
బెజవాడ శ్రీనివాసరావు
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా కోసం శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనెల 23న(మే) ఆరిగిపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద బెజవాడ శ్రీనివాసరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ రోజు నుంచి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు ఆయన మృతి చెందాడు. ఆయన మృతదేహానికి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, యలమంచిలి రవి, ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు తదితరులు నివాళు అర్పించారు.
అతని కుటుంబానికి నేతలు సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా కోసం సామాన్యులు బలి అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే ఆత్మహత్యలకు కారణమని పేర్కొన్నారు. ఇకనైనా హోదా విషయంలో కేంద్రం ముందుకు రావాలని నేతలు సూచించారు.