
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్
హైదరాబాద్ : ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కోసం జిహాదీ గ్రూప్‌లతో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓ యువకుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సల్మాన్ యత్నిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
గత కొన్నిరోజులుగా సల్మాన్ కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో అతడు జరుపుతున్న సంభాషణలపై కూడా ఆరా తీశారు. చివరికి అసలు విషయం నిర్ధారణ కావటంతో సల్మాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కోసం జిహాదీ శిక్షణ తీసుకోవడానికి ఇద్దరు యువకులు మహారాష్ట్ర నుంచి ముందుగా హైదరాబాద్ వచ్చి, పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.