న్యూఢిల్లీ: సౌదీ అరేబియా తమ సావరీన్ వెల్త్ ఫండ్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) కార్యాలయాన్ని భారత్‌లో ఏర్పాటు చేసే యోచనలో ఉంది. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు పెంచుకునేందుకు ఇది దోహదపడగలదని భావిస్తంది.
ఇండియా–సౌదీ అరేబియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆ దేశ పెట్టుబడుల శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ ఈ విషయాలు చెప్పారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యాలయ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల్లో ఒక బృందాన్ని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీకి పంపించనున్నట్లు ఆయన వివరించారు.
అటు భారతీయ అంకుర సంస్థలు సౌదీ మార్కెట్లో ప్రవేశించేందుకు, భాగస్వాములను, పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు డిజిటల్‌గాను, భౌతికంగానూ తోడ్పడేలా తగు సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఫలీహ్ పేర్కొన్నారు. 2000 ఏప్రిల్–2023 జూన్ మధ్య కాలంలో భారత్‌లో సౌదీ పెట్టుబడులు 3.22 బిలియన్ డాలర్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment