హజ్‌ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి! Over 550 Hajj pilgrims have died due to extreme heat in Mecca. Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి!

Published Wed, Jun 19 2024 9:55 AM | Last Updated on Wed, Jun 19 2024 10:29 AM

several pilgrims deceased during Hajj amid scorching heat

జరుసలెం: అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్‌ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్‌ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్‌ దేశానికి చెందినవాళ్లు ఉన్నారని, అధిక టెంపరేషన్‌ వల్ల కలిగిన ఆనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు.

భారీగా వచ్చిన యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా మొత్తం ఈజిప్ట్‌కు చెందిన యాత్రికులు అధిక ఎండకు కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్  హాస్పిటల్ ఇచ్చినట్లు  దౌత్య అధికారులు తెలిపారు. 

జోర్డాన్‌కు చెందినవాళ్లు 60 మందిని కలుపుకొని మొత్తంగా 577 మంది హజ్‌ యాత్రికులు మరణించినట్ల అధికారలు తెలిపారు. ఎండ వేడికి ఇంతపెద్ద సంఖ్యలు యాజ్‌ యాత్రికుల మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు.  ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.

ఇక.. సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల టెంపరేచర్‌ నమోదైనట్లు సౌదీ వాతావరణ శాఖ  వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో  హజ్‌ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement