swf
-
భారత్‌లో సావరీన్ ఫండ్ కార్యాలయం - సౌదీ అరేబియా యోచన
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా తమ సావరీన్ వెల్త్ ఫండ్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) కార్యాలయాన్ని భారత్‌లో ఏర్పాటు చేసే యోచనలో ఉంది. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు పెంచుకునేందుకు ఇది దోహదపడగలదని భావిస్తంది. ఇండియా–సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆ దేశ పెట్టుబడుల శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ ఈ విషయాలు చెప్పారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యాలయ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల్లో ఒక బృందాన్ని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీకి పంపించనున్నట్లు ఆయన వివరించారు. అటు భారతీయ అంకుర సంస్థలు సౌదీ మార్కెట్లో ప్రవేశించేందుకు, భాగస్వాములను, పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు డిజిటల్‌గాను, భౌతికంగానూ తోడ్పడేలా తగు సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఫలీహ్ పేర్కొన్నారు. 2000 ఏప్రిల్–2023 జూన్ మధ్య కాలంలో భారత్‌లో సౌదీ పెట్టుబడులు 3.22 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ఆ చట్టం అమలైతే డ్రైవర్లకు ఉరితాడే!
కర్నూలు (రాజ్‌విహార్): సవరించిన మోటారు వాహనాల చట్టం అమలులోకి వస్తే డ్రైవర్లకు ఉరితాడే మిగులుతుందని ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు జె. దివాకర్ అన్నారు. శనివారం కర్నూలు జిల్లాలో ఎస్‌డబ్ల్యూఎస్, మోటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు, ప్రజా సంఘాలు ఆక్టు సవరణను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆమోదం కోసం కేంద్ర కసరత్తు చేస్తోందని చెప్పారు. ఆర్టీసీకి ఉన్న రక్షణను తొలగించి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ప్రమాదాలు తగ్గించాలనే పేరుతో డ్రైవర్లపై జరిమానాలు, శిక్షలు పెంచారని సీఐటీయూ నగర నగర కార్యదర్శి ఎండి అంజిబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రాయుడు, మోటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభాకర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్ఐఐల రాకకు ఇక బ్రేక్!
చమురు ధరల పతనమే కారణం: క్రెడిట్ సూసీ ముంబై: వచ్చే ఏడాది(2015)లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు సగానికి పడిపోనున్నాయని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం క్రెడిట్ సూసీ తాజాగా అంచనా వేసింది. వెరసి 2015లో ఎఫ్ఐఐల పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు మించకపోవచ్చునని కంపెనీ ఈక్విటీ రీసెర్చ్ ఎండీ నీలకాంత్ మిశ్రా పేర్కొన్నారు. ఇందుకు సావరిన్ వెల్త్ ఫండ్స్(ఎస్‌డబ్ల్యూఎఫ్) పెట్టుబడులు మందగించడం కారణంగా నివలనున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఏడాది(2014) జనవరి నుంచి ఇప్పటివరకూ ఎఫ్ఐఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన నిధుల్లో ఇవి సగంకావడం గమనార్హం. దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌లో భాగమైన బ్లూచిప్ షేర్లలో ఎఫ్ఐఐలు ఇప్పటికే 27% వాటాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీ స్టాక్ మార్కెట్ విలువ ఇటీవలే 1.6 ట్రిలియన్ డాలర్లను తాకి కొత్త రికార్డు సృష్టించింది కూడా. దీంతో పలు బ్రోకరేజీ దిగ్గజాలు వచ్చే ఏడాదికి సెన్సెక్స్ లక్ష్యాన్ని 33,000 పాయింట్లుగా అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ సూసీ తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ముడిచమురు ధరలు భారీగా పతనంకావడంతో ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు నిధుల కొరత ఏర్పడనుందని, దీంతో వీటి పెట్టుబడులకు బ్రేక్‌పడే అవకాశముందని మిశ్రా అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యం, యూఏఈ, ఒమన్ వంటి దేశాలలో ఎస్డ బ్ల్యూఎఫ్‌లు అధికమని వెల్లడించారు. దేశీ ఈక్విటీలలో ఎస్‌డబ్ల్యూఎఫ్ నిధుల వాటా 50% వరకూ ఉంటుందని వివరించారు. కాగా, పెన్షన్ ఫండ్స్, బీమా కంపెనీలు దేశీ ఈక్విటీలపట్ల ఆసక్తికనబరుస్తున్నట్లు తెలిపారు. అయితే పెట్టుబడులకు ముందు భారీ స్థాయిలో రీసెర్చ్‌ను చేపడతాయని చెప్పారు.