులు, 5 రోజుల తీర్థయాత్ర ప్యాకేజీతో సూపర్ లగ్జరీ బస్సులు సిద్ధం చేసామన్నారు. 4 రోజుల ప్యాకేజీలో విజయవాడ, తడ బైపాస్, తేనేగాటి, శబరిమల ఉంటాయని, ధర రూ.3500 అని చెప్పారు. 5 రోజుల యాత్రలో కాణిపాకం, ఎరుమేళి, శబరిమల, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం ఉంటాయని, ధర రూ.3800గా నిర్ణయించామన్నారు. గత ఏడాది 22 బస్సులు నడపడం ద్వారా రూ.29 లక్షల ఆదాయం గడించగా ఈ ఏడాది 60 బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఆదాయంలో తూర్పు రీజియన్‌కు అగ్రస్థానం.. ఆరు నెలల కాలంలో ఆర్టీసీలో తూర్పురీజియన్ రూ.9.83 కోట్ల రాబడి సాధించి రాష్ట్రవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిందని ఆర్ఎం చెప్పారు. రీజియన్ చరిత్రలో ఇంత ఆదాయం సాధించడం ఇదే మొదటి సారన్నారు. దసరాకు గత ఏడాది 610 ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ.1.18 కోట్లు ఆదాయం సాధించామని, ఈ ఏడాది 925 బస్సులను నడిపి రూ.రెండు కోట్లు సాధించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్ టి.పెద్దిరాజు, అసిస్టెంట్ మేనేజర్ కుమార్, ప్రత్యేక బస్సుల నిర్వహణాధికారి బాషా, పీఆర్ఓ రాజబాబు పాల్గొన్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండల వాడి దర్శనానికి ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారిని 69,317 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.38 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం సులువుగా లభిస్తోంది. గురువారం ఉదయం సమయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, కాలి నడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా శీఘ్రంగానే లభిస్తోంది. -
అమరనాథ్ యాత్రలో గుండెపోటు మరణాలు!!
శ్రీనగర్ః అమరనాథ్ యాత్రలో గుండెపోటు మరణాలు రాను రాను పెరుగుతున్నాయి. గుండెపోటుతో షెర్ ఇ కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్ కె ఐ ఎమ్ ఎస్) లో చేరిన ఓ యాత్రికుడు చికిత్స పొందుతూ ఈ రోజు మరణించడంతో యాత్రలో గుండెపోటు మరణాలు 18 కి చేరాయి. ప్రముఖ ఆధ్యాత్మిక అమరనాథ్ యాత్రలో.. యాత్రికులు ఒక్కొక్కరుగా గుండెపోటుకు గురై.. మృత్యు వాత పడుతుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమర్ నాథ్ యాత్రకు వెళ్ళిన పంజాబ్ కు చెందిన 18 ఏళ్ళ సందీప్ సింగ్.. జూలై 15 న బల్టాల్ శిబిరం వద్దకు వచ్చేసరికి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అతడిని చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ టెరిటరీ కేర్ హాస్పిటల్ స్కిమ్స్ కు తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం సందీప్ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. యాత్రికులు ప్రయాణ సమయంలో గుండెపోటుకు గురౌతున్నారని, తీవ్ర గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ప్రస్తుతం మరణించిన సందీప్ మృత్యువాత పడ్డ యాత్రికుల్లో 14వ వాడని అధికారులు తెలిపారు. అలాగే ఓ యాత్రికుడు, స్థానిక డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా... ఓ సీఆర్పీఎఫ్ జవాన్, సెవేదార్ బల్టాల్ శిబిరంలో యాత్రికులకోసం ఏర్పాటు చేసిన వంటగదిలో తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. -
నేడు రధసప్తమి