తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు.. మోదీ పేరుమీద మొదటి పూజ | First Puja At Kedarnath Performed in name of PM Modi | Sakshi
Sakshi News home page

తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు.. మోదీ పేరుమీద మొదటి పూజ

Published Fri, May 10 2024 4:57 PM | Last Updated on Fri, May 10 2024 5:08 PM

First Puja At Kedarnath Performed in name of PM Modi

డెహ్రాడూన్: భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం తలుపులు ఈ రోజు ఓపెన్ చేశారు. ఆరు నెలల విరామం తరువాత ఆలయ తలుపులు తెరిచి పూజలు నిర్వహించారు. మొదటి పూజ ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద నిర్వహించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో ఆలయ తలుపులు తెరిచి భక్తులందరికీ స్వాగతం పలికారు. చార్‌ధామ్ తీర్థయాత్రకు బయలుదేరే వారందరికీ సురక్షితమైన, సంతృప్తికరమైన ప్రయాణం కోసం ప్రార్థనలు చేశారు.

దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు, యాత్రికులు ఈ తీర్థ యాత్ర కోసం వేచి ఉంటారు. ఈ కారణంగానే చాలామంది భక్తులు పెద్ద ఎత్తున దర్శనం కోసం వచ్చారు. వారందరికీ నా శుభాకాంక్షలు సీఎం ధామి శుభాకాంక్షలు తెలిపారు.

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బాబా కేదార్ ఆలయ పునరాభివృద్ధికి సంబంధించిన పనులు మూడు దశల్లో జరుగుతున్నాయి, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి తాము కృషి చేస్తున్నట్లు ధామి పేర్కొన్నారు. చలికాలంలో ఆరు నెలల విరామం తరువాత దైవ దర్శనానికి ఆలయ తలుపు తెలిచారు. అయితే బద్రీనాథ్ ఆలయ తలుపులు మే 12న ఓపెన్ చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement