మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు | BJP Senior Leader Said On PM Modi Message Not The First Time | Sakshi
Sakshi News home page

మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు

Published Wed, Jan 18 2023 4:41 PM | Last Updated on Wed, Jan 18 2023 4:50 PM

BJP Senior Leader Said On PM Modi Message Not The First Time - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత మైనారిటీ వ్యవహారాల మాజీ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మోదీ ఆ సమావేశంలో నేతలను సంబంధంలేని అంశాలపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగానే నఖ్వీ మోదీ ఎప్పుడూ విభేదాలు సృష్టించే వారిని మందలిస్తూనే ఉంటారని, పార్టీ సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించరని చెప్పుకొచ్చారు.

ఆయన ఇలాంటి విషయాల్లో నేతలను హెచ్చరించడం మొదటిసారి కాదని, సమాజంలో చీలికలు సృష్టించే వ్యక్తులకు మోదీ తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. అలాగే తన పార్టీ సభ్యులు ఇలాంటి ప్రకటనలు చేసిన అంగీకరించరని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలు పస్మాండ, ముస్లీంలు, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు తదితరాలను సమగ్ర అభివృద్ధికి బ్రాండ్‌గా విశ్వసిస్తున్నారని చెప్పారు. మోదీ సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తారని నొక్కి చెప్పారు.

ఈ సమయంలో ఇంకోవైపు కూడా దృష్ట కేంద్రీకరించాలని అన్నారు. ప్రతి పక్షాలను ఉద్దేశిస్తూ..విషపూరిత కుట్రలపై లౌకిక సిండికేట్‌ ఎల్లప్పుడూ మౌనంగా ఉంటుందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ నేతలు, మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌ లాంటి వారంతా ఇలాంటి విషయాలను వ్యతిరేకించరని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, మోదీ మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పార్టీ నేతలకు విధ్వంసకర వ్యాఖ్యలను చేయొద్దని హెచ్చరించారు.

ఆయన బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌కి సంబంధించిన పఠాన్‌ సినిమా విషయంలో పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు, విధ్వంసం నేపథ్యంలోనే ఈ సూచనలు చేశారు. ఆ సమావేశంలో పార్టీ ఎజెండా గురించి నొక్కి చెప్పారు. అలాగే 2024 జాతీయ ఎన్నికలకు కేవలం 400 రోజులే ఉన్నందున పార్టీ సభ్యులు ప్రతి విభాగానికి సేవ చేయాలని, ఓట్లు ఆశించకుండా అన్నికమ్యూనిటీలను కలవాలని మోదీ కోరారు. 

(చదవండి: తమిళనాడు Vs తమిళగం దుమారం..వివరణ ఇచ్చిన గవర్నర్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement