వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దొంతిరెడ్డి నారాయణరెడ్డికి జిల్లా ప్రముఖులు నివాళులర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
గురువారం ఉదయం రాజుపాళెం మండలం కొర్రపాడులోని ఆయన నివాసానికి వైఎస్సార్ జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు, మైదుకూరు ఎమ్మెల్యేలు శివప్రసాదరెడ్డి, రఘురామిరెడ్డి, పార్టీ జిల్లా నేత సంబటూరు ప్రసాదరెడ్డి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. నారాయణరెడ్డి మృతదేహంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.