హజ్ యాత్ర‌లో 98 భార‌తీయుల మృతి: కేంద్రం | 98 Indians Died Of Natural Causes During Hajj, Says Foreign Ministry | Sakshi
Sakshi News home page

హజ్ యాత్ర‌లో 98 భార‌తీయుల మృతి: కేంద్రం

Published Fri, Jun 21 2024 5:14 PM | Last Updated on Fri, Jun 21 2024 6:18 PM

98 Indians Died Of Natural Causes During Hajj: Foreign Ministry

న్యూఢిల్లీ: తీవ్ర ఎండ, వేడిగాలులతో ఈ ఏడాది హజ్ యాత్రికులు పెద్ద సంఖ్యలో మృత్యువాత ప‌డ్డారు.. దాదాపు 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 98 0 మంది భారతీయులు మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర విదేశాంగ‌ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఈ మ‌ర‌ణాల‌న్నీ  స‌హ‌జ కార‌ణాల వ‌ల్లే న‌మోదైన‌ట్లు తెలిపింది.

కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్ర కోసం సౌదీని సందర్శించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  అక్కడ‌ భారతీయుల కోసం తాము చేయగలిగినదంతా చేస్తున్న‌ట్లు  పేర్కొంది.

ప్రతి సంవత్సరం కనీసం స‌గం మిలియన్ల మంది (5ల‌క్ష‌లు) హ‌జ్‌లో మ‌ర‌ణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.  అయితే వాస్తవ సంఖ్య 30 రెట్లు ఎక్కువగా ఉండ‌వ‌చ్చ‌ని హెచ్చరించింది.

కాగా ఏడాది సౌదీలో హాజ్ యాత్ర‌కు హాజ‌రైన వారిలో 10 దేశాల‌కు చెందిన దాదాపు 1,081 మంది మ‌ర‌ణించిన‌ట్లు అక్కడి వైద్యాధికారులు ధ్రువీకరించారు. అత్యధికంగా ఈజిప్టుకు చెందిన యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ వారం సౌదీలో ఉష్ణోగ్రత 51.8 డిగ్రీల సెల్సియస్  చేరుకుంది. 

ఇక‌ ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్‌ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షల మంది ఉండగా, సౌదీ పౌరులు రెండు లక్షల మందికి పైగా ఉంటారని సౌదీ హజ్‌ అధికార యంత్రాంగం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement