సాక్షి, అమరావతి : మైనార్టీ శాఖా మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అంజాద్ బాషా.. వైఎస్సార్ కడప జిల్లాలోని మసీదులు, చర్చిల మరమ్మత్తుల నిమిత్తం 3 కోట్ల 36 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎం చేసినందుకు సీఏం గారికి కృతజ్ఞతలు తెలిపారు.
వక్స్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని, వక్స్ బోర్డు ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం సోదరులు వినియోగిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లో వైఎస్సార్సీపీ అవినీతి రహిత పాలననే అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని, తాము కూడా అదే బాటలో ముందుకు వెళడానికి కృషి చేస్తామని పేర్కోన్నారు. జగన్ పాలన, తన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి పాలనను మించేలా ఉండబోతుందని పేర్కోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment