సిడ్నీ: ప్రపంచంలో హీట్‌వేవ్ వల్ల సంభవించే మరణాల్లో అయిదో వంతు భారత్‌లోనేని ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా హీట్‌వేవ్ కారణంగా 1.53లక్షల మందికిపైగా మరణిస్తుండగా ఇందులో ఐదో వంతు మంది భారత్‌లో చనిపోతుండడం కలవరం కలిగిస్తోంది. హీట్‌వేవ్ మరణాల్లో భారత్ తర్వాత వరుసగా చైనా, రష్యా దేశాలున్నాయి.
మొత్తం హీట్‌వేవ్ మరణాల్లో సగం ఆసియా నుంచే కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. 1990 నుంచి ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా హీట్‌వేవ్‌తో సంభవిస్తున్న మరణాలను యూనివర్సిటీ అధ్యయనం చేసింది.
మొత్తం మరణాల్లో 30 శాతం యూరప్‌లో సంభవిస్తున్నాయని తేలింది. ప్రభుత్వాలు హీట్‌వేవ్‌ల పట్ల సమగ్ర దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేసినప్పుడే మరణాలను అరికట్టవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
క్లైమేట్ చేంజ్ మైగ్రేషన్ పాలసీ, హీట్ యాక్షన్ ప్రణాళికలు, అర్బన్ ప్లానింగ్ అండ్ గ్రీన్ స్ట్రక్చర్స్, సామాజిక మద్దతు కార్యాచరణ, పబ్లిక్ హెల్త్‌కేర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అవేర్‌నెస్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ వంటి చర్యలు హీట్‌వేవ్ మరణాలు నివారించడానికి తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment