జెడ్డా: హజ్ యాత్ర వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా 2021 ఏడాదికి సంబంధించి హజ్ విధానాన్ని ప్రకటించింది. ఈ సంవత్సరం విదేశీ యాత్రికులకు ప్రవేశాన్ని నిరోధించింది. హజ్ యాత్రలో ఈసారి కేవలం సౌదీ అరేబియాలో నివసించే ప్రజలే పాల్గొంటారని తెలిపింది. హజ్ యాత్రకు ఈ ఏడాది 60 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గత ఏడాది కూడా హజ్ యాత్రకు విదేశీ యాత్రికులను సౌదీ నిరాకరించింది.
ఈ సందర్భంగా "కరోనావైరస్ ఇంకా కట్టడి కాలేదు. వ్యాక్సిన్‌లు వేస్తున్నప్పటికి.. మహమ్మారి రోజు రోజుకు విభిన్న వైవిద్యాలను ప్రదర్శిస్తుంది. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని’’ సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి తవ్ఫిక్ అల్-రబియా విలేకరుల సమావేశంలో అన్నారు. కరోనా వ్యాప్తికి ముందు ప్రతి ఏటా సుమారు 2.5 మిలియన్ల మంది మక్కా, మదీనాను సందర్శించే వారు.
చదవండి: అంతుచిక్కని కట్టడం.. గుర్తు తెలియని దేవుడికి బలులు
Comments
Please login to add a commentAdd a comment