Minority Affairs
-
మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం పెద్దలు, మత గురువులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై సీఎంకు తమ అభిప్రాయాలను మత పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదు. మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు. ‘‘ఉమ్మడి పౌరస్మృతి అంశం మీద డ్రాఫ్ట్ అనేది ఇప్పటివరకూ రాలేదు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కాని మీడియాలో, పలుచోట్ల చర్చ విపరీతంగా నడుస్తోంది. వాటిని చూసి ముస్లింలు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తంచేస్తున్నారు. కొన్ని అంశాలను మీ అందరి దృష్టికి తీసుకు వస్తున్నాను. ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటేగనుక ఏం చేసేవారన్నదానిపై మీరు ఆలోచనలు చేసి నాకు సలహాలు ఇవ్వండి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఇక్కడ ఇంకో విషయాన్నికూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రొపగండా నడుస్తోంది. ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలి. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏ తండ్రైనా, ఏతల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపుతారు. మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీ లేదనే విషయాన్ని మన అంతా స్పష్టం చేద్దాం’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. ‘‘భారతదేశం చాలా విభిన్నమైనది. ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న వివిధ కులాలు, వర్గాలకూ వివిధ రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వారి వారి మత గ్రంథాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్ లాబోర్డులు ఉన్నాయి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఏ నియమమైనా ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారానే చేయాలి. ఎందుకంటే వాటి మీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి. Misinterpretationకు తావు ఇవ్వకుండా ఉంటుంది కాబట్టి. ఒకవేళ మార్పులు అవసరం అనుకుంటే, ఈ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్, కేంద్ర ప్రభుత్వం కూడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సనల్ లాబోర్డ్స్‌తో మమేకమై, వారి పర్సనల్ లా బోర్డ్స్ ద్వారా జరగాలి’’ సీఎం జగన్ తెలిపారు. -
మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత మైనారిటీ వ్యవహారాల మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మోదీ ఆ సమావేశంలో నేతలను సంబంధంలేని అంశాలపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగానే నఖ్వీ మోదీ ఎప్పుడూ విభేదాలు సృష్టించే వారిని మందలిస్తూనే ఉంటారని, పార్టీ సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించరని చెప్పుకొచ్చారు. ఆయన ఇలాంటి విషయాల్లో నేతలను హెచ్చరించడం మొదటిసారి కాదని, సమాజంలో చీలికలు సృష్టించే వ్యక్తులకు మోదీ తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. అలాగే తన పార్టీ సభ్యులు ఇలాంటి ప్రకటనలు చేసిన అంగీకరించరని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలు పస్మాండ, ముస్లీంలు, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు తదితరాలను సమగ్ర అభివృద్ధికి బ్రాండ్‌గా విశ్వసిస్తున్నారని చెప్పారు. మోదీ సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తారని నొక్కి చెప్పారు. ఈ సమయంలో ఇంకోవైపు కూడా దృష్ట కేంద్రీకరించాలని అన్నారు. ప్రతి పక్షాలను ఉద్దేశిస్తూ..విషపూరిత కుట్రలపై లౌకిక సిండికేట్ ఎల్లప్పుడూ మౌనంగా ఉంటుందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వారంతా ఇలాంటి విషయాలను వ్యతిరేకించరని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, మోదీ మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పార్టీ నేతలకు విధ్వంసకర వ్యాఖ్యలను చేయొద్దని హెచ్చరించారు. ఆయన బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్‌కి సంబంధించిన పఠాన్ సినిమా విషయంలో పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు, విధ్వంసం నేపథ్యంలోనే ఈ సూచనలు చేశారు. ఆ సమావేశంలో పార్టీ ఎజెండా గురించి నొక్కి చెప్పారు. అలాగే 2024 జాతీయ ఎన్నికలకు కేవలం 400 రోజులే ఉన్నందున పార్టీ సభ్యులు ప్రతి విభాగానికి సేవ చేయాలని, ఓట్లు ఆశించకుండా అన్నికమ్యూనిటీలను కలవాలని మోదీ కోరారు. (చదవండి: తమిళనాడు Vs తమిళగం దుమారం..వివరణ ఇచ్చిన గవర్నర్) -
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఈ నిర్ణయం వెనుక ఉపరాష్ట్రపతి రేసులో ఆయన నిల్చునే అవకాశాలు ఉన్నట్లు చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. చివరిసారిగా బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నఖ్వీ పాల్గొనగా.. మంత్రిగా నఖ్వీ సేవలను ప్రశంసించారు ప్రధాని మోదీ. కేబినెట్ భేటీ అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంకు వెళ్లిన నఖ్వీ.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మైనార్టీ నేతగా నఖ్వీకి ప్రాధాన్యం ఇస్తూ.. ఆయన ఉపరాష్ట్రపతి రేసులో నిలపాలని బీజేపీ యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాజ్యసభ వ్యవహారాలపై నఖ్వీకి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు తెర మీదకు వచ్చింది. అయితే బీజేపీ తరపున దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
రెచ్చగొట్టి అలజడులకు కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముస్లింలను రెచ్చగొట్టి అలజడులు సృష్టించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పన్నుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్ రజా మైనార్టీ యువతకు సూచించారు. ‘చలో నంద్యాల’ పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముస్లింలను కరివేపాకు మాదిరిగా వాడుకుని వదిలేసే పార్టీల తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కృష్ణా జిల్లా కొండపల్లిలోని హజ్రత్ సయ్యద్ షా బుఖారి ఆస్థాన ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం మైనార్టీలతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. నంద్యాలలో షేక్ అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించడం అభినందనీయమన్నారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులతో వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపి ఘటనకు బాధ్యులైన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. పోలీసులే నిందితులుగా ఉన్న కేసులో బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వమే పిటిషన్ దాఖలు చేయడం ఇదే తొలిసారి అని తెలిపారు. సలాం అత్తకు రూ.25 లక్షలు పరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు. ఆ కార్యక్రమాలకు దూరంగా ఉందాం.. ముస్లిం యువతను రెచ్చగొట్టి ప్రభుత్వానికి దూరం చేసేందుకు కొన్ని పార్టీలు ‘చలో నంద్యాల’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అల్తాఫ్ రజా సూచించారు. కొంత మందిని అడ్డుపెట్టుకుని చేస్తున్న స్వార్థ రాజకీయాలను ఆపకుంటే రోడ్డుపైకి వచ్చి నిలదీస్తామని, గత ప్రభుత్వ పాలనలో ముస్లింలకు చేసిన అన్యాయాలను ఎలుగెత్తి చాటుతామని హెచ్చరించారు. దోషులను తేల్చాలి.. దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ముస్లింలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నారని అల్తాఫ్ తెలిపారు. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి గౌరవించారని, నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే మైనార్టీలకు అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేద్దామని సూచించారు. సలాంపై మోపిన దొంగతనం కేసు, అపవాదులపై క్షుణ్నంగా విచారణ జరిపి అసలు దోషులను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశ ద్రోహం కేసులు గుర్తున్నాయ్.. ఘటనలో నిందితులైన ఇద్దరు పోలీసులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేస్తే కొందరు రాజకీయ నేతలు వారికి బెయిల్ ఇప్పించారని అల్తాఫ్ రజా పేర్కొన్నారు. ఇప్పుడు ముస్లింలపై ప్రేమ నటిస్తున్న పార్టీ గతంలో ‘నారా హమారా’లో ప్రశ్నించిన వారిపై దేశ ద్రోహం కేసులు నమోదు చేయడం, గుంటూరు సభలో అక్రమ కేసులు బనాయించడాన్ని ఎవరూ మరచిపోలేదన్నారు. చంద్రబాబు పాలనలో ముస్లింలపై మోపిన అక్రమ కేసులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎత్తి వేశారని గుర్తు చేశారు. -
'రోస్టర్ రిజర్వేషన్ మేరకే నియామకాలు'
సాక్షి, కర్నూలు : ఏపీ డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా మంగళవారం కర్నూల్ జిల్లాలోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యునివర్సిటీని సందర్శించారు. సరైన వసతులు లేక యునివర్సిటీలో అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. వెంటనే యునివర్సిటీ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈసీ ప్రతిపాధించిన రోస్టర్ రిజర్వేషన్ ప్రకారమే యునివర్సిటీలో నియామకాలు చేపడతామని మంత్రి తెలిపారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంజాద్ వెల్లడించారు. -
అవినీతి రహిత పాలనను అందిస్తాం: డిప్యూటి సీఎం
సాక్షి, అమరావతి : మైనార్టీ శాఖా మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అంజాద్ బాషా.. వైఎస్సార్ కడప జిల్లాలోని మసీదులు, చర్చిల మరమ్మత్తుల నిమిత్తం 3 కోట్ల 36 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎం చేసినందుకు సీఏం గారికి కృతజ్ఞతలు తెలిపారు. వక్స్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని, వక్స్ బోర్డు ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం సోదరులు వినియోగిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లో వైఎస్సార్సీపీ అవినీతి రహిత పాలననే అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని, తాము కూడా అదే బాటలో ముందుకు వెళడానికి కృషి చేస్తామని పేర్కోన్నారు. జగన్ పాలన, తన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి పాలనను మించేలా ఉండబోతుందని పేర్కోన్నారు. -
మైనార్టీ వ్యవహారాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
-
మూడు భాషల్లో హజ్ యాత్ర వెబ్సైట్
సాక్షి, న్యూఢిల్లీ: హజ్ యాత్ర చేసేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హెచ్ఏజే.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేసింది. ఈ వెబ్‌సైట్‌ను ఆ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ వెబ్సైట్లో మైనారిటీ వ్యవహారాల శాఖ సమాచారం, హజ్ విభాగం, హజ్ యాత్ర వివరాలు, నిబంధనలు, నియమావళి, హజ్ కమిటీ వివరాలు, ప్రైవేటు టూర్ ఆపరేటర్ల వివరాలు, ఈ యాత్రలో చేయాల్సినవి, చేయకూడనివి తదితర వివరాలను పొందుపరిచినట్టు తెలిపారు. హజ్–2017 యాత్రకు జనవరి 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు.