Congress Senior Leader Thamagonda Rajeshwar Died Due To Covid-19 - Sakshi
Sakshi News home page

కరోనాతో కాంగ్రెస్‌ నేత కన్నుమూత

Published Tue, May 18 2021 1:02 PM | Last Updated on Tue, May 18 2021 1:40 PM

Congress Senior Leader Thamagonda Rajeshwar Passed Away - Sakshi

ముషీరాబాద్‌: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) కార్యదర్శి, పార్టీ ఓబీసీ సెల్‌ రాష్ట్ర మాజీ చైర్మన్, ముషీరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత తమగొండ రాజేశ్వర్‌ (70) కరోనాతో మృతి చెందారు. ఈ నెల 7న శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో కుటుంబ సభ్యులు బోడుప్పల్‌లోని ఓ ప్రై వేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

అంత్యక్రియలు ముషీరాబాద్‌ శ్మశాన వాటికలో నిర్వహించారు. రాజేశ్వర్‌కు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, రాజేశ్వర్‌ మృతి పట్ల పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్, మాజీ ఎంపీలు రాపోలు ఆనంద్‌భాస్కర్, వి.హనుమంతరావు, ఎం.అంజన్‌ కుమార్‌ యాదవ్, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తదితరులు సంతాపం ప్రకటించారు.
చదవండి: అంబులెన్సులు అధిక చార్జీలు అడగొద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement