Hajj pilgrims
-
హజ్ యాత్రలో 98 భారతీయుల మృతి: కేంద్రం
న్యూఢిల్లీ: తీవ్ర ఎండ, వేడిగాలులతో ఈ ఏడాది హజ్ యాత్రికులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డారు.. దాదాపు 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 98 0 మంది భారతీయులు మరణించినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మరణాలన్నీ సహజ కారణాల వల్లే నమోదైనట్లు తెలిపింది.కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్ర కోసం సౌదీని సందర్శించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అక్కడ భారతీయుల కోసం తాము చేయగలిగినదంతా చేస్తున్నట్లు పేర్కొంది.ప్రతి సంవత్సరం కనీసం సగం మిలియన్ల మంది (5లక్షలు) హజ్లో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే వాస్తవ సంఖ్య 30 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించింది.కాగా ఏడాది సౌదీలో హాజ్ యాత్రకు హాజరైన వారిలో 10 దేశాలకు చెందిన దాదాపు 1,081 మంది మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు ధ్రువీకరించారు. అత్యధికంగా ఈజిప్టుకు చెందిన యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ వారం సౌదీలో ఉష్ణోగ్రత 51.8 డిగ్రీల సెల్సియస్ చేరుకుంది. ఇక ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షల మంది ఉండగా, సౌదీ పౌరులు రెండు లక్షల మందికి పైగా ఉంటారని సౌదీ హజ్ అధికార యంత్రాంగం తెలిపింది. -
హజ్ యాత్ర మృతుల్లో భారతీయుల లెక్క ఇది
రియాద్: సౌదీ అరేబియాలోని హజ్ యాత్ర ఈసారి విషాదాంతంగా మారుతోంది. మునుపెన్నడూ లేనంతగా ఉష్ణోగ్రత నమోదు కావడం.. దీనికి తోడు ఇతరత్ర సమస్యలతో యాత్రికులు చనిపోయారు. ఆ మృతుల సంఖ్య 600పైనే ఉందని సౌదీ హజ్ నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. ఇందులో 50కి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈసారి దాదాపు 600 మందికి పైగా యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో అనేక దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈజిప్టుకు చెందినవారే 300కు పైగా ఉన్నట్లు అంచనా. హజ్ యాత్రలో మరణించిన భారతీయుల సంఖ్య 68గా ఉందని సౌదీ దౌత్య విభాగం ప్రకటించింది.‘‘మరణించిన వాళ్లలో 68 మంది భారతీయులు ఉన్నారు. వీళ్లలో కొందరు సహజంగా.. వృద్ధాప్యరిత్యా సమస్యలతో మరణించారు. మరికొందరు ప్రతికూల వాతావరణంగా చనిపోయారు. తప్పి పోయినవాళ్ల వివరాలు తెలియాల్సి ఉంది’’ అని ప్రకటించింది.ఇక ఎడారి నగరమైన మక్కాలో ఉష్ణోగ్రతలు తారా స్దాయికి చేరుతున్నాయి. సౌదీ ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా.. తీవ్ర ఎండలు, ఉక్కబోత వాతావరణమే అందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. హజ్ యాత్ర చేసే వారిలో వృద్ధులు, మధ్య వయస్సు వారు ఎక్కువ మంది ఉంటుంటారు. వీరంతా ఎండ ధాటికి తట్టుకోలేక చనిపోతున్నారు. అయితే ఇది ప్రతీ ఏడాది సర్వసాధారణంగానే జరుగుతుందని.. ఈ ఏడాది అది మరింత ఎక్కువ ఉందని చెప్పలేమని ఓ దౌత్యాధికారి అంటున్నారు. ఏటా బక్రీద్ మాసంలో జరిగే ఈ యాత్రకు వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు తరలివస్తుంటారు. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు. భారత్ నుంచి కూడా ప్రతీ ఏటా భారీ సంఖ్యలో హజ్ యాత్రకు వెళ్తుంటారు.హజ్ యాత్రకు వెళ్లి మృత్యువాత పడిన సంఖ్యను 645గా ప్రకటించారు. వీళ్లలో 323 మంది వరకూ ఈజిప్షియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా అధిక ఉష్ణోగ్రతవల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే 60 మంది వరకూ జోర్డాన్ వాసులు మరణించారని దౌత్యవేత్తలు తెలిపారు. ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనీషియాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా మృతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ ప్రభుత్వం వర్చువల్ ఆస్పత్రులను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తోంది. -
హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి!
జరుసలెం: అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 550 మందికి పైగా హజ్ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్ దౌత్యవేత్తలు వెల్లడించారు. ఇందులో అధికంగా ఈజిప్ట్ దేశానికి చెందినవాళ్లు ఉన్నారని, అధిక టెంపరేషన్ వల్ల కలిగిన ఆనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు.భారీగా వచ్చిన యాత్రికుల రద్దీ కారణంగా ఒక వ్యక్తి తీవ్ర గాయపడి మరణించగా, మిగతా మొత్తం ఈజిప్ట్‌కు చెందిన యాత్రికులు అధిక ఎండకు కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యాత్రికుల మరణాలకు సంబంధించిన వివరాలను మక్కా సమీపంలోని అల్-ముయిసెమ్ హాస్పిటల్ ఇచ్చినట్లు దౌత్య అధికారులు తెలిపారు. జోర్డాన్‌కు చెందినవాళ్లు 60 మందిని కలుపుకొని మొత్తంగా 577 మంది హజ్ యాత్రికులు మరణించినట్ల అధికారలు తెలిపారు. ఎండ వేడికి ఇంతపెద్ద సంఖ్యలు యాజ్ యాత్రికుల మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.ఇక.. సోమవారం మక్కాలో 51.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్లు సౌదీ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ మార్పుల వల్ల ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవటంతో హజ్ యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. -
హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు
సాక్షి, అమరావతి: హజ్, జెరూసలేం యాత్రికులకు రాష్ట్రప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ మంగళవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హజ్ యాత్రకు వెళ్లేవారిలో మూడు లక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్నవారికి రూ. 60 వేలు, మూడు లక్షలు పైబడి వార్షికాదాయం ఉన్న వారికి రూ. 30 వేలు చొప్పున ప్రభుత్వం సహాయంగా అందజేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మొహద్ ఇలియాస్ రిజ్వి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హజ్ యాత్రకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు ముందుగా ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలను పూర్తిగా చదవాలని, నిర్ధారిత ఫార్మాట్లో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. జెరూసలేం, ఇతర బైబిల్ సంబంధిత యాత్రాస్థలాల సందర్శనార్థం వెళ్లే వారికి.. మూడు లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ. 40 వేల సహాయాన్ని రూ. 60 వేలకు, మూడు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 20 వేలను రూ. 30 వేలకు పెంచుతున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ వేరొక ఉత్తర్వులో పేర్కొంది. -
హజ్ యాత్రికులకు సౌదీ అరేబియాలో కొత్తరకం వసతులు
-
హజ్ యాత్రికుల ఎంపిక పూర్తి
మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు ఏకే ఖాన్ హైదరాబాద్: ఈ ఏడాది మన దేశం నుంచి హజ్ వెళ్లేందుకు లక్షా 72 వేలమందికి సౌదీ అరేబియా ప్రభుత్వం అనుమతినిచ్చిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య సలహాదారు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ తెలిపారు. శనివారం నాంపల్లి హజ్‌హౌస్‌లో హజ్‌కు వెళ్లే యాత్రికులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...2017 హజ్ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా 20,601 దరఖాస్తులు అందాయన్నారు. ఇందులో సాధారణ క్యాటగిరీలో 17,564, ఏ క్యాటగిరీలో 743, బీ క్యాటగిరీలో 2294 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర హజ్ కమిటీ నిబంధనల ప్రకారం ఏ,బీ క్యాటగిరీలో దరఖాస్తు చేసుకున్న 3,037 మంది నేరుగా హజ్ యాత్రకు ఎంపికైయ్యారన్నారు. అనంతరం మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ..ఈ ఏడాది హజ్ యాత్రికుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 2017 హజ్ యాత్రకు ఎంపికైన వారు ఏప్రిల్ 5 లోపు మొదటి విడత రూ. 81 వేలు హజ్ రుసుమును కేంద్ర హజ్ కమిటీ పేరున డీడీ తీసి జమచేయాలని హజ్ కమిటీ ప్రత్యేక అధికారి తెలిపారు. ఏప్రిల్ 13వ తేదీ లోపు ఎంపికైన యాత్రికులు తమ పాస్‌పోర్టును రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో అందించాలని కోరారు. -
హజ్ యాత్రికులకు సత్వరమే పాస్‌పోర్ట్‌లు
హైదరాబాద్ : హజ్ యాత్రికులకు త్వరితగతిన పాస్‌పోర్టులను జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ పాస్ పోర్టు అధికారిణి ఎస్. అశ్విని హమీ ఇచ్చారు. బుధవారం హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎం షుకూర్ పాస్‌పోర్ట్ అధికారిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె పై హామీ ఇచ్చారు. పోలీసు క్లియరెన్స్ నివేదిక అందిన వెంటనే పాస్‌పోర్టులు జారీ చేసే విధంగా ఆదేశించామని చెప్పారు. హజ్‌యాత్ర-2016 కోసం దరఖాస్తు చేసుకునేందుకు తక్కువ సమయం ఉండటంతో వెంటనే పాస్‌పోర్టు పరిశీలన పూర్తి చేసి జారీ చేయాలని అధికారి అశ్వినికి... ఎస్ఎం షుకూర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పాస్‌పోర్టు అధికారి మదన్ మోహన్, హజ్ కమిటీ ఏఈవో ఇర్ఫాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.