ఇస్లాంలో హజ్ యాత్రను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇస్లాంను అనుసరించే ప్రతీఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని భావిస్తారు. ఇస్లాంను అనుసరించేవారు తప్పనిసరిగా ఐదు విధులు పాటించాలని ఆ మత పెద్దలు చెబుతారు. దానిలో ఒకటే హజ్ యాత్ర. మిగిలినవి కల్మా, రోజా, నమాజ్, జకాత్. ముస్లింలు తమ జీవితంలో వీటిని పాటించేందుకు ప్రయత్నిస్తారు.
యాత్ర ఎన్నాళ్లు సాగుతుంది?
ఇస్లాంను అనుసరిస్తున్న పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం 628వ సంవత్సరంలో తొలిసారి పాగంబర్ మొహమ్మద్ తన 1,400 మంది అనుచరులతో ఒక పవిత్ర యాత్ర చేశారు. ఇస్లాంను నమ్మేవారు దీనినే తొలి తీర్థయాత్రగా చెబుతారు.ఈ యాత్ర ద్వారానే పాగంబర్ ఇబ్రహీమ్ ఇస్లాం సంప్రదాయాలను పునరుద్ధరించారని అంటారు. తరువాతి కాలంలో దీనినే హజ్ అంటూ వచ్చారు. ప్రతీయేటా ప్రపంచంలోని ఇస్లాం మతస్థులు సౌదీ అరబ్‌లోని మక్కాకు హజ్ కోసం వెళుతుంటారు. ఈ పవిత్ర హజ్ యాత్ర 5 రోజులు కొనసాగుతుంది. ఈ యాత్ర ఈద్ ఉల్ అజహ అంటే బక్రీద్‌తో పూర్తవుతుందని చెబుతారు
జిల్-హిజాలోని 8వ తేదీన..
ఈ యాత్ర అధికారికంగా ఎప్పుడు ప్రారంభవుతుందనే విషయానికి వస్తే ఇస్లాం మాసం జిల్-హిజాలోని 8వ తేదీన ప్రారంభమవుతుంది. ఇదే రోజున హాజీ మక్కా నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరాన ఉన్న మీనా పట్టణానికి వెళ్లారని చెబుతారు. అక్కడ హాజీ రాత్రంతా గడిపారని అంటారు. మర్నాడు హాజీ అరాఫత్ మైదానానికి చేరుకున్నారట. ఈ అరాఫత్ మైదానంలో నిలుచుని హజ్‌యాత్రికులు అల్లాను గుర్తుచేసుకుంటారు. తాము చేసిన తప్పులను మన్నించాలని వేడుకుంటారు. తరువాత సాయంత్రానికి సౌదీ అరబ్‌లోని ముజదల్ఫా పట్టణం చేరుకుంటారు. రాత్రంతా అక్కడే ఉంటారు. మర్నాటి ఉదయం మీనా పట్టణానికి చేరుకుంటారు.
హజ్‌యాత్రలో ముస్లింలు ఏం చేస్తారంటే..
హజ్ యాత్రకు వెళ్లిన ముస్లింలు ఒక విధానాన్ని ఫాలో అవుతారు. బీబీసీ రిపోర్టును అనుసరించి ముందుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హజ్ యాత్రికులు ముందుగా జోద్దా పట్టణంలో కలుసుకుంటారు. సరిగ్గా మక్కాకు ముందుగా ఉన్న ఒక ప్రాంతం నుంచి అధికారికంగా యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాన్ని మీకత్ అని అంటారు. ఈ ప్రాంతం మక్కాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అహ్రమ్, ఉమ్రాలకు ఎంతో ప్రాధాన్యం
హజ్‌కు వెళ్లిన యాత్రికులంతా మీకత్‌కు చేరుకోగానే ఒక తరహా దుస్తులు ధరిస్తారు. దీనిని అహ్రమ్ అని అంటారు. అయితే కొందరు యాత్ర ప్రారంభించినది మొదలు అహ్రమ్ ధరిస్తారు. ఇది తెలుపు రంగు కలిగిన వస్త్రం. దీనిని సూదితో కుట్టరు.
ఉమ్రా విషయానికొస్తే మక్కా చేరుకున్న ప్రతీ ముస్లిం తప్పనిసరిగా ఉమ్రా పాటించాల్సి ఉంటుంది. ఉమ్రా అనేది ఇస్లాంలోని ప్రముఖ ధార్మిక ప్రక్రియ. ఇది కేవలం హజ్ మాసంలోనే కాకుండా సంవత్సరం పొడవునా ఎప్పుడైనా చేయవచ్చు. అయితే చాలామంది హజ్‌యాత్రకు వెళ్లినప్పుడు ఉమ్రాను తప్పకుండా ఆచరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment