jihadi training
-
బెంగళూరు జిహాదీ ముఠా గుట్టురట్టు
సాక్షి, బెంగళూరు/బనశంకరి: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు తెలిపే సమయంలో విధ్వంసానికి కుట్రపన్నిన జిహాదీ ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు ఆదివారం రట్టు చేశారు. కీలక సూత్రధారి మహబూబ్ పాషా.. బెంగళూరులో ఉన్న జిహాదీ ముఠాకు నాయకుడని వెల్లడైంది. పోలీసులు తమ వ్యవహారం పసిగట్టారని తెలియగానే పాషా ముఠా పరారైంది. కొడగు జిల్లా అటవీప్రాంతం, బెంగళూరు సమీపంలోనీ అటవీప్రాంతాల్లో సభ్యులకు తుపాకీ కాల్చడం, బాంబుల తయారీ వంటి వాటిలో శిక్షణనిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసింది. ముఠా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారితో సంప్రదింపులు జరుపుతున్నారన్న అభియోగాలతో ఇద్దరు ఇమామ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. -
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్
-
గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ అరెస్ట్
హైదరాబాద్ : ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కోసం జిహాదీ గ్రూప్‌లతో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓ యువకుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సల్మాన్ యత్నిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజులుగా సల్మాన్ కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో అతడు జరుపుతున్న సంభాషణలపై కూడా ఆరా తీశారు. చివరికి అసలు విషయం నిర్ధారణ కావటంతో సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కోసం జిహాదీ శిక్షణ తీసుకోవడానికి ఇద్దరు యువకులు మహారాష్ట్ర నుంచి ముందుగా హైదరాబాద్ వచ్చి, పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. -
పాతబస్తీని సందర్శించిన సీపీ మహేందర్ రెడ్డి
ఉగ్రవాద శిక్షణ కోసం అఫ్ఘానిస్థాన్ వెళ్లడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు సిమి కార్యకర్తలను మాత్రమే తాము అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పాతబస్తీ ప్రాంతాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఇద్దరు సిమి కార్యకర్తలు మినహా వేరెవ్వరినీ తాము అరెస్టు చేయలేదని కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటుకోసం జిహాదీ శిక్షణ తీసుకోవడానికి ఇద్దరు యువకులు మహారాష్ట్ర నుంచి ముందుగా హైదరాబాద్ వచ్చి, పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమిషనర్ పాతబస్తీ ప్రాంతాన్ని సందర్శించారు.