మూడు భాషల్లో హజ్‌ యాత్ర వెబ్‌సైట్‌ | Hajj website in three languages | Sakshi
Sakshi News home page

మూడు భాషల్లో హజ్‌ యాత్ర వెబ్‌సైట్‌

Published Wed, Dec 21 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

మూడు భాషల్లో హజ్‌ యాత్ర వెబ్‌సైట్‌

మూడు భాషల్లో హజ్‌ యాత్ర వెబ్‌సైట్‌

సాక్షి, న్యూఢిల్లీ: హజ్‌ యాత్ర చేసేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హెచ్‌ఏజే.జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేసింది. ఈ వెబ్‌సైట్‌ను ఆ శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మంగళవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు.

ఈ వెబ్‌సైట్‌లో మైనారిటీ వ్యవహారాల శాఖ సమాచారం, హజ్‌ విభాగం, హజ్‌ యాత్ర వివరాలు, నిబంధనలు, నియమావళి, హజ్‌ కమిటీ వివరాలు, ప్రైవేటు టూర్‌ ఆపరేటర్ల వివరాలు, ఈ యాత్రలో చేయాల్సినవి, చేయకూడనివి తదితర వివరాలను పొందుపరిచినట్టు తెలిపారు. హజ్‌–2017 యాత్రకు జనవరి 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement