mushirabad
-
Hyderabad: పోలీసులను ప్రశ్నించినందుకు చేయి విరగ్గొట్టారు!
ముషీరాబాద్: రోడ్డుపై నిలుచున్న వ్యక్తిని ముషీరాబాద్ పోలీసులు అకారణంగా దాడి చేశారు. పోలీసుల దెబ్బలకు బాధితుని చేయి విరగడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆదివారం బాధితుడు ముషీరాబాద్ బీఆర్ఎస్ మీడియా సెల్ ఇన్చార్జి సత్యనారాయణబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని స్నేహితుడు తీసుకెళ్లడంతో వాహనం కోసం వినోభానగర్‌లోని తన ఇంటి సమీపంలో రోడ్డుపై నిలుచోని ఉన్నానని తెలిపారు. స్నేహితుడి కోసం నిల్చున్నానని చెబితే... పార్సిగుట్ట నుంచి వినోభానగర్ వైపు వెళ్తున్న పోలీసులు ఇక్కడ నిలబడొద్దని సూచించారు. తన స్నేహితుడి కోసం నిల్చున్నానని చెబితే అయినా వెళ్లిపోవాలని దురుసుగా మాట్లాడారని అన్నారు. పక్కనున్న బార్‌ను మూయించరు కానీ తనను దబాయిస్తారేందని ప్రశ్నించినందుకు తనపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టారన్నారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు. వైద్యులు పరీక్షలు చేసి చేయి విరిగిందని చెప్పారన్నారు. ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలి... ఆదివారం ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నవీన్‌రాజ్ బాధితుడు సత్యనారాయణ బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం బాధితుడిని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ రాంబాబుకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ బాబుపై దాడి చేసిన ఏఎస్ఐ మోహన్‌రావు, ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయాలన్నారు. వారిని సస్పెండ్ చేయని పక్షంలో స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. -
ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోండి
కవాడిగూడ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరును ఫ్యామిలీ రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. గత పదేళ్లుగా కేసీఆర్ కుటుంబం తెలంగాణలోని వనరులను అడ్డగోలుగా దోచుకుందని ధ్వజమెత్తారు. ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజును గెలిపించాలని కోరుతూ మంగళవారం కవాడిగూడ డివిజన్ పరిధిలోని దోమలగూడ ఏవీ కళాశాల నుంచి భారీ బైక్‌ర్యాలీని నిర్వహించారు. ర్యాలీనుద్దేశించి ఫడ్నవీస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబ ఆస్తులను ఏవిధంగా పెంచుకోవాలనే ఆలోచనతోనే పాలన సాగించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రచారానికి చేసిన ఖర్చుతో రాష్ట్రంలోని దళిత కుటుంబాలను మొత్తం అభివృద్ధి చేయవచ్చన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను కొనే పార్టీ బీఆర్ఎస్ అయితే, అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటేనని ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే బీఆర్ఎస్కి గొర్రెల్లా అమ్ముడు పోతారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుందని భరోసానిచ్చారు. ముషీరాబాద్ బాధ్యత నాదే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి పూసరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీలేదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పూసరాజును గెలిపిస్తే ముషీరాబాద్ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ నియోజవర్గ కన్వి నర్ రమేష్ రాం, కార్పొరేటర్లు జి. రచనశ్రీ, కె.రవిచారి, సుప్రియా నవీన్‌గౌడ్, పావని వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి..దంపతుల ఆత్మహత్య
బౌద్ధనగర్: ‘మేము చావడానికి కారణం ఆ నలుగు రే. వారిని విడిచిపెట్టకండి’అని సూసైడ్ నోట్ రాసి నాలుగేళ్ల కూతురుతో సహా దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా లక్ష్మీపురానికి చెందిన కొప్పుల సాయికృష్ణ (37), చిత్రకళ(30) దంపతులు. వీరికి తేజస్వి అనే నాలుగేళ్ల పాప ఉంది. ఏడాది నుంచి ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో నివసిస్తున్నారు. సాయికృష్ణ గతంలో ర్యాపిడో బైక్ నడిపేవాడు. ఏడాదిగా ఉద్యోగానికి వెళ్లడం లేదు. భార్య చిత్రకళ నాంపల్లి బిర్లా సైన్స్ సెంటర్లోని టికెట్ కౌంటర్లో ఉద్యో గం చేస్తుండేది. అయితే అపాయింట్మెంట్ ఆర్డర్, పే స్లిప్ అడిగిన నేపథ్యంలో నెలక్రితం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. భర్తకు పని లేకపోవడం, తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేని చిత్రకళ తీవ్ర మనోవేదనకు గురైంది. లేనిపోని కారణాలు చూపి తనను ఉద్యోగం నుంచి తొలగించిన నలుగురు ఉద్యోగులు శ్యాం కొటారి, గాతా, హరిబాబు, సంతోష్ రెడ్డిలను వదిలిపెట్టవద్దని సూసైడ్ నోట్లో రాసి ఆ నోట్‌ను గోడకు అతికించింది. ముందుగా కూతురుకి ఉరేసి.. ఆ తర్వాత భార్య, భర్త కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి వారున్న ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పక్కింటి వాళ్లు తలుపులు కొట్టారు. అయినా తీయలేదు. శుక్రవారం ఉదయం ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి తలుపులు బద్దలుగొట్టి చూడగా ముగ్గురూ విగతజీవులై కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. మృతిపై అనుమానాలు: బిర్లా సైన్స్ సెంటర్లో పలు అవకతవకలు జరిగాయని, వాటి గురించి తనకు తెలియడం వల్లనే శ్యామ్ కొఠారి, గీతారావు, హరిబాబు, సంతోష్ రెడ్డిలు కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగం నుంచి తొలగించారని సూసైడ్ నోట్లో పేర్కొంది. తాను పని చేసిన కార్యాలయంలో రూ.కోట్లలో మోసం జరిగిందని పేర్కొంటూ 12 పాయింట్లతో సూసైడ్ నోట్ రాసి గోడకు అతికించింది. ‘‘ఓ మంత్రితో మాట్లాడేందుకు యత్నించినా కుదరలేదు. ఓ టీవీకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా స్పందించ లేదు.’’ అని అందులో పేర్కొంది. అయితే ఆఫీసులో జరిగిన దానికి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ముషీరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే బరిలో దత్తాత్రేయ కుమార్తె!
హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి పేరు బాగా వినిపిస్తోంది. ఈ విషయంపై సాక్షి ప్రతినిధి ఆమెతో ముచ్చటించారు. పాలిటిక్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా? సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు బీజేపీ సిద్ధాంతాలు కూడా చాలా ఇష్టం. అందుకే అనేక సంవత్సరాలుగా పార్టీ వ్యవహారాల్లోనూ పాల్గొంటున్నాను. నాన్న అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారా? జవాబు: నాన్న చిన్నప్పటి నుంచి నేరి్పన నీతి, నైతిక విలువలు, క్రమ శిక్షణతో పాటు ఆయన కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న పార్టీ సిద్ధాంతం నచ్చి పార్టీలోకి వచ్చాను. 2014, 2019, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటూ.. వస్తున్నాను. మా నాన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గత 35–40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండటంతో ప్రతి కార్యకర్త, నాయకులతో పరిచయాలు ఉన్నాయి. మా ఇళ్లు, పార్టీ వేర్వేరు అని ఏనాడు అనుకోవడం లేదు. దీనికి తోడు అత్తగారి కుటుంబం కూడా రాజకీయాలతో ముడిపడిన కుటుంబమే. మా మామయ్య చేవెళ్ల పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. ముషీరాబాద్ టికెట్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేదు. మొదట పార్టీ ఆర్గనైజేషన్‌లో పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవాలి. నేను ఎక్కడైనా సరిపోతానని పార్టీ అనుకుంటే పార్టీ అక్కడ నిలపెడుతుంది. నా వరకు నేను ఇప్పటి వరకు ప్రత్యక్షంగా అడిగింది లేదు. నేను అక్కడ నిలుచుంటానని చెప్పడం మేము నేర్చుకున్న సిద్ధాంతం కాదు. అలా అడగడం మా పార్టీలైన్ కాదు. ప్రజలు కోరుకుంటున్నారు కదా.? ప్రజలు ఖచ్ఛితంగా బీఆర్ఎస్ నుంచి వేరే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. విజయలక్ష్మిని కోరుకుంటున్నారని నేను అనుకోను. బీజేపీ అభ్యర్థిగా విజయలక్ష్మి సరిపోతుందని పార్టీ అనుకుంటే అప్పుడు ఆలోచిస్తా.. ! డాక్టర్ లక్ష్మణ్ తరువాత మీపేరే ఎక్కువగా వినిపిస్తుంది? అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనే లైన్లో పనిచేసింది లేదు. బీజేపీ కార్యకర్తగానే గుర్తించబడటం నాకు ఇష్టం. ఒక వేళ అవకాశం కల్పిస్తే? అవకాశం కల్పిస్తే.. పూర్తి బాధ్యతాయుతంగా పార్టీకోసం పనిచేస్తాను. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి, తొందరగా ఒక నిర్ణయానికి వస్తే మంచిదేమో? మనం ఒక నిర్ణయానికి రావొద్దు, పార్టీ అధిష్టానం రావాలి. వేరే పారీ్టలాగ నేను ఇక్కడ నిల్చుంటేనే ఉంటా అనే పార్టీ బీజేపీ కాదు. బీజేపీకి క్రమశిక్షణ కలిగిన వ్యవస్థ ఉంటుంది. పనిచేస్తూ.. పోవాలంతే.. ఫలితం ఆశించకూడదు. -
స్టీల్ బ్రిడ్జి.. నగరానికే తలమానికం
ముషీరాబాద్: ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల మేర రూ.440 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి నగరానికే తలమానికం కానుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రాత్రింబవళ్లూ పని చేయాలని కేటీఆర్ సూచించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి పనులను పరిశీలించారు. అనంతరం వీఎస్టీ వద్ద నిర్మితమవుతున్న ర్యాంప్‌పైకి ఎక్కి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించి ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం స్టీల్ బ్రిడ్జీని చేపడుతున్నామని తెలిపారు. నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఉపశమనం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన.. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్ఎన్డీపీలో భాగంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ నాలా రిటైనింగ్ వాల్ పనులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హుస్సేన్‌సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిక్కడపల్లిలోని కూరగాయల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. చేపల మార్కెట్ కోసం డిజైన్ రూపొందించండి.. దేశంలోనే ఫ్రెష్ ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉందంటే రాంనగర్‌లోనే ఉందనే విధంగా చేపల మార్కెట్‌ను మంచి డిజైన్ చేసి వారం రోజుల్లో తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహకు మంత్రి కేటీఆర్ బాధ్యతలను అప్పగించారు. జాగా నేను ఇప్పిస్తా.. డబ్బులు ఇప్పిస్తా వారం రోజుల్లో డిజైన్ చేసి తీసుకురా అని జైసింహతో చెప్పారు. ఈఎన్సీలు శ్రీధర్, జియావుద్దీన్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
అమ్మకు గుడి
ముషీరాబాద్: అమ్మంటే ప్రత్యక్ష దైవంగా భావించారు. కన్నతల్లి కన్నుమూసి ఏడేళ్లయిపోయింది. ఇన్నాళ్లు గుండెల్లో కొలువైన అమ్మకు ఇంట్లోనే గుడి కట్టారు. అమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని.. కళ్లముందు విగ్రహ రూపంలో కని పిస్తుండాలని.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టారు ముషీరాబాద్ గంగపుత్ర కాలనీకి చెందిన బాదం గణేష్, శ్రీనివాస్, వేణు, శివప్రసాద్‌లు. అమ్మ విగ్రహ ఆవిష్కరణోత్సవానికి బంధుమిత్రులను ఆహ్వానించారు. పండుగలా కార్యక్రమం నిర్వహించి అతిథ్యం ఇచ్చి తల్లిపై ప్రేమను చాటుకున్నారు. గణేష్, శ్రీనివాస్, వేణు, శివప్రసాద్‌ల తల్లి బాదం వెంకటసూర్యకుమారి ఏడేళ్ల క్రితం మరణించా రు. కొంతకాలంగా తల్లి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేయాలని నలుగురు కొడుకులు ప్ర యత్నిస్తున్నారు. ఇటీవల విగ్రహ ఏర్పాటు కోసం ఇంట్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. అందులో తల్లి సూర్యకుమారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. -
మాటే సోపానం
ఇంటిని చక్కదిద్దుకోవడంలోనే కాదు వంటలు, ఆటలు, కళలు, రకరకాల వృత్తులు, వ్యాపారాలు .. ఇదీ అన్ని చెప్పలేనంత ప్రతిభను మహిళలు మాత్రమే కనబరుస్తారు. వీటన్నింటిలో రాణించాలంటే అవసరమైనది మంచి మాట. ‘నలుగురితో ఎలా మెలగాలో తెలుసుండటంతో పాటు ‘మంచి మాట’ కూడా తోడైతే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలరు అని వివరిస్తున్నారు డాక్టర్ డి.కల్పన. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉంటున్న ఈ పబ్లిక్ స్పీకింగ్ ట్రెయినర్ గృహిణిగా ఉన్న తన జీవితమే ‘మాట’ను ఉపాధిగా మార్చుకోవడానికి ఉపకరించిందని తెలియజేశారు. ‘‘డిగ్రీ పూర్తి చేసిన నాకు పెళ్లి తర్వాత ‘మాట’ సమస్య వచ్చింది. కొన్నాళ్లు నలుగురిలో మాట్లాడటానికి జంకడం నాకు నేనుగా గమనించాను. అది గుర్తించి ఈ సమస్య నుంచి బయటపడాలనుకున్నాను. అందుకు నా కుటుంబం మద్దతుగా నిలిచింది. సమస్య నుంచి బయట పడ్డాను. నాలాగ మొదట మాట తడబడటం అనే సమస్య చాలా మందిలో ఉండటం గమనించాను. కొందరు ‘మాట’తో ఎంతగా వృద్ధిలోకి వస్తున్నారో గమనించాను. కొందరు ప్రతిభ ఉన్నా వెనకంజలో ఉంటున్నవారినీ చూశాను. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు. అప్పుడే ‘పబ్లిక్ స్పీకింగ్’ కాన్సెప్ట్‌పై శిక్షణ అవసరం గ్రహించి, ఇంట్లోవారితో చర్చించాను. అందకు నాకు పూర్తి మద్దతు లభించింది. మీడియా జంక్షన్ పేరుతో పబ్లిక్ స్పీకింగ్పైన 18 ఏళ్లుగా శిక్షకురాలిగా ఉన్నాను. తరగతులకు వచ్చేవారిలో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్నవారు, వచ్చినవారూ పాల్గొన్నారు. వారందరికీ చెప్పిన విషయాల్లో ముఖ్యమైనవి... భయం గడప దాటాలి ప్రతి ఒక్కరిలోనూ వారి మనసు పొరల్లో ఎన్నో అంశాల దాగి ఉంటాయి. కానీ, వాటిని బయటకు సరిగ్గా వ్యక్తపరచలేరు. కొందరు వ్యక్తపరిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. మరికొందరి మాటలను అస్సలు వినలేం. ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించగల నేర్పుతో ‘మాట’ ఉండాలంటే సాధన అవసరం. దానికి ముందు ‘ఏం మాట్లాడితే ఏం అనుకుంటారో’ అనే భయాన్ని వదిలిపెట్టాలి. తల్లిగా పిల్లలతో కథల రూపేణా, వారి విషయాలు కనుక్కోవడంలోనూ మాట్లాడుతూ ఉండాలి. పేరెంట్ టీచర్ మీటింగ్స్‌లో పాల్గొని అక్కడి టీచర్స్‌తో మాట్లాడాలి. అలాగే, ఇంటికి ఎవరో ఒకరు అతిథులుగా వస్తారు. వారితోనూ మాట కలపచ్చు. కాలనీలు, అపార్ట్మెంట్లలో గెట్ టుగెదర్ లాంటివి ఏర్పాటు చేసుకొని, మీరు చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేయాలి. వచ్చిన చిన్న అవకాశాన్నే అయినా ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉంటే అదే సరైన దారి చూపుతుంది. మాట్లాడటం అనే కళను ఒంటపట్టేలా చేస్తుంది. చిన్న చిన్న పార్టీలే మాటకు వేదికలు మాట మనపైన మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకు మహిళలకు తరచూ తారసపడేవి నలుగురైదుగురితో ఏర్పాటుచేసుకునే కిట్టీపార్టీ, బర్త్ డే పార్టీ, చిన్న చిన్న వేడుకలలో ఒక యాక్టివిటీ ప్రోగ్రామ్‌ను ఏర్పాటుచేసి, అందులో పాల్గొనాలి. ఒక్కొక్క పాయింట్ మీద ఒక్క నిమిషం మాట్లాడాలి. ఉదాహరణకు.. క్యాండిల్ కేర్, పెన్ను, పుస్తకం, బెలూన్స్.. ఇలా మీ కళ్ల ముందు ఉన్న వస్తువులను ఉపయోగించుకుంటూ దాని ప్రాముఖ్యాన్ని బయటకు వ్యక్తపరచడం అన్నమాట. మాటతో సమస్యలు దూరం డాక్టర్ మాట ద్వారానే సగం జబ్బు తగ్గిపోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే లాయర్లు కూడా మాట ద్వారానే రాణించాలి. కొన్ని సార్లు మాట కటువుగా, కొన్నిసార్లు మృదువుగా ఉండాలి. ఎక్కడ ఆపాలి, స్వరం ఎక్కడ పెంచాలి అనే విషయాల్లో మనకు పూర్తి ఆత్మవిశ్వాసం వస్తే కోరుకున్న రంగాల్లో కోరుకున్న ప్రగతి సాధించడానికి ‘మాట’ ఎంతగానో సాయపడుతుంది. ‘మాట’ సరైన విధంగా ఉపయోగించకపోతే ఆ ‘మాట’నే వారికి అథఃపాతాళానికి చేరుస్తుంది. ఈ విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుంచుకొని వృద్ధిలోకి రావడానికి ‘మాట’ను మంత్రంగా ఉపయోగించుకొని ఎదుగుదలకు సోపానంగా మలచుకోవాలి’’ అని వివరించారు ఈ ట్రెయినర్. బొమ్మలతో స్పీచ్ సాధ్యమే నలుగురైదుగురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఒక చోట చేరినప్పుడు ఒక బాక్స్‌లో చిన్న చిన్న బొమ్మలు, వస్తువులు వేసి... ఎవరికి ఏ వస్తువు వస్తే ఆ టాపిక్ మీద నిమిషం సేపైనా మాట్లాడాలి. దినపప్రతికల్లో వచ్చిన ఏదైనా ఒక వార్త తీసుకొని మాట్లాడవచ్చు. మా దగ్గర నాలుగు రోజుల ప్రోగ్రామ్ స్పీకింగ్ కోర్స్‌లో, ఒకరోజు ఫుల్ డే కేటాయిస్తాం. అందుకు అందరికీ వీలున్న సెలవురోజున ఎంచుకుంటున్నాం. డాక్టర్ డి. కల్పన – నిర్మలారెడ్డి -
ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలి
ముషీరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీకి 15 రోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం బీసీ భవన్లో నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోనల్విధానం పూర్తయినా నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విమర్శించారు. అన్ని శాఖల్లో అడ్హాక్ ప్రమోషన్ల పేరుమీద ఉద్యోగాలన్నీ భర్తీ చేశారని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను కూడా ప్రమోషన్లకింద భర్తీ చేశారని ఆరోపించారు. సీఎం జోక్యం చేసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను పూర్తిస్థాయిలో లెక్కించి భర్తీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. -
టీఆర్ఎస్ నాయకురాలు వసుంధర కన్నుమూత
ముషీరాబాద్ : టీఆర్ఎస్ నాయకురాలు బుసమల్ల వసుంధర (57) మంగళవారం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. తెలంగాణ పోరాటంలో ముందు భాగంలో నిలబడడమే కాకుండా కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి వంటి సీనియర్ నేతలతో ఆమె కలిసి పని చేసినట్లు వసుంధర సోదరి సంధ్య తెలిపారు. ఆమె భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ సీఎస్ఐ డయాసిన్ ఆఫీస్ లో సందర్శనార్థం ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు కార్ఖానాలోని సీఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారన్నారు. -
బీసీ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్సీపీదే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ రాజ్యసభలో బీసీ బిల్లును పెట్టిన ఘనత ఒక్క వైస్సార్సీపీకే దక్కు తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. భారత దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని కితాబిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవగా, వచ్చే పార్లమెంట్ సమావేశా ల్లో సైతం బీసీ బిల్లు పెడతామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. కాగా, ఆదర్శ పాఠశాల ల్లో పనిచేసే 1,000 మంది టీచర్లకు వెంటనే 7 నెలల జీతాలు చెల్లించడంతో పాటు వీరిని రెన్యువల్ చేయాలని ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సీనియర్ జర్నలిస్టు కోప్ర కన్నుమూత
ముషీరాబాద్: జర్నలిస్టు, కవి, రచయిత, బహుజన మేధావి కోలపూడి ప్రసాద్ (56) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కోప్రగా ఆయన అందరికీ సుపరిచితుడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వారం క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొదట పెరాలసిస్ రావడంతో కొన్ని అవయవాలు పనిచేయలేదు. కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ప్రసాద్ మొదట్లో ఆర్ అండ్ బిలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొంతకాలం విరసంలో, అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో పనిచేశారు. అనంతరం ఆ పార్టీకి దూరమై హైదరాబాద్ వచ్చారు. జర్నలిస్టుగా అనేక పత్రికలలో పనిచేశారు. అనేక పాటలు, కవితలు, వ్యాసాలు రాసి బహుజన మేధావిగా గుర్తింపుపొందారు. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) సిద్ధాంతకర్తగా ప్రాచుర్యం పొందారు. కోలపూడి ప్రసాద్ (కోప్ర) మరణంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, మేడి పాపయ్య మాదిగలతోపాటు బహుజన మేధావులు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. కోప్ర మరణం బీసీ ఉద్యమానికి తీరనిలోటన్నారు. చదవండి: కాల్పుల విరమణ దిశగా మావోలు? -
కరోనాతో కాంగ్రెస్ నేత కన్నుమూత
ముషీరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యదర్శి, పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర మాజీ చైర్మన్, ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత తమగొండ రాజేశ్వర్ (70) కరోనాతో మృతి చెందారు. ఈ నెల 7న శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో కుటుంబ సభ్యులు బోడుప్పల్‌లోని ఓ ప్రై వేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు ముషీరాబాద్ శ్మశాన వాటికలో నిర్వహించారు. రాజేశ్వర్‌కు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, రాజేశ్వర్ మృతి పట్ల పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్, మాజీ ఎంపీలు రాపోలు ఆనంద్‌భాస్కర్, వి.హనుమంతరావు, ఎం.అంజన్ కుమార్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు సంతాపం ప్రకటించారు. చదవండి: అంబులెన్సులు అధిక చార్జీలు అడగొద్దు -
నేరాల్లో దిట్ట.. జువైనల్ హోం సిబ్బంది కళ్లుగప్పి..
సాక్షి, కాచిగూడ: నింబోలి అడ్డలోని బాలికల జువైనల్ హోం నుంచి ఓ యువతి పారిపోయిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్ కుమార్తె సమ్రీన్(18) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వివిధ నేరాలకు సంబంధించి నెల రోజుల క్రితం బాలికా సదన్‌కు తీసుకువచ్చారు. సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో సమ్రీన్ సిబ్బంది కళ్లుగప్పి ప్రధాన గేట్ తాళం తీసుకుని పారిపోయింది. విషయం తెలుసుకున్న బాలికా సదన్ సిబ్బంది ప్రమీల కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు..
సాక్షి, ముషీరాబాద్: రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి(80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకింది. వారం రోజులుగా అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. ఆరడుగుల ఆజానుబాహుడు.. కోర మీసాలు.. వీటికి తోడు బుల్లెట్.. నాయిని నర్సింహారెడ్డి అనగానే గుర్తుకొచ్చేవి ఇవే. సోష లిస్టు పార్టీ భావాలతో ఎప్పుడూ నీతి, న్యాయం కోసం పోరాడేవారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇట్టే అక్కడికి చేరి వారికి న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉండేవారు. అందువల్లే హైదరాబాద్ వచ్చిన అనతికాలంలోనే కార్మికుల పక్షాన నిలబడి వారి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరూ ఆయనను ముద్దుగా బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు అని పిలుచుకునేవారు. ఆయన ఏ గల్లీకి వెళ్లినా బుల్లెట్ ఉండాల్సిందే. వయోభారం మీదపడ్డా.. బుల్లెట్ నడపలేని స్థితిలో ఉన్నా తన బుల్లెట్‌ను మాత్రం రోజూ తుడవడం, ఒకసారి స్టార్ట్ చేసి పక్క న పెట్టడం ఆయనకు అలవాటు. ముఖ్యం గా వాహనాలంటే ఆయనకు అమితమైన మోజు. మార్కెట్లోకి ఏ కొత్త వాహనం వచ్చినా దానిని ట్రయల్ చేసేవారు. చదవండి: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత రమిజాబీ కేసుతో వెలుగులోకి... 1978లో నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో రమిజాబీ అనే ముస్లిం మహిళపై జరిగిన అత్యాచారం, దాడి ఘటన అప్పట్లో రాష్త్రాన్ని మొత్తం కుదిపివేసింది. బాధితుల పక్షాన నిలబడి నాయిని సుదీర్ఘ పోరాటం చేశారు. అప్పట్లో నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ను వేలాది మందితో ముట్టడించారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నల్లకుంట, ముషీరాబాద్ ప్రాంతాలలో కర్ఫ్యూ కూడా విధించారు. ఈ ఘటనతోనే నాయిని వెలుగులోకి వచ్చారు. -
ఆ డిపో బస్సు ఒక్కటీ రోడ్డెక్కలేదు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ఒక బస్ డిపో కొత్త రికార్డు సృష్టించింది. సమ్మె మొదలైన గత 46 రోజుల్లో ఆ డిపో నుంచి ఒక్కబస్సూ రోడ్డెక్కలేదు. రాష్ట్రంలో 97 బస్ డిపోలు ఉండగా.. 96 చోట్ల ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఏదోలా బస్సులను తిప్పుతోంది. కానీ, ముషీరాబాద్–2 బస్సు డిపోలోని 140 బస్సులకు ఒక్కటంటే ఒక్కటి కూడా బయటకు రావడంలేదు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు సమీపంలో ఉన్న ఈ డిపోలోని 140 బస్సులను జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 2012లో కేంద్రం మంజూరు చేసింది. టాటా కంపెనీ రూపొందించిన ఆ బస్సులు సాధారణ బస్సులకు కాస్త భిన్నం. వీటిని నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సాధారణ బస్సులు నడిపే అనుభవం ఉన్న డ్రైవర్లు వీటిని నడపటానికి ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఈ బస్సుల మన్నిక అంతంతే. ప్రస్తుతం కండీషన్ తప్పిన ఆ బస్సులు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని డిపోలోనే ఉంచేశారు. ఫలితంగా సమ్మె కాలంలో ఆ డిపో నుంచి ఒక్క బస్సూ గేటు దాటలేదు. -
ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
సాక్షి, హైదరాబాద్ : వాళ్ల వివాహం ఆదర్శంగా నిలిచింది. అబ్బాయి ఎత్తు 5.4 అడుగులు, అమ్మాయి ఎత్తు 3.2 అడుగులు... వారిద్దరి ఎత్తులో చాలా తేడా ఉన్నప్పటికీ, వారి మనసులో మాత్రం ఎలాంటి భేదం లేదు. ఇద్దరూ మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఆదర్శ జంటగా నిలిచారు. ముషీరాబాద్‌లోని హెరిటేజ్ ఫంక్షన్ ప్యాలెస్ ఈ వేడుకకు వేదికైంది. గురువారం రాత్రి 8గంటలకు బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వరుడు చిదురాల విద్యాసాగర్ (25)ది సిద్దిపేట. తల్లిదండ్రులు చంద్రమౌళి, నాగమణి మృతి చెందడంతో కొంతకాలంగా అక్క దగ్గరే ఉంటూ పీజీ పూర్తి చేశాడు. ఇక పెళ్లి కుమార్తె వీరవల్లి రవళి (22). తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మ. వీరిది సికింద్రాబాద్‌లోని మహంకాళి ప్రాంతం. రవళికి ఒక సోదరుడు ఉండగా, వీరిద్దరూ మరుగుజ్జులే. రవళి ప్రస్తుతం అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. వధూవరులు ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం, ఇల్లరికం రావాలని కోరగా వరుడు ఒప్పుకోవడంతో పెద్దల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. -
ముషీరాబాద్‌లో సదర్ దున్నపోతులు హల్చల్
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
హైదరాబాద్‌సిటీ: ముషీరాబాద్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన అభిలాష్, సంయుక్త కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. బీటెక్ చదువుతున్న వీరిద్దరూ శుక్రవారం ముషిరాబాద్‌లోని స్నేహితుడి ఇంటికి వచ్చారు. ఏమైందో ఏమో గానీ ఇద్దరూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. రూములో ఎవరూ లేకపోవడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియురాలు సంయుక్త ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందగా.. తీవ్రగాయాలపాలైన అభిలాష్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్
-
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్
హైదరాబాద్ : ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కోసం జిహాదీ గ్రూప్‌లతో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓ యువకుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సల్మాన్ యత్నిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజులుగా సల్మాన్ కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో అతడు జరుపుతున్న సంభాషణలపై కూడా ఆరా తీశారు. చివరికి అసలు విషయం నిర్ధారణ కావటంతో సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కోసం జిహాదీ శిక్షణ తీసుకోవడానికి ఇద్దరు యువకులు మహారాష్ట్ర నుంచి ముందుగా హైదరాబాద్ వచ్చి, పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. -
ముషీరాబాద్‌కు ‘సన్’స్ట్రోక్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ పార్టీ టికె ట్లు ఆశిస్తున్నవారిలో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధాన పార్టీలు కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడం.. ఎప్పటినుంచో టికెట్ తమకే ఇస్తారని ఆశల పల్లకిలో ఊరేగి ఊహల్లో తేలిపోతున్నవారు ఇప్పుడు ఏం జరుగుతుందోనని మదన పడుతున్నారు. ఒక్కో పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారు ఇద్దరికంటే ఎక్కువమంది ఉన్న నియోజకవర్గాల్లో అయితే పార్టీ జెండా ఎవరు ఎత్తుకుంటారోనని ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మలక్‌పేటలో ఎవరికి వారు.. మలక్‌పేట నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కిరాలేదు. వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఈ స్థానం నుంచి ఎవరికీ టిక్కెట్ కేటాయించనప్పటికీ ఇక్కడి నేతలు ఎవరికివారు తమకే టిక్కెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.వైఎస్సార్సీపీ నుంచి నగర యువజన విభాగం అధ్యక్షుడు, మలక్‌పేట నియోజకవర్గ సమన్వయకర్త లింగాల హరిగౌడ్తో పాటు మరో సమన్వయకర్త బొడ్డు సాయినాథ్‌రెడ్డి కూడా సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరికివారు సీటు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ మహ్మద్ అలీ కుమారుడు ఆజం అలీ మలక్‌పేట నుంచి తానే పోటీ చేస్తున్నట్టు ప్రచారం మొదలెట్టగా.. కార్మికశాఖ నాయకుడు చెవ్వ సతీష్‌కుమార్ ఈ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే ఇబ్రహీంపట్నం టికెట్టు ఇవ్వాలని చెవ్వ పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి ఇప్పటికే ముజఫర్ అలీఖాన్ ప్రచారం మొదలెట్టారు. మరోవైపు జీహెచ్ఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సలీంనగర్ కార్పొరేటర్ చెకొలేకర్ శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందని కింది స్థాయి కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ పొత్తు ఉంటే ఈ సీటు టీడీపీకే కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. లేకుంటే బీజేపీ నుంచి పార్టీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి కూడా ఈ సీటుపై కన్నేసినట్టు సమాచారం. స్థానిక నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్చందర్జీతో పాటు బి.నర్సింహలు కూడా బీజేపీ నుంచి మలక్‌పేట సీటు కోసం పట్టుపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న విజయసింహారెడ్డి బీజేపీలో చేరితే ఆయనకు టికెట్ ఇవ్వవచ్చనే ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆశావాహుల్లో పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్, బాలకృష్ణయాదవ్ పోటీలో ఉన్నారు. మొత్తానికి సిట్టింగ్ స్థానమైన ఎంఐఎం పార్టీకి ఈ ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదన్నది ఆ పార్టీని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ముషీరాబాద్‌కు ‘సన్’స్ట్రోక్ ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ సోమవారం టీపీసీసీకి పంపించిన జాబితాలో నగరం నుంచే అత్యధికంగా ఏడుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను అందించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందులో టి.శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, విక్రమ్‌గౌడ్, వినయ్‌కుమార్, కోదండరెడ్డి, బాలరాజు, సురేష్‌కుమార్ పేర్లు ఉన్నాయి. వీరిలో బాల్‌రాజ్, కోదండరెడ్డి మినహా మిగతా ఐదుగురూ కాంగ్రెస్ ముఖ్య నేతల కుమారులే కావడం గమనార్హం. దివంగత మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే టి.మణెమ్మల కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్, దివంగత కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్‌కుమార్, ఎస్.యాదగిరి కుమారుడు సురేష్‌కుమార్ దానం పంపిన జాబితాలో ఉన్నారు. ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే మణెమ్మ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండటం, ఆమె కొడుకు శ్రీనివాస్‌రెడ్డి ఉత్సాహంగా పని చేయక పోవడమే ఈ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లను సిఫార్సు చేయడానికి కారణమని చెప్పుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ నేతల కళ్లు ఈ స్థానంపై పడ్డాయని అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా, నియోజకవర్గంలో ప్రస్తు తం ఆరు డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, నలుగురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పటికీ వారి అభిప్రాయాలను తీసుకోకుండా కేవలం నాయకుల కొడుకుల పేర్లను మాత్రమే పీసీసీకి పంపించడంతో వారంతా మండిపడుతున్నారు. కోదండరెడ్డి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. ఈయన ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కృతనిశ్చయంతో ఉండి ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు. ఇంతమంది పోటీలో ఉన్నా ఎవరికివారు సీటు మాత్రం తమకే వస్తుందని పైకి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల సమయం దగ్గరపడుతుండటం, జాబితా ఇంకా సిద్ధం కాకపోవడంతో బీఫాం ఎంవరిని వరిస్తుందోనని కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది.