Hajj journey
-
హజ్ యాత్ర మృతుల్లో భారతీయుల లెక్క ఇది
రియాద్: సౌదీ అరేబియాలోని హజ్ యాత్ర ఈసారి విషాదాంతంగా మారుతోంది. మునుపెన్నడూ లేనంతగా ఉష్ణోగ్రత నమోదు కావడం.. దీనికి తోడు ఇతరత్ర సమస్యలతో యాత్రికులు చనిపోయారు. ఆ మృతుల సంఖ్య 600పైనే ఉందని సౌదీ హజ్ నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. ఇందులో 50కి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈసారి దాదాపు 600 మందికి పైగా యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో అనేక దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈజిప్టుకు చెందినవారే 300కు పైగా ఉన్నట్లు అంచనా. హజ్ యాత్రలో మరణించిన భారతీయుల సంఖ్య 68గా ఉందని సౌదీ దౌత్య విభాగం ప్రకటించింది.‘‘మరణించిన వాళ్లలో 68 మంది భారతీయులు ఉన్నారు. వీళ్లలో కొందరు సహజంగా.. వృద్ధాప్యరిత్యా సమస్యలతో మరణించారు. మరికొందరు ప్రతికూల వాతావరణంగా చనిపోయారు. తప్పి పోయినవాళ్ల వివరాలు తెలియాల్సి ఉంది’’ అని ప్రకటించింది.ఇక ఎడారి నగరమైన మక్కాలో ఉష్ణోగ్రతలు తారా స్దాయికి చేరుతున్నాయి. సౌదీ ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా.. తీవ్ర ఎండలు, ఉక్కబోత వాతావరణమే అందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. హజ్ యాత్ర చేసే వారిలో వృద్ధులు, మధ్య వయస్సు వారు ఎక్కువ మంది ఉంటుంటారు. వీరంతా ఎండ ధాటికి తట్టుకోలేక చనిపోతున్నారు. అయితే ఇది ప్రతీ ఏడాది సర్వసాధారణంగానే జరుగుతుందని.. ఈ ఏడాది అది మరింత ఎక్కువ ఉందని చెప్పలేమని ఓ దౌత్యాధికారి అంటున్నారు. ఏటా బక్రీద్ మాసంలో జరిగే ఈ యాత్రకు వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు తరలివస్తుంటారు. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు. భారత్ నుంచి కూడా ప్రతీ ఏటా భారీ సంఖ్యలో హజ్ యాత్రకు వెళ్తుంటారు.హజ్ యాత్రకు వెళ్లి మృత్యువాత పడిన సంఖ్యను 645గా ప్రకటించారు. వీళ్లలో 323 మంది వరకూ ఈజిప్షియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా అధిక ఉష్ణోగ్రతవల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే 60 మంది వరకూ జోర్డాన్ వాసులు మరణించారని దౌత్యవేత్తలు తెలిపారు. ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనీషియాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా మృతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ ప్రభుత్వం వర్చువల్ ఆస్పత్రులను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తోంది. -
హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి!
జరుసలెం: అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్ దేశానికి చెందినవాళ్లు ఉన్నారని, అధిక టెంపరేషన్ వల్ల కలిగిన ఆనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు.భారీగా వచ్చిన యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా మొత్తం ఈజిప్ట్‌కు చెందిన యాత్రికులు అధిక ఎండకు కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ హాస్పిటల్ ఇచ్చినట్లు దౌత్య అధికారులు తెలిపారు. జోర్డాన్‌కు చెందినవాళ్లు 60 మందిని కలుపుకొని మొత్తంగా 577 మంది హజ్ యాత్రికులు మరణించినట్ల అధికారలు తెలిపారు. ఎండ వేడికి ఇంతపెద్ద సంఖ్యలు యాజ్ యాత్రికుల మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.ఇక.. సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు సౌదీ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో హజ్ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. -
హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే..
ఇస్లాంలో హజ్ యాత్రను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇస్లాంను అనుసరించే ప్రతీఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని భావిస్తారు. ఇస్లాంను అనుసరించేవారు తప్పనిసరిగా ఐదు విధులు పాటించాలని ఆ మత పెద్దలు చెబుతారు. దానిలో ఒకటే హజ్ యాత్ర. మిగిలినవి కల్మా, రోజా, నమాజ్, జకాత్. ముస్లింలు తమ జీవితంలో వీటిని పాటించేందుకు ప్రయత్నిస్తారు. యాత్ర ఎన్నాళ్లు సాగుతుంది? ఇస్లాంను అనుసరిస్తున్న పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం 628వ సంవత్సరంలో తొలిసారి పాగంబర్ మొహమ్మద్ తన 1,400 మంది అనుచరులతో ఒక పవిత్ర యాత్ర చేశారు. ఇస్లాంను నమ్మేవారు దీనినే తొలి తీర్థయాత్రగా చెబుతారు.ఈ యాత్ర ద్వారానే పాగంబర్ ఇబ్రహీమ్ ఇస్లాం సంప్రదాయాలను పునరుద్ధరించారని అంటారు. తరువాతి కాలంలో దీనినే హజ్ అంటూ వచ్చారు. ప్రతీయేటా ప్రపంచంలోని ఇస్లాం మతస్థులు సౌదీ అరబ్‌లోని మక్కాకు హజ్ కోసం వెళుతుంటారు. ఈ పవిత్ర హజ్ యాత్ర 5 రోజులు కొనసాగుతుంది. ఈ యాత్ర ఈద్ ఉల్ అజహ అంటే బక్రీద్‌తో పూర్తవుతుందని చెబుతారు జిల్-హిజాలోని 8వ తేదీన.. ఈ యాత్ర అధికారికంగా ఎప్పుడు ప్రారంభవుతుందనే విషయానికి వస్తే ఇస్లాం మాసం జిల్-హిజాలోని 8వ తేదీన ప్రారంభమవుతుంది. ఇదే రోజున హాజీ మక్కా నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరాన ఉన్న మీనా పట్టణానికి వెళ్లారని చెబుతారు. అక్కడ హాజీ రాత్రంతా గడిపారని అంటారు. మర్నాడు హాజీ అరాఫత్ మైదానానికి చేరుకున్నారట. ఈ అరాఫత్ మైదానంలో నిలుచుని హజ్‌యాత్రికులు అల్లాను గుర్తుచేసుకుంటారు. తాము చేసిన తప్పులను మన్నించాలని వేడుకుంటారు. తరువాత సాయంత్రానికి సౌదీ అరబ్‌లోని ముజదల్ఫా పట్టణం చేరుకుంటారు. రాత్రంతా అక్కడే ఉంటారు. మర్నాటి ఉదయం మీనా పట్టణానికి చేరుకుంటారు. హజ్‌యాత్రలో ముస్లింలు ఏం చేస్తారంటే.. హజ్ యాత్రకు వెళ్లిన ముస్లింలు ఒక విధానాన్ని ఫాలో అవుతారు. బీబీసీ రిపోర్టును అనుసరించి ముందుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హజ్ యాత్రికులు ముందుగా జోద్దా పట్టణంలో కలుసుకుంటారు. సరిగ్గా మక్కాకు ముందుగా ఉన్న ఒక ప్రాంతం నుంచి అధికారికంగా యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాన్ని మీకత్ అని అంటారు. ఈ ప్రాంతం మక్కాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అహ్రమ్, ఉమ్రాలకు ఎంతో ప్రాధాన్యం హజ్‌కు వెళ్లిన యాత్రికులంతా మీకత్కు చేరుకోగానే ఒక తరహా దుస్తులు ధరిస్తారు. దీనిని అహ్రమ్ అని అంటారు. అయితే కొందరు యాత్ర ప్రారంభించినది మొదలు అహ్రమ్ ధరిస్తారు. ఇది తెలుపు రంగు కలిగిన వస్త్రం. దీనిని సూదితో కుట్టరు. ఉమ్రా విషయానికొస్తే మక్కా చేరుకున్న ప్రతీ ముస్లిం తప్పనిసరిగా ఉమ్రా పాటించాల్సి ఉంటుంది. ఉమ్రా అనేది ఇస్లాంలోని ప్రముఖ ధార్మిక ప్రక్రియ. ఇది కేవలం హజ్ మాసంలోనే కాకుండా సంవత్సరం పొడవునా ఎప్పుడైనా చేయవచ్చు. అయితే చాలామంది హజ్‌యాత్రకు వెళ్లినప్పుడు ఉమ్రాను తప్పకుండా ఆచరిస్తారు. -
ఇకపై ఏపీ నుంచి నేరుగా హజ్ యాత్ర
సాక్షి, విజయవాడ: మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి యాత్రికులు నేరుగా హజ్ యాత్రకు వెళ్లేందుకు ఎంబార్కింగ్ పాయింట్ సాధించామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మొదటి ప్లోర్లోని సీసీఎల్ఏ కాన్ఫరెన్స్ హాల్లో మైనార్టీ శాఖ సెక్రటరీ ఎ.ఎం.డి. ఇంతియాజ్, హజ్ కమిటీ ఛైర్మన్ బి.ఎస్. గౌస్ లాజమ్ ఆధ్వర్యంలో జరిగిన హజ్ కమిటీ సమన్వయ సమావేశంలో మంత్రి అంజాద్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుండి 1,813 మంది యాత్రికులను నేరుగా పవిత్ర హజ్ యాత్రకు పంపడం జరుగుతుందన్నారు. 7 జూన్, 2023 నుండి 19 జూన్, 2023 వరకు కొనసాగనున్న హజ్ యాత్రలో భాగంగా ప్రతి రోజూ 155 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. కొత్తగా ఎంబార్కేషన్ పాయింట్ వచ్చాక వివిధ ఎయిర్ లైన్స్ ఏపీ నుండి యాత్రికులను హజ్‌కు తీసుకెళ్లి మళ్లీ హజ్ నుంచి ఏపీకి తీసుకువచ్చే విధంగా ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందన్నారు. హైదరాబాద్, బెంగుళూరు ఎంబార్కేషన్ నుండి వెళ్లే ప్రతి ఒక్క యాత్రికుడి మీద రూ.80,000 అదనంగా భారం పడుతున్న పరిస్థితుల్లో సీఎం జగన్ ఆదేశాలకనుగుణంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సింథియా, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో చర్చించి హజ్ యాత్ర టికెట్ ధరను తగ్గించాలని కోరామన్నారు. తగ్గించలేని పరిస్థితుల్లో తమ రాష్ట్రం నుండి హజ్ కు వెళ్లే యాత్రికులను హైదరాబాద్, బెంగుళూరు నుండి వెళ్లే విధంగా అనుమతించాలని కోరామన్నారు. ఈ విషయమై పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు చెప్పినట్లు అంజాద్ బాషా వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రోద్భలంతో ప్రతి ఏటా యాత్రికుడిపై విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చుకు అదనంగా ఒక్కొక్కరికి రూ. 80,000ల చొప్పున రూ.14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించడం విశేషమన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కి మైనార్టీ సంక్షేమ శాఖ, హజ్ యాత్రికుల తరపున అంజాద్ బాషా కృతజ్ఞతలు తెలిపారు. హజ్ యాత్రికుల కోసం గుంటూరు జిల్లా నంబూరు వద్ద గల మదరసాలో వసతి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాత్రికుల లగేజ్‌ను మదరసాలోనే స్కానింగ్ చేసి అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టుకు తరలించేలా ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. అదే విధంగా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 ఏసీ బస్సుల ద్వారా యాత్రికులను మదరసా నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు పంపించే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. హజ్ యాత్రికుల సౌకర్యార్థం 24 గంటలు పనిచేసేలా మదరసా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామన్నారు. హజ్‌కు వెళ్లే యాత్రికులు వసతి కేంద్రం వద్దకు 24 గంటల ముందుగానే చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేయాలని అంజాద్ బాషా కోరారు. మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ ఇంతియాజ్ మాట్లాడుతూ 7 జూన్, 203 నుండి 19 జూన్, 2023 వరకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి హజ్‌కు బయలుదేరే యాత్రికుల యాత్ర సవ్యంగా సాగాలని ఆకాంక్షించారు. చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, హజ్ కమిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎం.నవాబ్ బాషా, ఎమ్మెల్సీ, హజ్ కమిటీ సభ్యులు ఇసాక్, మైనార్టీ శాఖ సలహాదారు ఎస్.ఎం. జియావుద్దీన్, ఏపీ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవాబ్ ఖాదర్ సాబ్, కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, ఆర్డీవోలు, ఎయిర్ లైన్స్ అధికారులు, గన్నవరం ఎయిర్ పోర్టు అథారిటీ, కస్టమ్స్, బ్యాంకర్లు, ఆర్టీసీ, పంచాయతీరాజ్, పోలీసు, వైద్యారోగ్యశాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ, ఆర్ అండ్ బీ, బీఎస్ఎన్ఎల్, ఫైర్ సర్వీసు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కాలినడక: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలో మీటర్లు
లండన్: కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్ యాత్ర తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. జీవితంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేపట్టాలని ముస్లిం సోదరులు భావిస్తుంటారు. అయితే.. ఓ వ్యక్తి పలు దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి హజ్‌కు చేరుకున్నారు. ఇరాక్‌లోని కుర్దిష్ మూలాలనున్న బ్రిటిషనర్.. అడమ్ మొహమ్మద్(52) ఈ సాహసం చేసి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్న అడమ్ మొహమ్మద్.. ఇంగ్లాండ్‌లోని వొల్వెర్‌హంప్టన్ నుంచి సుమారు 6,500 కిలోమీటర్లు నడిచి మక్కాకు చేరుకున్నారు. 10 నెలలు.. 9 దేశాలు.. హజ్ యాత్రకు బయలుదేరిన అడమ్ మొహమ్మద్.. నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనన్, జోర్డన్ దేశాల మీదుగా సౌదీ అరేబియాకు చేరుకున్నారు. 10 నెలల 25 రోజుల్లో మొత్తం 6,500 కిలోమీటర్లు నడిచారు. తన యత్రను గత ఏడాది 2021, ఆగస్టు 1న ప్రారంభించిన అడమ్.. ఈ ఏడాది జూన్‌లో గమ్యాన్ని చేరుకున్నారు. ఆల్ జజీరా న్యూస్ ప్రకారం.. అడమ్ రోజుకు సగటున 17.8 కిలోమీటర్లు నడిచారు. సుమారు 300 కిలోల సామగ్రితో కూడిన తోపుడు బండిని తోసుకుంటూ తన యాత్రను సాగించారు. ఆ బండికి మ్యూజిక్ స్పీకర్లు అమర్చి ఇస్లామిక్ పాటలు వింటూ నడిచినట్లు చెప్పుకొచ్చారు అడమ్. శాంతి, సమానత్వంపై ప్రజలకు సందేశం అందించాలనే తాను ఇలా కాలినడకన యాత్ర చేపట్టానన్నారు. ఆన్‌లైన్‌లోనూ గోఫన్‌మీ పేజ్‌ను ఏర్పాటు చేశారు. 'ఇది నేను డబ్బు, పేరు కోసం చేయటం లేదు. ప్రపంచంలోని మనుషులంతా సమానమనే విషయాన్ని ఎత్తిచూపాలనుకుంటున్నా. ఇస్లాం బోధిస్తున్న శాంతి, సమానత్వ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నా.' అని అందులో రాసుకొచ్చారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది ముస్లింలు హజ్ సందర్శించుకునేందుకు సౌదీ అరేబియా అనుమతించింది. 2020, 2021లో కేవలం సౌదీ అరేబియా పౌరులను మాత్రమే అనుమతించారు. ఈ ఏడాది జులై 7న ఈ హజ్ యాత్ర మొదలైంది. ఇదీ చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
Andhra Pradesh: ‘హజ్’ అరుదైన భాగ్యం
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : ఇస్లాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉండగా అందులో మొదటిది విశ్వాసం. ఆతర్వాతి స్థానాలు నమాజ్, రోజా, జకాత్, హజ్‌లకు లభిస్తాయి. నమాజ్, రోజాలకు ఆర్థిక స్థోమత అవసరం ఉండదు. నాలుగోది జకాత్ (అంటే దానధర్మాలు). హజ్ అనేది ఆర్థిక స్థోమతను బట్టి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర యాత్ర. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింలు 40 రోజుల పవిత్ర హజ్‌యాత్ర చేస్తున్నారు. హజ్‌యాత్ర ఒకప్పుడు ప్రయాసతో కూడుకున్నది. సుదీర్ఘ ఓడ ప్రయాణం, ఆ తరువాత సౌదీలో ఒంటెలు, గుర్రాలపై ప్రయాణం వంటి దశలు ఉండేవి. విమాన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎంతో సులువుగా మారింది. 2019కి సంబంధించిన జిల్లా యాత్రికులు 473 మంది యాత్ర చేశారు. ఆతర్వాత కోవిడ్–19 కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో భారతీయులకు హజ్ యాత్ర అవకాశం కలగలేదు. ప్రస్తుతం 2022కి సంబంధించిన దరఖాస్తుల ప్రకియ ఈనెల 1వ తేదీనే ప్రారంభమైంది. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు పూర్తి చేసిన దరఖాస్తులను జనవరి 10వ తేదీలోపు అందజేయాల్సి ఉంటుంది. (కాగా ఆన్‌లైన్‌కు ఆఖరు తేది 2022, జనవరి 31). ముస్లింలలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు. పైగా దరఖాస్తు గడులన్నీ ఆంగ్లంలో ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని పూరించాలంటే తలప్రాణం తోకకు వస్తుంటుంది. ఒక్కగడి తప్పుగా పూరించినా హజ్ యాత్రలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా సెంట్రల్ హజ్ కమిటీ తరపున హజ్‌యాత్ర చేసే అవకాశం కోల్పోవచ్చు. అన్ని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాతే పూరించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియబరుస్తూ హజ్ యాత్రికులకు ‘సాక్షి’ అందించిన తోడ్పాటే ఈ కథనం.. దరఖాస్తుల్లో రెండు విధాలు.. కుటుంబంలో ఒక్కరే హజ్‌యాత్రకు వెళ్లాలనుకుంటే వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేసుకుంటే చాలు. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులు వెళ్లాలనుకుంటే ఒకే దరఖాస్తులో అందరి వివరాలు పొందుపరచవచ్చు. ఇలాంటి దరఖాస్తును ‘కవర్’ అంటారు. కవర్లో కవర్‌హెడ్ అందరి తరపున బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కవర్లో ఐదుగురు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లవచ్చు. ఇందులో (09.09.2022 నాటికి) రెండేళ్లలోపు వయస్సు కలిగిన ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉండవచ్చు. (వీరికి టికెట్టులో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.) యాత్రికులు అందజేసిన దరఖాస్తులను హజ్ కమిటీలు, సొసైటీల ప్రతినిధులు బాధ్యత తీసుకుని ఆన్లైన్ చేస్తారు. కవర్ నెంబర్ మాత్రం ఐహెచ్‌పీఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ చేస్తారు. హజ్ యాత్రికులను ఎంపిక చేసేందుకు సెంట్రల్ హజ్ కమిటీ వారు జనవరిలో కవర్ నంబర్‌తోనే డ్రా తీస్తారు. అర్హతలు.. భారత పౌరసత్వం కల్గిన ముస్లింలు హజ్ కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హజ్ చేయాలంటే వారు తప్పనిసరిగా ఇండియన్ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. (అది మిషన్ రీడబుల్, ఇంటర్నేషన్ పాస్‌పోర్టు అయి ఉండాలి) 2022 హజ్ యాత్ర కోసం పాస్‌పోర్టు కాలపరిమితి 2022, డిసెంబరు 31వ తేదీ వరకు ఉండాలి. ఒక్కరోజు తక్కువ ఉన్నా అనుమతించరు. హజ్ దరఖాస్తుకు జత చేయాల్సినవి.. పూరించిన హజ్ దరఖాస్తుతో పాటు సెంట్రల్ హజ్ కమిటీ అకౌంటుపై బ్యాంక్‌లో (ఎస్బీఐ బ్యాంక్‌లో) చెల్లించిన రూ. 300 చలానా, పాస్‌పోర్టు జిరాక్స్, అకౌంట్ నంబర్ కనిపించే విధంగా బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, నాలుగు ఫొటోలు (వెనక తెల్లటి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. తెలుపు కాకుండా తలకు ఇతర రంగు టోపీ ధరిస్తే మంచిది) అందజేయాల్సి ఉంటుంది. మహిళలు చెవులు కనిపించేలా ఫొటోలు దిగాలి. ఒకవేళ పాస్‌పోర్టులో సూచించిన ఇంట్లో నివాసం ఉండకపోతే ప్రస్తుత చిరునామాను సూచించే ధ్రువపత్రం (ఆధార్ లేక రేషన్ కార్డు) కూడా జతపరచాలి. రెండు కేటగిరీల్లో యాత్ర.. హజ్ యాత్రకు వెళ్లే వారిలో చెల్లించే ఫీజును బట్టి గ్రీన్, అజీజియా అనే రెండు కేటగిరీలు ఉంటాయి. గ్రీన్ కేటగిరీ వారికి మక్కాకు సమీపంలో బస చేసే సదుపాయం కల్పిస్తారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో గ్రీన్ కేటగిరీకి ‘ఎన్‌సీఎన్‌టీజడ్’ అని పేరు మార్చారు. అంటే ‘నాన్ కుకింగ్ నాన్ ట్రాన్స్పోర్ట్ జోన్’ అని అర్థం. 65 ఏళ్ల లోపు వారే అర్హులు. గతంలో డెభ్భై ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు హజ్‌యాత్రలో రిజర్వు కేటగిరీ కేటాయించేవారు. ప్రస్తుతం కోవిడ్–19 వచ్చాక నిబంధనలు మారాయి. 65 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు మాత్రమే యాత్రకు వెళ్లాలి. రెండేళ్లలోపు పిల్లలను వెంట తీసుకెళితే పాస్‌పోర్టు అవసరం ఉండదు. అంతకు పైబడి వయస్సు కలిగిన పిల్లలకు ప్రత్యేక పాస్‌పోర్టు అవసరం. మహిళలకు ఒంటరిగా వెళ్లే అవకాశం ఉండదు. నిబంధనల్లో సూచించిన వ్యక్తి (మెహరం) తోడుండాలి. లేదా 31.05.2022 నాటికి వయస్సు 45 ఏళ్లు పైబడిన నలుగురు మహిళలు గ్రూప్‌గా వెళ్లవచ్చు. వ్యాక్సినేషన్ తప్పనిసరి.. హజ్ యాత్రకు వెళ్లే ముందు ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలనే నిబంధన ఉంది. వ్యాక్సినేషన్ చేయించుకోవడమే కాకుండా ఆ మేరకు సర్టిఫికెట్ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. వీరు అనర్హులు.. గర్భిణీ మహిళలు, మానసిక రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, కుష్ఠు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. నామినీ.. హజ్ యాత్రికుల వెంట రాకుండా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పేరును (పూర్తి చిరునామాతో) మాత్రమే నామినీగా పొందుపరచాలి. బ్యాంక్‌లో ఖుర్బానీ ఫీజు.. హజ్‌యాత్రలో భాగంగా ఖుర్బానీ నిర్వహించడానికి సౌదీ ప్రభుత్వం గుర్తించిన ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఐడీబీ)లో ‘అదాయి కూపన్’ తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఈ అంశాన్ని స్పష్టం చేయాలి. (ప్రైవేట్ వ్యక్తులకు ఖుర్బానీ సొమ్ము అప్పగిస్తే వారు మోసగించే అవకాశం ఉందని చెబుతారు). లక్కీ డ్రా.. దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయించిన కోటా మేరకే యాత్రికులు ఎంపికవుతారు. ముంబాయిలో డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన వారికి మాత్రమే కమిటీ తరపున హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉచితంగా ఆన్లైన్ సేవలు.. హజ్ యాత్రికులకు సేవ చేస్తే పుణ్యం లభిస్తుందనే సదుద్దేశంతో జిల్లాలో అనేక సొసైటీలు ముందుకు వచ్చి వారి ప్రయాణానికి అవసరమైన సేవలు ఉచితంగా అందిస్తున్నాయి. సొసైటీల ప్రతినిధులు దరఖాస్తులను ఉచితంగా ఆన్లైన్ చేస్తున్నారు. దరఖాస్తులు మొదలు హజ్ యాత్రికులు విమానం ఎక్కే దాకా వారికి అవసరమైన శిక్షణ, సదుపాయాలు, రోగనిరోధక వాక్సినేషన్ వంటి సేవాభావంతో కల్పిస్తాయి. బుధవారపేటలోని మహబూబ్‌సుభానీ మసీదులో రాయలసీమ హజ్ సొసైటీ వారు సేవలు అందిస్తున్నారు. వీరి ఫోన్ నంబర్లు: అధ్యక్షుడు ఎం.మొహమ్మద్పాష: 76809 01952, ప్రధాన కార్యదర్శి బాషా సాహెబ్: 99633 18255. జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు నాయబ్ సలీం: 99123 78586, ప్రధాన కార్యదర్శి అష్వాక్ హుసేని: 98662 86786. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలతో వీరిని సంప్రదిస్తే ఉచితంగా ఆన్లైన్ చేస్తారు. ఒంట్లో సత్త ఉన్నప్పుడు వెళ్లి రావడమే మేలు: ఇర్షాదుల్ హక్ ఆర్థిక స్థోమత కలిగిన వాళ్లు వృద్ధాప్యం వచ్చేంత వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరి ఆయుష్షు ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కదా.. పైగా వృద్ధాప్యంలో లేనిపోని జబ్బులు వస్తుంటాయి. వాటిని భరించి 40 రోజుల ప్రయాణంలో ఇబ్బందులు పడటం కంటే, యవ్వన ప్రాయంలోనే హజ్ యాత్రకు వెళ్లి రావడం ఉత్తమం. నేను అబ్బాస్‌నగర్‌లో ఉంటాను. నాకు ఏసీ స్పేర్‌పార్ట్స్ షాప్ ఉంది. హజ్‌కు వెళ్లేంత స్థోమత ఉంది కాబట్టి నా 50వ ఏటనే హజ్ ముగించుకువచ్చాను. నా ముగ్గురు పిల్లలను బంధువులకు అప్పగించి నేను, నాభార్య ఇద్దరు కలిసి ఓ ఐదేళ్ల క్రితమే హజ్ యాత్రకు వెళ్లొచ్చాం. యాత్రకు అవసరమైన డాక్యుమెంటేషన్ అంతా హజ్ సొసైటీల వాళ్లే ఉచితంగా చేసి పెట్టారు. అల్లా వారికీ పుణ్యం ప్రసాదిస్తాడు. శిక్షణ తీసుకోకపోతే ఇక్కట్లే.. : జాకిర్ హుసేన్, సివిల్ ఇంజనీరు నేను సివిల్ ఇంజనీర్ని. బాలాజీనగర్‌లో ఉంటాను. హజ్‌కు వెళ్లాలంటే సాధారణ దుస్తులను వదిలేసి ఇహ్రాం అనే వస్త్రాన్ని ధరించాల్సి ఉంటుంది. దేశం వదిలి ఇతర దేశానికి వెళతాం కాబట్టి అక్కడి చట్టం, అక్కడి నియమ నిబంధనలపై అవగాహన ఉండాలి. హజ్ యాత్రలోని ప్రధాన ఘట్టాలు కూడా తెలిసి ఉండాలి. పక్కనే ఉండే వ్యక్తిని అడిగితే అతనూ మనదేశీయుడే అయి ఉంటాడు. అందువల్ల హజ్‌యాత్రకు ముందే అన్ని తెలుసుకుని ఉండాలి. ఇందుకు హజ్ సొసైటీలు నిర్వహించే శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడతాయి. అప్లికేషన్ భర్తీ చేసేటప్పుడు ఒక్క గడి తప్పున్నా అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. నేను విద్యావంతుడినైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్‌ను సొసైటీ ద్వారానే భర్తీ చేయించుకున్నాను. -
హజ్ యాత్ర.. 60 వేల మందికే అవకాశం
జెడ్డా: హజ్ యాత్ర వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా 2021 ఏడాదికి సంబంధించి హజ్ విధానాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరం విదేశీ యాత్రికులకు ప్రవేశాన్ని నిరోధించింది. హజ్ యాత్రలో ఈసారి కేవలం సౌదీ అరేబియాలో నివసించే ప్రజలే పాల్గొంటారని తెలిపింది. హజ్ యాత్రకు ఈ ఏడాది 60 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గత ఏడాది కూడా హజ్ యాత్రకు విదేశీ యాత్రికులను సౌదీ నిరాకరించింది. ఈ సందర్భంగా "కరోనావైరస్ ఇంకా కట్టడి కాలేదు. వ్యాక్సిన్లు వేస్తున్నప్పటికి.. మహమ్మారి రోజు రోజుకు విభిన్న వైవిద్యాలను ప్రదర్శిస్తుంది. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని’’ సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి తవ్ఫిక్ అల్-రబియా విలేకరుల సమావేశంలో అన్నారు. కరోనా వ్యాప్తికి ముందు ప్రతి ఏటా సుమారు 2.5 మిలియన్ల మంది మక్కా, మదీనాను సందర్శించే వారు. చదవండి: అంతుచిక్కని కట్టడం.. గుర్తు తెలియని దేవుడికి బలులు -
రేపటి నుంచి హజ్ క్యాంప్ షురూ..
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర–2018కి సంబంధించిన హజ్ క్యాంప్ సోమవారం(30న) నుంచి ప్రారం భం కానుంది. ఈ ఏడాది హజ్ క్యాంప్ నుంచి తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని 4 జిల్లాల నుంచి దాదాపు 8 వేల మంది హజ్ యాత్రికులు యాత్రకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హజ్ కమిటీ హజ్ హౌస్‌లో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆగస్టు 1 నుంచి హజ్ యాత్ర 2018 ప్రారంభం కానుంది. హజ్ హౌస్‌ను మిని ఎయిర్‌పోర్టుగా మార్చడానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించనున్నారు. యాత్ర కు సంబంధించిన లగేజ్, బోర్డింగ్, ఇమిగ్రేషన్, కస్టమ్స్ తదితర అన్ని ప్రక్రియల కౌంటర్లను హజ్ హౌస్‌లోనే ఏర్పాటు చేయనున్నారు. యాత్రికులు హజ్ హౌస్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని హజ్ టెర్మినల్ చేరుకుం టా రని హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లా ఖాన్ తెలిపారు. అనంతరం విమానంలో సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి మక్కాకు చేరుకుంటారన్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, రవా ణా, అగ్నిమాపక, పోలీసు శాఖల సమన్వయంతో యాత్రికులకు అసౌకర్యం కలగకుండా హజ్ క్యాంప్ కొనసాగుతుందని హజ్ కమిటీ ప్రత్యేకాధికారి తెలిపారు. సోమవారం అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హజ్ హౌస్‌లో తమ సిబ్బందితో సమీక్ష జరిపి, వారికి షిఫ్టులను కేటాయిస్తారన్నారు. యాత్ర కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు హజ్ హౌస్‌లోనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విడుదల కాని నిధులు.. హజ్ క్యాంప్ నిర్వహణకు అవసరమైన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఈ ఏడాది హజ్ క్యాంప్‌తో పాటు హజ్ కమిటీకి ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది రావాల్సిన మొదటి క్వార్టర్ నిధులు ఇంకా విడుదల కాలేదు. హజ్ క్యాంప్ నిర్వహణకు టెండర్ల ద్వారా పనులు కేటాయించారు. టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అడ్వాన్స్లివ్వాలని హజ్ కమిటీ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో హజ్ క్యాంప్ నిర్వహణపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
హజ్ దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర (2018)కు వెళ్లే వారి నుంచి దరఖాస్తు స్వీకరణ గడువును రాష్ట్ర హజ్ కమిటీ పొడిగించింది. ఈ నెల 7 నుంచి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఎ.షుకూర్ గురువారం తెలిపా రు. దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచాలని కేంద్ర హజ్ కమి టీని కోరడంతో గడువు పొడిగించినట్లు చెప్పారు. హజ్ యాత్ర కు దరఖాస్తులు చేసుకునే వారి పాస్‌పోర్టు వ్యాలిడిటీ 2019 ఫిబ్రవరి 14 వరకు ఉండాలని, లేనిపక్షంలో పాస్‌పోర్టును రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. హజ్‌యాత్రకు వెళ్లే వారు దరఖాస్తు ఫారం పూర్తిచేసిన అనంతరం రూ.300 స్టేట్ బ్యాంక్ లేదా యూనియన్ బ్యాంక్ ద్వారా చలానా తీయాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు జిరాక్స్, అడ్రస్ సరిగా లేకుండా యాత్రకు వెళ్లే వారి బ్యాంక్ పాస్ బుక్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్‌లను జత చేయాలన్నారు. గతంలో ఒక కవర్లో ఐదుగురు వెళ్లేందుకు అవకాశం ఉండేదని ఇప్పుడు నలుగురికే అవకాశం ఇచ్చామన్నారు. 70 ఏళ్లు పైబడి న రిజర్వేషన్ కేటగిరీ వారు ఒరిజినల్ పాస్‌పోర్టు దరఖాస్తును జమ చేయాల్సి ఉంటుందన్నారు. గ్రీన్, అజీజీయా 2 కేటగిరీలున్నాయని, ఏ కేటగిరీలో వెళ్లాలనుకుంటే ఆ కేటగిరీని పేర్కొనాలని, ఇప్పటివరకు 11 వేల దరఖాస్తులు అందాయన్నారు. -
మూడు భాషల్లో హజ్ యాత్ర వెబ్సైట్
సాక్షి, న్యూఢిల్లీ: హజ్ యాత్ర చేసేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హెచ్ఏజే.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేసింది. ఈ వెబ్‌సైట్‌ను ఆ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ వెబ్సైట్లో మైనారిటీ వ్యవహారాల శాఖ సమాచారం, హజ్ విభాగం, హజ్ యాత్ర వివరాలు, నిబంధనలు, నియమావళి, హజ్ కమిటీ వివరాలు, ప్రైవేటు టూర్ ఆపరేటర్ల వివరాలు, ఈ యాత్రలో చేయాల్సినవి, చేయకూడనివి తదితర వివరాలను పొందుపరిచినట్టు తెలిపారు. హజ్–2017 యాత్రకు జనవరి 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. -
వారిని నమ్మి మోసపోవద్దు ...
{పైవేట్ టూర్ ఆపరేటర్ల నుంచి తప్పక రశీదు తీసుకోవాలి హజ్‌యాత్రికులకు ఏకే ఖాన్ సూచన సిటీబ్యూరో: హజ్‌యాత్ర వెళ్లేవారు ప్రైవేట్ ఆపరేటర్లను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ పథకాల అమలు కమిటీ చైర్మన్ ఏకేఖాన్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన హజ్‌హౌస్‌లో రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ‘హజ్‌యాత్ర-2016’ దరఖాస్తులను విడుదల చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. హజ్ కమిటీ ద్వారా ఎంపిక కాని వారు ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను ఆశ్రయించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల చేతిలో మోసపోయినట్టు ప్రతీ సంవత్సరం వందలాది కుటుంబాలు మోసపోయినట్టు ఫిర్యాదులు వస్తున్నా..సరైన ఆధారాలు లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడంలేదన్నారు. ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను ఆశ్రయించే ముందు ఆ సంస్థ గురించి ఆరా తీయడంతో పాటు హజ్ కోటా కేటాయింపు, ఏర్పాట్లు తదితర విషయాలు పూర్తిగా అడిగి తెలుసుకోవాలన్నారు. డబ్బు చెల్లింపునకు సంబంధించిన రశీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రశీదు ఉంటే ఆపరేటర్లు యాత్ర సాధ్యం కానప్పుడు తిరిగి డబ్బు చెల్లించే అవకాశాలున్నాయన్నారు. ఆన్లైన్ ద్వారా నమోదు.. హజ్‌యాత్ర-2016 కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌ద్వారా సమర్పించవచ్చని ఏకే ఖాన్ అన్నారు. 2017 మార్చి 10 వరకు గడువుతో అంతర్జాతీయ పాస్‌పోర్టు ఉన్నవారు అర్హులన్నారు. కేంద్ర హజ్ కమిటీ రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం లక్కీ డ్రా ద్వారా యాత్రికుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగతుందన్నారు. దళారులను నమ్మవద్దని సూచించారు. దరఖాస్తులతో మెడికల్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, ఎంపిక అనంతరం సమర్పించవచ్చన్నారు. హజ్‌యాత్ర కోసం సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు. యాత్రికులకు ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి ఏర్పాటు జరుగుతాయన్నారు. 2016 జనవరి 13 నాటికి 70 ఏళ్లు పూర్తయిన వారు సీనియర్ సిటిజన్ కింద గుర్తించబడుతారన్నారు. దరఖాస్తులను 8 ఫిభ్రవరి వరకు సమర్పించవచ్చని చెప్పారు. ఆగస్టు మొదటి వారం నుంచి హజ్‌యాత్ర ఫ్లైట్స్ బయలుదేరుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, డెరైక్టర్ జలాలొద్దీన్ అక్బర్, హజ్‌కమిటీ ప్రత్యేకాధికారి షుకూర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షఫీయుల్లా తదితరలు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 2 నుంచి హజ్‌యాత్ర
* యాత్రికులకు ఖుర్బానీ వెసులుబాటు * రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఎం షుకూర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్ర-2015 సెప్టెంబర్ రెండు నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎం.షుకూర్ వెల్లడించారు. ముంబైలో జరిగిన కేంద్ర హజ్ కమిటీ సమావేశానికి హాజరై వచ్చిన సందర్భంగా గురువారం హజ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యాత్రికులు హైదరాబాద్ నుంచే హజ్‌యాత్రకు బయలుదేరుతారని ఆయన వివరించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి హజ్‌యాత్రకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సేవలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ సేవలపై అభ్యంతరాలు వ్యక్తమైనా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హమీ ఇచ్చిందన్నారు. మక్కాలో హజ్ ప్రార్థనల సందర్భంగా యాత్రికులు నేరుగా ఖుర్బానీ ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. సౌదీ ప్రభుత్వం తరఫున ఖుర్బానీకి అంగీకరిస్తే మాత్రం యాత్రికుల ఖర్చుకు ఇచ్చే 469 సౌదీ రియాల్స్ మినహాయించడం జరుగుతుందని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో కేంద్ర హజ్ కమిటీ రెండో విడత డబ్బులు చెల్లించే తేదీ ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. హజ్ యాత్రకు మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
హజ్ యాత్ర ఆరంభం
సాక్షి, చెన్నై: ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కా. ఇస్లాంలోని ఐదు సూత్రాల్లో చిట్ట చివరిదిగా హజ్ తీర్థ యాత్రను పరిగణిస్తారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో కనీసం ఒక్క సారైనా ఈ యాత్ర చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రతి ఏటా బక్రీదు నెలలో హజ్‌యాత్ర ఆరంభం అవుతుంది. ప్రపంచ దేశాల్లోని ముస్లింలు ఈ యాత్రతో మక్కానగరం చేరుకుంటారు. బక్రీద్ పండుగ పర్వదినాన మక్కాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. జీవిత కాలంలో తాము చేసిన పాప కర్మల నుంచి విముక్తి కల్పించాలని అల్లాను వేడుకుంటారు. హజ్ యాత్ర : రాష్ట్రంలోని ముస్లింలను ప్రతి ఏటా హజ్ కమిటీ ద్వారా మక్కాకు పంపిస్తున్నారు. ప్రతి ఏటా ఈ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీ, సౌకర్యాలను కల్పిస్తున్నది. హజ్ కమిటీ ద్వారా అర్హులైన వాళ్లను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరిలో అదృష్ట వంతుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. అదే సమయంలో గత ఏడాది కంటే, ఈ ఏడాది హజ్ యాత్ర సీట్లను కేంద్రం తగ్గించడం ముస్లింలను నిరాశ పరిచింది. రాష్ట్ర వాటాలో కోత వేయడాన్ని సీఎం జయలలిత సైతం ఖండించారు. గత ఏడాది కల్పించిన సీట్లతో పాటుగా, ఈ ఏడాది అదనపు సీట్లను రాబట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడాదికి గాను ఇప్పటి వరకు 3,300 మందిని హజ్ యాత్ర నిమిత్తం లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. రెండు రోజులుగా చెన్నైలోని హజ్ హౌస్‌లో హజ్ యాత్రకు వెళ్లే తొలి బృందానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సౌదీ పద్ధతులు, అక్కడ వ్యవహరించాల్సిన విధానాలను, కల్పిండిన సదుపాయాలు, సహకరించే అధికారుల గురించి విశదీకరించారు. సర్వం సిద్ధం : 450 మందితో కూడిన తొలి బృందాన్ని సౌదీకి పంపించేందుకు హజ్ హౌస్ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. పాస్ పోర్టులు, వీసా, తదితర వాటిని హాజీలకు అందజేశాయి. మధ్యాహ్న ప్రార్థన అనంతరం హజ్ హౌస్ నుంచి హాజీలను ప్రత్యేక బస్సుల్లో విమానాశ్రయానికి తరలించారు. కొందరు అయితే తమ సొంత వాహనాల్లో విమానాశ్రయానికి చేరుకున్నారు. హజ్ యాత్రకు వెళ్లే తమ వాళ్లకు వీడ్కోలు పలికేందుకు బంధువులు, ఆప్తులు పెద్ద ఎత్తున మీనంబాక్కంకు తరలి రావడంతో ఆ పరిసరాలు కిటకిటలాడాయి. దీంతో విమానాశ్రయం విదేశీ టెర్మినల్ పరిసరాల్లో గట్టి భద్రత కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ప్రత్యేకంగా నాలుగో నెంబర్ మార్గాన్ని కేటాయించడంతో హాజీలందరూ తమ వాళ్ల నుంచి వీడ్కోలు తీసుకుని హజ్ యాత్రకు బయలు దేరి వెళ్లారు. రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అబ్దుల్ రహీం, వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు తమిళ్ మగన్ హుస్సేన్, హజ్ కమిటీ కార్యవర్గం ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ విభాగం అధికారులు హాజీలకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ప్రయాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ముగియడంతో సాయంత్రం విమానాశ్రయంలో జరిగిన ప్రార్థనాననంతరం హాజీలందరూ సౌదీ అరేబియాకు విమానంలో పయనమయ్యారు. తొలి బృందం పయనంతో మంగళవారం నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో చెన్నై నుంచి జట్లు జట్లుగా హజ్ యాత్రకు ఎంపిక చేసిన హాజీలు పయనం కానున్నారు. నెల రోజులకు పైగా హ జ్ యాత్రను ముగించుకునే ఈ తొలి బృందం అక్టోబరు 20వ తేదీ అర్ధరాత్రి చెన్నైకు చేరుకుంటుంది. కేంద్రం మరిన్ని సీట్లను కేటాయిస్తుందన్న ఆశాభావంతో మరికొంత మంది ముస్లింలు వేచి ఉన్నారు. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న హజ్ కమిటీ వర్గాలు ఇప్పటికే కొందరిని వెయిటింగ్ లిస్టులో ఉంచాయి. సీట్ల సంఖ్య పెరిగిన పక్షంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్లకు హజ్ యాత్ర అవకాశం దక్కుతుంది. -
హజ్ యాత్రకు ఏర్పాట్లు కట్టుదిట్టం చేయండి
అధికారులకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆదేశం హైదరాబాద్: హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు సౌకర్యాలు కల్పించడానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. హజ్ యాత్ర ఏర్పాట్ల కోసం తెలంగాణ హజ్ కమిటీకి త్వరలో రూ.2 కోట్ల నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది యాత్రికుల నుంచి యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను వసూలు చేయడం లేదన్నారు. యాత్రికులకు ఏ చిన్న అసౌకర్యం కలగడానికి తావులేదన్నారు. యాత్రకు బయలుదేరే యాత్రికుల బస కోసం నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో శుక్రవారం ప్రారంభమైన హజ్ క్యాంప్‌ను ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన హజ్ టర్మినల్‌ను సందర్శించారు. రేపు బయలు దేరనున్న తొలి ఫ్లైట్: ఈ ఏడాది హజ్ తొలి ఫ్లైట్ 349 మంది యాత్రికులతో ఆదివారం ఉదయం 12 గంటలకు శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మక్కాకు బయలుదేరి వెళ్లనుంది. అధికారుల సూచనల మేరకు యాత్రికులు యాత్రకు బయలుదేరడానికి 48 గంటల ముందు హజ్ క్యాంప్‌కు రిపోర్టు చేసేందుకు తరలివస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 7 వేల మంది యాత్రికులు తెలంగాణ హజ్ కమిటీ నేతృత్వంలో హజ్ యాత్రకు వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. ఈనెల 28న వెళ్లనున్న యాత్రికుల చివరి ఫ్లైట్‌తో క్యాంప్ ముగియనుంది.