సాక్షి, కర్నూలు : ఏపీ డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా మంగళవారం కర్నూల్ జిల్లాలోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యునివర్సిటీని సందర్శించారు. సరైన వసతులు లేక యునివర్సిటీలో అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. వెంటనే యునివర్సిటీ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈసీ ప్రతిపాధించిన రోస్టర్ రిజర్వేషన్ ప్రకారమే యునివర్సిటీలో నియామకాలు చేపడతామని మంత్రి తెలిపారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంజాద్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment