హజ్ యాత్రికులకు సత్వరమే పాస్‌పోర్ట్‌లు | passports issued to hajj pilgrims, says aswini sattaru | Sakshi
Sakshi News home page

హజ్ యాత్రికులకు సత్వరమే పాస్‌పోర్ట్‌లు

Published Wed, Feb 10 2016 8:22 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

passports issued to hajj pilgrims, says aswini sattaru

హైదరాబాద్ : హజ్ యాత్రికులకు త్వరితగతిన పాస్‌పోర్టులను జారీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ పాస్ పోర్టు అధికారిణి ఎస్. అశ్విని హమీ ఇచ్చారు. బుధవారం హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎం షుకూర్ పాస్‌పోర్ట్ అధికారిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె పై హామీ ఇచ్చారు. పోలీసు క్లియరెన్స్ నివేదిక అందిన వెంటనే పాస్‌పోర్టులు జారీ చేసే విధంగా ఆదేశించామని చెప్పారు.

హజ్‌యాత్ర-2016 కోసం దరఖాస్తు చేసుకునేందుకు తక్కువ సమయం ఉండటంతో వెంటనే పాస్‌పోర్టు పరిశీలన పూర్తి చేసి జారీ చేయాలని అధికారి అశ్వినికి... ఎస్‌ఎం షుకూర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పాస్‌పోర్టు అధికారి మదన్ మోహన్, హజ్ కమిటీ ఏఈవో ఇర్ఫాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement