BJP Rajya Sabha MP Hardwar Dubey Passed Away Due To Illness At Age Of 73 - Sakshi
Sakshi News home page

విషాదం.. బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ దూబే కన్నుమూత

Published Mon, Jun 26 2023 10:58 AM | Last Updated on Mon, Jun 26 2023 11:51 AM

BJP Rajya Sabha MP Hardwar Dubey Passed Away - Sakshi

ఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే(73) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా, దుబే పార్థీవాదేహాన్ని ఈరోజు మధ్యాహ్నం ఆగ్రాకు తీసుకురానున్నారు. 

వివరాల ప్రకారం.. దుబే ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ స‌భ్యులు ఆయనను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, దూబే క్షేమంగా ఉన్నార‌ని ఆయ‌న‌ కుమారుడు ప్రన్షు దూబే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో కొంతసేపటికి శ్వాస ఆగిపోయింద‌ని తెలిపారు. ఆయన మృతికి బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

ఇక, హరద్వార్‌ దూబే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. రాష్ట్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు. దూబే 2020లో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. హర్‌ద్వార్ దూబేకి కుమారుడు ప్రన్షు దూబే, కోడలు ఊర్వశి, కుమార్తె డాక్టర్ కృత్యా దూబే ఉన్నారు. ఆయన సోదరుడు గామా దూబే కూడా బీజేపీ సీనియర్ నేత కావడం విశేషం. 

ఇది కూడా చదవండి: హిమాచల్‌లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement