senior leader
-
చంద్రబాబు విన్యాసాలు.. కష్టాల్లో ఏపీ ప్రజలు
-
నా ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపండి
సాక్షి, హైదరాబాద్: తన ఫామ్‌హౌస్‌లోని ఏ కట్టడమైనా ఒక్క అంగుళం ఎఫ్టీఎల్ లేదా బఫర్‌జోన్‌లో ఉన్నా సొంత ఖర్చులతో కూల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు ప్రక టించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకు చట్టం నుంచి ఏ మినహాయింపులు వద్దు. ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏవిధంగా వ్యవహరిస్తుందో, అదే విధంగా వ్యవహరిస్తే చాలు. ఎక్కువ–తక్కువలు అవసరం లేదు.మీరు, నేను కలగజేసుకోకుండా చట్టాన్ని తన పని చేసుకుపోనిద్దాం’’అని పేర్కొంటూ శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపేరు తేవడానికి తనలో నరనరాన ఉన్న కాంగ్రెస్ రక్తం అంగీకరించనందునే ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తగా ప్రాంతాలకు అతీతంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ బలోపేతానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తున్నా.. హైదరాబాద్ శివార్లలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తన ఫామ్‌హౌస్‌కు సంబంధిత అధికారులను పంపాలని.. వారు చట్టప్రకారం మార్క్ చేస్తే ఆ పరిధిలో కట్టడాలేవైనా ఉంటే 48 గంటల్లో కూల్చి, ఆ వ్యర్థాలను కూడా తొలగిస్తానని కేవీపీ లేఖ లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భారం పడనివ్వబోనని తెలిపారు. అయితే మార్కింగ్ ప్రక్రి య పారదర్శకంగా జరగాలని.. తేదీ, సమయాన్ని ముందే ప్రకటిస్తే ప్రతిపక్ష నాయకులు కూడా తీరిక చేసుకుని వచ్చి వీక్షించే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే మాట్లాడుతున్నారని, వారిది మొసలి కన్నీరని విమర్శించారు.‘‘బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని, తద్వారా మిమ్మల్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారు కాంగ్రెస్ సీఎంపై నిరాధార ఆరోపణలు చేయడానికి నన్ను, మా ఫామ్‌హౌస్‌ను పావుగా వాడుకోవడం మనోవేదన కలిగిస్తోంది. నేను కాంగ్రెస్‌లో క్రమశిక్షణ గల కార్యకర్తను. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా సమరి్థస్తాను. ఈ విషయాన్ని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమే అయినా తప్పడం లేదు’’లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
శ్రీలంక హక్కుల నేత సంపంతన్ కన్నుమూత
కొలంబో: శ్రీలంకకు చెందిన సీనియర్ తమిళ నేత ఆర్.సంపంతన్ (91) కన్నుమూశారు. అనా రోగ్యంతో బాధపడుతున్న ఆయన కొలంబోలోని ఆస్పత్రిలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు తమిళ నేషనల్ అలయెన్స్ (టీఎన్ఏ) పార్టీ ప్రకటించింది. మితవాద భావాలు కలిగిన ఆయన శ్రీలంకలో తమిళులకు శాంతి, న్యాయం, గౌరవప్రదమైన స్థానం కోసం జీవితాంతం శ్రమించారు. సింహళులు మెజారిటీగా ఉన్న శ్రీలంకలో సంపంతన్ సారథ్యంలోని టీఎన్ఏ తొలిసారి 2004లో తమిళులకు చెందిన రెండో ప్రధాన ప్రతిపక్షంగా మారింది. 1948లో బ్రిటన్ నుంచి శ్రీలంక స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి అక్కడి తమిళులు స్వతంత్ర ప్రతిపత్తి డిమాండ్‌ను వినిపిస్తూనే ఉన్నారు. 1970ల వరకు శాంతియుతంగానే సాగిన వీరి పోరాటం అనంతర కాలంలో హింసాత్మక రూపం దాల్చింది. 1977లో ట్రింకోమలి నుంచి సంపంతన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తమిళుల స్వతంత్ర ప్రతిపత్తి డిమాండ్‌కు రాజకీయ పరమైన పరిష్కారానికి తీవ్రంగా ప్రయత్నించారు. 2015లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన శ్రీలంక నూతన రాజ్యాంగం రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఆయన మృతికి ప్రధాని మోదీ తదితరులు సంతాపం ప్రకటించారు. -
ధర్మపురి శ్రీనివాస్ ప్రస్థానం
-
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీ. శ్రీనివాస్ కన్నుమూత
-
కేసీఆర్ పై చర్యలేవి ?
-
టీడీపీది కావాలనే దుష్టప్రచారం..
-
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్‌పురి దాకా...హోరాహోరీ
లోక్‌సభ ఎన్నికల సుదీర్ఘ ఘట్టంలో మే 7న మూడో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ విడతలో రాజకీయ ఉద్ధండులతో పాటు కొత్త ముఖాలూ బరిలో ఉన్నారు. కొల్హాపూర్‌లో ఛత్రపతి శివాజీ వారసునికి బీజేపీ టికెటిచి్చంది. శివమొగ్గలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ భార్య బరిలోకి ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ లోక్‌సభ టికెట్ తీసుకున్నారు. మెయిన్‌పురిలో డింపుల్ భాభీ మరోసారి మేజిక్ చేసేందుకు సిద్ధమంటున్నారు. ఇలా మూడో దశ బరిలో ఆసక్తి రేపుతున్న కీలక స్థానాలపై ఫోకస్... బారామతి వదినా మరదళ్ల వార్! దేశమంతటా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గమిది. మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ ముద్దుల తనయ సుప్రియా సులేపై వదిన సునేత్రా పవార్ పోటీకి సై అంటున్నారు. బాబాయి శరద్ పవార్‌పై తిరుగుబావుటా ఎగరేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని దక్కించుకున్న అజిత్ పవార్ తన చెల్లెలిపై ఏకంగా భార్యనే రంగంలోకి దించారు. సుప్రియ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. ఎన్సీపీ (శరద్) వర్గానికి సారథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నేత కంచన్ రాహుల్ కూల్‌పై 1,55,774 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి వదినా మరదళ్ల మధ్య హై ఓల్టేజ్ పోటీ నెలకొంది. సునేత్రకు బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి కూటమి బలమైన దన్నుంది. ఇక సుప్రియ కాంగ్రెస్, శివసేన (ఠాక్రే) ఎన్సీపీ (పవార్)తో కూడిన మహా వికాస్ అగాడీ తరఫున వదినకు సవాలు విసురుతున్నారు. బీఎస్పీ నుంచి ప్రియదర్శని కోక్రే కూడా రేసులో ఉన్నారు. విదిశ మామాజీ ఈజ్ బ్యాక్ మధ్యప్రదేశ్‌కు 20 ఏళ్లకు పైగా సీఎం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించి పెట్టారు. ఇంతటి రికార్డున్నా శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మళ్లీ సీఎంగా చాన్స్ రాలేదు. అయితే బీజేపీ అనూహ్యంగా ఆయనను విదిశ నుంచి లోక్‌సభ బరిలో దింపింది. ‘‘శివరాజ్‌ను ఢిల్లీకి తీసుకెళ్తా. కేంద్ర ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు’ అన్న మోదీ ప్రకటనతో విదిశ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మామాజీగా ప్రసిద్ధుడైన శివరాజ్ ఇక్కడ 1991 నుంచి 2004 దాకా వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలవడం విశేషం. బీజేపీ దిగ్గజాలు వాజ్‌పేయి ఒకసారి, సుష్మా స్వరాజ్ రెండుసార్లు ఇక్కడ విజయం సాధించారు. ఈ బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ నుంచి ప్రతాప్ భాను శర్మ బరిలో ఉన్నారు. ఆయన కూడా 1980, 1984లో ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఏకంగా 40 ఏళ్ల తర్వాత మళ్లీ బరిలో దిగుతున్నారు!ఆగ్రా త్రిముఖ పోరు యూపీకి దళిత రాజధానిగా పేరొందిన ఆగ్రాలో ముక్కోణపు పోరు నెలకొంది. సిట్టింగ్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్‌పై బీఎస్పీ నుంచి పూజా అమ్రోహి, సమాజ్‌వాదీ నుంచి సురేశ్ చంద్ర కర్దామ్ బరిలో ఉన్నారు. మోదీ–యోగీ ఫ్యాక్టర్, అయోధ్య రామమందిరం, సంక్షేమ పథకాలనే బఘెల్ నమ్ముకున్నారు. వైశ్యులు, బ్రాహ్మణులు, పంజాబీలు, యాదవేతర ఓబీసీలతో పాటు దళితుల్లో ఒక వర్గం కమలానికి మద్దతిస్తుండటం ఆయనకు కలిసి రానుంది. దళితుల ఓటు బ్యాంకుపై పూజ, జాతవ్‌లు, ముస్లిం ఓట్లపై కర్దామ్ ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడి 20.57 లక్షల ఓట్లలో 30 శాతం దళితులే. వారిలోనూ మూడొంతుల మంది జాతవ్ దళితులు! బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులిద్దరిదీ ఇదే సామాజికవర్గం. ప్రత్యర్థుల నాన్ లోకల్ విమర్శలను పూజ దీటుగా తిప్పికొడుతున్నారు. ఈ స్థానం ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. రామమందిర ఉద్యమంతో 1990 నుంచి బీజేపీ గుప్పిట్లోకి చేరింది. మధ్యలో రెండుసార్లు మాత్రం ఎస్పీ నుంచి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ గెలిచారు.శివమొగ్గ బీజేపీకి పక్కలో బల్లెం కర్ణాటక దిగ్గజ నేత బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర మరోసారి శివమొగ్గలో బరిలో నిలిచారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ భార్య గీతకు కాంగ్రెస్ టికెటివ్వడంతో రాజకీయం వేడెక్కింది. పైగా బీజేపీతో 50 ఏళ్లకు పైగా అనుబంధమున్న అగ్ర నేత కేఎస్ ఈశ్వరప్ప స్వతంత్ర అభ్యరి్థగా బరిలో నిలిచి రాఘవేంద్రకు పక్కలో బల్లెంలా మారారు. ఈ ముక్కోణపు పోటీ అందరినీ ఆకర్షిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న ఈశ్వరప్ప తన కుమారుడు కంతేశ్‌కు ఎంపీ టికెట్ కోసం విఫలయత్నం చేశారు. యడ్యూరప్పతో మొదట్నుంచీ ఉప్పు నిప్పుగా ఉన్న ఈశ్వరప్పకు ఈ పరిణామం తీవ్ర ఆగ్రహం కలిగించింది. రాష్ట్ర బీజేపీ చీఫ్, యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రపై తీవ్ర విమర్శలకు దిగి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాను మోదీకి వీర విధేయుడినంటూ ఆయన బొమ్మతోనే ఈశ్వరప్ప జోరుగా ప్రచారం చేస్తుండటంతో బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు!కొల్హాపూర్.. బరిలో ఛత్రపతి ఛత్రపతి శివాజీ వంశీయుడిని కాంగ్రెస్ బరిలోకి దించడంతో కొల్హాపూర్‌లో పోటీ కాక పుట్టిస్తోంది. శివసేన సిట్టింగ్ ఎంపీ సంజయ్ మాండ్లిక్ ఈసారి శివసేన (షిండే) నేతగా మహాయుతి కూటమి తరఫున మళ్లీ బరిలో ఉన్నారు. దాంతో కాంగ్రెస్, శివసేన (ఠాక్రే) ఎన్సీపీ (శరద్)లతో కూడిన మహా వికాస్ అగాడీ వ్యూహాత్మకంగా ఛత్రపతి రాజర్షి సాహు మహారాజ్‌కు టికెటిచ్చింది. ఆయన కాంగ్రెస్ అభ్యరి్థగా బరిలో ఉన్నారు. అయితే ఆయన శివాజీకి నిజమైన వారసుడు కాదన్న మాండ్లిక్ వ్యాఖ్యలతో అగ్గి రాజుకుంది. వీటిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికార కూటమి వెనక్కు తగ్గింది. ‘గాడీ (సింహాసనం)ని గౌరవించండి. కానీ ఓటు మాత్రం మోడీకే వేయండి’ అంటూ కొత్త తరహా ప్రచారం మొదలుపెట్టింది. రెండు కూటముల మధ్య ఇక్కడ టఫ్ ఫైట్ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు గట్టి పట్టుండటం సాహు మహారాజ్‌కు కలిసొచ్చే అంశం.మెయిన్‌పురి.. భాభీ సవాల్ ఈ స్థానం ఎస్పీ దిగ్గజం దివంగత ములాయం సింగ్ యాదవ్ కంచుకోట. ములాయం మరణానంతరం 2022లో ఉప ఎన్నికలో ఆయన కోడలు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ సత్తా చాటారు. 2.88 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ శాక్యను ఓడించారు. ఈసారి మళ్లీ బీజేపీకి సవాలు విసురుతున్నారు. బీజేపీ నుంచి యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. ఫిరోజాబాద్‌కు చెందిన ఠాకూర్ బలమైన నాయకుడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. బీఎస్పీ కూడా శివ ప్రసాద్ యాదవ్ రూపంలో బలమైన అభ్యరి్థని రంగంలోకి దించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. బీఎస్పీ నుంచి మధ్యలో బీజేపీలోకి వెళ్లిన శివప్రసాద్ అనంతరం సొంత పార్టీ కూడా పెట్టి చివరికి బీఎస్పీ గూటికే చేరారు. ఇక్కడ మోదీ–యోగి ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో సమాజ్‌వాదీకి ఎలాగైనా చెక్ పెట్టేందుకు కమలనాథులు తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. కానీ డింపుల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Odisha: ఎన్నికల వేళ ‘బీజేడీ’కి గట్టి దెబ్బ
భువనేశ్వర్: అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ ఒడిషాలో అధికార బీజేడీకి గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఆరుసార్లు ఎంపీ భర్తృహరి మెహతాబ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌కు రాజీనామా లేఖ పంపినట్లు తెలిపారు. అవినీతిపై పోరాటంలో పార్టీకి కమిట్మెంట్ లేనందునే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని మెహతాబ్ వెల్లడించారు. అవినీతిపై పోరకు తాను ఇచ్చిన సలహాలు సూచనలకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికి ఓపిక ఉంటుందని, ఇప్పుడది నశించిందని అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. పార్టీని వీడినప్పటికీ అవినీతిపై తన పోరాటం కొనసాగిస్తానన్నారు. ప్రస్తుతం కటక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న భర్తృహరి మెహతాబ్ ఒడిషా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మెహతాబ్ కుమారుడు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేడీ, బీజేపీ పొత్తు ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేడీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఇదీ చదవండి.. లోక్‌సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు -
తొలిసారి లోక్‌సభకు జేపీ నడ్డా పోటీ?
లోక్‌సభ ఎన్నికల బరిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు రాజ్యసభ సభ్యులు కనిపించనున్నారు. సీనియర్ నేతలను వారి సొంత రాష్ట్రాల నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ నిర్ణయించిందని సమాచారం. బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నడ్డా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా జేపీ నడ్డా రాజ్యసభలో రెండోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. రాజ్యసభకు చెందిన సీనియర్ నేతలను రంగంలోకి దించితే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. దానికి ప్రధాన కారణం ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో పలువురు సీనియర్ నేతలు రాజ్యసభ సభ్యులగా ఉన్నారు. ఈ విషయాన్ని పలువురు మంత్రులు, ఎంపీలు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. కాగా రాజ్యసభ సభ్యునిగా ఒక నేతకు రెండు పర్యాయాలకు మించి అవకాశం ఇవ్వకూడదనే విధానాన్ని పార్టీ రూపొందించింది. ఈ విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. నడ్డా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ విధానాన్ని కొనసాగించినట్లవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నడ్డా రెండవసారి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. ఇదిలావుండగా న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు మంత్రులు ఆకాంక్షిస్తున్నారు. అయితే పార్టీలోని సీనియర్ నేతలను, మంత్రులను వారి సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలని నాయకత్వం అనుకుంటోంది. అప్పుడే ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోంది. -
పోటీలో సీనియర్లు.. గండం గట్టెక్కాలంటే గెలిచి తీరాల్సిందే.. లేదంటే!
ఎన్నికల్లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది మామూలు విషయమే. కాని పదే పదే ఓడిపోయే నేతలకు రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. అందుకే ఈసారి చాలా మంది నేతలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఓడితే వచ్చేసారి టిక్కెట్ రాదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే కసితో ఎన్నికల పోరాటంలో పాల్గొంటున్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే అనుకుంటారు. అందుకోసమే శ్రమిస్తారు. అయతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థులకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే రెండు లేదా మూడుసార్లు ఓడిపోయినా.. ఆయా పార్టీలు వారికి ఈసారికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు గనుక ఓడిపోతే..ఇక తమ రాజకీయ జీవితం ఖతం అయిపోయినట్లే అనే భయం ఆ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇలా రెండు, మూడు సార్లు ఓడిపోయి.. ఇప్పుడు బరిలో దిగినవారు అధికార బీఆర్ఎస్లో మాత్రం పెద్దగా లేరు. కాంగ్రెస్, బీజేపీల్లో ఇటువంటి అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వారందరి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏడెనిమిది మంది అభ్యర్థులు రెండు మూడు సార్లుగా వరుసగా ఓడిపోతున్నవారే. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా నిజామాబాద్‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ది ఇదే పరిస్థితి.. ఈసారి సింపతితో గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్. ఇప్పటికే మూడు సార్లు ఓడిన ఆది శ్రీనివాస్ మరోసారి వేములవాడ బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. గండ్ర సత్యనారాయణ, గడ్డం ప్రసాద్, కేఎల్ఆర్, ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతల పరిస్థితి ఇదే. ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిన నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక బీజేపీ లోను కొందరు నేతల పరిస్థితి ఇలాగే ఉంది. సనత్ నగర్ నుంచి ఇప్పటికే పలుమార్లు అదృష్టం పరిక్షించుకున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మరోసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ బరిలో దిగారు. ఇది నాకు చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారట మర్రి. మరోనేత మహేశ్వర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యి ఈ సారి మళ్ళీ నిర్మల్ బరిలో దిగారు. తల్లోజు ఆచారి పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో విజయం గుమ్మం దాకా వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఈ సారి గెలుపు పై ఆచారి ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వరుస ఓటములతో చతికిల పడ్డారు. సూర్యాపేట నుంచి బరిలో ఉన్న సంకినేని వెకటేశ్వరరావు , రామచందర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ లది ఇదే పరిస్థితి. అన్ని పార్టీల్లోనూ 15 నుంచి 20 మంది రెండు లేదా మూడు సార్లు వరుసగా ఓడిపోయారు. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. ఇప్పుడు గనుక ఓడితే ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ తప్పదని వారంతా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రజలు వారిపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
విషాదం.. బీజేపీ సీనియర్ నేత, ఎంపీ దూబే కన్నుమూత
ఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే(73) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా, దుబే పార్థీవాదేహాన్ని ఈరోజు మధ్యాహ్నం ఆగ్రాకు తీసుకురానున్నారు. వివరాల ప్రకారం.. దుబే ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, దూబే క్షేమంగా ఉన్నారని ఆయన కుమారుడు ప్రన్షు దూబే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో కొంతసేపటికి శ్వాస ఆగిపోయిందని తెలిపారు. ఆయన మృతికి బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇక, హరద్వార్ దూబే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. దూబే 2020లో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. హర్ద్వార్ దూబేకి కుమారుడు ప్రన్షు దూబే, కోడలు ఊర్వశి, కుమార్తె డాక్టర్ కృత్యా దూబే ఉన్నారు. ఆయన సోదరుడు గామా దూబే కూడా బీజేపీ సీనియర్ నేత కావడం విశేషం. Saddened by the passing away of Rajya Sabha MP Shri Hardwar Dubey Ji. My heartfelt condolences to his family and friends. Praying for his sadgati. Om Shanti pic.twitter.com/kaBYVt6ibC — Pralhad Joshi (@JoshiPralhad) June 26, 2023 ఇది కూడా చదవండి: హిమాచల్‌లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం -
ఇక కాస్కోండి..!
-
మోదీ ఇలా అనడం తొలిసారి కాదు!: బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత మైనారిటీ వ్యవహారాల మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మోదీ ఆ సమావేశంలో నేతలను సంబంధంలేని అంశాలపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగానే నఖ్వీ మోదీ ఎప్పుడూ విభేదాలు సృష్టించే వారిని మందలిస్తూనే ఉంటారని, పార్టీ సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించరని చెప్పుకొచ్చారు. ఆయన ఇలాంటి విషయాల్లో నేతలను హెచ్చరించడం మొదటిసారి కాదని, సమాజంలో చీలికలు సృష్టించే వ్యక్తులకు మోదీ తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. అలాగే తన పార్టీ సభ్యులు ఇలాంటి ప్రకటనలు చేసిన అంగీకరించరని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలు పస్మాండ, ముస్లీంలు, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు తదితరాలను సమగ్ర అభివృద్ధికి బ్రాండ్‌గా విశ్వసిస్తున్నారని చెప్పారు. మోదీ సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తారని నొక్కి చెప్పారు. ఈ సమయంలో ఇంకోవైపు కూడా దృష్ట కేంద్రీకరించాలని అన్నారు. ప్రతి పక్షాలను ఉద్దేశిస్తూ..విషపూరిత కుట్రలపై లౌకిక సిండికేట్ ఎల్లప్పుడూ మౌనంగా ఉంటుందని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వారంతా ఇలాంటి విషయాలను వ్యతిరేకించరని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, మోదీ మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పార్టీ నేతలకు విధ్వంసకర వ్యాఖ్యలను చేయొద్దని హెచ్చరించారు. ఆయన బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్‌కి సంబంధించిన పఠాన్ సినిమా విషయంలో పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు, విధ్వంసం నేపథ్యంలోనే ఈ సూచనలు చేశారు. ఆ సమావేశంలో పార్టీ ఎజెండా గురించి నొక్కి చెప్పారు. అలాగే 2024 జాతీయ ఎన్నికలకు కేవలం 400 రోజులే ఉన్నందున పార్టీ సభ్యులు ప్రతి విభాగానికి సేవ చేయాలని, ఓట్లు ఆశించకుండా అన్నికమ్యూనిటీలను కలవాలని మోదీ కోరారు. (చదవండి: తమిళనాడు Vs తమిళగం దుమారం..వివరణ ఇచ్చిన గవర్నర్) -
టీడీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: టీడీపీ మనుగడపై ఆ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులకు రోజురోజుకూ నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రతిపక్ష పాత్ర సమర్థంగా పోషించాలని ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడం, అంచనాలను అందుకోవడంలో నాయకత్వం దారుణంగా విఫలమైందని, అస్తవ్యస్త విధానాలతో ఉనికి కోల్పోయి కొట్టుమిట్టాడుతోందని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల నాడి గుర్తించే సత్తా నాయకత్వానికి లేదని, పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించే కార్యక్రమం ఒక్కటి కూడా ఈ మూడేళ్లలో చేపట్టలేదని అంగీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విమర్శించడం, అడ్డుకోవడం ద్వారా ప్రజాగ్రహానికి గురవుతున్న విషయాన్ని గుర్తించాలని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తేనే కలసి వస్తుందని, టీడీపీ అంతర్గత సమావేశాల్లో నాయకులు, కార్యకర్తలు పలుమార్లు హెచ్చరిస్తున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. వీటిని ఆమోదిస్తే మరింత మంది గళం విప్పుతారనే భయంతో అధినేత గోడ మీది పిల్లిలా వ్యవహరిస్తున్నారని పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే అభిప్రాయంతో సీనియర్లు.. పార్టీని గెలిపించే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేవని తాజాగా ఓ ఎంపీ కూడా అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించారు. పార్టీలో చాలామంది సీనియర్లు ఇప్పటికే ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఇక లోకేష్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ‘పార్టీ లేదూ.. బొ. లేదూ’ అని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. పార్టీ బలహీన పడిన ఈ సమయంలో మహారాష్ట్రలో మాదిరిగా టీడీపీలోనూ ఏక్నాథ్ షిండేలకు కొదవలేదనే వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. -
ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ: బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్లే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం వైపు పయనిస్తోందని బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వివేకం పాటించకపోతే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని, ప్రస్తుత ఆర్థిక విధానాలను కొనసాగిస్తే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ప్రమాదంలో ఉందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై నారాయణరెడ్డి స్పందిస్తూ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని, సీఎం భయపడాల్సిన అవసరం లేదని, సొంత ఇంటిని చక్కదిద్దడంపై దృష్టి సారించాలని అన్నారు. చదవండి: ధనిక రాష్ట్రం.. జీతాలివ్వలేని స్థితికి కేంద్రంపై మాట్లాడే హక్కు సీఎంకు లేదని, విచ్చలవిడిగా రుణాలు తీసుకోవడంతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. రాష్ట్ర రుణ భారం రూ.4 లక్షల కోట్లు దాటిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై సగటున రూ. 1.14 లక్షల రుణభారం ఉంది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న రుణాల వడ్డీ, అసలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు 18 వేల కోట్లు చెల్లిస్తోందన్నారు. “డబ్బులు అప్పుగా తీసుకుంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి నెల రోజులు గడవడం కష్టంగా మారే హీన దశకు పరిస్థితి చేరుకుందని ప్రతి నెలా జీతాలు, పింఛన్లు ఆలస్యం అవుతున్నాయని ఆయన అన్నారు. వేల కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్నాయని వివిధ కార్పొరేషన్ల రుణాలు మరియు చెల్లింపు ప్రక్రియ గురించి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపకపోవడంతో, కేంద్రం రుణాలు ఇవ్వడం నిలిపివేసిందని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాలు కేంద్రం సందేహాలను నివృత్తి చేసి రుణాలు పొందగలిగాయని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సందేహాలను నివృత్తి చేయకుండా నిందలు వేస్తూ సమస్యను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శ్రీలంకలో పరిస్థితిపై కేంద్రం అప్రమత్తమైందని, విపరీతమైన రుణాలను నియంత్రించాలని నిర్ణయించిందని భారత్‌ను శ్రీలంక పరిస్థితితో పోలుస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయ, ఆర్థిక, భద్రతా అస్థిరత ఏర్పడినప్పుడు శ్రీలంక అటువంటి పరిస్థితిలో ఉందని అన్నారు. “కానీ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో సురక్షితంగా ఉందని ప్రధానమంత్రి యుగ పురుషుడు ఉన్నాడని ఆయన జాతి ప్రయోజనాల కోసం జన్మించాడని దేశాన్ని సురక్షితమైన మార్గంలో నడిపించడంతోపాటు కోట్లాది మంది భారతీయుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రధాని వివేకవంతుడని అన్నారు. ప్రధానమంత్రి దార్శనికత కారణంగా దేశం ఆర్థికంగా, రాజకీయంగా, అంతర్గత, బాహ్య భద్రత విషయంలో సురక్షితంగా ఉందని’’ నారాయణరెడ్డి అన్నారు. ప్రధాని నిపుణుల సలహాలు తీసుకుంటారని, తెలివిగా, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. చంద్రశేఖరరావు ఒక చక్రవర్తిలా ప్రవర్తిస్తారని, ఆధునిక యుగంలో కూడా తాను రాజుగా భావించుకుంటాడని ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ నిజాం కూడా బహుమతులతో వచ్చే సందర్శకులను కలుసుకునేవాడని, కానీ కేసీఆర్ ఎవరినీ కలవలేదు, మంచి సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన అహంకారం, దురహంకారం వల్ల రాష్ట్రం సంక్షోభం వైపు నడుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ అబద్ధాలు చెబుతారని, తన ఆర్థిక విధానాలు గాడి తప్పినా సీఎం తానే గొప్పలు చెప్పుకుంటున్నారని నీళ్లు, నిధులు, ఉద్యోగాలు (నీళ్లు, నిధులు, నియమాలు) కోసం తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకొని కేసీఆర్ అధికారంలోకి వచ్చారని. కానీ నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులు నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్తుపై ఆధారపడటం వల్ల చాలా ఖర్చుతో కూడుకున్నవని అన్నారు. ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులు వాయిదాల చెల్లింపుకు వినియోగిస్తున్నారని, అయితే ప్రజలు చెల్లిస్తున్న పన్నులు 6 శాతం కమీషన్ రూపంలో సీఎం కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళుతుందని ఆయన విమర్శించారు. -
కరోనాతో కాంగ్రెస్ నేత కన్నుమూత
ముషీరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యదర్శి, పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర మాజీ చైర్మన్, ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత తమగొండ రాజేశ్వర్ (70) కరోనాతో మృతి చెందారు. ఈ నెల 7న శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో కుటుంబ సభ్యులు బోడుప్పల్‌లోని ఓ ప్రై వేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు ముషీరాబాద్ శ్మశాన వాటికలో నిర్వహించారు. రాజేశ్వర్‌కు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, రాజేశ్వర్ మృతి పట్ల పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్, మాజీ ఎంపీలు రాపోలు ఆనంద్‌భాస్కర్, వి.హనుమంతరావు, ఎం.అంజన్ కుమార్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు సంతాపం ప్రకటించారు. చదవండి: అంబులెన్సులు అధిక చార్జీలు అడగొద్దు -
రాజమాతకు అస్వస్థత: కోలుకోవాలని సీఎం నవీన్ ప్రార్థన
బరంపురం: కళ్లికోట్ రాజమాత, ఒడిశా రాజకీయల్లో సీనియర్ నాయకురాలు తెలుగు ప్రజల గాడ్ మదర్ సుజ్ఞాని దేవి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రాజధాని భువనేశ్వర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలు సుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజ మాత సుజ్ఞాని దేవి త్వరగా కోలుకుని నవ్వు తూ ఇంటికి తిరిగి చేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. Deeply concerned to know about the hospitalisation of senior party leader V. Sugnana Kumari Deo. Wishing her speedy recovery and praying for her good health. — Naveen Patnaik (@Naveen_Odisha) May 5, 2021 చదవండి: ఏపీలో కొత్త రకం వైరస్ లేదు -
అహ్మద్ పటేల్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్‌నేత, వ్యూహకర్త అహ్మద్‌పటేల్(71) గుర్గావ్లో కన్నుమూశారు. నెలరోజులుగా ఆయన కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను ఈ నెల 15న ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్సకు అవయవాలు స్పందించని కారణంగా బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించినట్లు ఆయన కుమారుడు ఫైజల్ తెలిపారు. çపటేల్ మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత సోనియా, రాహుల్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఐదు దఫాలుగా రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మూడు దఫాలుగా పటేల్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన స్వగ్రామం పిరమన్‌లో పటేల్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ‘కాంగ్రెస్‌పార్టీకి జీవితాన్ని అంకింతం చేసిన ఒక కీలక నేతను కోల్పోయాము. భర్తీ చేయలేని ఒక సహచరుడు, నమ్మకస్తుడు, స్నేహితుడిని కోల్పోయాను’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆపదలు దాటించే అహ్మద్ భాయ్ స్నేహితులు ‘ఏపీ’ లేదా ‘బాబూ భాయ్’అని పిలుచుకునే అహ్మద్ పటేల్ సోనియాకు 2001 నుంచి రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి ఆపద వస్తే అహ్మద్వైపే అధినేత్రి చూసేవారు. కీలకాంశాల్లో పార్టీలో ఏకాభిప్రాయం సాధించే చతురుడుగా పటేల్ పేరుగాంచారు. ఏపీకి అన్ని పార్టీల్లో దోస్తులు, అభిమానులు ఉన్నారు. మూడు నెలల క్రితమే పార్టీలో తలెత్తబోయిన ఒక తిరుగుబాటును సైతం ఆయన చాకచక్యంగా సద్దుమణిగేలా చేశారు. పటేల్ ప్రస్థానం 1949 ఆగస్టులో జన్మించిన పటేల్ రాజకీయ ప్రస్థానం గుజరాత్‌లోని భరూచా జిల్లాల స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో మొదలైంది. 1977లో 28ఏళ్ల వయసులో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం 1993 లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీకి ఆయన సన్నిహితుడు. అప్పట్లో ప్రధానికి పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1985, 1992ల్లో ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. 1992నుంచి మంత్రిగా ఆయన ఎప్పుడూ పదవీ బాధ్యతలు నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ తరఫున కీలక నిర్ణయాలు తీసుకునే అతికొద్దిమందిలో ఆయన ఒకరు. పటేల్‌కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
కరోనాతో కాంగ్రెస్ నేత నరేందర్ యాదవ్ మృతి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ కార్యదర్శి, హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు నరేందర్ యాదవ్ (కడియం) కరోనా బారిన పడి మృతి చెందారు. ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన ఆయన యశోదా ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. నరేందర్ యాదవ్ మృతిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎ ల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, సంపత్ కుమార్, వంశీచంద్æ రెడ్డి తదితరులు విచారం వ్యక్తంచేశారు. నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నరేందర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. నగర పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరేందర్ మృతి పార్టీకి తీరని లోటని, పార్టీ క్రమశిక్షణ గల సైనికుడిని కోల్పోయిందని విచారం వెలిబుచ్చారు. -
విషమంగానే జైట్లీ ఆరోగ్యం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టంపై ఉన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఆయన్ను పర్యవేక్షిస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం జైట్లీని పరామర్శించారు. కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధనోవా ఆసుపత్రికి వచ్చారు. శ్వాసకోస సంబంధిత అనారోగ్యంతో ఈ నెల 9న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10 తర్వాత ఆయన ఆరోగ్యం గురించి ఎయిమ్స్ ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. ఇప్పటికే రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా జైట్లీని పరామర్శించారు. ఎయిమ్స్ నుంచి వెలువడుతున్న పొగ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎయిమ్స్‌లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. 34 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు శ్రమించాయి. ప్రమాద సమయంలో ఎయిమ్స్‌లో ఉన్న రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు విఘాతం కలిగిందని రోగుల బంధువులు అన్నారు. మంటలు చెలరేగిన పై అంతస్తులో ఉన్న కొందరు రోగులను వేరే భవనానికి తరలించారు. టీచింగ్ భవనంలో విద్యుత్ సంబంధిత పనులు జరుతుగున్న మైక్రోబయాలజీలోని వైరాలజీ యూనిట్లో మంటలు ప్రారంభం అయినట్లు అధికారులు గుర్తించారు. -
జోషి మరణం తీరని లోటు: సురవరం
సాక్షి, హైదరాబాద్: సీపీఐ సీనియర్ నాయకుడు పీపీసీ జోషి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జోషి ఆదివారం హైదరాబాద్‌లోని పుప్పాలగూడలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేనిలోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానించారు. నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ కూడా మరో ప్రకటనలో జోషి మృతికి సంతాపం ప్రకటించింది. సాహిత్య సంస్థలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడింది. ఆయన మరణం అభ్యుదయ, వామపక్ష వాదులకు తీరనిలోటని పేర్కొంది. జోషి పార్టీలో పలు కీలక బాధ్యతలతోపాటు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌కు మేనేజర్‌గా, సీపీఐ కేంద్ర కార్యాలయ ట్రెజరర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జోషి తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులయ్యారు. -
సీపీఎం సీనియర్ నాయకుడు మృతి
పాల్వంచ: సీపీఎం సీనియర్ నాయకుడు గుండ్ల దైవాదీనం (92) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానిక రాహుల్‌గాంధీనగర్‌లో గల స్వగృహంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. దైవాదీనం సీపీఎం అనుబంధ రైతు సంఘం రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్నారు. సీపీఎం నిర్వహించిన అనేక ఉద్యమాల్లో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. దైవాదీనానికి భార్య తులశమ్మ, నలుగురు కొడుకులు ఉండగా.. ముగ్గురు కొడుకులు గతంలోనే మృతి చెందగా.. ప్రస్తుతం కొడుకు వెంకటేశ్వర్లు ఉన్నారు. దైవాదీనం మృతదేహాన్ని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, బి.వెంకట్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, కొండపల్లి శ్రీధర్, దొడ్డా రవి, గూడెపూడి రాజు, మానస అకాడమీ డైరెక్టర్ టి.ప్రభుకుమార్, సీపీఐ జిల్లా సమితి నాయకులు ముత్యాల విశ్వనాథం, పట్టణ, మండల కార్యదర్శులు కొమ్మవరపు ఆదాం, ముత్యాల వెంకటేశ్వర్లు, వి.పూర్ణచందర్రావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు జ్యోతుల రమేష్, టీఆర్ఎస్ నాయకులు మల్లెల రవిచంద్రతోపాటు పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. -
మీటూ : సీనియర్ బీజేపీ నేతపై వేటు
డెహ్రాడూన్ : మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఉదంతం తర్వాత మహిళను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొన్న మరో సీనియర్ బీజేపీ నేతపై ఆ పార్టీ వేటు వేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర శాఖ బీజేపీ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్‌ను లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి పార్టీ కేంద్ర నాయకత్వం తప్పించింది. పార్టీ మహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు సంజయ్ కుమార్‌పై బీజేపీ కేంద్ర నాయకత్వం చర్యలు చేపట్టిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ చీఫ్ అమిత్ షా తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం ఉత్తరాఖండ్ రాష్ట్ర నేతలకు తెలిపారు. సంజయ్ కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లడైనప్పటి నుంచీ ఆయనపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఉత్తరాఖండ్ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనల నేపథ్యంలో సంజయ్‌ను ఢిల్లీ పిలిపించిన అధిష్టానం ఆయనను పార్టీ పదవి నుంచి తప్పిస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని వివరించింది. ఉత్తరాఖండ్‌కు పార్టీ త్వరలోనే నూతన ప్రధాన కార్యదర్శిని ప్రకటిస్తుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ గతంలో తాను పత్రికా సంపాదకుడిగా ఉన్న సమయంలో జర్నలిస్ట్ ప్రియా రమణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
జైపాల్ రెడ్డితో మనసులో మాట
-
నారాయణరెడ్డికి వైఎస్సార్సీపీ ఘన నివాళి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దొంతిరెడ్డి నారాయణరెడ్డికి జిల్లా ప్రముఖులు నివాళులర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురువారం ఉదయం రాజుపాళెం మండలం కొర్రపాడులోని ఆయన నివాసానికి వైఎస్సార్ జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు, మైదుకూరు ఎమ్మెల్యేలు శివప్రసాదరెడ్డి, రఘురామిరెడ్డి, పార్టీ జిల్లా నేత సంబటూరు ప్రసాదరెడ్డి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. నారాయణరెడ్డి మృతదేహంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. -
వైఎస్ఆర్ సీపీ నాయకుడు నారాయణరెడ్డి మృతి
వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర ఖాదీ పరిశ్రమల బోర్డు మాజీ డెరైక్టర్, వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు దొంతిరెడ్డి నారాయణరెడ్డి(65) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడుకు చెందిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. నారాయణరెడ్డి...మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సన్నిహితుడిగా మెలిగేవారు. నారాయణరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు. -
పితాని ఎక్కడ?
- ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో కానరాని సీనియర్ నేత - మంత్రి పదవి ఆశించి భంగపాటు - వ్యూహాత్మక మౌనమా.. అసంతృప్త రాగమా! - టీడీపీ శ్రేణుల్లో ఎడతెగని చర్చ సాక్షి ప్రతినిధి, ఏలూరు : పితాని సత్యనారాయణ.. గడచిన దశాబ్ద కాలంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి. ఇప్పుడు కూడా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే. కాంగ్రెస్ హయాంలో ఐదేళ్లపాటు మంత్రిగా జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన పితాని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. గడచిన 50 రోజుల కాలంలో ఎక్కడా ప్రజలకు.. కనీసం నాయకులకు కూడా కానరావడం లేదు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తప్పించి మరే ఇతర ప్రభుత్వ, పార్టీపరమైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న దాఖలాలే లేవు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంలోను, ఎంపీపీ ఎన్నికల వేళ కూడా ఆయన జాడే లేదు. బీసీ కోటాలో ప్రస్తుత టీడీపీ హయాంలోనూ మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడిన ఆయన వ్యూహాత్మకంగా మౌనముద్ర వహిస్తున్నారా.. అసంతృప్తితో దూరంగా ఉంటున్నారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయమైంది. సుజాతకు మంత్రి పదవి రావడంతో... 2004లో పెనుగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పితాని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెనుగొండ నియోజకవర్గం రద్దయి ఆచంటలో కలిసింది. అప్పటి ఎన్నికల్లో పితానికి ఆచంట నుంచి పోటీచేసే అవకాశాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించారు. ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి పదవిని సైతం కట్టబెట్టారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ పితాని కొనసాగారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ, ఆర్ అండ్ బీ వంటి కీలక శాఖలు చేపట్టి జిల్లా రాజకీయాలను శాసించారు. అప్పట్లో మంత్రి హోదాలో వట్టి వసంతకుమార్ ఉన్నప్పటికీ పితాని హవా సాగించారు. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసిన తర్వాత ఆయన వెంటే ఉండి జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఎన్నికల వేళ చివరి నిమిషంలో టీడీపీలోకి వెళ్లి ఆచంట నుంచి పోటీచేసి అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు బీసీ వర్గానికి చెందిన సీని యర్ నేతగా ఉన్న తనకు మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఆశించారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా పీతల సుజాతకు మంత్రి పదవిని కట్టబెట్టడంతో పితాని ఆశలు తల్లకిందులయ్యాయి. దీనివల్ల పితానికి రాజకీయంగానూ ఒకింత ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుందని అంటున్నారు. సుజాత వైపు ఆచంట టీడీపీ శ్రేణులు 2004లో ఆచంట ఎమ్మెల్యేగా పీతల సుజాత గెలుపొందారు. అప్పట్లో ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఈ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో జనరల్ కావడంతో ఆమెకు ఆ ఎన్నికల్లో చంద్రబాబు సీటు ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లో ఆమె చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందిన విష యం తెలిసిందే. ఆచంట పూర్వ ఎమ్మెల్యేగా ఉన్న విస్తృత పరిచయాల నేపథ్యంలో ఇప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు మం త్రి సుజాతనే ఆశ్రయిస్తున్నారు. టీడీపీలోకి పితాని రాకను మొదటినుంచీ వ్యతి రేకిస్తున్న ఓ వర్గం పూర్తిగా సుజాత వెంటే ఉంటోంది. ఈ పరిణామాలు పితానికి ఇబ్బందిగా మారాయంటున్నారు. ఈ దృష్ట్యా కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే విదేశంలో బంధువుల ఇంట సేదతీరుతున్నట్టు తెలు స్తోంది. ఈనెల 16, 17తేదీల్లో చంద్ర బాబు జిల్లా పర్యటనకు రానున్నారు. అప్పుడైనా పితాని మొహం చూపిస్తారా, చాటేస్తారా అనేది తేలాల్సి ఉంది. -
కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు రాజా సస్పెన్షన్
గౌహతి: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత అనిల్ రాజాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతకుముందే అతన్ని పార్టీ జనరల్ సెక్రటరీ హోదా నుంచి తొలగించిన అస్సాం పీసీసీ.. తాజాగా పార్టీ నుంచి వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు భవనేశ్వర్ కాలితా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పార్టీ వ్యతిరేక కార్యకలాపాకు పాల్పడుతున్న అతనిని తొలగిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎదుర్కొనే సవాళ్లును పార్టీ నేతలు అంతా కలిసికట్టుగా అధిగమించడానికి యత్నించాలని చెప్పినా రాజా మాత్రం వాటిని అతిక్రమించాడని కాలితా స్పష్టం చేశారు. గత 2009 లోక్ సభకు నోవ్ గాంగ్ నుంచి పోటీచేసిన రాజా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
ఢిల్లీలో డీఎస్ లాబీయింగ్!
- శాసనమండలి ఫ్లోర్‌లీడర్ కోసం యత్నం - దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి మంతనాలు - సీనియర్ నేతగా ఆయనకే దక్కే అవకాశం? సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అయిన ధర్మపురి శ్రీనివాస్ ఢిల్లీలో మకాం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్‌కు చేరిన ఆయన రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణకు చెందిన పలువురు టీ-కాంగ్రె స్ నాయకులు సైతం ఢిల్లీలోనే ఉన్నారు. డీఎస్ రెండు రోజుల నుంచి కీలక పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయమై తెలంగాణ ప్రజల మనోభావాలను అధినేత్రి సోనియాకు తెలిపేందుకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేశారు. అయితే ఈసారి మాత్రం శాసనమండలి ఫ్లోర్‌లీడర్ పదవి కోసం దేశ రాజధానికి చేరిన ఆయన బుధవారం ఢిల్లీ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో డీఎస్ భేటీ అయినట్లు సమాచారం. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం.. ఆ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనమండలి పక్షనేతగా అవకాశం కల్పించాలని కోరినట్లు పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. 1983లో రాజకీయ ఆరంగేట్రం చేసిన డీఎస్ అనతికాలంలోనే దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే నేతగా ఎదిగారు. 1989లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై విజయం సాధించిన ఆయన 1999, 2004లలో వరుసగా గెలుపొందారు. 2004, 2009లలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ సీఎం కాగా.. ఆ రెండు ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షునిగా వ్యవహరించిన డీఎస్ అధిష్టానానికి మరింత దగ్గరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో అర్బన్‌గా మారిన నిజామాబాద్ నుంచి 2009, 2010 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చెందిన ఆయనకు ఈసారి నిజామాబాద్ రూరల్‌ను ఎంచుకున్నప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలోనూ ఓటమి తప్పలేదు. అయితే 2010 ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన డీఎస్‌కు 2011 అక్టోబర్‌లో కాంగ్రెస్ అధిష్టానం శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో శాసనమండలి సభ్యునిగా ఉన్న తనకు తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలికి తొలి ఫ్లోర్‌లీడర్‌గా అవకాశం కల్పించాలని దిగ్విజయ్ సింగ్‌ను కోరినట్లు సమాచారం. ఇదిలా వుండగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ కూడ ఇదే పదవి కోసం ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. ఆయన కూడా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసింది. అయితే డీఎస్కే ఈ విషయంలో అధిష్టానం అనుకూలంగా ఉన్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. -
మోడీవి పగటి కలలు : ఖర్గే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశ ప్రధాని కావాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పగటి కలలు కంటున్నారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీ కలలన్నీ కల్లలవుతాయని జోస్యం చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగంపై మోడీ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. అభివృద్ధిలో గుజరాత్ దేశంలోనే తొలి స్థానంలో ఉందంటూ మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం గుజరాత్ 10-12 స్థానంలో ఉందన్నారు. మహారాష్ర్ట, హర్యానా, కేరళ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని వెల్లడించారు. మోడీ అధిక ప్రసంగాలు మాని, గుజరాత్‌ను అభివృద్ధి పరచిన అనంతరం మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ప్రధాని ప్రసంగంపై ముఖ్యమంత్రులు విమర్శలు చేసే ఆనవాయితీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే. అద్వానీ సైతం మోడీ వ్యవహార శైలిని తప్పుబట్టారని గుర్తు చేశారు. అదే పార్టీలో ఉన్న మోడీ ఆ మాత్రం పెద్దరికాన్ని ఎందుకు ప్రదర్శించలేక పోయారని ప్రశ్నించారు. కాగా రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలకు, మూడు శాసన మండలి స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయా నియోజక వర్గాల్లో పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తోందన్నారు. రెండు రోజుల పాటు తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని ఆయన తెలిపారు.